Connect with us

Crime

48 గంటల్లో ఇద్దరి ఆత్మహత్యలు కారణాలేంటి?

janamvelugunews

Published

on

బాసర త్రిబుల్ ఐటీలో మరో విద్యార్థిని మృతి

ళాశాలలో వసతి గృహంపై నుండి దూకి ఆత్మహత్య

దీపిక మరణించిన కొన్ని గంటలకే లిఖిత ఆత్మహత్య చేసుకోవడం కళాశాలలో కలకాలం

జనం వెలుగు, బాసర:- రాజీవ్ గాంధీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన విశ్వవిద్యాలయం బాసర త్రిబుల్ ఐటీ లో మంగళవారం దీపికా అనే విద్యార్థి మరణించిన వార్త విధితమే అది మరువకముందే కొన్ని గంటల్లోనే బుధవారం అర్ధరాత్రి అనగా రెండు గంటలకు బాలికల వసతి గృహ పై నుండి దూకి లిఖిత అనే పిసి చదువుతున్న విద్యార్థిని గజ్వేల్ కు చెందిన ఆత్మహత్య చేసుకోవడం కలకాలం సృష్టిస్తుంది దీనితో పలువురు ప్రజా సంఘ నాయకులు, విపక్ష నాయకులు మండిపడుతున్నారు. కళాశాల యాజమాన్యంపై ఈ సందర్భంగా కళాశాల అధికారుల వివరాల మేరకు, గజ్వేల్, గజ్వేల్ సిటీ, సిద్దిపేట జిల్లా వాసి అర్ధరాత్రి రెండు గంటల సమయంలో బాలికల వసతి గృహం 4 వ అంతస్తు నుండి ప్రమాదవశాత్తు కిందికి జారి పడటంతో భద్రతా సిబ్బంది గమనించి, అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థినిని క్యాంపస్ హెల్త్ సెంటర్లో ప్రధమ చికిత్స అనంతరం భైంసా ఏరియా హాస్పిటల్ కి తరలించడం జరిగింది. భైంసా ఏరియా హాస్పిటల్ వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం నిర్మల్ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించడం జరిగింది. అక్కడి వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు ధృవీకరించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Crime

మండల కేంద్రంలో ఇనుపరాట్లతో వ్యక్తిపై దాడి

janamvelugunews

Published

on

మండల కేంద్రంలో ఇనుపరాట్లతో వ్యక్తిపై దాడి….

నందిపేట జూన్ 14 జనం వెలుగు: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తా సురేష్ నగర్ కాలనీ ఎదురుగా ఉన్న ఆర్డర్ మెస్ ప్రాంతంలో నందిపేట రాజనగర్ దుబ్బ ప్రాంతానికి చెందిన నయిం అనే వ్యక్తిపై కొందరు వ్యక్తులు కారుపై వచ్చి ఇనుపరాట్లతో దాడి చేయడంతో నయిం తలకు,

  చెయ్యికి, పొట్ట ప్రాంతంలో తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నయిం, కయ్యులు అన్నదమ్ములని, వీరి బంధువులైన షేక్ తాలిబ్, షేక్ తాహెర్, సాజిద్, షాహెద్, గాలిబ్ మరి కొంతమంది వ్యక్తులు కారులో వచ్చి రాడ్లతో నయీంపై దాడి చేయడం జరిగిందని,

   వీరి ఇరువురి మధ్య పాత కక్షలు ఉన్నాయని, సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నామని, నయీమ్ చికిత్స పొందుతున్నాడని, బాధితుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు, దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు.

Continue Reading

Crime

పసిపాపను చంపిన హంతకుల జాడేది

janamvelugunews

Published

on

పసిపాపను చంపిన హంతకుల జాడేది.,

నందిపేట జూన్ 14 జనం వెలుగు; నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో దాదాపు 20 రోజుల కిందట మెయిన్ రోడ్డు పాత హనీ రెస్టారెంట్ వెనకాల ఖాళీ స్థలంలో అప్పుడే పుట్టిన పసికందును ఎండలో పడేయడంతో పసికందు మృతి చెందిన ఘటన అందరికీ తెలిసిందే…

కానీ పాప చనిపోయి 20 రోజులు గడిచిన ఆ పసి గుడ్డు నెత్తుటి మరకలు అంటిన అదాంతకుల యాడ మాత్రం తెలిసి రాలేదు. బేటి బచావో… బేటి పడావో…. అనే నినాదాలు పేపర్లకే పరిమితమైనట్టు ఉంది ఈ సంఘటన.. తరతరాల నుండి ఆడపిల్లల పైన ఎన్నో అఘైత్యాలు, ఆడపిల్ల అంటే అలుసే… మగాడు అంటే మురుపమే..

   ఈ తారతమ్యాలను రూపుమాపేందుకు ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపట్టిన క్షేత్రస్థాయిలో మాత్రం ఆ లక్ష్యాలను చేదిదిండం లేదు. వెంటనే ఈ దుశ్చర్యలకు పాల్పడిన, ఆ నెత్తుటి మరకల చేతులకు సంకెళ్లు వేస్తేనే మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Continue Reading

Crime

పేకాట స్థావరం పై దాడి.. 9 మంది అరెస్ట్

janamvelugunews

Published

on

పేకాట స్థావరం పై దాడి.. 9 మంది అరెస్ట్

నందిపేట జూన్ 14 జనం వెలుగు: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తా పెట్రోల్ బంక్ వెనకాల కాలనీలోని ఓ ఇంటిపై నందిపేట పోలీసులు శనివారం దాడి చేసి పత్తలాడుతున్న 9 మంది వ్యక్తులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి 28 వేల140రూ నగదును, 7 సెల్ ఫోన్లు, 2 బైకులను స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై వినయ్ కుమార్ మాట్లాడుతూ.,.. పక్క సమాచారం మేరకు పెట్రోల్ బంక్ వెనకాల కాలనీలో పేకాట సవరం పై దాడి చేసి పేకాడుతున్న వ్యక్తులను అరెస్టు చేయడం జరిగిందని, జూదం ఆడడం చట్టరీత్యా నేరమని, జూదమే కాదు అసాంఘిక కార్యక్రమాలు ఎవరు పాల్పడిన, మాదకద్రవ్యాలతో సంబంధం ఉన్న, దౌర్జన్యం చేస్తూ ఎదుటివారిని ఇబ్బంది పెట్టినా, చట్ట వ్యతిరేక పనులు చేసే వారిపై ఉక్కు పాదం మోపుతామని, తమ పరిసర ప్రాంతాలలో అసాంఘిక కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Continue Reading