నిజామాబాద్
1000 రోజుల ప్రజాపాలనలో సంక్షేమం–అభివృద్ధికి పెద్దపీట


1000 రోజుల ప్రజాపాలనలో సంక్షేమం–అభివృద్ధికి పెద్దపీట
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన: ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణకు తీవ్ర నష్టం.. కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా విఫలం
1000 రోజుల్లో 1 కోటి 24 లక్షల 40 వేలు జీతభత్యాలు తీసుకున్నారు
22 వేల కోట్లు ప్రభుత్వం కేసీఆర్ పై వెచ్చించింది
బీజేపీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటుంది.. అందుకే నిధులు ఇస్తలేరు
జనం వెలుగు, నిజామాబాద్ :- తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తూ సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యత ఇస్తోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలన 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని ఎమ్మెల్యే ఆరోపించారు. తెలంగాణను పునర్నిర్మిస్తామని చెప్పి కుటుంబ పాలన సాగించారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ప్రజాధనాన్ని భారీగా దుర్వినియోగం చేశారని, కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రజలకు ప్రయోజనం కలగలేదని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలు నిర్బంధ వాతావరణాన్ని ఎదుర్కొన్నారని, అలాంటి పరిస్థితుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనను తీసుకొచ్చిందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒకవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే మరోవైపు రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని భూపతి రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 4 లక్షలకుపైగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి నిర్మాణ దిశగా ముందుకు తీసుకెళ్లామని చెప్పారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ వంటి హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు.
రైతుల సంక్షేమానికి రూ.1.68 లక్షల కోట్లకు పైగా కేటాయించామని, సుమారు రూ.25 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో సుమారు రూ.70 వేల కోట్ల వడ్డీలేని రుణాలను అందిస్తున్నామని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో సుమారు రూ.200 కోట్లతో రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు.
విశ్వవిద్యాలయాలకు రెగ్యులర్ వైస్చాన్స్లర్లను నియమించడంతో ఉన్నత విద్యా వ్యవస్థను బలోపేతం చేశామని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఇప్పటివరకు సుమారు 70 వేల ఉద్యోగాలు కల్పించామని, రాష్ట్రానికి భారీగా విదేశీ పెట్టుబడులను తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
కులగణనను దేశానికి రోల్ మోడల్‌గా తెలంగాణలో చేపట్టడం, ఎస్సీ వర్గీకరణను అమలు చేయడం, గిగ్ వర్కర్ల సంక్షేమానికి చట్టబద్ధమైన రక్షణ కల్పించడం వంటి నిర్ణయాలు సామాజిక న్యాయం దిశగా కీలక అడుగులని భూపతి రెడ్డి అన్నారు.
తెలంగాణను 2047 నాటికి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ‘రైజింగ్ తెలంగాణ’ విజన్‌తో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే తెలిపారు. CURE, PURE, RARE వంటి బృహత్తర ఆలోచనలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
తెలంగాణ తలసరి ఆదాయం రూ.4 లక్షలకు పైగా ఉందని, దేశ సగటుతో పోలిస్తే గణనీయంగా అధికంగా ఉందని పేర్కొన్నారు. 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా తీసుకెళ్లే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు
తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, పునర్విభజన చట్టం హామీల విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే ఆరోపించారు. రాష్ట్రం చెల్లిస్తున్న పన్నులకు అనుగుణంగా కేంద్రం నుంచి నిధులు రావడం లేదని అన్నారు. రాష్ట్రం నుంచి రూపాయి పన్ను చెల్లిస్తే అందులో కేవలం 42 పైసల మేరకు తిరిగి వస్తున్నాయని పేర్కొన్నారు.
తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు, నిధులను అడ్డుకోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి ఆటంకాలు కల్పిస్తోందని విమర్శించారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి చేపడుతున్న పర్యటనలను కూడా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
హైదరాబాద్‌ను అక్రమ కబ్జాల నుంచి రక్షించేందుకు హైడ్రాను ఏర్పాటు చేశామని తెలిపారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన బాధ్యతను కేసీఆర్ నిర్వర్తించడం లేదని ఆరోపించారు. ప్రతిపక్ష నేత హోదాలో ప్రభుత్వ సౌకర్యాలను అనుభవిస్తూ ప్రజా సమస్యలపై మాత్రం స్పందించడం లేదని విమర్శించారు.
కేసీఆర్‌కు ప్రతిపక్ష నాయకుడిగా గత 1000 రోజుల్లో లభించిన జీతభత్యాలు సుమారు రూ.1.24 కోట్లు అని, ఆయన భద్రత, వాహనాలు, సిబ్బంది తదితర సౌకర్యాలకు ప్రభుత్వం భారీగా ప్రజాధనాన్ని వెచ్చిస్తోందని భూపతి రెడ్డి పేర్కొన్నారు. ఈ సౌకర్యాల కోసం గత 1000 రోజుల్లో సుమారు రూ.21 కోట్ల మేర ప్రభుత్వ వ్యయం జరిగిందని ఆయన ఆరోపించారు.
ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ అసెంబ్లీలో ప్రజా సమస్యలపై తన వాణిని వినిపించాల్సి ఉండగా, సభకు పూర్తిస్థాయిలో హాజరు కావడం లేదని ఎమ్మెల్యే విమర్శించారు. ప్రజాధనంతో సౌకర్యాలు పొందుతూ ప్రజల కోసం పనిచేయని ప్రతిపక్ష నాయకుడు తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
“కేసీఆర్‌ను ప్రతిపక్ష నాయకుడిగా ఎందుకు కొనసాగించాలి? ప్రజలకు చెప్పాలి. ప్రజల సమస్యల కోసం పనిచేయలేని ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగడం ఎందుకు?” అని భూపతి రెడ్డి ప్రశ్నించారు.
బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని ఎమ్మెల్యే అన్నారు. పదేళ్ల పాలనలో రాష్ట్రంపై సుమారు రూ.9 లక్షల కోట్ల అప్పుల భారం మోపారని, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాల్లో భారీ బకాయిలు పెట్టారని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి, ప్రజలపై అప్పుల భారాన్ని మోపి వెళ్లిపోయారని విమర్శించారు.
ప్రజల్లో ఆదరణ కోల్పోయిన బీఆర్ఎస్ రాజకీయ మనుగడ కోసం రోడ్లపైకి వస్తోందని, చిల్లర రాజకీయాలకు పాల్పడుతోందని భూపతి రెడ్డి విమర్శించారు. కుటుంబ అంతర్గత రాజకీయాలపై కూడా ఆయన విమర్శలు చేశారు.
“బీఆర్ఎస్ను తెలంగాణ ప్రజలు మర్చిపోయారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన ఆ పార్టీ రాజకీయ మనుగడ కోసం చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనకు ప్రజల మద్దతు ఉంది. రాబోయే రోజుల్లో తెలంగాణను మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం” అని ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు.
ఈ మీడియా సమావేశంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, రాష్ట్ర గీతా పారిశ్రామిక కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, ఐసీడీఎంఎస్ మాజీ చైర్మన్ సాయరెడ్డి, బాగా రెడ్డి, భాస్కర్ రెడ్డి, అమృతాపూర్ గంగాధర్, ఉమ్మాజి నరేష్, పొలసాని శ్రీనివాస్, వాసు సాయిరెడ్డి, జనార్దన్, మోహన్, అంబర్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్
అదనపు కలెక్టర్ తో మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుల భేటీ


అదనపు కలెక్టర్ తో మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుల భేటీ
జనంవెలుగు నిజామాబాద్ : – నిజామాబాద్ జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యులు అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాజాగౌడ్ తో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీ.సీ హాల్ లో భేటీ అయ్యారు.
జిల్లా డీఎంఏసీ సభ్యులను అదనపు కలెక్టర్ పరిచయం చేసుకున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీ. ఓకు అనుగుణంగా అర్హులైన వారికి అక్రిడిటేషన్ కార్డులు జారీ అయ్యేలా కృషి చేయాలని సూచించారు.
ఈ విషయంలో కమిటీ సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పారదర్శకంగా ఈ ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో డీపీఆర్ఓ ఎన్.పద్మశ్రీ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ సమాచార ఇంజనీర్ ఉమేష్ చంద్ర,
డీఎంఏసీ సభ్యులు కోయల్ కర్ రామ్ దయానంద్, ఆర్.భూపతి, జి.సాయి ప్రసాద్, ఎంఏ. మాజిద్, ఎల్.బాల్ కుమార్, ఎస్.శ్రీకాంత్, ఎన్.శ్రీనివాస్ పాల్గొన్నారు.
నిజామాబాద్
ఎల్ నినో నేపథ్యంలో ఆరుతడి పంటలనే సాగు చేయాలి


ఎల్ నినో నేపథ్యంలో ఆరుతడి పంటలనే సాగు చేయాలి
ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి
ఖరీఫ్ పంటను గట్టెక్కిస్తాం…రబీలో మాత్రం వరి వేస్తే కాపాడలేం
ఆరుతడి సాగుకు అన్నివిధాలుగా తోడ్పాటును అందిస్తాం
కొత్తగా బోరుబావులు తవ్విస్తే సీజ్ చేస్తామని స్పష్టీకరణ
జనంవెలుగు నిజామాబాద్ :- ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదైన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా రైతులు రబీలో ఆరుతడి పంటలనే సాగు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి హితవు పలికారు.
అందుబాటులో ఉన్న నీటి వనరులు, భూగర్భ జలాల లభ్యత, విద్యుత్ సరఫరా తదితర పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.
ఒకవేళ వరి మినహా ఇతర పంటల సాగుకు చౌడు భూములు వంటి నేల రకాలు సహకరించకపోతే క్రాప్ హాలిడే పాటించాలని, వరి సాగు మాత్రం చేయవద్దని స్పష్టం చేశారు.
నందిపేట మండలం నూత్ పల్లి రైతు వేదికలో మంగళవారం ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం నిర్వహించగా, కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని రైతులనుద్దేశించి మాట్లాడారు.
ఖరీఫ్ లో వేసిన వరి పంట పూర్తి స్థాయిలో చేతికి అందేంత వరకు జిల్లా యంత్రాంగం తరపున కాపాడుతామని రైతులకు భరోసా కల్పించారు.
అయితే రబీలో మాత్రం వరి పంటకు సాగు నీరు అందించే పరిస్థితి ఉండదని కలెక్టర్ వెల్లడించారు. సూపర్ ఎల్ నినో ప్రభావంతో ప్రతీకూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ రంగంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై రైతులకు కీలక సూచనలు చేశారు.
వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో పండే పెసలు, మినుములు, శనగతో పాటు జొన్న, మొక్కజొన్న, కూరగాయలు వంటి పంటల సాగును చేపట్టడం ఎంతో శ్రేయస్కరమని రైతులను ప్రోత్సహించారు.
బిందు సేద్యాన్ని వినియోగించుకొని ఆయిల్‌పామ్ తోటలు, కూరగాయలు తదితర పంటలను సాగు చేయడం ద్వారా నీటిని పొదుపుగా వినియోగించుకోవచ్చని అన్నారు. ఆరుతడి పంటల సాగుకు ముందుకు వచ్చే రైతాంగానికి ప్రభుత్వ పరంగా జిల్లా యంత్రాంగం తరఫున తోడ్పాటును అందిస్తామని భరోసా కల్పించారు.
మల్చింగ్, బిందు సేద్యం విధానాలకు రాయితీ వర్తించేలా ప్రణాలికలు రూపొందిస్తామని అన్నారు. కూరగాయలు, ఇతర ఆరుతడి పంటలకు మార్కెటింగ్ సదుపాయం కల్పించే దిశగా కూడా తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
వీబీజీరాంజీ కింద ఇంకుడు గుంతలు, నీటి కుంటలు, బోరు బావుల రీఛార్జ్ వంటి పనులను చేపట్టి వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించుకోవడంపై దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు.
అయితే ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కొత్తగా బోరుబావులు తవ్వకూడదని, ఎవరైనా తవ్విస్తే వాటిని సీజ్ చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.
ప్రస్తుతం ప్రధాన జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటి నిల్వలను తాగునీటి అవసరాలకే వినియోగిస్తామని కలెక్టర్ తెలిపారు. భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయని, రానున్న రోజుల్లో సేద్యానికి కరెంటు సరఫరాకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు.
దీనిని దృష్టిలో పెట్టుకుని రైతులు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని, యాసంగిలో వరి సాగు చేసి ఇబ్బందుల్లో పడవద్దని జిల్లా పాలనాధికారి హితవు పలికారు.
ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక మహిళా సంఘాల ప్రతినిధులు సైతం రబీలో రైతులు ఆరుతడి పంటలే సాగు చేసేలా విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహిస్తూ వారికి అవగాహన కల్పించాలని అన్నారు.
ఈ సందర్భంగా ఆదర్శ రైతులు తమ అభిప్రాయాలను వెల్లడించగా, రబీలో ఏ తరహా పంటలు సాగు చేయవచ్చు, కరువు పరిస్థితులను అధిగమించేందుకు అనుసరించాల్సిన విధానాలు ఏమిటీ తదితర అంశాలపై వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు రైతులకు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్ రావు, ఉద్యానవన శాఖ అధికారిణి సంధ్య, సర్పంచ్ రాజిరెడ్డి, స్థానిక అధికారులు, రైతులు పాల్గొన్నారు.
నిజామాబాద్
ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి


ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
కలెక్టర్ ఇలా త్రిపాఠి
సమయపాలన పాటించాలని అధికారులకు ఆదేశం
జనంవెలుగు నిజామాబాద్ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ, ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు.
సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 121 ఫిర్యాదులు అందాయి. అదనపు కలెక్టర్లు రాజాగౌడ్, భుజంగరావు, డీఆర్ఓ గీత, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీఆర్డీఓ సాయన్న, మున్సిపల్ అదనపు కమిషనర్ చంద్రశేఖర్లతో కలిసి కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించారు.
ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయవద్దని, పెండింగ్ అర్జీలను వెంటదివెంట పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఇదిలాఉండగా, ప్రజావాణి కార్యక్రమానికి పలువురు అధికారులు గైర్హాజరు కావడం, కొంతమంది ఆలస్యంగా హాజరు కావడాన్ని గమనించిన కలెక్టర్, ప్రతి ఒక్కరు విధిగా సమయ పాలన పాటించాలని ఆదేశించారు.
ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం అయ్యే నిర్ణీత సమయం ఉదయం 10.30 గంటల వరకు అధికారులు అందరూ హాజరు అయి ఉండాలన్నారు. ముందస్తు అనుమతి లేకుండా కార్యస్థానం విడిచి వెళ్లవద్దని ఆదేశించారు.
ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో నెలకొని ఉన్న పరిస్థితుల గురించి క్షేత్రస్థాయిలో ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు. మండల ప్రత్యేక అధికారులు అవగాహన సదస్సులలో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.








