Connect with us

నిజామాబాద్

చాకలి ఐలమ్మ స్పూర్తితో ముందుకు సాగాలి

janamvelugunews

Published

on

చాకలి ఐలమ్మ స్పూర్తితో ముందుకు సాగాలి

జెడ్పి చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు

జనంవెలుగు, నిజామాబాద్, సెప్టెంబర్ 10 : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తితో ముందుకు సాగాలని జెడ్పి చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు పిలుపునిచ్చారు. చాకలి ఐలమ్మ 38వ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఆదివారం వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. వినాయక్ నగర్ లో గల ఐలమ్మ విగ్రహానికి జెడ్పి చైర్మన్, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, ఇతర జిల్లా శాఖల అధికారులు, వివిద కుల సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జెడ్పి చైర్మన్ మాట్లాడుతూ, పెత్తందారి వ్యవస్థకు, దొరల పాలనకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ పోరాటం చేశారని గుర్తు చేశారు. మహిళ అయి ఉండి కూడా తన హక్కుల కోసం ఎలుగెత్తి చాటారని కొనియాడారు. దొరల ఆధీనంలో ఉన్న భూములను పేదలకు పంచి సమసమాజ స్థాపనకు కృషి చేసిన ధీరవనిత ఐలమ్మ అని కొనియాడారు. చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకుని, ఆమె ఆశయాల సాధనకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి నర్సయ్య, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిజామాబాద్

అదనపు కలెక్టర్ తో మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుల భేటీ

Thammali Pandu

Published

on

అదనపు కలెక్టర్ తో మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుల భేటీ

జనంవెలుగు నిజామాబాద్ : – నిజామాబాద్ జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యులు అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాజాగౌడ్ తో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీ.సీ హాల్ లో భేటీ అయ్యారు.

జిల్లా డీఎంఏసీ సభ్యులను అదనపు కలెక్టర్ పరిచయం చేసుకున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీ. ఓకు అనుగుణంగా అర్హులైన వారికి అక్రిడిటేషన్ కార్డులు జారీ అయ్యేలా కృషి చేయాలని సూచించారు.

ఈ విషయంలో కమిటీ సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పారదర్శకంగా ఈ ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో డీపీఆర్ఓ ఎన్.పద్మశ్రీ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ సమాచార ఇంజనీర్ ఉమేష్ చంద్ర,

డీఎంఏసీ సభ్యులు కోయల్ కర్ రామ్ దయానంద్, ఆర్.భూపతి, జి.సాయి ప్రసాద్, ఎంఏ. మాజిద్, ఎల్.బాల్ కుమార్, ఎస్.శ్రీకాంత్, ఎన్.శ్రీనివాస్ పాల్గొన్నారు.

Continue Reading

నిజామాబాద్

ఎల్ నినో నేపథ్యంలో ఆరుతడి పంటలనే సాగు చేయాలి

Thammali Pandu

Published

on

ఎల్ నినో నేపథ్యంలో ఆరుతడి పంటలనే సాగు చేయాలి

ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి

ఖరీఫ్ పంటను గట్టెక్కిస్తాం…రబీలో మాత్రం వరి వేస్తే కాపాడలేం

ఆరుతడి సాగుకు అన్నివిధాలుగా తోడ్పాటును అందిస్తాం

కొత్తగా బోరుబావులు తవ్విస్తే సీజ్ చేస్తామని స్పష్టీకరణ

జనంవెలుగు నిజామాబాద్ :- ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదైన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా రైతులు రబీలో ఆరుతడి పంటలనే సాగు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి హితవు పలికారు.

అందుబాటులో ఉన్న నీటి వనరులు, భూగర్భ జలాల లభ్యత, విద్యుత్ సరఫరా తదితర పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.

ఒకవేళ వరి మినహా ఇతర పంటల సాగుకు చౌడు భూములు వంటి నేల రకాలు సహకరించకపోతే క్రాప్ హాలిడే పాటించాలని, వరి సాగు మాత్రం చేయవద్దని స్పష్టం చేశారు.

 నందిపేట మండలం నూత్ పల్లి రైతు వేదికలో మంగళవారం ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం నిర్వహించగా, కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని రైతులనుద్దేశించి మాట్లాడారు.

ఖరీఫ్ లో వేసిన వరి పంట పూర్తి స్థాయిలో చేతికి అందేంత వరకు జిల్లా యంత్రాంగం తరపున కాపాడుతామని రైతులకు భరోసా కల్పించారు.

అయితే రబీలో మాత్రం వరి పంటకు సాగు నీరు అందించే పరిస్థితి ఉండదని కలెక్టర్ వెల్లడించారు. సూపర్ ఎల్ నినో ప్రభావంతో ప్రతీకూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ రంగంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై రైతులకు కీలక సూచనలు చేశారు.

వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో పండే పెసలు, మినుములు, శనగతో పాటు జొన్న, మొక్కజొన్న, కూరగాయలు వంటి పంటల సాగును చేపట్టడం ఎంతో శ్రేయస్కరమని రైతులను ప్రోత్సహించారు.

బిందు సేద్యాన్ని వినియోగించుకొని ఆయిల్‌పామ్ తోటలు, కూరగాయలు తదితర పంటలను సాగు చేయడం ద్వారా నీటిని పొదుపుగా వినియోగించుకోవచ్చని అన్నారు. ఆరుతడి పంటల సాగుకు ముందుకు వచ్చే రైతాంగానికి ప్రభుత్వ పరంగా జిల్లా యంత్రాంగం తరఫున తోడ్పాటును అందిస్తామని భరోసా కల్పించారు.

మల్చింగ్, బిందు సేద్యం విధానాలకు రాయితీ వర్తించేలా ప్రణాలికలు రూపొందిస్తామని అన్నారు. కూరగాయలు, ఇతర ఆరుతడి పంటలకు మార్కెటింగ్ సదుపాయం కల్పించే దిశగా కూడా తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

వీబీజీరాంజీ కింద ఇంకుడు గుంతలు, నీటి కుంటలు, బోరు బావుల రీఛార్జ్ వంటి పనులను చేపట్టి వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించుకోవడంపై దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు.

అయితే ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కొత్తగా బోరుబావులు తవ్వకూడదని, ఎవరైనా తవ్విస్తే వాటిని సీజ్ చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.

     ప్రస్తుతం ప్రధాన జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటి నిల్వలను తాగునీటి అవసరాలకే వినియోగిస్తామని కలెక్టర్ తెలిపారు. భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయని, రానున్న రోజుల్లో సేద్యానికి కరెంటు సరఫరాకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు.

దీనిని దృష్టిలో పెట్టుకుని రైతులు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని, యాసంగిలో వరి సాగు చేసి ఇబ్బందుల్లో పడవద్దని జిల్లా పాలనాధికారి హితవు పలికారు.

ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక మహిళా సంఘాల ప్రతినిధులు సైతం రబీలో రైతులు ఆరుతడి పంటలే సాగు చేసేలా విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహిస్తూ వారికి అవగాహన కల్పించాలని అన్నారు.

     ఈ సందర్భంగా ఆదర్శ రైతులు తమ అభిప్రాయాలను వెల్లడించగా, రబీలో ఏ తరహా పంటలు సాగు చేయవచ్చు, కరువు పరిస్థితులను అధిగమించేందుకు అనుసరించాల్సిన విధానాలు ఏమిటీ తదితర అంశాలపై వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు రైతులకు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్ రావు, ఉద్యానవన శాఖ అధికారిణి సంధ్య, సర్పంచ్ రాజిరెడ్డి, స్థానిక అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Continue Reading

నిజామాబాద్

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

Thammali Pandu

Published

on

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

కలెక్టర్ ఇలా త్రిపాఠి

సమయపాలన పాటించాలని అధికారులకు ఆదేశం

జనంవెలుగు నిజామాబాద్ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ, ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు.

సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 121 ఫిర్యాదులు అందాయి. అదనపు కలెక్టర్లు రాజాగౌడ్, భుజంగరావు, డీఆర్ఓ గీత, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీఆర్డీఓ సాయన్న, మున్సిపల్ అదనపు కమిషనర్ చంద్రశేఖర్లతో కలిసి కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించారు.

ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయవద్దని, పెండింగ్ అర్జీలను వెంటదివెంట పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఇదిలాఉండగా, ప్రజావాణి కార్యక్రమానికి పలువురు అధికారులు గైర్హాజరు కావడం, కొంతమంది ఆలస్యంగా హాజరు కావడాన్ని గమనించిన కలెక్టర్, ప్రతి ఒక్కరు విధిగా సమయ పాలన పాటించాలని ఆదేశించారు.

ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం అయ్యే నిర్ణీత సమయం ఉదయం 10.30 గంటల వరకు అధికారులు అందరూ హాజరు అయి ఉండాలన్నారు. ముందస్తు అనుమతి లేకుండా కార్యస్థానం విడిచి వెళ్లవద్దని ఆదేశించారు.

ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో నెలకొని ఉన్న పరిస్థితుల గురించి క్షేత్రస్థాయిలో ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు. మండల ప్రత్యేక అధికారులు అవగాహన సదస్సులలో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Continue Reading