నిజామాబాద్
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి


పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
జనంవెలుగు, లోకేశ్వరం:- మండలంలోని కనకాపూర్ గ్రామంలో శుక్రవారం ఫ్రైడే-డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ఆరోగ్య సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రైడే-డ్రైడే ఆరోగ్య సిబ్బంది గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ పరిసరాల పరిశుభ్రత, సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు.
నీటి కుండిలను, పూల కుండీలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.పనికి రాని టైర్లు,బకిట్లలో, త్రాగిన కొబ్బరి బొండాలలో నీళ్లు నిల్వ ఉంచకూడదన్నారు. ఖాళీ చేసి పనికి రాని వస్తువులను పడేయలని, వాడకుండా ఉన్న కూలర్లలో ఉన్న నీళ్లను తీసివేసి శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.రోజుల తరబడి నిల్వ ఉన్న నీటిలో లార్వా, దోమలు వృద్ధి చెంది ఆరోగ్యానికి హాని చేస్తాయని తెలిపారు.
పంచాయతీ కార్యదర్శి రాజు మాట్లాడుతూ మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని, దానిని కాపాడుకోవడం మన బాధ్యత అన్నారు. వర్షాలు కురుస్తున్నందున సీజనల్ వ్యాధులు ప్రబలే ఆస్కారం ఎక్కువగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఇంట్లోని చెత్తను వీధిలో, మురికి కాలువలలో పాడేయకుండా ఇంటిలోనే తడి చెత్తను, పొడి చెత్తను వేరువేరుగా గ్రామ పంచాయతీ ద్వారా అందించిన చెత్తబుట్టలో నిల్వ ఉంచుకొని గ్రామపంచాయతీ ట్రాక్టర్ వచ్చినప్పుడు అందులోనే వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజు,ఆశ వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్
విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు


విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు
రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
జనంవెలుగు నిజామాబాద్:- విజయదశమి పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు నింపాలని, ప్రజలు చేపట్టే ప్రతి కార్యంలో విజయం సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, ఐకమత్యంతో జీవించాలని, అన్ని వర్గాల ప్రజలకు విజయదశమి శుభాలను అందించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
నిజామాబాద్
జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు


జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు
జనంవెలుగు నిజామాబాద్ :– విజయ దశమి వేడుకను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే విజయదశమి వేడుకను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
దసరా పండుగ అందరి జీవితాల్లో విజయాలు సమకూర్చాలని, చేపట్టిన ప్రతీ కార్యం విజయవంతం కావాలని అభిలషించారు. విజయ దశమి వేళ అన్ని వర్గాల వారు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో జీవనాలు వెళ్లదీయాలని ఆకాంక్షించారు.
నిజామాబాద్
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో


బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో..
నగరంలో సందడిగా సాగిన సద్దుల బతుకమ్మ వేడుకలు
బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) వద్ద మహిళల కోలాహలం.
జనంవెలుగు నిజామాబాద్ :- నిజామాబాద్ నగరంలో ఆట పాటలతో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ అనేది తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక ప్రతీకగా జరుపుకునె తంగేడు, గూనుగు పూలతో పాటు, రక రకాల పూలతో జరుపుకునే పువ్వుల పండగ.
భాద్రపద అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు వైభవంగ జరుపుకునే మహిళల పండుగ.ప్రకృతిలో లభించే రకరకాల పూలను గోపురం లా అందమైన పొరలు గార్చి తయారు చేస్తారు,
పసుపుతో గౌరమ్మను చేసి దాని పై ప్రతిష్టిస్తారు. ప్రతి గల్లీలో మహిళలు ముస్తాబయి.. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి హుషారైనా బతుకమ్మ పాటలతో హోరేత్తించారు.
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు చిన్నారులకు తెలియచేయడానికి ఈ పండగ ఒక వేదిక అనుకోవచ్చు. చిన్నారులు చిట్టి, చిట్టి బతుకమ్మలను చేతిలో పట్టుకుని ఫోటోలకు,ఫోజులివ్వడం అందరిని ఆనంద డోలికల్లో ముంచెత్తింది.
బతుకమ్మ డి జె పాటలకు మహిళలు ఉత్సాహం తో, హుషారైనా స్టెప్పులు వేయడం అందరిని అలరించింది. ఈ సందర్బంగా బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) దగ్గర మహిళలు మరొక్కసారి బతుకమ్మ పాటలకు సంగీతానికి తగ్గట్టుగా,ఒకేసారి కొట్టె చప్పట్ల సప్పుడుకు,ఒకేసారి వేసే స్టెప్పులతో చెరువు వాతావరణమంతా హోరేత్తింది.
ఈ సందర్బంగా ఖిల్లా రోడ్, గాజుల్ పేట్, బడా బజార్, శివాజినగర్, గాయత్రీనగర్, సీతారామ్ నగర్, వర్ని రోడ్, సాయి నగర్ ప్రాంతల లోని మహిళలు బొడ్డెమ్మ చెరువులో బతుకమ్మలను పోయిరా.. పోయిరా బతుకమ్మ అంటూ వదిలారు.








