Connect with us

నిజామాబాద్

| Nizamabad మున్సిపల్ ఎన్నికలను సాఫీగా నిర్వహించాలి

janamvelugunews

Published

on

మున్సిపల్ ఎన్నికలను సాఫీగా నిర్వహించాలి

కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం దిశా నిర్దేశం

జనంవెలుగు, నిజామాబాద్, జనవరి 27: ఎలాంటి అవాంతరాలు, లోటుపాట్లకు తావులేకుండా మున్సిపల్ ఎన్నికలను పూర్తి పారదర్శకంగా, సాఫీగా జరిపించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీ కుముదిని సూచించారు. మంగళవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీ.జీ.పీ శివధర్ రెడ్డిలతో కలిసి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్‌లకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా కట్టుదిట్టంగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా పర్యవేక్షణ జరపాలన్నారు.

     ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, ఎన్నికల సంఘం నియమ, నిబంధనలకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని అన్నారు. జిల్లాలో నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీలు ఉన్నాయని, మొత్తం 146 వార్డులకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎన్నికల కమిషనర్ దృష్టికి తెచ్చారు. ఎన్నికల షెడ్యూల్ ను అనుసరిస్తూ బుధవారం నుండి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు వీలుగా ఆయా మున్సిపాలిటీల పరిధిలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. నిజామాబాద్ నగరం, బోధన్ పట్టణాలలో ఎన్నికల భద్రత విషయంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్ జరిపిస్తామని అన్నారు.

      వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ మున్సిపల్ కమిషనర్లు, నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. నోడల్ అధికారులు తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆదేశించారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలకు తావు లేకుండా, అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఎన్నికల నియమావళిని తు.చ తప్పక పాటించాలని, మున్సిపల్ పట్టణ పరిధిలో రాజకీయ పార్టీల బ్యానర్లు, ఫ్లెక్సీలు, పోస్టర్లు, ఫోటోలు, ఇతర ప్రచార సామాగ్రిని తొలగించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశించారు.

నామినేషన్ సెంటర్లలోని అన్ని గదులకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, అలాగే నిబంధనల ప్రకారం అన్ని సౌకర్యాలు కల్పించాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో పొలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, కామారెడ్డి ఇంచార్జి అదనపు కలెక్టర్ మధుమోహన్, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియా, కిరణ్మయి, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిజామాబాద్

| nandipet ఘనంగా ప్రజా పాలన మండల స్థాయి సమావేశం 

janamvelugunews

Published

on

ఘనంగా ప్రజా పాలన మండల స్థాయి సమావేశం 

 జనంవెలుగు, నందిపేట్:- ప్రజా పాలనలో భాగంగా గురువారం నందిపేట మండల కేంద్ర సాయిబాబా ఫంక్షన్ హాల్ లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అనే నినాదంతో మండల స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్ ఏడి శ్రీనివాసులు పాల్గొన్న ఈ సమావేశానికి వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు మండల పాలన సిబ్బంది హాజరయ్యారు,

ఈ కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది కూడా పాల్గొని అనుకోకుండా జరిగే అగ్ని ప్రమాదాలను ఎలా నివారించవచ్చో, గ్యాస్ సిలిండర్ల ప్రమాదం జరిగినప్పుడు ప్రజలు ఎలా స్పందించాలో అగ్నిమాపక సిబ్బంది ప్రత్యక్షంగా చేసి చూయించి అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాసరావు మాట్లాడుతూ.., ప్రజల సంక్షేమం ప్రభుత్వ ధ్యేయం అనే లక్ష్యంతో రాష్ట్రంలో ప్రజాప పాలన కార్యక్రమాలు జరుపుకోవడం జరిగిందని, అందులో భాగంగానే ఈరోజు మండల స్థాయి సమావేశం జరుపుకుంటున్నామన్నారు.

ప్రజాభివృద్ధి కొరకు క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిగణలోకి తీసుకొని వారికి మంచి ఫలితాలను అందించేందుకే ప్రజాపాలన కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ఈ ప్రజా పాలన కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారులకు ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా సహకరించిన ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు.

మండల కేంద్ర సర్పంచ్ సిలిండర్ లింగం మాట్లాడుతూ…. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రజా పాలన కార్యక్రమానికి అద్భుత ఫలితాలు వస్తున్నాయని, ఎందుకంటే గ్రామ స్థాయిలో ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్యలపై ప్రజాపాలనలో సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉండి తక్షణమే

నిర్ణయం తీసుకోవడం వల్ల పరిష్కారం దొరుకుతుందని, లబ్ధిదారులకు అధికారులకు వారధిగా ఈ ప్రజా పాలన కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని కొనియాడారు. తాసిల్దార్ సంతోష్ రెడ్డి, ఆర్ ఐ, ఎ ఎస్ఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. వివిధ గ్రామాల సర్పంచులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు, యువకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Continue Reading

నిజామాబాద్

|nizamabad పనుల్లో వేగం పెంచాలి

janamvelugunews

Published

on

పనుల్లో వేగం పెంచాలి
* యూజీడీ కనెక్షన్ పనులను పర్యవేక్షించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా…

ఇందూరు: అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కి ఇంటి నుంచి ఇచ్చే కనెక్షన్ల పనుల్లో వేగం పెంచాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. నగరంలోని 24వ డివిజన్ గాయత్రి నగర్ లో గురువారం యుజిడి అనుసంధాన పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తయిన చోట మున్సిపల్ పబ్లిక్ హెల్త్ శాఖ ఆధ్వర్యంలో కనెక్షన్ లు ఇస్తున్నారన్నారు.

నగరవాసులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అయితే పనులు నాణ్యతతో చేపట్టాలని, ఇంటి యజమానులకు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సరైన పద్ధతిలో పనులు పూర్తి చేయాలన్నారు. అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. పనులు చేసే బృందాలని పెంచాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్లు ఇపకాయల సుమిత్రా కిషోర్, మఠం పవన్, చింతకాయల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

నిజామాబాద్

|Armoor సిబిఎస్ఇ పదో తరగతి ఫలితాల్లో క్షత్రియ విద్యార్థుల ప్రభంజనం

janamvelugunews

Published

on

సిబిఎస్ఇ పదో తరగతి ఫలితాల్లో క్షత్రియ విద్యార్థుల ప్రభంజనం
జనం వెలుగు ఆర్మూర్:- నిన్న వెలువడిన సిబిఎస్ఇ 2025- 2026 పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో క్షత్రియ విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించారని ఆ పాఠశాల ప్రిన్సిపాల్ డా. విజయలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించబడిన విద్యార్థుల అభినందన కార్యక్రమం లో విద్యార్థులు తమ స్వీయ అను భవాలను, అధ్యాపకుల కృషిని తెలియజేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఏనుగు ప్రణతి 483/500 మార్కులతో ప్రథమ స్థానం, ముకుంద్ హర్షిణి 462/500 మార్కులతో ద్వితీయ స్థానాన్ని (బెస్టాఫ్ 5 ఔట్ ఆఫ్ 6 సబ్జెక్ట్స్) పొందినారు.

ఈ సందర్భం గా స్కూల్ ప్రిన్సిపాల్ డా. విజయ లక్ష్మి మాట్లాడుతూ 100 శాతం ఉత్తీర్ణతతో మెరుగైన ఫలితాలను సాధించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, రాబోయే రోజుల్లో స్ఫూర్తి వంత మైన ప్రణాళికను రూపొందించుకొని మరింత మెరుగైన ఫలితాలను సాధిస్తామని ఆమె అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందిస్తూ చదువుతో పాటు సంస్కారాన్ని పాటిస్తూ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆమె ఆకాంక్షించారు.

స్కూల్ కరెస్పాండెం ట్ అల్జాపూర్ దేవేందర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్య, సంస్కారవంతమైన నైతిక విలువలను పెంపొందించే లక్ష్యంతో క్షత్రియ పాఠశాలను స్థా పించమని జరిగిందని అన్నాడు. ఇట్టి ఫలితాలకు విశేష కృషికి పాటుపడిన ప్రతి ఒక్కరిని ఆయన అభినందించాడు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల కోశాధికారి అల్జా పూర్ గంగాధర్, డైరెక్టర్ అల్జాపూర్ వీరేందర్, అధ్యాపాక బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Continue Reading