Connect with us

Crime

161 వ జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం

janamvelugunews

Published

on

జనం వెలుగు:- సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం కన్సాన్ పల్లీ శివారులో గల నాందేడ్ అఖోళ 161 వ జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.చీరాల నుండి నారాయణఖేడ్ కు వెళ్తున్న సూపర్ లగ్జరీ ఆర్టీసి బస్సు ఎదురుగా వచ్చిన మారుతి కారును ఢీ కొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి పాప, మరో వ్యక్తి ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. వీరంతా ఐ.డి.ఏ జీడిమెట్ల శుబాష్ నగర్ కు చెందిన దిలీప్, వినోద్, సుప్రతీక, చిన్నారి కాన్సీగా గుర్తించారు. పొగ మంచు కారణంగా బస్ కంప్లీట్ గా రాంగ్ రూట్ లో ప్రయనించడంతో ఎదురుగా వచ్చిన కారును ఢీ కొని సుమారు 50 మీటర్ల వరకు కారుతో ముందుకు దూసుకెళ్లింది. రహదారిపై సూచిక బోర్డ్ లు లేకపోవడంతో రహదారిపై అలుముకున్న పొగ మంచే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతుల వివరాలతో కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతులను పోస్ట్ మార్టం నమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Crime

మండల కేంద్రంలో ఇనుపరాట్లతో వ్యక్తిపై దాడి

janamvelugunews

Published

on

మండల కేంద్రంలో ఇనుపరాట్లతో వ్యక్తిపై దాడి….

నందిపేట జూన్ 14 జనం వెలుగు: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తా సురేష్ నగర్ కాలనీ ఎదురుగా ఉన్న ఆర్డర్ మెస్ ప్రాంతంలో నందిపేట రాజనగర్ దుబ్బ ప్రాంతానికి చెందిన నయిం అనే వ్యక్తిపై కొందరు వ్యక్తులు కారుపై వచ్చి ఇనుపరాట్లతో దాడి చేయడంతో నయిం తలకు,

  చెయ్యికి, పొట్ట ప్రాంతంలో తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నయిం, కయ్యులు అన్నదమ్ములని, వీరి బంధువులైన షేక్ తాలిబ్, షేక్ తాహెర్, సాజిద్, షాహెద్, గాలిబ్ మరి కొంతమంది వ్యక్తులు కారులో వచ్చి రాడ్లతో నయీంపై దాడి చేయడం జరిగిందని,

   వీరి ఇరువురి మధ్య పాత కక్షలు ఉన్నాయని, సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నామని, నయీమ్ చికిత్స పొందుతున్నాడని, బాధితుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు, దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు.

Continue Reading

Crime

పసిపాపను చంపిన హంతకుల జాడేది

janamvelugunews

Published

on

పసిపాపను చంపిన హంతకుల జాడేది.,

నందిపేట జూన్ 14 జనం వెలుగు; నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో దాదాపు 20 రోజుల కిందట మెయిన్ రోడ్డు పాత హనీ రెస్టారెంట్ వెనకాల ఖాళీ స్థలంలో అప్పుడే పుట్టిన పసికందును ఎండలో పడేయడంతో పసికందు మృతి చెందిన ఘటన అందరికీ తెలిసిందే…

కానీ పాప చనిపోయి 20 రోజులు గడిచిన ఆ పసి గుడ్డు నెత్తుటి మరకలు అంటిన అదాంతకుల యాడ మాత్రం తెలిసి రాలేదు. బేటి బచావో… బేటి పడావో…. అనే నినాదాలు పేపర్లకే పరిమితమైనట్టు ఉంది ఈ సంఘటన.. తరతరాల నుండి ఆడపిల్లల పైన ఎన్నో అఘైత్యాలు, ఆడపిల్ల అంటే అలుసే… మగాడు అంటే మురుపమే..

   ఈ తారతమ్యాలను రూపుమాపేందుకు ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపట్టిన క్షేత్రస్థాయిలో మాత్రం ఆ లక్ష్యాలను చేదిదిండం లేదు. వెంటనే ఈ దుశ్చర్యలకు పాల్పడిన, ఆ నెత్తుటి మరకల చేతులకు సంకెళ్లు వేస్తేనే మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Continue Reading

Crime

పేకాట స్థావరం పై దాడి.. 9 మంది అరెస్ట్

janamvelugunews

Published

on

పేకాట స్థావరం పై దాడి.. 9 మంది అరెస్ట్

నందిపేట జూన్ 14 జనం వెలుగు: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తా పెట్రోల్ బంక్ వెనకాల కాలనీలోని ఓ ఇంటిపై నందిపేట పోలీసులు శనివారం దాడి చేసి పత్తలాడుతున్న 9 మంది వ్యక్తులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి 28 వేల140రూ నగదును, 7 సెల్ ఫోన్లు, 2 బైకులను స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై వినయ్ కుమార్ మాట్లాడుతూ.,.. పక్క సమాచారం మేరకు పెట్రోల్ బంక్ వెనకాల కాలనీలో పేకాట సవరం పై దాడి చేసి పేకాడుతున్న వ్యక్తులను అరెస్టు చేయడం జరిగిందని, జూదం ఆడడం చట్టరీత్యా నేరమని, జూదమే కాదు అసాంఘిక కార్యక్రమాలు ఎవరు పాల్పడిన, మాదకద్రవ్యాలతో సంబంధం ఉన్న, దౌర్జన్యం చేస్తూ ఎదుటివారిని ఇబ్బంది పెట్టినా, చట్ట వ్యతిరేక పనులు చేసే వారిపై ఉక్కు పాదం మోపుతామని, తమ పరిసర ప్రాంతాలలో అసాంఘిక కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Continue Reading