నిజామాబాద్
నిజామాబాద్ జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఏర్పాటు


నిజామాబాద్ జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఏర్పాటు
జనంవెలుగు, నిజామాబాద్: జిల్లాకు సంబంధించిన మీడియా అక్రిడిటేషన్ కమిటీని రెండేళ్ల కాలపరిమితికి ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో సభ్యులుగా ఏ. నర్సింలు, ఆర్. భూపతి, జి. సాయిప్రసాద్, సి.హెచ్. జాన్సన్, ఎం.ఏ. మాజీద్, కె. రామ్ దయానంద్, మొహమ్మద్ గౌస్, ఎల్. బాలకుమార్, ఎన్. శ్రీనివాస్, బి. శ్రీకాంత్‌లను నియమించారు.
మీడియా ప్రతినిధుల అక్రిడిటేషన్‌కు సంబంధించిన విషయాలను పరిశీలించడం, అర్హులైన వారికి గుర్తింపు కార్డులు జారీ చేసే ప్రక్రియను సమర్థంగా నిర్వహించడం ఈ కమిటీ బాధ్యతగా ఉంటుంది. జిల్లాలో మీడియా వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా కొనసాగించేందుకు ఈ కమిటీ కీలక పాత్ర పోషించనుంది.
నిజామాబాద్
శివమెత్తిన మహిళా శివంగులు


శివమెత్తిన మహిళా శివంగులు


జనం వెలుగు, నందిపేట్: నందిపేట మండల కేంద్రంలో శుక్రవారం మండల కేంద్ర మహిళా సంఘాల మహిళలంతా కలిసి తమకు చెందిన సంఘం స్థలాన్ని కొందరు వ్యక్తులు కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తూ బస్టాండ్ ఎదురుగా పెద్ద ఎత్తున ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు.
మండల కేంద్ర బిఎస్ఎన్ఎల్ ఆఫీసు పక్కన గల మహిళా సంఘం స్థలంలో పక్కనే ఉన్న బ్రహ్మంగారి ఆలయానికి సంబంధించిన పిల్లర్లను నిర్మించడంతో మహిళలంతా కలిసి గ్రామపంచాయతీ వరకు వెళ్లి సర్పంచ్ కు సెక్రటరీకి ఫిర్యాదు చేసి బస్టాండ్ ఎదురుగా కొద్దిసేపు ధర్నా చేసి అనంతరం మహిళా సంఘం భవనం ఆవరణలో కట్టిన పిల్లర్లను కూల దోశారు.
ఈ సందర్భంగా మహిళా సమైక్య అధ్యక్షులు ఎర్రం పద్మ మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి మహిళా సంఘాల మహిళలంతా 30 రూపాయల నుండి పొదుపు చేసుకుంటూ మహిళా గ్రూపులను తయారు చేసుకున్నామని అప్పటినుండి ఎన్నో బాధలను భరిస్తూ మహిళా భవనాన్ని కాపాడుకుంటూ వస్తున్నామని, మండల కేంద్రంలో ఏడు సంఘాలతో దాదాపు 3000 మందికి ఈ భవనం ఒకటే దిక్కని,
ఈ భవనంలో కనీస అవసరాలైన బాత్రూంల సదుపాయాలు కూడా లేకున్నా సమావేశాలను అలాగే నిర్వహించుకుంటున్నామని, ఈ చిన్న భవనాన్ని కాస్త పక్కనున్న బ్రహ్మంగారి టెంపుల్ వారు ఆక్రమించుకోవడం ఎంత మట్టుకు సమంజసం అని అన్నారు. గత నెల రోజులుగా అధికారులకు గ్రామపంచాయతీ సెక్రటరీకి మొరపెట్టుకుంటున్నామని, అయినా ఎవరినీ ఖాతరు చేయకుండా రాత్రికి రాత్రే పిల్లర్లను
వేశారని అందుకే ఈరోజు మా మహిళలంతా ఆగ్రహించి చివరిసారిగా గ్రామపంచాయతీలో ఫిర్యాదు చేసి బస్టాండ్ ఎదురుగా మా నిరసన వ్యక్తం చేసి మా సంఘ భవనంలో అక్రమంగా కట్టిన కట్టడాలను కూల్చివేశామన్నారు. వెంటనే కబ్జా చేసిన వారిపై చర్య తీసుకుని మా సంఘ భవనానికి హద్దులు నిర్ణయించి భవనంలో సదుపాయాలు కల్పించాలని లేదంటే కలెక్టర్ వరకు వెళ్లేందుకు సిద్ధమని హెచ్చరించారు.
నిజామాబాద్
రూరల్ ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన టీజీఎస్ఆర్టీసి ఆర్. ఎం. డిప్యూటీ ఆర్ ఎం.


రూరల్ ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన టీజీఎస్ఆర్టీసి ఆర్. ఎం. డిప్యూటీ ఆర్ ఎం.
టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ మేనేజర్ ఎస్.వి.జి.కె. మూర్తి. డిప్యూటీ రీజినల్ మేనేజర్ పి. జ్యోతి గురువారం నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్ జిల్లాలో ప్రజలకు మరింత మెరుగైన, సౌకర్యవంతమైన రవాణా సేవలు అందించేందుకు టీజీఎస్ఆర్టీసీ చేపడుతున్న కార్యక్రమాలపై చర్చించారు. అలాగే ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందించేందుకు ప్రజాప్రతినిధుల సహకారం అవసరమని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి టీజీఎస్ఆర్టీసీ ప్రజా రవాణా సేవలను అభినందిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా సేవలను మరింత విస్తరించాలని సూచించారు.
నిజామాబాద్
అరణ్య అర్బన్ పార్కును వర్చువల్ గా ప్రారంభోత్సవం చేసిన సీ.ఎం


అరణ్య అర్బన్ పార్కును వర్చువల్ గా ప్రారంభోత్సవం చేసిన సీ.ఎం
పాల్గొన్న ఎమ్మెల్యే, కలెక్టర్
వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు, అధికారులు
నిజామాబాద్ జూన్ 18: నిజామాబాద్ నగర శివారులో గల మాక్లూర్ మండలం చిన్నాపూర్ వద్ద ఏర్పాటు చేసిన అరణ్య అర్బన్ పార్క్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వర్చువల్ పద్ధతిలో గురువారం గుర్రంగూడ నుండి లాంఛనంగా ప్రారంభించారు. ఆర్మూర్ శాసన సభ్యులు పైడి రాకేష్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అర్పన, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, వి. భుజంగ రావు, అదనపు డీసీపీ శుభం ప్రకాష్ నగ్రాలే, జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ తదితరులు అరణ్య అర్బన్ పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. సఫారీ వాహనంలో పర్యటించి అర్బన్ పార్క్ లో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. ఓపెన్ జిమ్ లు, వాకింగ్ ట్రాక్, ప్లే జోన్ ఏరియా, కల్వర్టులు, పర్కులేషన్ ట్యాంకులు, వాచ్ టవర్, సోలార్ ద్వారా నడిచే బోరుబావులు, రోడ్డు వసతులను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, అటవీ ప్రాంతాన్ని కాపాడడానికి ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ అధికారులు, సిబ్బంది అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. పచ్చదనాన్ని పెంపొందిస్తూ, వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు, ప్రజలకు ఆహ్లాదం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అటవీ ప్రాంత అభివృద్ధి కోసం ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో అటవీ శాఖ కార్యక్రమాలను సైతం ప్రభుత్వం కొనసాగించిందని గుర్తు చేశారు. మొక్కల పెంపకం ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ గుర్తెరిగి విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించేలా కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. చెట్లు నరకడం ఎంతో సులభం అని, కానీ పర్యావరణానికి, ప్రాణికోటికి ఎంతో మేలు చేకూర్చే మొక్కలు నాటి, వాటిని కాపాడడం గురించి ఎంతో మంది తమకు ఎందుకులే అని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందరి భాగస్వామ్యం ఉన్నప్పుడే, పచ్చదనం పెంపొందించబడుతుందని అన్నారు. జిల్లాలో అటవీ శాఖ పరంగా చేపట్టే కార్యక్రమాలకు. జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.
ఆర్మూర్ శాసన సభ్యులు పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, 63వ నెంబర్ జాతీయ రహదారికి ఆనుకుని, నిజామాబాద్ నగరానికి ఐదు కిలోమీటర్ల దూరంలోనే 476 ఎకరాల విస్తీర్ణంలో అరణ్య అర్బన్ పార్క్ ప్రజలకు అందుబాటులోకి రావడం ఎంతో సంతోషం కలిగించిందని అన్నారు. దైనందిన కార్యకలాపాలతో అలసిన వారికి అర్బన్ పార్క్ ఆహ్లాదం పంచుతుందని, వ్యాయామం చేసుకునే వారికి మరింత వెసులుబాటు ఏర్పడిందని అన్నారు. అర్బన్ పార్క్ లో మరిన్ని వసతులు అందుబాటులో తెచ్చేలా జిల్లా యంత్రాంగం చొరవ చూపాలని అన్నారు. అర్బన్ పార్క్ లో అసాంఘిక శక్తులకు ప్రవేశం లేకుండా గట్టి నిఘా ఉంచాలని అటవీ అధికారులకు సూచించారు. అటవీ ప్రాంత సంరక్షణ, విస్తీర్ణం పెంపొందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. పచ్చదనం పెంపొందించే కార్యక్రమాల్లో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని, పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సూచించారు. అడవులకు నష్టం కలిగించే వారి పట్ల అటవీశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ సాయన్న, డీఎఫ్ఓ సుధాకర్, సర్పంచ్ లు కే.లత, గంగాధర్, చిన్నా, విద్యార్థిని, విద్యార్థులు, అటవీ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.








