నిజామాబాద్
ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలను తనిఖీ చేసిన కలెక్టర్


ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలను తనిఖీ చేసిన కలెక్టర్
మైనర్ బాలికతో కిచెన్ లో పనులు చేయిస్తుండడం పట్ల ఆగ్రహం
కళాశాల ప్రిన్సిపాల్ కు షోకాజ్ నోటీసు జారీ
సదరు బాలికను పాఠశాలలో చేర్పించాలని అధికారులకు ఆదేశం
నిజామాబాద్, మార్చి 12 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారంలో గల ప్రభుత్వ గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిచెన్, డైనింగ్ హాల్ లను సందర్శించి నిర్వహణ తీరుతెన్నులను నిశితంగా పరిశీలించారు. విద్యార్థినుల కోసం వండిన అన్నం, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. కిచెన్ శుభ్రంగా ఉంచుకోవాలని, లేని పక్షంలో ఈగలు, దోమలు వృద్ధి చెంది వ్యాధులు ప్రబలేందుకు ఆస్కారం ఉంటుందన్నారు.
కాగా, కిచెన్ లో మైనర్ బాలిక (16) పనులు చేస్తుండడాన్ని గమనించిన కలెక్టర్, ఆమె గురించి వాకబు చేశారు. తన పెద్దమ్మతో కలిసి గత కొన్ని రోజులుగా కిచెన్ లో వంట పనులలో సహాయం చేస్తున్నానని సదరు బాలిక కలెక్టర్ కు తెలిపారు. దీంతో కలెక్టర్ కళాశాల నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువుకునే వయస్సు కలిగిన మైనర్ బాలికతో ప్రభుత్వ విద్యా సంస్థలో ఎలా పనులు చేయిస్తున్నారని నిలదీశారు. దీనిని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి, కళాశాల ప్రిన్సిపాల్ సయ్యదా జైనబ్ కు షోకాజ్ మెమో జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చక్కగా చదువుకోవాలని, ప్రభుత్వ పరంగా అన్ని వసతులు కల్పిస్తామని బాలికకు కలెక్టర్ భరోసా కల్పించారు. బాలికను సమీపంలోని పాఠశాలలో చేర్పించి, ఉచిత విద్యా, వసతి అమలయ్యేలా చూడాలని సీ.డీ.పీ.ఓ, ఎం.ఈ.ఓలను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ డిగ్రీ విద్యార్థినులకు కొద్దిసేపు వివిధ అంశాలపై బోధన చేశారు. చక్కగా చదువుకుని ఉన్నత విద్యను పూర్తి చేసుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సూచించారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ దశలో చదువును ఆపకూడదని మార్గనిర్దేశం చేశారు.
నిజామాబాద్
విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు


విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు
రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
జనంవెలుగు నిజామాబాద్:- విజయదశమి పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు నింపాలని, ప్రజలు చేపట్టే ప్రతి కార్యంలో విజయం సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, ఐకమత్యంతో జీవించాలని, అన్ని వర్గాల ప్రజలకు విజయదశమి శుభాలను అందించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
నిజామాబాద్
జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు


జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు
జనంవెలుగు నిజామాబాద్ :– విజయ దశమి వేడుకను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే విజయదశమి వేడుకను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
దసరా పండుగ అందరి జీవితాల్లో విజయాలు సమకూర్చాలని, చేపట్టిన ప్రతీ కార్యం విజయవంతం కావాలని అభిలషించారు. విజయ దశమి వేళ అన్ని వర్గాల వారు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో జీవనాలు వెళ్లదీయాలని ఆకాంక్షించారు.
నిజామాబాద్
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో


బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో..
నగరంలో సందడిగా సాగిన సద్దుల బతుకమ్మ వేడుకలు
బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) వద్ద మహిళల కోలాహలం.
జనంవెలుగు నిజామాబాద్ :- నిజామాబాద్ నగరంలో ఆట పాటలతో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ అనేది తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక ప్రతీకగా జరుపుకునె తంగేడు, గూనుగు పూలతో పాటు, రక రకాల పూలతో జరుపుకునే పువ్వుల పండగ.
భాద్రపద అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు వైభవంగ జరుపుకునే మహిళల పండుగ.ప్రకృతిలో లభించే రకరకాల పూలను గోపురం లా అందమైన పొరలు గార్చి తయారు చేస్తారు,
పసుపుతో గౌరమ్మను చేసి దాని పై ప్రతిష్టిస్తారు. ప్రతి గల్లీలో మహిళలు ముస్తాబయి.. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి హుషారైనా బతుకమ్మ పాటలతో హోరేత్తించారు.
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు చిన్నారులకు తెలియచేయడానికి ఈ పండగ ఒక వేదిక అనుకోవచ్చు. చిన్నారులు చిట్టి, చిట్టి బతుకమ్మలను చేతిలో పట్టుకుని ఫోటోలకు,ఫోజులివ్వడం అందరిని ఆనంద డోలికల్లో ముంచెత్తింది.
బతుకమ్మ డి జె పాటలకు మహిళలు ఉత్సాహం తో, హుషారైనా స్టెప్పులు వేయడం అందరిని అలరించింది. ఈ సందర్బంగా బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) దగ్గర మహిళలు మరొక్కసారి బతుకమ్మ పాటలకు సంగీతానికి తగ్గట్టుగా,ఒకేసారి కొట్టె చప్పట్ల సప్పుడుకు,ఒకేసారి వేసే స్టెప్పులతో చెరువు వాతావరణమంతా హోరేత్తింది.
ఈ సందర్బంగా ఖిల్లా రోడ్, గాజుల్ పేట్, బడా బజార్, శివాజినగర్, గాయత్రీనగర్, సీతారామ్ నగర్, వర్ని రోడ్, సాయి నగర్ ప్రాంతల లోని మహిళలు బొడ్డెమ్మ చెరువులో బతుకమ్మలను పోయిరా.. పోయిరా బతుకమ్మ అంటూ వదిలారు.








