Sports
ముగిసిన ప్రెస్ క్లబ్ క్రికెట్ టోర్నీ


ముగిసిన ప్రెస్ క్లబ్ క్రికెట్ టోర్నీ
జనంవెలుగు, నిజామాబాద్:- నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 33 వ, మల్లెపూల నరేంద్ర మెమోరియల్ క్రికెట్ ఛాంపియన్ షిప్ ట్రోఫీని ఆంజనేయులు జట్టు కైవసం చేసుకుంది. 2 రోజులుగా జరిగిన ఈ టోర్నీలో ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరిగింది. ఈ మ్యాచ్ లో ఆంజనేయులు జట్టు విజేతగా నిలిచింది.
Sports
ఇంగ్లాండ్ టార్గెట్ 399


ఇంగ్లాండ్ టార్గెట్ 399
జనంవెలుగు, క్రీడా విభాగం:- విశాఖ వేదికగా జరుగుతోన్న రెండో టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది. మూడో రోజు 28/0తో బ్యాటింగ్ కొనసాగించిన భారత్ 255 పరుగులకు ఆలౌటైంది. గిల్(104)శతకంతో రాణించగా. అక్షర్(45), శ్రేయస్(29), అశ్విన్ (29) ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు తక్కువ స్కోరుకే ఔటయ్యారు. హార్ట్‌లీ 4, రెహాన్ 3, జేమ్స్ 2, షోయబ్ ఒక వికెట్ తీశారు. ఇంగ్లాండ్ టార్గెట్ 399. అంతకు ముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులు చేయగా. ఇంగ్లాండ్ 253 పరుగులకు ఆలౌటైంది.
Education
బంగారు పతకం సాధించిన అల్ఫోర్స్, ఇ-టెక్నో స్కూల్ విద్యార్థి


బంగారు పతకం సాధించిన అల్ఫోర్స్, ఇ-టెక్నో స్కూల్ విద్యార్థి
జనం వెలుగు, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్ట్ అనిల్ గంటడి:- విద్యార్థులకు విద్యతో పాటు క్రీడల పట్ల అవగాహన కల్పించాలని మరియు అందులో పాల్గొనేలా ప్రోత్సాహకాలను అందించాలని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా॥ వి. నరేందర్ రెడ్డి స్థానిక ఆదర్శనగర్ లోని అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ విద్యార్థిని జాతీయ స్థాయి కరాటే పోటీలలో బంగారు పతకం సాధించడంపట్ల ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలలో ఎన్నో విషయాలు నేర్చుకునేవి ఉంటాయని ప్రత్యేకంగా విజయాలను సాధించే విధానాలను తెలుసుకుంటామని చెప్పారు. క్రీడల్లో లభించే లాభాలు మరే ఇతర అంశాల్లో సాధ్యం కాదని చెప్పారు. క్రీడల ద్వారా కలిగే విశిష్ట లాభాలవలన పాఠశాల విద్యా ప్రణాళికలో భాగంగా విద్యార్థులను వివిధ పోటలకు ఎంపిక చేయడమే కాకుండా అందులో విజయాన్ని సునాయాసంగా అందుకోవడానికై ప్రోత్సాహాన్ని అందిస్తున్నామని చెప్పారు. ప్రాథమికంగా విద్యార్థులకు పాఠశాలలో ఎంపిక పరీక్ష నిర్వహిస్తామని అందులో ప్రతిభను కనబరచిన వారికి పోటీలకు ఎంపిక చేస్తామని వారు చెప్పారు. ఈ క్రమంలో ఇటీవల కాలంలో మంచిర్యాల్ జిల్లా కేంద్రంలో నిర్వహించినటువంటి పి.యస్. ఆర్ మొదటి జాతీయ ఓపన్ ఆల్ స్టైల్స్ కరాటే చాంపియన్షిప్-2024 కటా విభాగంలో పాఠశాలకు చెందినటువంటి కాపం సమన్యు, వైట్ బెల్ట్ తో పాటు బంగారు పతాకాన్ని సాధించాడని హర్షం వ్యక్తం చేశారు. బంగారు పతకం సాధించడంపట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ విజేతకు పుష్పగుచ్ఛంతో పాటు ప్రశంస పత్రాన్ని అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
Sports
ముగిసిన చింరాజ్ పల్లి క్రికెట్ లీగ్ 11వ సీజన్


ముగిసిన చింరాజ్ పల్లి క్రికెట్ లీగ్ 11వ సీజన్
జనంవెలుగు, నందిపేట్:- చింరాజ్ పల్లి గ్రామంలో గత 10 సంవత్సరాలుగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్న చింరాజ్ పల్లి క్రికెట్ లీగ్ 11వ సీజన్ కి.శే రాజేండ్ల రవితేజ, మాడబోయి జ్ణానేశ్వర్ గార్ల స్మారకర్థంగా నిర్వహించబడింది, జనవరి 14,15 లలో కొనసాగిన లీగ్ ఫైనల్ నేడు ముగిసింది. కాగా 11వ సీజన్ విన్నర్ గా బొంత సిద్దేశ్వర్ (దినేష్) జట్టు , రన్నర్ గా తోట రవి(ధనుష్) జట్టు నిలవగా అనంతరం ముగింపు సభ కు హాజరైన ముఖ్య అతిథిలు మాట్లాడుతూ ఆటలో గెలుపోటములు సహజం అని సామరస్యంగా తీసుకోవాలన్నారు. తర్వాత విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు అనంతరం సిసిఎల్ నిర్వహక సభ్యుడు కాశ రాఘవేంద్ర ధన్యవాద విజ్ఞాపన సందర్బంగా CCL 11 కు విరాళాలు అందజేసిన వారికి అలాగే సీజన్ విజయవంతంగా ముగియడానికీ ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తోట గణేష్, పిఎసిఎస్ చింరాజ్ పల్లి చైర్మన్ బొంకం గంగరెడ్డి, గ్రామ పెద్దలు రాజేండ్ల మురళి, తోట రాజేశ్వర్ పాల్గొన్నారు.








