Connect with us

నిర్మల్

లోకేశ్వరం భాగతసింగ్ చొరస్తాలో రాస్తరోకో

INTHIYAZ MIRZA

Published

on

లోకేశ్వరం భాగతసింగ్ చొరస్తాలో రాస్తో రోకో

రోడ్లపై నిలిచినా వాహనాలు

దళితులపై దళితులతో దాడి చేయించిన అబ్దుల్లాపూర్ గ్రామ విడిసి, సర్పంచ్ ను వెంటనే అరెస్ట్ చేయాలి

జనం వెలుగు, లోకేశ్వరం:- లోకేశ్వరం మండల కేంద్రంలోని భగత్ సింగ్ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కొబ్బనోళ్ల గంగన్న, గైని మురళి మాట్లాడారు. కనకాపూర్ గ్రామానికి చెందిన దళిత రైతు కొబ్బనోళ్ల గంగన్న, తన ఐదు ఎకరాల భూమిలో వీడీసీ నిర్మించిన బిల్డింగ్ లో గృహప్రవేశం చేయడం జరిగింది. వీడిసి వాళ్లు దళిత రైతుల భూమిని కబ్జా చేసి రెవెన్యూ పోలీసులతో మమేకమై బిల్డింగ్ నిర్మించారు. 33 సంవత్సరాలుగా సాగులో ఉన్నటువంటి భూమిని క్రికెట్ రౌండ్ గా మార్చిన వీడిసి పై గ్రామ సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ దళితుల భూమిని గుంజుకున్న విడిసిపై అట్రాసిటీ యాక్ట్ కేసు పెట్టాలని, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పోలీసులు ఐదు రోజులు గడిచిన పట్టించుకోలేదని నిన్ననే హైదరాబాద్ వెళ్లి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కి ఈ సమస్యపై ఫిర్యాదు చేయడం జరిగింది. అని నేడు తన భూమిలో ఉన్నటువంటి బిల్డింగ్ లో గృహప్రవేశం చేశామని ఇది పసిగట్టిన అబ్దుల్లాపూర్ గ్రామ విడిసి సర్పంచ్, వెనుక ఉండి ఆ గ్రామ దళితులను ఉసిగొలిపి పంపి, దాడి చేయించారు. విషయాన్ని వెంటనే దాడి జరుగుతున్న క్రమంలోనే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అబ్దుల్లాపూర్ గ్రామ సర్పంచ్ కోట్ల ఖరీదు కలిగిన ఈ భూమిని ప్లాన్ ప్రకారంగా కబ్జా చేశారు. దళితుడి భూమిలో వీడీసీ బిల్డింగ్ అక్రమంగా నిర్మిస్తుంటే ప్రేక్షక పాత్ర వహించిన రెవెన్యూ, పోలీసులు, దళిత రైతుకు అన్యాయం చేశారు. మా భూమిలో మేము నివాసం ఉంటామని, వెళ్లిన వారిని అబ్దుల్లాపూర్ గ్రామ రైతులతో కొట్టించారు. వెంటనే వీడీసీ వాళ్ళను అరెస్ట్ చేయాలని దళితుడినైనా నాకు న్యాయం చేయాలని కొబ్బనోళ్ల గంగన్న కోరారు. ఈ రాస్తారోకోలో మండల దళిత నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిర్మల్

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

janamvelugunews

Published

on

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

5వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అజూహ ఫాతిమా ప్రధానోపాధ్యాయురాలిగా, భార్గవ్ ప్రసాద్ డీఈఓగా, సాత్విక్ ఎంఈఓగా, శశాంత్ కాంప్లెక్స్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా ఆదర్శ్, ప్రణీత్, చరణ్య, తేజశ్రీ, నవ్య, యశ్వంత్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.

విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.

విద్యార్థుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రతిబింబించిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

Continue Reading

నిర్మల్

| Nirmal ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన

janamvelugunews

Published

on

ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన

నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీ

జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్ ఏర్పాటు, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.

అలాగే, సభ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Continue Reading

నిర్మల్

Nirmal | నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం

janamvelugunews

Published

on

నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం

జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్‌బండ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, పచ్చదనం, సుందరీకరణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Continue Reading