Crime
42 చాలాన్లతో పట్టుబడ్డ స్కూటీ


42 చాలాన్లతో పట్టుబడ్డ స్కూటీ
వెహికల్ చెకింగ్ లో భాగంగా బస్టాండ్ దగ్గరలో పట్టణ ట్రాఫిక్ సిబ్బంది
జనం వెలుగు, నిర్మల్ గంటాడి అనిల్:- నిర్మల్ పట్టణ కేంద్రంలో సోమవారం రోజున వెహికల్ చెకింగ్ లో భాగంగా బస్టాండ్ యందు వెహికల్ చెక్ చేస్తూ ఉండగా ఒక మైనర్ బాలుడు స్కూటీ మీద ఒక కాలు మీద ఇంకో కాలు పెట్టుకొని డేంజరస్ గా డ్రైవ్ చేస్తూ ఉండగా ఆ వెహికల్ ని ఆపి ఈ చాలన్ చూడగా సుమారు 26 వేల రూపాయల వరకు 42 వరకు చాలన్స్ వరకు ఉండడం జరిగింది. దీనితో ఆ వెహికల్ ని, ఆ చిన్న బాలుని పోలీస్ స్టేషన్కు తీసుకు రావడం జరిగింది. ఈ సమాచారాన్ని వాళ్ళ తల్లిదండ్రులకు తెలిపి పోలీస్ స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. చాలామంది త్రిబుల్ రైడింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, సిగ్నల్ జంపు కావాలని చేస్తూ పోలీసులకు మేము ఎప్పుడు దొరకమని ట్రాఫిక్ వాయుయేషన్ చేస్తూ వారి యొక్క బండి పైన ఎక్కువ ఫైన్స్ పడేవిధంగా ట్రాఫిక్ వాయులేషన్ రెగ్యులర్గా చేస్తూ ఉన్నారు. పిల్లలు చేసే ట్రాఫిక్ వాయుయేషన్ పేరెంట్స్ పిల్లలకి వెహికల్స్ ఇచ్చేటప్పుడు బయట రోడ్డుపైన ఏమి చేస్తున్నారు, ఎలా డ్రైవ్ చేస్తున్నారు, గమనించగలరని ట్రాఫిక్ పోలీస్ వారు విన్నవించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై దేవేందర్, రాజశేఖర్
Crime
మండల కేంద్రంలో ఇనుపరాట్లతో వ్యక్తిపై దాడి


మండల కేంద్రంలో ఇనుపరాట్లతో వ్యక్తిపై దాడి….
నందిపేట జూన్ 14 జనం వెలుగు: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తా సురేష్ నగర్ కాలనీ ఎదురుగా ఉన్న ఆర్డర్ మెస్ ప్రాంతంలో నందిపేట రాజనగర్ దుబ్బ ప్రాంతానికి చెందిన నయిం అనే వ్యక్తిపై కొందరు వ్యక్తులు కారుపై వచ్చి ఇనుపరాట్లతో దాడి చేయడంతో నయిం తలకు,
చెయ్యికి, పొట్ట ప్రాంతంలో తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నయిం, కయ్యులు అన్నదమ్ములని, వీరి బంధువులైన షేక్ తాలిబ్, షేక్ తాహెర్, సాజిద్, షాహెద్, గాలిబ్ మరి కొంతమంది వ్యక్తులు కారులో వచ్చి రాడ్లతో నయీంపై దాడి చేయడం జరిగిందని,
వీరి ఇరువురి మధ్య పాత కక్షలు ఉన్నాయని, సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నామని, నయీమ్ చికిత్స పొందుతున్నాడని, బాధితుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు, దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు.
Crime
పసిపాపను చంపిన హంతకుల జాడేది


పసిపాపను చంపిన హంతకుల జాడేది.,
నందిపేట జూన్ 14 జనం వెలుగు; నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో దాదాపు 20 రోజుల కిందట మెయిన్ రోడ్డు పాత హనీ రెస్టారెంట్ వెనకాల ఖాళీ స్థలంలో అప్పుడే పుట్టిన పసికందును ఎండలో పడేయడంతో పసికందు మృతి చెందిన ఘటన అందరికీ తెలిసిందే…
కానీ పాప చనిపోయి 20 రోజులు గడిచిన ఆ పసి గుడ్డు నెత్తుటి మరకలు అంటిన అదాంతకుల యాడ మాత్రం తెలిసి రాలేదు. బేటి బచావో… బేటి పడావో…. అనే నినాదాలు పేపర్లకే పరిమితమైనట్టు ఉంది ఈ సంఘటన.. తరతరాల నుండి ఆడపిల్లల పైన ఎన్నో అఘైత్యాలు, ఆడపిల్ల అంటే అలుసే… మగాడు అంటే మురుపమే..
ఈ తారతమ్యాలను రూపుమాపేందుకు ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపట్టిన క్షేత్రస్థాయిలో మాత్రం ఆ లక్ష్యాలను చేదిదిండం లేదు. వెంటనే ఈ దుశ్చర్యలకు పాల్పడిన, ఆ నెత్తుటి మరకల చేతులకు సంకెళ్లు వేస్తేనే మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
Crime
పేకాట స్థావరం పై దాడి.. 9 మంది అరెస్ట్


పేకాట స్థావరం పై దాడి.. 9 మంది అరెస్ట్
నందిపేట జూన్ 14 జనం వెలుగు: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తా పెట్రోల్ బంక్ వెనకాల కాలనీలోని ఓ ఇంటిపై నందిపేట పోలీసులు శనివారం దాడి చేసి పత్తలాడుతున్న 9 మంది వ్యక్తులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి 28 వేల140రూ నగదును, 7 సెల్ ఫోన్లు, 2 బైకులను స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై వినయ్ కుమార్ మాట్లాడుతూ.,.. పక్క సమాచారం మేరకు పెట్రోల్ బంక్ వెనకాల కాలనీలో పేకాట సవరం పై దాడి చేసి పేకాడుతున్న వ్యక్తులను అరెస్టు చేయడం జరిగిందని, జూదం ఆడడం చట్టరీత్యా నేరమని, జూదమే కాదు అసాంఘిక కార్యక్రమాలు ఎవరు పాల్పడిన, మాదకద్రవ్యాలతో సంబంధం ఉన్న, దౌర్జన్యం చేస్తూ ఎదుటివారిని ఇబ్బంది పెట్టినా, చట్ట వ్యతిరేక పనులు చేసే వారిపై ఉక్కు పాదం మోపుతామని, తమ పరిసర ప్రాంతాలలో అసాంఘిక కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.








