నిజామాబాద్
టీ జి ఎస్ ఆర్ టి సి ప్రభుత్వంలో విలీన ప్రక్రియ వేగవంతం


టీ జి ఎస్ ఆర్ టి సి ప్రభుత్వంలో విలీన ప్రక్రియ వేగవంతం
నిజామాబాద్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ఎస్ వి జి కే మూర్తి
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్నత కమిటీ ఏర్పాటు
కార్మిక సంఘాల ప్రతినిధులు విలీన ప్రక్రియలో భాగస్వాములు
టీ జి ఎస్ ఆర్ టి సి ని ప్రభుత్వంలో విలీన ప్రక్రియ వేగవంతం చేసిందని రాష్ట్ర ప్రభుత్వం దీనికి సానుకూలంగా ఉందని నిజామాబాద్ రీజినల్ మేనేజర్ ఎస్ వి జి కె మూర్తి శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు. రీజినల్ మేనేజర్ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీన ప్రక్రియ తాజా పురోగతిపై స్పష్టత ఇస్తూ కార్మికుల చిరకాల స్వప్నం అయిన విలీన ప్రక్రియ అనేది మన సంస్థను పురోగతి వైపు నడిపిస్తుందని ఆయన అన్నారు.ఈ చారిత్రాత్మక నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సానుకూలంగా ఉందని దీనికి నాకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. గత ఏప్రిల్ సమ్మె సమయంలో ముఖ్యమైన మూడు అంశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ పరిశీలించి సానుకూలంగా పరిగణించిందని ఇందులో 2021 వేతన సవరణ యూనియన్ల పునరుద్ధరణ మరియు ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. ఆర్టిసి విలీన అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిందన్నారు.ఈ కమిటీ ఇప్పటికే ప్రత్యేకంగా సమావేశమై విలీనానికి సంబంధించిన అన్ని సాంకేతిక, ఆర్థిక, పరిపాలన పరమైన అంశాలపై లోతైన సమీక్ష నిర్వహించిందని,సమ్మె కాలంలో మిగిలిన డిమాండ్లపై ఆర్టీసీ ఈడీల కమిటీ కార్మిక సంఘాలతో చర్చ జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని డిపోలలో కార్మిక శాఖ పర్యవేక్షణ అత్యంత పారాధర్షక పద్ధతి లో యూనియన్ వెరిఫికేషన్ ప్రక్రియ ను నిర్వహించడాతగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికల్లో ప్రజా స్వామ్య బద్దంగా మెజారిటీ సాధించిన కార్మిక సంఘాల ప్రతినిధులను విలీన ప్రక్రియలో ప్రత్యక్ష భాగస్వాములను చేస్తామన్నారు. ప్రతినిధుల నుండి వచ్చే విలువైన సూచనలు, సలహాలను కాబినెట్ సబ్ కమిటీ పరిశీలన కు పంపి అందరికి ఆమోద యోగ్యంగా, వందకు వంద శాతం పారదర్శకంగా విలీన తుది ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. కార్మికుల భవిష్యత్తు కు భద్రత కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని, తమ విధులను అంకిత భావం తో నిర్వహిస్తూ సంస్థ అభివృద్ధి కి ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమం లో అసిస్టెంట్ మేనేజర్ ట్రాఫిక్ సత్యనారాయణ పాల్గొన్నారు.
నిజామాబాద్
ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన ప్రోత్సహికుడికి రాష్ట్ర గవర్నర్ అవార్డు – కలెక్టర్ అభినందనలు


ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన ప్రోత్సహికుడికి రాష్ట్ర గవర్నర్ అవార్డు – కలెక్టర్ అభినందనలు
ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని లోక్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లచే ప్రదానం చేసిన వ్యక్తిగత అత్యధిక రక్తదాన ప్రోత్సహికుడు (Individual Highest Blood Donor Motivator) అవార్డును రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కార్యదర్శి ప్రశాంత్ అందుకున్నారు. రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు లోక రమణ రెడ్డి తరఫున ఈ అవార్డును ఆయన స్వీకరించారు.
ఈ సందర్భంగా నేడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ మరియు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, నిజామాబాద్ జిల్లా శాఖ అధ్యక్షులు ఇలా త్రిపాఠి, ఐఏఎస్ అవార్డు గ్రహీత ప్రశాంత్‌ను అభినందించారు. జిల్లాలో తలసేమియా బాధిత చిన్నారులకు నిరంతరాయంగా రక్తం అందుబాటులో ఉండేందుకు వివిధ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు క్రమం తప్పకుండా రక్తదాన శిబిరాలను నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. రక్తదానం ద్వారా అనేక ప్రాణాలను కాపాడవచ్చని, సమాజంలో ప్రతి ఒక్కరూ రక్తదానం పట్ల అవగాహన పెంపొందించుకోవాలని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి సాయాగౌడ్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్, జిల్లా కోశాధికారి కరిపే రవీందర్, జిల్లా కార్యదర్శి గోక అరుణ్ బాబు, మోపాల్ మండల చైర్మన్ వెంకటేశ్వర్లు, పి.ఆర్.ఓ బొద్దుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్
ప్రజావాణికి 135 ఫిర్యాదులు


ప్రజావాణికి 135 ఫిర్యాదులు
నిజామాబాద్, జూన్ 15 : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 135 ఫిర్యాదులు అందాయి. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగరావు, ట్రైనీ కలెక్టర్ పి.సురేష్, డీఆర్ఓ గీత, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
ప్రజావాణి అనంతరం కలెక్టర్ అధికారులకు పలు అంశాలపై సూచనలు చేశారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అయినందున అన్ని వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. జిల్లా అధికారులతో పాటు మండల స్పెషల్ ఆఫీసర్లు, ఆర్.సీ.ఓలు విధిగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. బాలికల పాఠశాలల్లో ఎక్కడైనా టాయిలెట్స్ అవసరం ఉన్న పక్షంలో తక్షణమే ప్రతిపాదనలు పంపాలని అన్నారు. కాగా, ఈ నెల 25 నుండి జూలై 24 వరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ కొనసాగనుందని, ఈ ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందే అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు అందరూ బీ.ఎల్.ఓ లను సంప్రదించి మ్యాపింగ్ ను పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Crime
మండల కేంద్రంలో ఇనుపరాట్లతో వ్యక్తిపై దాడి


మండల కేంద్రంలో ఇనుపరాట్లతో వ్యక్తిపై దాడి….
నందిపేట జూన్ 14 జనం వెలుగు: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తా సురేష్ నగర్ కాలనీ ఎదురుగా ఉన్న ఆర్డర్ మెస్ ప్రాంతంలో నందిపేట రాజనగర్ దుబ్బ ప్రాంతానికి చెందిన నయిం అనే వ్యక్తిపై కొందరు వ్యక్తులు కారుపై వచ్చి ఇనుపరాట్లతో దాడి చేయడంతో నయిం తలకు,
చెయ్యికి, పొట్ట ప్రాంతంలో తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నయిం, కయ్యులు అన్నదమ్ములని, వీరి బంధువులైన షేక్ తాలిబ్, షేక్ తాహెర్, సాజిద్, షాహెద్, గాలిబ్ మరి కొంతమంది వ్యక్తులు కారులో వచ్చి రాడ్లతో నయీంపై దాడి చేయడం జరిగిందని,
వీరి ఇరువురి మధ్య పాత కక్షలు ఉన్నాయని, సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నామని, నయీమ్ చికిత్స పొందుతున్నాడని, బాధితుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు, దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు.








