Connect with us

నిజామాబాద్

చింరాజ్ పల్లి ప్రాథమికోన్నత పాఠశాల అదనపు గది ప్రారంభోత్సవం

suresh sitharla

Published

on

జనం వెలుగు, నందిపేట్:- నందిపేట్ మండంలోని చింరాజ్ పల్లి గ్రామంలో గల ప్రాథమికోన్నత పాఠశాలకు మండల పరిషత్ నిధుల ద్వార మంజూరైన నిధులతో అదనపు గది నిర్మించిన స్థానిక ఎంపిటిసీ సభ్యుడు ఆ పాఠశాల పూర్వ మేనెజ్మెంట్ చైర్మన్ సిరిగిరి శ్రీనివాస్ గురువారం స్థానిక వ్యవసాయ సహకార సంఘం (PACS) చింరాజ్ పల్లి చైర్మన్ బొంకం గంగరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రదానోపాద్యాయుడు ప్రసాద్, నిర్వహణ కమిటి చైర్మన్ తోట రవి, గ్రామ సర్పంచ్ ఉపసర్పంచ్ లు తోట గణేష్, దుడ్డు భూపతి నాయకులు బొంత శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Crime

మండల కేంద్రంలో ఇనుపరాట్లతో వ్యక్తిపై దాడి

janamvelugunews

Published

on

మండల కేంద్రంలో ఇనుపరాట్లతో వ్యక్తిపై దాడి….

నందిపేట జూన్ 14 జనం వెలుగు: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తా సురేష్ నగర్ కాలనీ ఎదురుగా ఉన్న ఆర్డర్ మెస్ ప్రాంతంలో నందిపేట రాజనగర్ దుబ్బ ప్రాంతానికి చెందిన నయిం అనే వ్యక్తిపై కొందరు వ్యక్తులు కారుపై వచ్చి ఇనుపరాట్లతో దాడి చేయడంతో నయిం తలకు,

  చెయ్యికి, పొట్ట ప్రాంతంలో తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నయిం, కయ్యులు అన్నదమ్ములని, వీరి బంధువులైన షేక్ తాలిబ్, షేక్ తాహెర్, సాజిద్, షాహెద్, గాలిబ్ మరి కొంతమంది వ్యక్తులు కారులో వచ్చి రాడ్లతో నయీంపై దాడి చేయడం జరిగిందని,

   వీరి ఇరువురి మధ్య పాత కక్షలు ఉన్నాయని, సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నామని, నయీమ్ చికిత్స పొందుతున్నాడని, బాధితుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు, దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు.

Continue Reading

Crime

పసిపాపను చంపిన హంతకుల జాడేది

janamvelugunews

Published

on

పసిపాపను చంపిన హంతకుల జాడేది.,

నందిపేట జూన్ 14 జనం వెలుగు; నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో దాదాపు 20 రోజుల కిందట మెయిన్ రోడ్డు పాత హనీ రెస్టారెంట్ వెనకాల ఖాళీ స్థలంలో అప్పుడే పుట్టిన పసికందును ఎండలో పడేయడంతో పసికందు మృతి చెందిన ఘటన అందరికీ తెలిసిందే…

కానీ పాప చనిపోయి 20 రోజులు గడిచిన ఆ పసి గుడ్డు నెత్తుటి మరకలు అంటిన అదాంతకుల యాడ మాత్రం తెలిసి రాలేదు. బేటి బచావో… బేటి పడావో…. అనే నినాదాలు పేపర్లకే పరిమితమైనట్టు ఉంది ఈ సంఘటన.. తరతరాల నుండి ఆడపిల్లల పైన ఎన్నో అఘైత్యాలు, ఆడపిల్ల అంటే అలుసే… మగాడు అంటే మురుపమే..

   ఈ తారతమ్యాలను రూపుమాపేందుకు ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపట్టిన క్షేత్రస్థాయిలో మాత్రం ఆ లక్ష్యాలను చేదిదిండం లేదు. వెంటనే ఈ దుశ్చర్యలకు పాల్పడిన, ఆ నెత్తుటి మరకల చేతులకు సంకెళ్లు వేస్తేనే మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Continue Reading

నిజామాబాద్

ప్రతి ఒక్కరికి అగ్ని ప్రమాదాలపై అవగాహన ఉండాలి

janamvelugunews

Published

on

ప్రతి ఒక్కరికి అగ్ని ప్రమాదాలపై అవగాహన ఉండాలి

నందిపేట్ జూన్ 14 జనం వెలుగు: నందిపేట మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై వినయ్ కుమార్ వస్తూ వస్తూనే తన మార్కును చూపిస్తున్నాడు. తన ఠాణా పరిధిలోని ప్రజలందరికీ ఎక్కడికక్కడ సమావేశాలను ఏర్పరుస్తూ మత్తుపదార్థాలపై, అగ్ని ప్రమాదాల నివారణపై, రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, దొంగతనాలపై, మరి ముఖ్యంగా యువత డ్రగ్స్ కు బానిస కాకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా విధి నిబద్ధతతో సమాచారం అందుకున్న వెంబటనే పేకాట స్థావరం పై దాడి చేసి అసాంఘిక కార్యక్రమాలు చేసే వారికి దడ పుట్టిస్తున్నాడు. శనివారం స్థానిక బస్టాండ్ ఆవరణలో ఫైర్ సిబ్బందితో కలిసి ఇంటిలో వినియోగించే ఎల్పిజి గ్యాస్ లీకేజీ, ఫైర్ సేఫ్టీ పైన మహిళలకు అవగాహన కల్పించారు. అనుకోకుండా సిలిండర్ లీకేజీ అయి మంటలు సంభవిస్తే భయపడకుండా ధైర్యంగా చిన్న చిట్కాతో ఎలా మంటలను ఆర్పేయవచ్చో ప్రత్యక్షంగా చూయించారు. వచ్చి రాగానే తమ ప్రజలకు ఆర్థిక నేరాలపై, ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలతో అవేర్నెస్ కల్పిస్తున్న ఎస్సై వినయ్ కుమార్ ను ప్రజలు అభినందిస్తున్నారు.

Continue Reading