Connect with us

నిర్మల్

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

janamvelugunews

Published

on

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనార్ధన్

జనం వెలుగు, నిర్మల్:- బీడీ, హాస్టల్ వర్కర్స్ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐ ఎఫ్ టి యు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనార్ధన్ డిమాండ్ చేశారు. సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవన్లో జరిగిన ఐ ఎఫ్ టి యు జిల్లా ఎనిమిదవ మహాసభకు కామ్రేడ్ ఎం హరిత అధ్యక్షత వహించారు. ఐ ఎఫ్ టి యు జెండాను కామ్రేడ్ హరిత ఎగురవేశారు. అనంతరం జనార్ధన్ మాట్లాడుతూ కార్మికులు తీవ్రమైన శ్రమదోపిడికి గురవుతున్నారని కేంద్ర ప్రభుత్వం ఎమ్మెన్సీలకు, పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు దోచిపెట్టే విధంగా, కార్మికుల హక్కులను కాలరాస్తూ చట్టాలు చేస్తున్నాయని విమర్శించారు. అనేక సంవత్సరాలుగా త్యాగాలతో, పోరాటాలతో సాధించుకున్న అనేక హక్కులను, చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తూ కార్పొరేట్ల కు లొంగిపోయి, ఊడిగం చేస్తూ కార్మిక వర్గానికి ద్రోహం చేస్తున్నదని అన్నారు.బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు శ్రమదోపిడికి గురవుతున్నారని అన్నారు. 41 జీవో నెంబర్ ని అమలు చేయాలని, కోత్ప చట్టాన్ని రద్దు చేయాలని, అర్హులైన కార్మికులందరికీ జీవనభృతిని అందించాలని డిమాండ్ చేశారు.హాస్టల్లో పనిచేస్తున్న వర్కర్స్ అందరిని పర్మినెంట్ చేయాలని,కనీస వేతనం 26,000 అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి జే రాజు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని ఓట్ల రాజకీయాలు చేస్తూ కులం, మతం పేరుతో ప్రజల మధ్య విభజన రాజకీయాలు చేస్తూ ఓట్లు దండుకుంటున్నాయని, పేదవాళ్లందరూ ఒక్కటై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు సునారికారి రాజేష్ భూక్య విలాస్, దుర్గం లింగన్న, లక్ష్మి, గోదావరి, కవిత తదితరులు పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిర్మల్

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

janamvelugunews

Published

on

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

5వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అజూహ ఫాతిమా ప్రధానోపాధ్యాయురాలిగా, భార్గవ్ ప్రసాద్ డీఈఓగా, సాత్విక్ ఎంఈఓగా, శశాంత్ కాంప్లెక్స్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా ఆదర్శ్, ప్రణీత్, చరణ్య, తేజశ్రీ, నవ్య, యశ్వంత్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.

విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.

విద్యార్థుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రతిబింబించిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

Continue Reading

నిర్మల్

| Nirmal ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన

janamvelugunews

Published

on

ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన

నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీ

జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్ ఏర్పాటు, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.

అలాగే, సభ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Continue Reading

నిర్మల్

Nirmal | నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం

janamvelugunews

Published

on

నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం

జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్‌బండ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, పచ్చదనం, సుందరీకరణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Continue Reading