Connect with us

ARTICLE'S

ఆకారం లేని కర్రకు అందమైన రూపం

suresh sitharla

Published

on

కర్రతో అందమైన కలకృతులు.

చెక్కపై  అబ్బురపరిచే కలకృ తులు.

జాతీయస్థాయిలో గుర్తింపు.

లెక్కకు మించి శిల్పాలు ఆకట్టుకునే బొమ్మలు.

 జనం వెలుగు:-  రాతి శిల్పాలపై అలనాటి కళాకారులు రూపొందించిన శిల్పాలు విశ్వ వ్యాప్తంగా  ఖ్యాతి గాడించాయి. నిజామాబాద్ గంగస్తాన్ లోని వెంకటేశ్వర ఆలయానికి ఎదురుగా కళా రూపు దిద్దుకుంటుంది. నిజామాబాద్ మండలానికి చెందిన రామ్ గోపాల్ చెక్కపై చెక్కుతున్న శిల్పాలు మాత్రం అలనాటి   కల వైభవాన్ని మరోసారి కళ్ళ ముందు నిలుపుతున్నాయి. ఏ కర్ర కైనా ఆయన చేతిలో పడితే. అందమైన రూపం వస్తుంది. ఆయన చేతిలో ఉలి చేసే నాట్యం అద్భుత కళాఖండాలకు ఊపిరి పోస్తుంది. చెక్కలపై బొమ్మలు కళాకృతులను చెక్కుతూ అందరినీ ఆకర్షిస్తున్నాడు రాంగోపాల్ కర్రల పై కళాఖండాలు సృష్టించి మరో బ్రహ్మగా మారాడు. ఊడ్ కార్వింగ్ అంటే మామూలు విషయం కాదు అది పెద్ద ప్రహసనం.

ఈ రామన్న ఇందూరు జక్కన్న

తెలంగాణ కళామతల్లి ముద్దుబిడ్డ
కళా సరస్వతి అనుమల్ల రాంగోపాల్. అతడు ఒక మధ్యతరగతి కుటుంబంలో  జన్మించి ఫోటోగ్రఫీ నుండి శిల్పకళా రంగంలో అడుగిడిన  అనతి కాలంలోనే తన కళ నైపుణ్యాన్ని 2015లో రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్నాడు. 12 సంవత్సరాల క్రితం నిజామాబాద్ లో స్థిరపడి తెలంగాణకు శిల్పకళాకారులను ఉద్ధరించడానికి కంకణం కట్టారు. మన దగ్గర వుడ్ కార్వింగ్ లో నిష్ణాతులు లేరు. ఇప్పటి తరానికి వుడ్ కార్వింగ్ లో మెలుకువలు నేర్పిస్తే, వారు అద్భుతాలు సృష్టించగలరు. టెక్నాలజీని వాడుకోవడం ఈ తరానికి బాగా తెలుసు.

నేను గుర్తింపు కోసం ఏనాడూ ప్రయత్నం చేయలేదు కానీ తెలంగాణ రాష్ట్రం  కలలకు క్షేత్రం కావాలి. కళాకారుల రాష్ట్రం కావాలన్న ఆకాంక్షతో మొదలుపెట్టిన నాకు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. నేను వేసే ప్రతి అడుగులో బాధను తానే స్వీకరించి ఏ బాధ కలగకుండా తన ప్రాణం కన్నా ఎక్కువగా కాపాడుతూ, ఈ కలను రాష్ట్రస్థాయి అవార్డు వరకు తీసుకువచ్చిన ఘనత నా భార్య శ్రీవాణికి చెందుతుందని తెలిపారు.

అనుమల్ల అద్భుత శిల్పకళకు తార్కాణాలు…..

నా దగ్గర అమూల్యమైన సమయం తప్ప ఆర్థిక స్థోమత లేక నిశ్శబ్దంగా ఉండి పోతున్నానని తన చమర్చిన కళ్ళతో తెలిపారు. కల సరస్వతి కొరకు ఎంత కష్టమైనా బాధనైనా మోయడానికి సిద్ధంగా ఉన్నానని అకుంఠిత దీక్షకు శిల్పకళ నైపుణ్యానికి మెచ్చి  తెలంగాణ రాష్ట్రం ఎన్నో అవార్డులు ప్రధానం చేసింది. తాను చేపట్టిన మహా యజ్ఞంలో భాగంగా ఈ శిల్పకళా సరస్వతికి కావలసిన వనరులన్నీ ప్రభుత్వం అందించే కళగా కళాకారులు ఉద్యమిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని శిల్పకళా క్షేత్రంగా మలచి మన రాష్ట్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నత శిఖరాల్లో నిలుపుతానని అందుకు తెలంగాణ ప్రజల ఆశీర్వాదాలు నాయకుల సహాయ సహకారాలు కళాకారుల అండదండలు, అందాలని మనసా వాచా కర్మణా కోరుకుంటున్నాను. రామ్ గోపాల్ చేతులో  ఉలి పట్టుకొని చెక్కపై అలా చెక్కుతు పోతుంటే లెక్కకు మించిన శిల్పాలు ఆకట్టుకునే బొమ్మలు ప్రాణం పోసుకుంటాయి. ఈయన రూపొందించిన కళాఖండాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి దీంతోపాటు, హరితహారం విశిష్టతను తెలుపుతూ, పూర్ణకుంభం ప్రాచిత్యాన్ని వివరిస్తూ చెక్కపై కళారూపాలను ఆవిష్కరించారు. ఆధునిక పోకడలతో మారుతున్న కాలానికి అనుగుణంగా తన కళ ను మలచి కుటుంబాన్ని పోషిస్తూ కాలం గడుపుతున్నాడు. తన కలను ప్రదర్శించడానికి ఆధునిక పరిజ్ఞానం అందించే అతి విలువైన యంత్రాల సహాయం అవసరం. ఆయనకు ఎలాంటి వనరులు లేకున్నా, విలువైన కళారూపాలను నిర్మిస్తూ కళారాధన చేయుచున్నాడు. ఉడ్ కార్వింగ్ రంగంలో ఆసక్తి వున్నవారికి ఉచితంగా శిక్షణనిచ్చి వారికీ ఉపాధి చూపించడం తో పాటు నేను చేపట్టే ఆలయ నిర్మాణంలో అవకాశం కల్పిస్తామని తెలిపారు.

మనిషి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించినప్పుడు అతను మనసు పొందే ఆనందం మాటలతో వర్ణించలేనిది. అది సహజంగా ఏర్పడినది కావచ్చు మానవుని ఆలోచనల నుండి వచ్చి, సృష్టి చేయబడి ఉండవచ్చు ప్రకృతి అంటే అమ్మ ఒడి, ఆ ఒడిలో ఉన్న కొన్నిటిని అస్త్రంగా చేసుకుంటూ మరికొన్నింటిని అందమైన శిల్పాలుగా తీర్చిదిద్దుతూ, అన్ని అవకాశాలను మాకు ఎక్కడ లోటులెకుండా మాకు అందిస్తూ ముందుకు నడిపిస్తున్న ప్రకృతి మాతకు హృదయపూర్వక సాష్టాంగ ప్రమాణాలు తెలుపుతూ అమ్మ ఇచ్చిన 25 ఆలోచన ఈ అవకాశం ఎప్పుడూ ఏమీ కోరదు. అమ్మ, ఇది అందరికీ అనుభవమై ఉంటుంది. మా గురువు కోరిక మేరకు అమ్మ కొరకు ఆనంద నిలయాన్ని ఏర్పాటు చేయాలని తన ఆలోచన నుండి వచ్చిన ఈ కళాఖండాలే ఆ ఆనంద నిలయానికి ఒక మార్గం అని తెలిపారు. మా గురువు మాకు తెలియకుండా ఎన్నో అద్భుతాలు మాతో చేయించారు. ఇంకా ఎన్ని రోజులు ఇలా అని మేము అనుకునే లోపలే మాకు సందేశం పంపించారు. మాకు గురూజీ ఇచ్చిన వివరణ ఇంతవరకు మాత్రమే తన సందేశాన్ని ఆచరణ చేస్తూ ఈ కళాక్షేత్రాన్ని ముందుకు నడిపిస్తున్నాము. మీ కళ్ళే మీకు మార్గం. మీ ప్రతి అడుగుకు ముందు  పాత్ర పోషించేది మీ కళ్ళే. అలాంటి కళ్ళు ఇలాంటి కళాకృతులను  ఆస్వాదించాలని ఆలోచనతో ఈ కళాక్షేత్రాన్ని మొదలుపెట్టాము. మనిషి తన జీవన విధానం అనే అంశం పైన వివరణ ఇవ్వడం జరిగింది. మనకు రెండు విషయాలు చాలా వివరంగా తెలుసు అవి ట్రెడిషనల్, మోడల్, సాంప్రదాయమైన ఆధునికమైన ఇవి పదాలు కావు. మన ఆచార వ్యవహారాలు ఈ రెండింటిని కలుపుకొని ఒక అద్భుతం చూపించాలని గురుజీ  యొక్క సంకల్పం. అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళమని శాసనము ఇచ్చారు. అందుకే మీ ముందుకు ఇలా రావడం జరిగిందని తెలిపారు. భావితరాలకు సైతం ఈ కలను గొప్పగా అందించాలంటున్నాడు. నిజామాబాద్ లో ఉడెన్ టెంపుల్ నిర్మించడం తన చిరకాల వాంఛ అని రామ్ గోపాల్ పేర్కొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ARTICLE'S

గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించాలి

janamvelugunews

Published

on

రుద్రూర్ జనం వెలుగు న్యూస్ 30 అక్టోబర్ :- రైతులు విధిగా తమ పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేయించాలని తద్వారా పశువులకు వ్యాధి సోకకుండా ఉంటుందని రుద్రూర్ పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ తెలిపారు. గురువారం రుద్రూర్ మండలకేద్రంలోని బొప్పాపూర్ గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ రైతులను ఉదేశించి మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి ప్రమాదకరమైనదని పశువులకు ఒకదాని నుండి ఒకదానికి సంక్రమిస్తుందని అన్నారు. గాలికుంటు వ్యాధి సోకకముందే టీకాలు వేయించి నివారణ చేపట్టాలని గాలికుంటు వ్యాధి సోకిన పశువులను ఇతర పశువుల నుండి దూరంగా ఉంచాలని లేనట్లయితే అన్ని పశువులకు వ్యాధి సోకి తీవ్ర నష్టం కలిగిస్తుందని సూచించారు. ప్రభుత్వం జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో భాగంగా పశువైద్య శాఖ ద్వారా ఉచితంగా గాలికుంటు వ్యాధి టీకాలు వేయించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతాంగం సద్వినియోగం చేసుకుని గాలికుంటు వ్యాధి టీకాలు వేయించి తమ పశువులను వ్యాధి పడకుండా రక్షించుకోవాలని బారిన సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలో 48 పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ పశు వైద్య సిబ్బంది, పాడి రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

ARTICLE'S

మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలి

janamvelugunews

Published

on

జనం వెలుగు న్యూస్ రుద్రూర్ 29- అక్టోబర్ : మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలకు రుద్రూర్ మండలంలో రైతులు ఆరుగాలం పాటు కష్టించి పండించిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. బుధవారం రుద్రూర్ మండల బిజెపి నాయకులు రైతుల కల్లాల వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్బంగా బిజెపి మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని మైచర్ మిషన్ వడ్లలోని తేమ శాతం 25 చూపిస్తే రైస్ మిల్లలోని మైచర్ మిషన్ తేమ శాతం 16 చూపిస్తున్నట్లు ఆరోపించారు అదేవిదంగా కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను రైస్ మిల్లుకు తరలించకపోవడం వలన కొంతమంది రైతుల ధాన్యం బస్తాలు అడుగుభాగం తడిచినట్లు సకాలంలో రైస్ మిల్ కు ధాన్యం తరలించి ఉంటే రైతులకు నష్టం జరిగేది కాదని పేర్కొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ వెంటనే సాంక్షన్ చేయాలని చేయాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లులు అన్నిటికీ అలాట్మెంట్ ఇచ్చి సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలని రుద్రూర్ బీజేపీ మండల కమిటీ తరఫున ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గూడూరి ప్రశాంత్ గౌడ్, నియోజవర్గ సీనియర్ నాయకులు పార్వతీ మురళి, మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి గజేందర్, కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు, ఎర్రోళ్ల గంగాధర్, యువ మోర్చా మండల అధ్యక్షుడు కుమ్మరి గణేష్, శివప్రసాద్, వరప్రసాద్, వినోద్ కుమార్, మాధవ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Continue Reading

ARTICLE'S

వర్ని అంగల్లో తైబజార్ అధిక వాసుళ్లు…

janamvelugunews

Published

on

జనం వెలుగు న్యూస్ : వర్ని మండల కేంద్రంలో ప్రతి మంగళవారం వారం వారపు సంత జరుగుతుంది. అందులోనే మేకల అంగడి కూడా జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుండి మేకలు అమ్మడానికి వ్యాపారులు వస్తారు.

ఇదే అదునుగా వర్ని తైబజార్ నిర్వాహకులు కొన్న వారి దగ్గర నుండి 50 రూపాయలు అమ్మిన వారి దగ్గర నుండి ఒక్కో మేకకు 50 రూపాయలు వసూలు చేస్తున్నారని వ్యాపారులు, కొనుగోలుదారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు కొంతమంది గ్రామ పంచాయతీ సెక్రెటరీ ఫిర్యాదు చేయగా అవును డబ్బులు కట్టాలని నిర్లక్ష్యగా సమాధానం చెబుతున్నాడని తెలిపారు తై బజార్ వ్యాపారులతో మిలాకతయి మార్కెట్లో అక్కడే ఉండి డబ్బులు వసూలు చేస్తున్నారని మేకల కొనుగోలు దారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై సెక్రెటరీకి వివరణ కోరగా అమ్మినవారు 25 రూ. కొన్నవారు 25 రూపాయలు చెల్లించాలని తెలిపారు. తై బజార్ వ్యాపారులు అధిక డబ్బులు వసూలు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కానీ పంచాయతీ సెక్రెటరీ దగ్గరుండి మరీ తైబజార్ వ్యాపారులతో మేకల క్రయ, విక్రయాల పై డబ్బులు వసూలు చేస్తున్నట్లు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.

Continue Reading