Connect with us

నిర్మల్

ఆలోచనలే భయాన్ని వీడితే బంగారు భవిష్యత్తు

suresh sitharla

Published

on

పురుషులకంటే స్త్రీలే ప్రపంచంలో అన్ని రంగాల్లో ముందుజా

జనం వెలుగు, బాసర:- ఆర్జీయూకేటీ బాసరలో సిఓఈ సిరీస్ 2 లో భాగంగా ‘వ్యక్తిత్వ వికాసం – ఉపాధి అవకాశాలు’ అనే అంశంపై డాక్టర్ దేశపాండే అక్షయ పాత్ర USAకి సహా వ్యవస్థాపకులు గురు రాజ్ దేశ్ పాండే సుదీర్ఘంగా మాట్లాడారు. ఆర్జీయూకేటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ వెంకటరమణ మాట్లాడుతూ అర్జీయూకేటీ విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని, ప్రపంచ స్థాయి కంపెనీలలో పోటీ తత్వం ఎలా ఉంది, విద్యార్థులుగా తక్షణం చేయవలసిన కర్తవ్యం ఏమిటి, వ్యక్తి కంపెనీ వ్యవస్థాపకుడుగా మారడానికి కావలసిన నైపుణ్యాలను పొందడానికే సి ఓ ఈ టాక్ సిరీస్ లను ప్రారంభించామని తెలిపారు. డైరెక్టర్ ప్రొఫెసర్ సతీష్ కుమార్ స్వాగత ఉపన్యాసం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ వెంచర్ క్యాపిటల్ లిస్ట్ పలు కంపెనీల వ్యవస్థాపకుడు అయిన దేశ్పాండే గురు రాజ్ తన జీవిత అనుభవాలను వివరిస్తూ చదువు పూర్తి అయిన తర్వాత శిక్షణ. శిక్షణ ద్వారా ఇంజనీర్ దాంతో కంపెనీ వ్యవస్థాపకులుగా ఎలా మారాలనేది వివరించారు. తను సుతాహాగా క్యాస్కేడ్ కమ్యూనికేషన్స్, సైకా మోర్ నెట్వర్క్, కూర నెట్వర్క్, తేజస్ నెట్వర్క్, సిమారాన్, వెబ్ డైలాగ్స్, ఎయిర్ వాన పలు కంపెనీలను స్థాపించినప్పుడు ఎదుర్కొన్న సమస్యలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఇన్నోవేటర్గా ఇలా ప్రగతి సాధించాలో ఆయన స్పష్టంగా వివరించారు దానికి ప్రధానంగా నూతనంగా ఆలోచించే విధానం కావాలని, ఎవరూ చూడని కోణంలో చూడాలని, భయాన్ని వీడితే భవిష్యత్తు మనదేనని, ప్రతి విజయం వెనకాల కష్టం ఉంటుందని దానికి పట్టుదల కృషి అత్యంత ప్రధానమైన ఆయుధాలని విద్యార్థులకు సూచించారు. మన చుట్టూ ఉన్న సమస్యలను మనమే ఒక జట్టుగా ఏర్పడి నూతనంగా ఆలోచించి పరిష్కారాన్ని చూపడమే ఇన్నోవేటర్ ముఖ్య లక్షణమని పేర్కొన్నా విద్యార్థుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దేశపాండే ఫౌండేషన్’ వ్యవస్థాపకురాలు జైశ్రీ దేశ్ పాండే మాట్లాడుతూ చేసే పనిని ప్రేమిస్తే అవకాశాలు వాటంతట అవే వస్తాయని, అర్థ శతాబ్దం కిందట బాలికలు చదవడం తక్కువని, ఉద్యోగాలు చేయడం అంతకన్నా తక్కువని, నేడు బాలికలదే పై చేయిగా, మహిళాలు అనేక రంగాల్లో అనేక ఉన్నత పదవులను సాధించి పెట్టడం మనం గమనిస్తున్నాము. దేశమే కాకుండా ప్రపంచంలోనే స్త్రీలు అత్యధికంగా అన్ని రంగాల్లో పనిచేయడం శుభ పరిణామం అని పేర్కొన్నారు. పేర్కొన్నారు. దేశ్ పాండే ఫౌండేషన్ ద్వారా అర్జీయూకేటీ విద్యార్థులకు సహసకారాలు అందిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమం అనంతరం వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ గురురాజ్ దేశ్ పాండే జై శ్రీ దేశ్ పాండే లకు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సాండ్ బాక్స్ కంపెనీ వ్యవస్థాపకులు రాజు రెడ్డి, సి ఓ ఈ లు, అసోసియేట్ డీన్స్, హెడ్ అప్ ది డిపార్ట్మెంట్స్, టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగులు, ఇంజనీరింగ్ మూడవ, నాలుగవ సంవత్సరం విద్యార్థులు పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిర్మల్

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

janamvelugunews

Published

on

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

5వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అజూహ ఫాతిమా ప్రధానోపాధ్యాయురాలిగా, భార్గవ్ ప్రసాద్ డీఈఓగా, సాత్విక్ ఎంఈఓగా, శశాంత్ కాంప్లెక్స్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా ఆదర్శ్, ప్రణీత్, చరణ్య, తేజశ్రీ, నవ్య, యశ్వంత్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.

విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.

విద్యార్థుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రతిబింబించిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

Continue Reading

నిర్మల్

| Nirmal ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన

janamvelugunews

Published

on

ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన

నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీ

జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్ ఏర్పాటు, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.

అలాగే, సభ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Continue Reading

నిర్మల్

Nirmal | నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం

janamvelugunews

Published

on

నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం

జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్‌బండ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, పచ్చదనం, సుందరీకరణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Continue Reading