నిర్మల్
హోంగార్డ్ కుటుంబాన్ని అన్నివిధాలుగా అదుకుంటాo


హోంగార్డ్ కుటుంబాన్ని అన్నివిధాలుగా అదుకుంటాo
జిల్లా ఏఎస్పీ కిరణ్ కారే
జనం వెలుగు, ముధోల్:- హోంగార్డ్ ధర్మేందర్ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని జిల్లా ఏఎస్పీ కిరణ్ కారే అన్నారు. శనివారం మండల కేంద్రమైన ముధోల్ లోని పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్న వాగమారే ధర్మేందర్ గుండె పోటుతో మృతి చెందారు. భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాల పూలమాలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ శాఖా పరంగా వచ్చే అన్ని బెనిఫిట్స్ లను అందే విధంగా చూస్తామని వెల్లడించారు. పోలీస్ శాఖ తరపున అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులను ఓదార్చి కష్ట సమయంలోనే ధైర్యంగా ఉండాలని సూచించారు.

హోంగార్డ్ అంతిమయాత్రకు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు భారీ సంఖ్యలో రావడంతో జనసంద్రమైంది. స్థానిక ప్రజాప్రతినిధులు అఫ్రోజ్ ఖాన్, సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్, పిఎసిఎస్ మాజీ చైర్మన్ సురేందర్ రెడ్డి, ఎంపిటిసి సభ్యులు సరళ శ్రీనివాస్ గౌడ్, కో-ఆప్షన్ సభ్యుడు ఖాళీద్, నాయకులు గౌతమ్, మరిబా, సత్యనారాయణతో పాటు భారతీయ బౌద్ధ మహాసభ రాష్ట్ర ప్రతినిధులు, జిల్లా ప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు, భీమ్ ఆర్మీ సభ్యులు, అభిమానులు కుటుంబ సభ్యులు ఆత్మీయులు అంతిమయాత్రలో పాల్గొని ఘన నివాళులర్పించారు. అంతకుముందు పోలీస్ శాఖ తరపున అంత్యక్రియల నిమిత్తం రూ.10,000ల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులు సభ్యులకు అందించారు. ఎస్ఐలు తిరుపతి, అశోక్, సాయి కుమార్ తో పాటు ఏఎస్ఐ సుదర్శన బౌద్ధ, పోలీస్ సిబ్బంది, హోమ్ గార్డ్ ఆర్ఐ రామకృష్ణ అంతిమయాత్రలో పాల్గొన్నారు. హోంగార్డ్ మృతిని జీర్ణించుకోలేకపోతున్నామని స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ధైర్యాన్ని కల్పించాలని వేడుకున్నారు.
నిర్మల్
ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
5వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అజూహ ఫాతిమా ప్రధానోపాధ్యాయురాలిగా, భార్గవ్ ప్రసాద్ డీఈఓగా, సాత్విక్ ఎంఈఓగా, శశాంత్ కాంప్లెక్స్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా ఆదర్శ్, ప్రణీత్, చరణ్య, తేజశ్రీ, నవ్య, యశ్వంత్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.
విద్యార్థుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రతిబింబించిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
నిర్మల్
| Nirmal ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన


ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన
నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీ
జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్ ఏర్పాటు, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.
అలాగే, సభ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్
Nirmal | నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం


నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం
జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్‌బండ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, పచ్చదనం, సుందరీకరణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








