Connect with us

నిజామాబాద్

కోటగిరిలో ఉపాధ్యాయునిపై దాడి చేసి అవమానించిన అరాచక శక్తులను కఠినంగా శిక్షించాలి

janamvelugunews

Published

on

మతం ముసుగులో చెలరేగిపోతున్న అరాచక శక్తులను అణచివేయాలి – యుయస్పీసి డిమాండ్

జనం వెలుగు, నిజామాబాద్:- నిజామాబాద్ జిల్లా కోటగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు మల్లికార్జున్ పై కొందరు బిజెపి, విహెచ్ పి, భజరంగ్ దళ్ కార్యకర్తలు చేసిన దౌర్జన్యాన్ని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుయస్పీసి) స్టీరింగ్ కమిటీ సభ్యులు తీవ్రంగా ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, ఉపాధ్యాయునికి రక్షణ కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మతం ముసుగులో రాష్ట్ర వ్యాప్తంగా కొందరు పేట్రేగి వ్యవహరిస్తున్నారు. వారు పాఠశాలల్లోకి చొరబడి ఉపాధ్యాయులపైనా దాడులకు తెగబడుతున్నందున ఉపాధ్యాయులు స్వేచ్ఛగా పాఠాలు చెప్పగలిగే వాతావరణం లేకుండా పోతున్నదని యుయస్పీసి నాయకులు ఆవేదన వ్యక్తంచేశారు. గణేష్ చందా ఇవ్వలేదనే కోపంతో ఉపాధ్యాయుడు మల్లికార్జున్ పిల్లలకు దేవుడు లేడని పాఠం చెబుతున్నాడని, సరస్వతీదేవిని నిందించాడని అభూత కల్పనలు సృష్టించి బడిలో ఆందోళన చేపట్టడం, ఉపాధ్యాయుడిని ఊరేగింపుగా గుడికి తీసుకెళ్ళి అతని అభీష్టానికి వ్యతిరేకంగా బొట్టుపెట్టి క్షమాపణ చెప్పించటం ద్వారా తీవ్రంగా అవమానించారు. ఇటువంటి అనాగరిక చర్యను పోలీసులు అడ్డుకోకపోగా అరాచక శక్తులకు వత్తాసు పలకటం విచారకరం. ప్రజాస్వామ్య వాదులు, సామాజిక వాదులు ఇలాంటివి అడ్డుకొకపోతే.. రాబోయే కాలంలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులను పాఠాలు చెప్పనివ్వరు. రాజ్యాంగంలోని 51(ఎ) ఆర్టికల్ ద్వారా సంక్రమించిన సైంటిఫిక్ టెంపర్ గురించి పాఠ్యాంశాల్లో బోధించాలంటేనే ఉపాధ్యాయులు భయపడే పరిస్థితులు రాష్ట్రంలో నెలకొంటున్నాయి. రాజ్యాంగ హక్కులు, మత స్వేచ్ఛ, పరమత సహనం, శాస్త్రీయ భావజాలం, మూఢనమ్మకాలు తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించే అవకాశం లేకుండా పోతున్నది. కనుక రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి మతం ముసుగులో చెలరేగిపోతున్న అరాచక శక్తులను నిర్దాక్షిణ్యంగా అణచివేయాలని, రాష్ట్రంలో, విద్యాసంస్థల్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని యుయస్పీసి స్టీరింగ్ కమిటీ సభ్యులు కె జంగయ్య, చావ రవి, వై అశోక్ కుమార్, ఎం రవీందర్, ఎం సోమయ్య, టి లింగారెడ్డి, యు పోచయ్య, డి సైదులు, సయ్యద్ షౌకత్ అలీ, పి రాజయ్య, కొమ్ము రమేష్, ఎన్ యాదగిరి, జాదవ్ వెంకట్రావు, జాడి రాజన్న, దూడ రాజనర్సుబాబు, మేడి చరణ్ దాస్, ఎస్ హరికిషన్, వి శ్రీను నాయక్, కె బిక్షపతి, వై విజయకుమార్, శాగ కైలాసం, సిహెచ్ రమేష్, బి కొండయ్య, ఎస్ మహేష్, మహమ్మద్ మసూద్ అహ్మద్, టి విజయసాగర్, సుధాకర్ రెడ్డి,  కె రామారావు, ఎం రామారావు,  ఎ గంగాధర్ తదితరులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Crime

మండల కేంద్రంలో ఇనుపరాట్లతో వ్యక్తిపై దాడి

janamvelugunews

Published

on

మండల కేంద్రంలో ఇనుపరాట్లతో వ్యక్తిపై దాడి….

నందిపేట జూన్ 14 జనం వెలుగు: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తా సురేష్ నగర్ కాలనీ ఎదురుగా ఉన్న ఆర్డర్ మెస్ ప్రాంతంలో నందిపేట రాజనగర్ దుబ్బ ప్రాంతానికి చెందిన నయిం అనే వ్యక్తిపై కొందరు వ్యక్తులు కారుపై వచ్చి ఇనుపరాట్లతో దాడి చేయడంతో నయిం తలకు,

  చెయ్యికి, పొట్ట ప్రాంతంలో తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నయిం, కయ్యులు అన్నదమ్ములని, వీరి బంధువులైన షేక్ తాలిబ్, షేక్ తాహెర్, సాజిద్, షాహెద్, గాలిబ్ మరి కొంతమంది వ్యక్తులు కారులో వచ్చి రాడ్లతో నయీంపై దాడి చేయడం జరిగిందని,

   వీరి ఇరువురి మధ్య పాత కక్షలు ఉన్నాయని, సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నామని, నయీమ్ చికిత్స పొందుతున్నాడని, బాధితుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు, దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు.

Continue Reading

Crime

పసిపాపను చంపిన హంతకుల జాడేది

janamvelugunews

Published

on

పసిపాపను చంపిన హంతకుల జాడేది.,

నందిపేట జూన్ 14 జనం వెలుగు; నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో దాదాపు 20 రోజుల కిందట మెయిన్ రోడ్డు పాత హనీ రెస్టారెంట్ వెనకాల ఖాళీ స్థలంలో అప్పుడే పుట్టిన పసికందును ఎండలో పడేయడంతో పసికందు మృతి చెందిన ఘటన అందరికీ తెలిసిందే…

కానీ పాప చనిపోయి 20 రోజులు గడిచిన ఆ పసి గుడ్డు నెత్తుటి మరకలు అంటిన అదాంతకుల యాడ మాత్రం తెలిసి రాలేదు. బేటి బచావో… బేటి పడావో…. అనే నినాదాలు పేపర్లకే పరిమితమైనట్టు ఉంది ఈ సంఘటన.. తరతరాల నుండి ఆడపిల్లల పైన ఎన్నో అఘైత్యాలు, ఆడపిల్ల అంటే అలుసే… మగాడు అంటే మురుపమే..

   ఈ తారతమ్యాలను రూపుమాపేందుకు ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపట్టిన క్షేత్రస్థాయిలో మాత్రం ఆ లక్ష్యాలను చేదిదిండం లేదు. వెంటనే ఈ దుశ్చర్యలకు పాల్పడిన, ఆ నెత్తుటి మరకల చేతులకు సంకెళ్లు వేస్తేనే మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Continue Reading

నిజామాబాద్

ప్రతి ఒక్కరికి అగ్ని ప్రమాదాలపై అవగాహన ఉండాలి

janamvelugunews

Published

on

ప్రతి ఒక్కరికి అగ్ని ప్రమాదాలపై అవగాహన ఉండాలి

నందిపేట్ జూన్ 14 జనం వెలుగు: నందిపేట మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై వినయ్ కుమార్ వస్తూ వస్తూనే తన మార్కును చూపిస్తున్నాడు. తన ఠాణా పరిధిలోని ప్రజలందరికీ ఎక్కడికక్కడ సమావేశాలను ఏర్పరుస్తూ మత్తుపదార్థాలపై, అగ్ని ప్రమాదాల నివారణపై, రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, దొంగతనాలపై, మరి ముఖ్యంగా యువత డ్రగ్స్ కు బానిస కాకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా విధి నిబద్ధతతో సమాచారం అందుకున్న వెంబటనే పేకాట స్థావరం పై దాడి చేసి అసాంఘిక కార్యక్రమాలు చేసే వారికి దడ పుట్టిస్తున్నాడు. శనివారం స్థానిక బస్టాండ్ ఆవరణలో ఫైర్ సిబ్బందితో కలిసి ఇంటిలో వినియోగించే ఎల్పిజి గ్యాస్ లీకేజీ, ఫైర్ సేఫ్టీ పైన మహిళలకు అవగాహన కల్పించారు. అనుకోకుండా సిలిండర్ లీకేజీ అయి మంటలు సంభవిస్తే భయపడకుండా ధైర్యంగా చిన్న చిట్కాతో ఎలా మంటలను ఆర్పేయవచ్చో ప్రత్యక్షంగా చూయించారు. వచ్చి రాగానే తమ ప్రజలకు ఆర్థిక నేరాలపై, ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలతో అవేర్నెస్ కల్పిస్తున్న ఎస్సై వినయ్ కుమార్ ను ప్రజలు అభినందిస్తున్నారు.

Continue Reading