నిర్మల్
భక్తులకు ఎలాంటి ఇలాంటి ఇబ్బంది పడకుండా చూస్తాం


నేడు వసంత పంచమి వేడుకలకు ముస్తాబైన బాసర ఆలయం
అమ్మవార్లకు నూతన పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రి అల్లోల
భక్తులకు ఎలాంటి ఇలాంటి ఇబ్బంది పడకుండా చూస్తాం
జనం వెలుగు:- బాసర భారతదేశంలో పవిత్ర పుణ్యక్షేత్రం తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో నేడు గురువారం శ్రీ పంచమి అనగా దీనిని వసంత పంచమి కూడా అంటారు. ఈ నేపథ్యంలో బాసర ఆలయానికి నేడు వసంత పంచమి శుభ సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో వచ్చి నలుమూలల నుండి పుణ్య గోదావరి నదిలో స్నానాలు ఆచరించి నది ఒడ్డున గల సురేశ్వర ఆలయాన్ని దర్శించుకుని నేరుగా అక్కడి నుండి అమ్మవారి దర్శనానికి బయలుదేరుతారు. ఈ సందర్భంగా నేడు వసంత పంచమి సందర్భంగా ఆలయంలో అర్జిత సేవలు రద్దు చేయబడినవి దీనితో వసంత పంచమి అమ్మవారి యొక్క జన్మదినం కావడంతో ఆలయంలోని గర్భగుడికి వివిధ రకాల రంగురంగుల పూలతో సుందరంగా అలంకరించారు ఆలక్షేత్రంతో పాటు ఉపాయాలకు రంగురంగుల విద్యుత్ దీపాలు కూడా పెట్టారు దీనితో ఆలయ క్షేత్రం కలకలలాడుతుంది. బుధవారం రాత్రి నుండి భక్తులు స్నానాల ఆచరించి క్యూ లైన్ లో నిల్చగా ఒంటిగంట నుండి పూజల టికెట్లు చాలా అధికారులు బ్యాంకు సిబ్బంది అందిస్తారు. దీనితో అమ్మవార్లకు అక్షరాభ్యాసం అలంకరణ ప్రత్యేక పూజలు జరిపి అనంతరం నాలుగు గంటల నుండి భక్తులకు తమ చిన్నారులకు అక్షర శ్రీకర పూజలు దిద్దుతామని ఆలయ అధికారులు ఒక ప్రకటనలు పేర్కొన్నారు. దీనితో సుందర దూర ప్రాంతం నుండి వచ్చిన భక్తులు క్యూ లైన్ లోనే ఆలయం తరఫున పాలు నీళ్లు తో పాటు బిస్కెట్లు కూడా అందించనున్నారు. కొందరు స్వచ్చంద సేవ సంస్థల వారు పాలతో పాటు అరటి పండ్లు కూడా అందించండి ఉన్నట్లు వారు తెలిపారు దీనితో గతంలో కరోనా ప్రభావం వల్ల మాస్కులు వేసుకొని అమ్మవారి ఆలయానికి రాకపోవడంతో ఈసారి రికార్డ్ స్థాయిలో అక్షర శ్రీకారాలు జరిగే అవకాశం ఉందని ఆలయ అధికారులు అంచనాలు వేస్తున్నారు దీనితో బాసర కార్యనిర్వ ఆలయ అధికారి విజయ రామారావు మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ప్రత్యేక మెడికల్ క్యాంపులు పెట్టమని మంచినీరు సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చూసుకుంటున్నామని పకడ్బందీ పోలీసు బందోబస్తు ఉంటుందని ఇటువంటి అవంతినే సంఘటన జరగకుండా ఎప్పటికప్పుడు పరిరక్షిస్తూ చూస్తామని వారు తెలిపారు.
నిర్మల్
ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
5వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అజూహ ఫాతిమా ప్రధానోపాధ్యాయురాలిగా, భార్గవ్ ప్రసాద్ డీఈఓగా, సాత్విక్ ఎంఈఓగా, శశాంత్ కాంప్లెక్స్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా ఆదర్శ్, ప్రణీత్, చరణ్య, తేజశ్రీ, నవ్య, యశ్వంత్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.
విద్యార్థుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రతిబింబించిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
నిర్మల్
| Nirmal ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన


ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన
నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీ
జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్ ఏర్పాటు, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.
అలాగే, సభ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్
Nirmal | నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం


నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం
జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్‌బండ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, పచ్చదనం, సుందరీకరణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








