నిజామాబాద్
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్,.సీ.పీ


ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్,.సీ.పీ
జనంవెలుగు, నిజామాబాద్, ఫిబ్రవరి 03: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 6న నిజామాబాద్ జిల్లా పర్యటనకు హాజరు కానున్న నేపథ్యంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, పొలీస్ కమిషనర్ పి.సాయిచైతన్య జిల్లా అధికారులతో కలిసి మంగళవారం సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోని బైపాస్ రోడ్డుకు ఆనుకుని ఉన్న ప్రాంతాన్ని సీ.ఎం సభా స్థలిగా ఖరారు చేసిన నేపధ్యంలో కలెక్టర్, సీ.పీ క్షేత్రస్థాయిలో ఆ ప్రాంతాన్ని సందర్శించి ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు.
సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. హెలిప్యాడ్, వేదిక తదితర వాటి ఏర్పాట్లను నిర్ణీత గడువు కంటే ముందుగానే పూర్తి చేయాలన్నారు. బహిరంగ సభకు వచ్చే వారు వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి భద్రతకు పకడ్బందీ బందోబస్తును ఏర్పాటు చేయాలని, సీ.ఎం పర్యటన నేపథ్యంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఆయా శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో పని చేయాలని హితవు పలికారు.
ముందస్తుగానే ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని సూచించారు. వీరి వెంట అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, అదనపు డీ.సీ.పీ బస్వారెడ్డి, డీఆర్డీఓ సాయాగౌడ్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఆర్ అండ్ బీ ఎస్.ఈ సర్దార్ సింగ్, ట్రాన్స్కో ఎస్.ఈ రాజేశ్వర్, ఆర్టీసీ ఆర్.ఎం జ్యోత్స్న, డీ.పీ.ఓ శ్రీనివాస్ రావు, డీ.ఎం.హెచ్.ఓ డాక్టర్ రాజశ్రీ తదితరులు ఉన్నారు.
నిజామాబాద్
అమర పోలీసు కుటుంబానికి ప్రభుత్వోద్యోగం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం


అమర పోలీసు కుటుంబానికి ప్రభుత్వోద్యోగం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం
సిపి సాయి చైతన్య.
జనం వెలుగు ఆర్మూర్:- 2025 సంవత్సరంలో విధి నిర్వాహణలో పోలీసు కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ 1923, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తు జారీ చేసిన నియామక ఉత్తర్వుల పత్రాన్ని ఆ కుటుంబానికి నిజామాబాద్ పోలీసు కమీషనర్ సాయి చైతన్య అందజేశాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమర వీరుల కుటుంబాలను ఆదుకునే చర్యలలో భాగంగా పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రమోద్ కుమార్ కుటుంబ (ప్రణిత) సభ్యులకు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగ నియామక ఉత్తర్వుల పత్రాన్ని అందజేశాడు.
పోలీసు విధి నిర్వాహణలో అమరుడైన ప్రమోద్ కుమార్ చేసిన సేవలను స్మరించుకుంటూ, విధి నిర్వాహణలో ప్రాణాలర్పించిన అమర వీరుల త్యాగాలను ఎప్పటికి మరువదని ఆయన అన్నాడు. అమర వీరులకు టుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వారి సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తొందని ఆయన అన్నాడు. దేశం కోసం, ప్రజల కోసం తమ ప్రాణాలను సహితం లెక్క చేయ కుండా విధులను నిర్వహించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఆయన వివరించాడు.
నిజామాబాద్
ప్రజా సేవలో నిజామాబాద్ రీజియన్ టీజీఎస్ఆర్టీసీ


ప్రజా సేవలో నిజామాబాద్ రీజియన్ టీజీఎస్ఆర్టీసీ
రీజినల్ మేనేజర్ ఎస్ వి జి కృష్ణమూర్తి
జనంవెలుగు నిజామాబాద్ :– నిజామాబాద్ రీజియన్ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు, నగరాల నుంచి తిరిగి గ్రామాలకు ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ బస్సు సేవలను వినియోగించుకోవాలని ప్రాంతీయ మేనేజర్ ఎస్.వి.జి.కృష్ణ మూర్తి ప్రజలకు సూచించారు.
ప్రజలు తమ ప్రయాణాలను సులభంగా, సౌకర్యవంతంగా ప్లాన్ చేసుకోవడానికి టీజీఎస్ఆర్టీసీ ఆన్లైన్ బుకింగ్ సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచింది.
ప్రయాణికులు www.tgsrtcbus.in వెబ్సైట్ను, అందుబాటులో ఉన్న బస్సు సర్వీసుల వివరాలను తెలుసుకోవడంతో పాటు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
ప్రయాణికులు ముందుగానే ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవడం ద్వారా తమ ప్రయాణాన్ని మరింత సులభతరం చేసుకోవచ్చు.
ప్రయాణికులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ రిజినల్ మేనేజర్ ఎస్ వి జి కృష్ణమూర్తి కోరారు.
నిజామాబాద్
మద్యాహ్న భోజనం అమలులో నిర్లక్ష్యం..


మద్యాహ్న భోజనం అమలులో నిర్లక్ష్యం..
కమలాపూర్ హైస్కూల్ ఇన్చార్జి హెచ్.ఎంపై సస్పెన్షన్ వేటు
జనంవెలుగు నిజామాబాద్:- నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం కమలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలులో నిర్లక్ష్యం వహించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అ పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు అమర్ సింగ్ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు.
2026 సెప్టెంబర్ 15 నుంచి 22వ తేదీ వరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడంలో నిర్లక్ష్యం జరిగినట్లు పలు వార్తా పత్రికల్లో ప్రచురితమైన కథనాలతో పాటు సంబంధిత అధికారులకు అందిన ఫిర్యాదులపై స్పందించిన కలెక్టర్, ఈ ఉదంతంపై విచారణ జరిపించారు.
ఈ సందర్భంగా మద్యాహ్న భోజనం అమలులో అలసత్వం చోటుచేసుకున్నట్లు వెల్లడి కాగా, విచారణ నివేదిక ఆధారంగా, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని ఇంచార్జి హెచ్.ఎం అమర్ సింగ్ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
విద్యార్థులకు అందాల్సిన సంక్షేమ పథకాలు, ప్రయోజనాల అమలులో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించబోమని ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు.








