Connect with us

Shorts

Sathyabhame😊 Short video

janamvelugunews

Published

on

Shorts

చింరాజ్ పల్లి క్రికెట్ లీగ్ సీజన్ 13 ప్రారంభం

janamvelugunews

Published

on

చింరాజ్ పల్లి క్రికెట్ లీగ్ సీజన్ 13 ప్రారంభం

జనంవెలుగు, నందిపేట్: మండలంలోని చింరాజ్ పల్లి గ్రామంలో CCL’13 మంగళవారం ప్రారంభం అయింది. శివాజి మహారాజ్ గారి చిత్రపటానికి నివాళులు ఆర్పించి టోర్నమెంట్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమ ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ రాజేండ్ల లావణ్య మురళి హాజరయ్యరు. ఈ సందర్భంగా గ్రామపెద్ద మాడబోయి సందీప్ మాట్లాడుతూ గెలుపోటములు సహజం అని సామరస్యంగా ఆడి సోదరాభావంతో మెలగాలని క్రీడాకారులకు సందేశమిచ్చారు. ఈ కార్యక్రమంలో CCL’13 నిర్వహకుడు కాశ రాఘవేంద్ర, సహా నిర్వహకుడు పాఠశాల చైర్మన్ తోట, రవి, కమిటి టీమ్స్ కో ఆర్డినేటర్ గడ్డం హారిష్, ఆర్గనైజింగ్ కో ఆర్డినేటర్ కండెల సాయినాథ్, మీడియా కో ఆర్డినేటర్ సిరిగిరి సింధు కార్తీక్, గ్రామ 1వ వార్డు మెంబర్ గడ్డం ప్రశాంత్, 3వ వార్డు మెంబర్ బొంత నవ్య సిద్దేశ్వర్, 6వ వార్డు మెంబర్ కల్లెడ అజయ్, మాజీ ఉప సర్పంచ్ దుడ్డు భూపతి, విడిసి సభ్యులు కుస్తపురం శ్రీనివాస్, పిఎసిఎస్ కార్యదర్శి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Shorts

జాతీయ టైక్వాండో ఛాంపియన్షిప్‌కు నిజామాబాద్ క్రీడాకారి సాయి ప్రసన్న ఎంపిక

janamvelugunews

Published

on

జాతీయ టైక్వాండో ఛాంపియన్షిప్‌కు నిజామాబాద్ క్రీడాకారి సాయి ప్రసన్న ఎంపిక

జనం వెలుగు, నిజామాబాద్: జాతీయ స్థాయి తైక్వాండో చాంపియంషిప్ నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలోని తల్వేద గ్రామానికి చెందిన సాయి ప్రసన్న ఎంపికయ్యింది. పల్లెటూరిలో చదువును ప్రారంభించి, ప్రభుత్వ హాస్టల్‌లో ఉంటూ కఠిన సాధనతో జాతీయ స్థాయికి చేరడం నిజామాబాద్ జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. నిజామాబాద్ జిల్లా భోర్గాన్ (పి) జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో చదువుకుంటున్న సాయి ప్రసన్న ఈనెల 13 నుంచి 15 తేదీ వరకు న్యూఢిల్లీలో జరగనున్న టైక్వాండో నేషనల్ ఛాంపియన్షిప్‌లో పాల్గొననున్నట్లు నిజామాబాద్ టైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కోచ్ మనోజ్ కుమార్ తెలిపారు.

సాయి ప్రసన్న సబ్ జూనియర్ అండర్-32 కేజీ వెయిట్ కేటగిరీలో రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చూపి బంగారు పతకం సాధించడంతో జాతీయ స్థాయికి ఎంపికయ్యారని ఆయన వివరించారు. ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కఠినమైన శిక్షణ, శారీరక శ్రమతో పాటు చదువులోనూ ముందుండటం, టీవీ, మొబైల్‌కు దూరంగా ఉండటం ఈ విజయానికి కారణమని తెలిపారు.

క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో సాయి ప్రసన్న ఈ స్థాయికి చేరుకున్నారని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో కూడా ఉత్తమ ప్రదర్శన కనబర్చి బంగారు పతకం సాధించి నిజామాబాద్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ విజయానికి బస్వ లక్ష్మినారాయణ, తల్లిదండ్రుల సహకారం ఎంతో కీలకమైందని మనోజ్ కుమార్ తెలిపారు.

Continue Reading