Connect with us

నిర్మల్

జి20 విజేతలుగా త్రిబుల్ ఐటీ విద్యార్థులు

suresh sitharla

Published

on

జనం వెలుగు, బాసర:- G20 భారత అధ్యక్ష పదవి పోటీలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర  గవర్నర్ కార్యాలయం హైదరబాద్ ఆదేశాలతో నిర్వహించిన పోటీలలో  ఆర్జీయూకేటీ విద్యార్థులు  విజేతలుగా నిలిచి, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ చేతుల మీదుగా బహుమతి అందుకోవడం పట్ల ఆర్జీయూకేటీ  వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ వెంకటరమణ, డైరెక్టర్ ప్రొఫెసర్ సతీష్ కుమార్   విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.  ఈ సందర్భంగా వైస్ ఛాన్సర్ ప్రొఫెసర్ వెంకటరమణ  మాట్లాడుతూ  విద్య, క్రీడారంగాలతోపాటు  వివిధ  సృజనాత్మక సాహిత్య సాంస్కృతిక  కళ రంగాలలో ఆర్జీయూకేటీ విద్యార్థులకు ప్రతిభా పాటవాలు ఉన్నాయని,  వారిని ప్రోత్సహించేందుకు   ముందుంటామని  తెలిపారు. ఈ సందర్భంలో  గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ  విద్యార్థులను పంపినందుకు ఆర్జీయూకేటీ  బాసర విసి ప్రొఫెసర్ వెంకటరమణకి  ప్రత్యేక అభినందనలు తెలియజెసారు. G20 కూటమి అధ్యక్ష బాధ్యతలను భారత్ డిసెంబర్ 1 నుంచి సంవత్సరం పాటు జీ 20 అధ్యక్ష దేశంగా భారత్ ఉంటుందన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో, తెలంగాణా రాష్ట్ర గవర్నర్ కార్యాలయం నుంచి  అందుకు సంబంధించిన లోగో థీమ్, “వసుధైవ కుటుంబం” లేదా “వన్ ఎర్త్” అనే ఇతివృత్తంతో G20 భారత ప్రస్థానంపై అవగాహన కల్పించేందుకు విశ్వవిద్యాలయ విద్యార్థులకు 4 భాషల్లో లోగో రూపకల్పన, వ్యాస రచన మరియు ప్రసంగం   పొటిలను దేశంలోనే తొలిసారిగా నిర్వహించారు. ఈ పోటిలో రాష్ట్ర విశ్వవిద్యాలయ విద్యార్థులందరూ మూడు ఈవెంట్‌లలో పాల్గొన్నారు,  ఆర్జీయూకేటీ  బాసర ప్రాంగణంలో నిర్వహించిన పోటీలో  దాదాపు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో నుంచి  50 మంది విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన  రెండవ స్థాయి పోటీలలో పాల్గొన్నారు. అందులో 3 విద్యార్థులు ఎంపికయ్యారు.   విజేతలు తెలుగు వ్యాస రచనలో 1వ బహుమతి వి.శ్రుతి E3 CSE(బంగారు పతకంతోపాటు 6000 నగదు).
వ్యాస రచన ఉర్దూలో 1వ బహుమతి ఆయేషా సాబా PUC1 (గోల్డ్ మెడల్ ప్లస్ 6000 నగదు).
A. రిషికెష్ E2 హిందీలో వ్యాస రచనకు కన్సోలేషన్ బహుమతి గెలుపొందారు. పాల్గొన్న విద్యార్థులందరికి  పార్టిసిపేషన్ సర్టిఫికేట్ తోపాటు 1000 నగదు బహుమతి లభించింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహణ  బాధ్యతలు  ఆంగ్ల శాఖ, తెలుగు శాఖ  అధ్యాపకులు డాక్టర్ ఎన్ విజయ్ కుమార్,  శ్రీ కె రాములు,  డాక్టర్ రమాదేవి,  డాక్టర్ శోభా దేవి  నిర్వర్తించారు.  ఈ కార్యక్రమానికి సహకారాలు అందించిన తెలుగు శాఖ ఆంగ్ల శాఖ అధ్యాపకులు ఉన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిర్మల్

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

janamvelugunews

Published

on

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

5వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అజూహ ఫాతిమా ప్రధానోపాధ్యాయురాలిగా, భార్గవ్ ప్రసాద్ డీఈఓగా, సాత్విక్ ఎంఈఓగా, శశాంత్ కాంప్లెక్స్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా ఆదర్శ్, ప్రణీత్, చరణ్య, తేజశ్రీ, నవ్య, యశ్వంత్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.

విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.

విద్యార్థుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రతిబింబించిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

Continue Reading

నిర్మల్

| Nirmal ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన

janamvelugunews

Published

on

ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన

నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీ

జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్ ఏర్పాటు, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.

అలాగే, సభ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Continue Reading

నిర్మల్

Nirmal | నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం

janamvelugunews

Published

on

నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం

జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్‌బండ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, పచ్చదనం, సుందరీకరణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Continue Reading