నిర్మల్
నేటి నుండి ఓని గ్రామంలో అఖండ హరినామ సప్త వేడుకలు


జనం వెలుగు, బాసర:- బాసర మండల పరిధిలోని ఓని గ్రామంలో నేటి నుండి అనగా 19వ తేదీ గురువారం గ్రామంలో హనుమాన్ ఆలయ సమీపాన 7 రోజులపాటు సాధ్య హరినామ సప్త కార్యక్రమం గ్రామది కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కొనసాగుతుంది అంతకుముందు హనుమాన్ ఆలయంలో వివిధ రకాల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు ఎవడు రోజులపాటు సాగే ఈ సప్త వేడుకల్లో పోనీ గ్రామం భక్తి మార్గంలో కాకడ హారతి తో మహిళలు పురుషులు వివిధ గ్రామాల నుండి వచ్చే భక్తులు ఉదయం మధ్యాహ్నం రాత్రి మూడు పూటల భోజనం దాతలు అందిస్తారు. అఖండ హరినామ్ వారం జ్ఞానేశ్వరి పారాయణ కథా ఉత్సవం నిర్వహించబడుతుంది. దీనికి .బి.పి. రాందాస్ పాటిల్ మార్గదర్శకత్వంలో వాహిస్తారు అయినప్పటికీ, అంకితమైన భక్తులందరూ
వినయపూర్వకమైన విన్నపం రామకథ :-
మా స్ఫూర్తి శ్రీ. హెచ్.బి.పి. రాందాస్ గురూజీ వైకర్ సంత్ విశారద్)
సలహాదారు: శ్రీ.హెచ్.బి.పి. కిషన్ (బాబు) మహారాజ్ కుడలేకర్ ప్రవచన Mr. Bh. సంగీత స్థాయి. గోవింద్ మహారాజ్ కుడలేకర్
ప్రారంభం 19/01/2023 గురువారం
ఉదయం 4 నుండి 6 వరకు కక్డా ఆరతి ఉదయం 6 నుండి 10 వరకు తారాజ్ జ్ఞానేశ్వరి పారాయణ ఉదయం 10 నుండి 12 వరకు గాథా భజన, మధ్యాహ్నం 2 నుండి 4 వరకు శ్రీరామ కథ ఉదయం 5 నుండి 6:30 వరకు హరిపాఠం ఉదయం 9 నుండి 11 వరకు హరి కీర్తన తర్వాత ఉదయం 12 నుండి 12 వరకు సాయంత్రం 4 గంటలకు జాగర్ భజన కార్యక్రమం
శ్రీ. హెచ్.బి.పి. చంద్రకాంత్ పాటిల్ వడ్గాంకర్
జ్ఞానేశ్వరి వ్యాస్పిత: గోవింద్ మహారాజ్ కుడలేకర్, బాబాసాహెబ్ పా. సావంత్
తేదీ 19/01/2023 ప్రతి గురువారం కీర్తాంకర్ …. రాజ్ కుర్ కదమ్
20/01/2023 రోజు కీర్తంకర్
శ్రీ.హెచ్.బి.పి.మధుసూదన్ మహారాజా దీప కదం
21/01/2023 శని
22/01/2023 ప్రతి ఆదివారం
కీర్తంకర్ Mr.B.P. రామ్ పాటిల్ మహరాజ్ గుజార్కర్
అడుగులు. 23/01/2023
కీర్తంకర్ శ్రీ.హెచ్.బి.పి.విలాస్ర శంకర్
24/01/2073
శ్రీ.హెచ్.బి.పి. సారా మహి
25/01/2003 రోజువారీ H.B.P.మహారాజ్ ఉస్మాన్నాగర్కర్
26/01/2023 ప్రతి గురువారం కీర్తాంకర్
శ్రీ….మహారాజ్ ఉస్మాన్నాగర్కర్ 11 మహర్
శ్రీ. రాందాస్ ప వైకర్ సంగీత విశారద్
హరిపట్. వెంకట్ మహారాజ్ ఎక్లార్కర్ నిర్వహించగా ప్రతిరోజు ఉదయం 4 గంటలకు జ్ఞానేశ్వరి పారాయణం మరియు భక్తి భజన గీతాలు 12 గంటల నుండి 5 గంటల వరకు రామానామ కథ ఎనిమిది గంటల నుండి 10 గంటల వరకు సంకీర్తన హరినామ వివిధ మారారుచే కీర్తన కార్యక్రమం ఉంటుంది రాత్రి వివిధ గ్రామాల ప్రముఖుల మృదంగం తబలా హార్మోనియం వైద్యులతో భజన కార్యక్రమంలో సంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి ఈ యొక్క కార్యక్రమం కొన్ని గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు సంయోజకులు ఒక ప్రకటనలు తెలిపారు.
నిర్మల్
ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
5వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అజూహ ఫాతిమా ప్రధానోపాధ్యాయురాలిగా, భార్గవ్ ప్రసాద్ డీఈఓగా, సాత్విక్ ఎంఈఓగా, శశాంత్ కాంప్లెక్స్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా ఆదర్శ్, ప్రణీత్, చరణ్య, తేజశ్రీ, నవ్య, యశ్వంత్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.
విద్యార్థుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రతిబింబించిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
నిర్మల్
| Nirmal ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన


ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన
నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీ
జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్ ఏర్పాటు, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.
అలాగే, సభ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్
Nirmal | నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం


నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం
జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్‌బండ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, పచ్చదనం, సుందరీకరణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








