నిర్మల్
బాసర త్రిబుల్ ఐటీ లో త్రీడీ ప్రింటింగ్, డిజైన్ లపై ఎఫ్ డి పి


జనం వెలుగు, బాసర:– రాజీవ్ గాంధీ శాసన సాంఘిక పరిజ్ఞాన విశ్వవిద్యాలయం బాసర ట్రిపుల్ ఐటిలో సోమవారం ఆలోచన ప్రక్రియకు భౌతిక నమూనా త్రిడీ ప్రింటింగ్ ఆర్జీయూకేటీ బాసరలో డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్, సెంటర్ ఫర్ ప్రొడక్ట్ డిజైన్, డెవలప్మెంట్ అండ్ అడిటీవ్ మ్యానీఫ్యాచరింగ్, ఉస్మానియా విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో త్రీడీ ప్రింటింగ్ డిజైన్ లపై వారం రోజులపాటు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ను నిర్వహించడం జరుగుతుంది. మొదటి రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రిన్సిపాల్ ప్రొ. శ్రీరామ్ వెంకటేష్ మాట్లాడుతూ ‘శిక్షకులకు శిక్షణ ఇవ్వండి’ విద్యార్థులకు మరింత చక్కగా బోధిస్తారనన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గల త్రిడీ ప్రింటింగ్ అత్యాధునిక ప్రయోగశాల, సౌకర్యాల గురించి చెప్తూ ఆర్జీయూకేటీని ఇండస్ట్రీయల్ టూర్ కు ఆహ్వానించారు. ప్రారంభ ఉపన్యాసకులుగా డైరెక్టర్ ప్రొఫెసర్ సతీష్ కుమార్ విచ్చేసి ఎఫ్‌డిపి, పరిశోధన ప్రాముఖ్యతను వివరిస్తూ ఉపకులపతి ప్రొ.వెంకటరమణ విద్యార్థుల అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ ముందుంటారని, తద్వారానే సీఇఓ చర్చలు, లెక్చర్ సిరీస్‌ల వంటివి ఇప్పటి వరకు నిర్వహించామని, వివిధ సంస్థలతో దాదాపు 16 యంఓయూలు చేశామన్నారు. భవిష్యత్తులో మరిన్ని నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ మాట్లాడుతూ ఆర్జీయూకేటీని ఉన్నత విద్యా సంస్థగా తీర్చిదిద్దే క్రమంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, విద్యార్థులకు ఇండస్ట్రియల్ టూర్లు, ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ సెంటర్లను సందర్శించుటకు శ్రీకారం చుట్టాము. ఈ క్రమంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం చేస్తున్న మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కు అభినందనలు తెలియజేశారు. ఈ అవకాశాలను విద్యార్థులు, అధ్యాపకులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి రాహుల్ సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో అందుబాటులో ఉన్న సౌకర్యాల గురించి, ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న విద్యాసంస్థల్లో పనిచేస్తున్న 30 మంది పరిశోధకులు, అధ్యాపకులు పాల్గొంటున్నారని తెలిపారు. విశ్వవిద్యాలయ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డీన్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం కన్వీనర్ డా.పి. చంద్రశేఖర్ రావు పరిశోధనలో త్రిడి ప్రింటింగ్ పాత్ర వివరిస్తూ, త్రిడీ ప్రింటింగ్ అనేది ఆలోచన ప్రక్రియకు భౌతిక నమూనా అని చెప్తూ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం గురించి ప్రసంగించారు. ఎఫ్‌డిపి కోఆర్డినేటర్ ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ప్రొ.శివ రామకృష్ణ మాట్లాడుతూ త్రిడీ ప్రింటింగ్ మెడికల్, ఏరోస్పేస్ మొదలైన వివిధ విభాగాలలో ఎనలేని పాత్ర పోషిస్తుందన్నారు. వస్తువు తయారీ యొక్క ప్రాముఖ్యతను పరిచయం చేసారు. తదనంతరం ప్రోటోటైప్‌లు టు ప్రొడక్ట్: టెక్నాలజీస్ అండ్ కేస్ స్టడీస్‌పై యొక్క మొదటి సెషన్‌ను అందించారు. కార్యక్రమంలో పరిశోధన విద్యార్థులు, విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
నిర్మల్
ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
5వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అజూహ ఫాతిమా ప్రధానోపాధ్యాయురాలిగా, భార్గవ్ ప్రసాద్ డీఈఓగా, సాత్విక్ ఎంఈఓగా, శశాంత్ కాంప్లెక్స్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా ఆదర్శ్, ప్రణీత్, చరణ్య, తేజశ్రీ, నవ్య, యశ్వంత్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.
విద్యార్థుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రతిబింబించిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
నిర్మల్
| Nirmal ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన


ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన
నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీ
జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్ ఏర్పాటు, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.
అలాగే, సభ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్
Nirmal | నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం


నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం
జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్‌బండ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, పచ్చదనం, సుందరీకరణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








