Politics
నాయకుల మధ్య చెలరేగుతున్న చిచ్చు


Views: 10619
నాయకుల మధ్య చెలరేగుతున్న చిచ్చు
సవాల్, ప్రతి సవాళ్ళతో దద్దరిల్లుతున్న బాల్కొండ.
దోషులెవరో,నిర్దోషు లెవరో తేల్చుకోవాల్సినది బాధ్యత ఇరువురిపై లేదా….
ఎంఎల్ఏ ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెసు నాయకుడు సునీల్ రెడ్డిల మధ్య చిచ్చు.
జనం వెలుగు బాల్కొండ: బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గ పు కాంగ్రెసు పార్టీ ఇంచార్జి ముత్యాల సునీల్ రెడ్డి, బాల్కొండ ఎంఎల్ఏ వేముల ప్రశాంత్ రెడ్డిల మధ్యన చిచ్చు చెల రేగుతుంది. ఇటీవల జిఎస్టిపై జరిగిన సంఘటనలో సునీల్ రెడ్డి 28 కోట్ల రూపాయల జిఎస్టిని ప్రభుత్వాని చెల్లించలేదని, నియోజకవర్గంలో పెద్ద వాగు పరి వాహ కం నుండి పెద్ద ఎత్తున అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న ఇసుకా సురుడు అంటూ సునీల్ రెడ్డిపై ఎంఎల్ఏ ప్రశాంత్ రెడ్డి, ఆతని అనుచరులు ఆరోపణలను చేసినది పాఠకులకు విదితమే.
దీంతో కాంగ్రెసు పార్టీ నాయకుడు సునీల్ రెడ్డి మోర్తాడ్ ప్రజానిలయంలో ఈ నెల 8 న ఏర్పాటు చేసిన విలేఖరుల సమా వేశంలో బట్టాపూర్ క్రష్షర్ లో 112 కోట్ల రూపాయల ప్రభుత్వానికి చె ల్లించాల్సిన బకాయిలను, అలాగే సుమారు 52 లక్షల రూపాయల కరెంటు బిల్లు లను ప్రభుత్వానికి చెల్లించలేదని వీటిపై ప్రశాంత్ రెడ్డిపై సునీల్ రెడ్డి ఘాటుగా విమర్శలు చేసి దమ్ముంటే నా సవాల్ ను స్వీ కరించి ఓ తేథీని నిర్ణయించు అని సవాల్ విసిరిన సంఘటన పాఠకులకు విదితమే. విమర్శలు ప్రతి విమ ర్శలు చేసుకుంటున్న బిఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు, విమర్శలు మానుకొని దోషులెవరో నిర్దోషు లెవరో తేల్చుకునేందుకు ఇద్దరికి అనువైన ఓ స్థలాన్ని ఎంపిక చేసుకుని బహి రంగంగా “ప్రజా దర్బార్” ను ఏర్పాటు చేసుకుని దొంగలెవరో దొరలెవరో ప్రజల సమక్షంలో ఇరువురే తేల్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. విమర్శలు, సద్విమర్శలు నాయకుల మధ్యనే కాకుండా కార్యకర్తల మద్య చేరిపో గా చిలికి చిలికి వాన కాస్త జడివాన లాగ మారి పోయింది.
Politics
| armoor ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెసుకు బుద్ది చెప్పండి


Views: 2638
బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెసు,బిజెపిల నాయకులు
జిల్లాలో 7 మున్సిపాలిటీలను,ఒక కార్పొరేషన్ గెలుచుకుంటాం
మాజి ఎంఎల్ఏ జీవన్ రెడ్డి
జనం వెలుగు ఆర్మూర్:- అధికారం కోసం గత అసెంబ్లీ ఎన్నికలలో కాం గ్రెసు పార్టీ ప్రజలకిచ్చిన హామీలను, అమలు చేయని కాంగ్రెసు పార్టీకి గ ట్టిగా బుద్ధి చెప్పే సమయం ఆసన్న మైనదని ఆర్మూర్ మాజి ఎంఎల్ఏ, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి అన్నాడు. కాంగ్రెసు, బిజె పి పార్టీల నుండి బుధవారం బిఆర్ఎస్ పార్టీలోకి చేరిన నాయకులకు పార్టీ కండువా కప్పి ఆయన ఆహ్వానించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడాడు. జిల్లాలోని 7 మున్సి పాలిటీలను, ఒక కార్పొరేషన్ ను గెలుచుకుంటామని, అలాగే ఆర్మూర్ లోని 36 వార్డులను బిఆర్ఎస్ గెలు పొందుతొందని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. వృద్దాప్య పింఛన్లను 2000 నుండి 4000 పెంచుతామని, మహిళలకు 2500 చేయూత పింఛన్లను, కళ్యాణ లక్ష్మిలో లక్ష రూపాయలతో తులం బంగారం, రైతు భరోసా తథితర అంశాలను కాంగ్రెసు పార్టీ అమలు చేయలేక చేతులెత్తేసిందని ఆయన దుయ్యబ ట్టాడు. ఆర్మూర్ పట్టణంలో 27 వార్డు నుండి ఎస్ఆర్ రమేష్, 21 నుండి నడుకుడ నాగరాజు, 9 వార్డు భూమేష్, 7 వార్డు కీర్తి గౌడు, 32 వార్డు సుకేష్ లు బిఆర్ఎస్ పార్టీలో చేరారని ఆయన చెప్పాడు. హామీలను ఆటకెక్కించిన కాంగ్రెసు పార్టీ ప్రస్తుతం మున్సిపాలిటీ ఎన్నికలలో ఓటు ద్వారా ధీటైన బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపు నిచ్చాడు.



Politics
| Nizamabad అన్నపూర్ణగా వెలిగిన నిజామాబాద్ ఎందుకు వెనుకబడింది


Views: 9482
మున్సిపాలిటీ ఎన్నికల ముందు ఆత్మపరిశీలన అవసరం:డాక్టర్ కేశవులు ప్రత్యేక కథనం
జనం వెలుగు, నిజామాబాద్: ఒకప్పుడు తెలంగాణకు అన్నం పెట్టిన జిల్లాగా “అన్నపూర్ణ”గా పేరొందిన నిజామాబాద్ నేడు అభివృద్ధి విషయంలో వెనుకబడి ఉండటం బాధాకరమైన వాస్తవమని తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్, నిజామాబాద్ జిల్లా డెవలప్‌మెంట్ ఫోరం చైర్మన్ మరియు సీనియర్ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కేశవులు అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ఆత్మపరిశీలన చేసుకుని రాజకీయ పార్టీలను స్పష్టమైన ప్రశ్నలు అడగాల్సిన అవసరం ఉందని ఆయన తన ప్రత్యేక కథనంలో పేర్కొన్నారు.
చుట్టుపక్కల జిల్లాలైన కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, సిరిసిల్ల, అదిలాబాద్ అభివృద్ధిలో దూసుకెళ్తుండగా, అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ నిజామాబాద్ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయిందన్నారు. ఈ పరిస్థితికి ఒకే పార్టీ కారణం కాదని, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అన్ని రాజకీయ పార్టీలూ బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు.
రాజకీయ సంకల్పం లోపమే వెనుకబాటుకు మూలకారణం
నిజామాబాద్ అభివృద్ధికి 10–20 ఏళ్ల దీర్ఘకాలిక విజన్ ప్లాన్ ఏ ప్రభుత్వమూ రూపొందించలేదని డాక్టర్ కేశవులు విమర్శించారు. తాత్కాలిక పథకాలకే పరిమితమై, పరిశ్రమలు, ఉపాధి, పట్టణ విస్తరణపై సమగ్ర ఆలోచన లేకపోవడం ప్రధాన లోపమన్నారు. అభివృద్ధికంటే రాజకీయ లాభనష్టాలకే ప్రాధాన్యం ఇచ్చారని వ్యాఖ్యానించారు.
వ్యవసాయ సంపద ఉన్నా విలువ జోడింపు లేదు
వరి, పసుపు, మొక్కజొన్న వంటి పంటలతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన పసుపు మార్కెట్ ఉన్నా, అగ్రో-ప్రాసెసింగ్ పరిశ్రమలు ఎందుకు రాలేదన్నది ప్రధాన ప్రశ్నగా నిలుస్తోందన్నారు. పసుపుకు ఇక్కడే విలువ జోడించే పరిశ్రమలు ఏర్పాటు చేయలేకపోవడంతో రైతుకు గిట్టుబాటు ధర, పట్టణానికి ఉపాధి కల్పించడంలో వైఫల్యం జరిగిందన్నారు. వ్యవసాయం ముడి సరుకుగానే బయటకు వెళ్లి, లాభాలు ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు చేరుతున్నాయని పేర్కొన్నారు.
మౌలిక వసతులు – మధ్యలో ఆగిపోయిన అభివృద్ధి
అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, డ్రైనేజీలే కాదని, రైల్వే హబ్‌గా మారే అవకాశమున్నా సరైన లాబీయింగ్ జరగలేదన్నారు. జాతీయ రహదారులు, ఇండస్ట్రియల్ కారిడార్లలో నిజామాబాద్‌కు తగిన ప్రాధాన్యం దక్కలేదని, పట్టణ విస్తరణ మాస్టర్ ప్లాన్‌లు కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. ఇతర జిల్లాల్లో ఇండస్ట్రియల్ పార్కులు, ఐటీ హబ్‌లు, మెడికల్, ఎడ్యుకేషన్ క్లస్టర్లు ఏర్పడితే, నిజామాబాద్‌లో మాత్రం వాగ్దానాలే మిగిలాయన్నారు.
*మున్సిపాలిటీ ఎన్నికలు: అభివృద్ధి ఎజెండా ఎక్కడ?*
ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ నిజామాబాద్ అభివృద్ధిపై స్పష్టమైన ఎజెండా కనిపించడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యక్తిగత ఆరోపణలు, రాజకీయ విద్వేషాలే ప్రచారంగా మారాయని, పట్టణ భవిష్యత్తుపై చర్చే లేకపోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతమన్నారు. ఎన్నికలు వ్యక్తుల కోసం కాదు, పట్టణ భవిష్యత్తు కోసం కావాలని సూచించారు. ఈ ఎన్నికల ముందు ప్రజలు రాజకీయ పార్టీల నుంచి స్పష్టమైన హామీలు కోరాలని డాక్టర్ కేశవులు పిలుపునిచ్చారు. “మాకు పార్టీ రంగు కాదు… మాకు నిజామాబాద్ భవిష్యత్తు కావాలి” అన్నది ప్రజల నినాదంగా మారాలన్నారు. అభివృద్ధిపై మాట్లాడని నాయకత్వాన్ని ప్రజలు తిరస్కరించాలని, ఈ మున్సిపాలిటీ ఎన్నికలు నిజామాబాద్‌కు టర్నింగ్ పాయింట్ కావాలని ఆయన ఆకాంక్షించారు.
అన్నపూర్ణగా వెలిగిన ఈ జిల్లా మళ్లీ తెలంగాణ అభివృద్ధి పటంలో ముందు వరుసలో నిలవాలంటే ప్రజల ఆత్మగౌరవంతో కూడిన ప్రశ్న అవసరమని డాక్టర్ కేశవులు స్పష్టం చేశారు. ఇది రాజకీయ వ్యాసం కాదని, నిజామాబాద్ భవిష్యత్తుపై ప్రజల డిమాండ్ అని ఆయన పేర్కొన్నారు.
డాక్టర్ కేశవులు భాషవత్తిని, ఎండీ (సైకియాట్రీ)
చైర్మన్: తెలంగాణ మేధావుల సంఘం & నిజామాబాద్ జిల్లా డెవలప్‌మెంట్ ఫోరం



Politics
రగులుతున్న తెలంగాణ రాజకీయం


Views: 0
రగులుతున్న తెలంగాణ రాజకీయం
హైదరాబాద్, మే 22:– కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్, హరీష్‌రావు, ఈటల రాజేందర్‌కు నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారుతోంది. ఈ నోటీసులతో తెలంగాణలో రాజకీయం మరింత వేడెక్కింది. నోటీసులపై బీఆర్‌ఎస్ మండిపడుతోంది. బీజేపీ, కాంగ్రెస్ కలిసి కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనిపై కాంగ్రెస్ కూడా ఘాటుగా స్పందిస్తోంది. అసలు వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకునేదే బీఆర్‌ఎస్, బీజేపీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తోంది. అంతే కాకుండా ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర కూడా జరుగుతోందని ఆరోపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో విచారణ చేస్తున్న పీసీ ఘోష్ కమిటీ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు ఈటల రాజేంద్ర, హరీష్‌రావుకు నోటీసులు జారీ చేసింది. ప్రాజెక్టుపై నెలకొన్న అనుమానాలపై సమాధానం చెప్పాలని పేర్కొంది. ఇదే ఇప్పుడు తెలంగాణలో రాజకీయ రచ్చకు కారణమైంది. దీనిపై బీఆర్‌ఎస్ నేతలు మండిపడుతున్నారు. నోటీసు వచ్చినప్పటి నుంచి బీఆర్‌ఎస్ నేతలంతా ప్రెస్‌మీట్లు పెట్టి ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బురదజల్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి చేస్తున్న కుట్రగా అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీకి పాలన చేతకాదని, ఇచ్చిన హామీల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు ఈ కుటిలయత్నం చేస్తున్నారని అన్నారు. దీన్నిపై కచ్చితంగా పోరాటం చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో రేవంత్ సర్కారు 20 నుంచి 30 వరకు కమీషన్లు లేనిదే ఏ పని చేయడం లేదని కేటీఆర్ అన్నారు. తమ ప్రభుత్వంలో లంచాలు లేనిదే ఏ పని కావడం లేదని మంత్రులు, ఎమ్మెల్యేలే బహిరంగంగా అంగీకరిస్తున్నారని అన్నారు. ఇవీ, పథకాలపై ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి నుంచి డైవర్ట్ చేయడానికే కాళేశ్వరం కమిషన్ నోటీసులు డ్రామా తెరపైకి తెచ్చారని అన్నారు. ఇదో చిల్లర ప్రయత్నమని అన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీస్తూనే ఉంటారని అన్నారు. ఈ నోటీసులపై మాజీ మంత్రి ఈటల రాజేంద్ర మాట్లాడుతూ ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తి లేదన్నారు. నోటీసులు అందితే కచ్చితంగా కమిషన్‌కు సహకరిస్తామని ఓ ఛానల్‌తో మాట్లాడుతూ అన్నారు. చట్టాలపై తమకు గౌరవం ఉందని చెప్పుకొచ్చారు. ఇలాంటి చిల్లర ప్రయత్నాలతో తనను భయపెట్టలేరని అభిప్రాయపడ్డారు. అప్పట్లో ఆ శాఖ కార్యదర్శిగా ఉన్న వ్యక్తే ఇప్పుడు సీఎస్‌గా ఉన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతలకు పాలనపై పట్టు లేదని అందుకే చిల్లర ప్రయత్నాలతో కాలయాపన చేస్తున్నారని అన్నారు. కాళేశ్వరం విషయంలో నోటీసులు ఇచ్చినందున ప్రభుత్వం బీజేపీ, బీఆర్‌ఎస్ కక్ష పెంచుకున్నారని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. అందుకే తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. చట్టానికి లోబడే అందరికీ నోటీసులు ఇచ్చారని ఈ విషయాన్ని మర్చిపోయి ప్రభుత్వంపై కక్షసాధింపులకు దిగబోతున్నారని కామెంట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్, టీడీపీ కూటమిగా పోటీ చేయబోతున్నాయని అన్నారు. ప్రజాప్రభుత్వ రాకుండా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నట్టు అనుమానం వ్యక్తం చేశారు. అసలు కేసీఆర్‌తోపాటు మాజీ మంత్రులకు ఘోష్ కమిటీ ఇచ్చిన నివేదికతో ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు మల్లు రవి. ఇస్తే సమాధానం చెప్పాలని ఎంతో మంది మాజీ ముఖ్యమంత్రులు జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. ఇదేం ఈ దేశంలో కొత్తకాదని వివరించారు. ఇప్పుడు కూడా తప్పు చేయలేదని కమిషన్ ముందుకెళ్లి నిరూపించుకోవాలని సూచించారు. విచారణకు సహకరించి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలన్నారు. కాళేశ్వరంలో జరిగిన అక్రమాలపై జూన్ ఐదో తేదీ విచారణకు రావాలని మాజీ సీఎం కేసీఆర్‌కు ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఆరో తేదీని హరీష్‌రావును పిలిచింది. ఏడో తేదీన ఈటలకు టైం ఇచ్చింది. ఈ నోటీసుల సంగతి వెలుగు చూసిన వెంటనే కేసీఆర్, హరీష్‌రావు సమావేశమై చర్చించారు. ఈ కమిషన్ ఎదట హాజరవుతారా లేదా అనేది ఆసక్తిగా మారింది.




















