నిజామాబాద్
35 యేండ్లుగా నరేంద్ర స్మారక పోటీలు నిర్వహించటం అభినందీయం డాక్టర్ జలగం తిరుపతి రావు


35 యేండ్లుగా నరేంద్ర స్మారక పోటీలు నిర్వహించటం అభినందీయం డాక్టర్ జలగం తిరుపతి రావు
జనంవెలుగు, నిజామాబాద్, జనవరి 27:- విధి నిర్వహణలో జర్నలిస్టు మల్లెపూల నరేంద్ర ఆకస్మికంగా మరణించి 35 యేండ్లు గడుస్తున్న ఆయనను గుర్తు పెట్టుకుని జర్నలిస్టులు నరేంద్ర స్మారక క్రీడా పోటీలు నిర్వహించటం అభినందీయమని ప్రముఖ వైద్యుడు జలగం తిరుపతి రావు అన్నారు. నరేంద్ర మెమోరియల్, నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ఆఫీసర్స్ క్లబ్ లో మంగళవారం జర్నలిస్టులకు షటిల్ టొర్నమెంట్ జరిగింది. ఈ పోటీలను ప్రారంభించిన వైద్యుడు తిరుపతిరావు మాట్లాడుతూ అన్నిరకాల వయస్సుల గల జర్నలిస్టులు, వైద్యులు, అధికారులు అన్నిరంగాల్లో నిష్ణాతులైన ఉన్నారు. ఎంత వయస్సు ఉన్న సరే వయస్సు నంబరే తప్పా మనస్సుకు కాదన్నారు. అటువంటి వారిని ప్రోత్సహించేందుకు ఇలాంటి క్రీడాలు ఎంతో ఉపయోగ పడుతాయన్నారు. ప్రస్తుతం యువత మోబైల్లో గేమ్స్, వీడియో గేమ్స్ కు అలవాటై పోతున్నారు. మైదానంలో ఆడే క్రీడాలను పూర్తిగా మరిచి పోతున్నారు.
మైదానంలో ఆడే క్రీడాలతోనే శారీరకంగా, మానసికంగా, ఉత్సహంగా,
ఉల్లాసంగా ఉంటుందన్నారు. చాలమంది చదువుతో ఒత్తిడిలకు గురైవుతున్నారు. అటువంటి వారికి ఆటలు ఆడటం అలవాటు ఉన్నట్లు అయితే ఒత్తిడిలు తగ్గి వారి ఆరోగ్యం మెరుగైతుందన్నారు. ఇలాంటి క్రీడాలను గత 35 సంవత్సరాలుగా పాత్రహిస్తున్న మల్లెపూల నరేంద్ర మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్, కన్వీనర్, ప్రెస్ క్లబ్ జర్నలిస్టులను అభినందించారు. ఈ కార్యక్రమంలో నరేంద్ర మెమోరియల్ స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ డి సాయిలు, కన్వీనర్ మల్లెపూల నర్సయ్య, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పంచరెడ్డి శ్రీకాంత్, ఐజేయూ నాయకులు బొబ్బిలి నర్సయ్య, ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యుడు చింతల గంగాదాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు
హైమద్ అలీఖాన్, ప్రెస్ క్లబర్ ప్రధాన కార్యదర్శి వాగ్మేరే సుభాష్, కోశాధికారి రాజ్కుమార్, ఆఫీసర్స్ క్లబ్ మేనేజర్ సురేష్, జర్నలిస్టులు పాల్గొన్నారు.
షటీల్ విజేతలు
జర్నలిస్టు నరేంద్ర స్మారకార్ధం నిర్వహించిన షటిల్ పోటిల ఫైనల్ మ్యాచ్ లో భానుతేజ, సందీప్ ల పై శ్రీకాంత్, రాజలింగం జట్టు 6 -15 తేడాతో గెలుపొందింది.
నిజామాబాద్
అమర పోలీసు కుటుంబానికి ప్రభుత్వోద్యోగం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం


అమర పోలీసు కుటుంబానికి ప్రభుత్వోద్యోగం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం
సిపి సాయి చైతన్య.
జనం వెలుగు ఆర్మూర్:- 2025 సంవత్సరంలో విధి నిర్వాహణలో పోలీసు కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ 1923, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తు జారీ చేసిన నియామక ఉత్తర్వుల పత్రాన్ని ఆ కుటుంబానికి నిజామాబాద్ పోలీసు కమీషనర్ సాయి చైతన్య అందజేశాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమర వీరుల కుటుంబాలను ఆదుకునే చర్యలలో భాగంగా పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రమోద్ కుమార్ కుటుంబ (ప్రణిత) సభ్యులకు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగ నియామక ఉత్తర్వుల పత్రాన్ని అందజేశాడు.
పోలీసు విధి నిర్వాహణలో అమరుడైన ప్రమోద్ కుమార్ చేసిన సేవలను స్మరించుకుంటూ, విధి నిర్వాహణలో ప్రాణాలర్పించిన అమర వీరుల త్యాగాలను ఎప్పటికి మరువదని ఆయన అన్నాడు. అమర వీరులకు టుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వారి సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తొందని ఆయన అన్నాడు. దేశం కోసం, ప్రజల కోసం తమ ప్రాణాలను సహితం లెక్క చేయ కుండా విధులను నిర్వహించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఆయన వివరించాడు.
నిజామాబాద్
ప్రజా సేవలో నిజామాబాద్ రీజియన్ టీజీఎస్‌ఆర్టీసీ


ప్రజా సేవలో నిజామాబాద్ రీజియన్ టీజీఎస్‌ఆర్టీసీ
రీజినల్ మేనేజర్ ఎస్ వి జి కృష్ణమూర్తి
జనంవెలుగు నిజామాబాద్ :– నిజామాబాద్ రీజియన్ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు, నగరాల నుంచి తిరిగి గ్రామాలకు ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్‌ఆర్టీసీ బస్సు సేవలను వినియోగించుకోవాలని ప్రాంతీయ మేనేజర్ ఎస్.వి.జి.కృష్ణ మూర్తి ప్రజలకు సూచించారు.
ప్రజలు తమ ప్రయాణాలను సులభంగా, సౌకర్యవంతంగా ప్లాన్ చేసుకోవడానికి టీజీఎస్‌ఆర్టీసీ ఆన్‌లైన్ బుకింగ్ సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచింది.
ప్రయాణికులు www.tgsrtcbus.in వెబ్‌సైట్‌ను, అందుబాటులో ఉన్న బస్సు సర్వీసుల వివరాలను తెలుసుకోవడంతో పాటు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
ప్రయాణికులు ముందుగానే ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవడం ద్వారా తమ ప్రయాణాన్ని మరింత సులభతరం చేసుకోవచ్చు.
ప్రయాణికులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ రిజినల్ మేనేజర్ ఎస్ వి జి కృష్ణమూర్తి కోరారు.
నిజామాబాద్
మద్యాహ్న భోజనం అమలులో నిర్లక్ష్యం..


మద్యాహ్న భోజనం అమలులో నిర్లక్ష్యం..
కమలాపూర్ హైస్కూల్ ఇన్‌చార్జి హెచ్.ఎంపై సస్పెన్షన్ వేటు
జనంవెలుగు నిజామాబాద్:- నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం కమలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలులో నిర్లక్ష్యం వహించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అ పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు అమర్ సింగ్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు.
2026 సెప్టెంబర్ 15 నుంచి 22వ తేదీ వరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడంలో నిర్లక్ష్యం జరిగినట్లు పలు వార్తా పత్రికల్లో ప్రచురితమైన కథనాలతో పాటు సంబంధిత అధికారులకు అందిన ఫిర్యాదులపై స్పందించిన కలెక్టర్, ఈ ఉదంతంపై విచారణ జరిపించారు.
ఈ సందర్భంగా మద్యాహ్న భోజనం అమలులో అలసత్వం చోటుచేసుకున్నట్లు వెల్లడి కాగా, విచారణ నివేదిక ఆధారంగా, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని ఇంచార్జి హెచ్.ఎం అమర్ సింగ్ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
విద్యార్థులకు అందాల్సిన సంక్షేమ పథకాలు, ప్రయోజనాల అమలులో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించబోమని ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు.








