Politics
గులాబీ హ్యాట్రిక్ సాధ్యమేనా


జనంవెలుగు, హైదరాబాద్, అక్టోబరు 12:- అందరి కంటే ముందే 115 నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు. అభ్యర్థుల ప్రకటనతో విపక్షాలకు ఊహించని షాక్ ఇచ్చారు. ఎవరి అంచనాలకు అందని వ్యూహాలతో నెగ్గుకొచ్చే గులాబీ బాస్, ప్రత్యర్థులపై మరోసారి పైచేయి సాధించారు. ఎన్నికలకు ముందే తానేంటో మరోసారి చేసి చూపించారు. ఎన్నికలకు 40 రోజులు ముందే టికెట్లిచ్చామని, గెలుపు విషయంలో సీరియస్ గా ఉండాలని అభ్యర్థులకు చెప్పకనే చెప్పారు. యుద్ధంలో దిగకముందే సగం గెలుపు ఖాయం చేశారు కేసీఆర్. బీఆర్ఎస్ అసంతృప్తుల కోసం ఎదురుచూస్తున్న ఇతర పార్టీలకు, ఆ అవకాశం లేకుండా చేసే ప్రణాళికలు వేశారు. టికెట్లు దక్కనివారు పార్టీలోనే ఉండాలని, తర్వాత మంచి అవకాశాలు వస్తాయని భరోసా ఇచ్చారు. అందుకు అనుగుణంగానే తాడికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, చెన్నమనేని రమేష్ బాబులకు నామినేటేడ్ పోస్టులు కట్టబెట్టారు. నిన్న మొన్నటి వరకు రాజయ్య, ముత్తిరెడ్డి, తామే అభ్యర్థులమంటూ చెప్పుకొచ్చారు. కేసీఆర్ హామీతో మెత్తబడ్డారు. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం చేస్తామని చెప్పుకొచ్చారు. కేసీఆర్ దిగనంతవరకే ప్రత్యర్థులకు ఛాన్స్. వన్స్ కేసీఆర్ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్ అన్న డైలాగ్ కూడా రాజకీయాల్లోనూ రిపీట్ అవుతుందన్న గ్యారెంటీ బీఆర్ఎస్ నేతల్లో ఉంది. కేసీఆర్ చెప్పినట్టే ఈసారి మెజార్టీ సీట్లు సిట్టింగులకే కేటాయించారు. అభ్యర్థుల్ని కూడా ముందే ప్రకటించేశారు. తమ సంగతేంటో అని ప్రత్యర్థి పార్టీల్లో ఎంతో కొంత చర్చ జరగాలనే కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ప్రత్యర్థులను ఇరుకు పెట్టేలా, పార్టీ పరంగా బీఆర్ఎస్ లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చూసుకున్నారు. ప్రతిపక్షాల్ని గందరగోళపరచాలనే అజెండాతో కేసీఆర్ ముందుకెళ్తున్నారు. ఎప్పుడైనా ముందస్తు నిర్ణయాలతో మంచే జరుగుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. తెలంగాణ రాజకీయాలు, భౌగోలిక పరిస్థితులపై కేసీఆర్ ఉన్నంత అవగాహన, క్లారిటీ, రాష్ట్రంలో మరే నేతకు లేదు. ఇంకా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమం, జిల్లాల చరిత్ర, సమస్యలు, సాగునీటి ప్రాజెక్టులు, ఆయకట్టు గురించి కేసీఆర్ ను కొట్టేవారే లేరు. బీఆర్ఎస్ కు కేసీఆరే కొండంత బలం. ఆయన ముందు తెలంగాణ ఏ పార్టీకి చెందిన నేతలైన దిగదుడుపే. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాలు కలిసి పోటీ చేశాయి. దీన్నే కేసీఆర్ అవకాశంగా మార్చుకున్నారు. చంద్రబాబు వచ్చి తెలంగాణలో ప్రచారం చేయడంతో కేసీఆర్ సెంటిమెంట్ ఉపయోగించారు. తెలంగాణలో ఆంధ్రోళ్ల పాలన, బానిసత్వం అవసరమా అంటూ ప్రచారం చేశారు. ఇది బాగా వర్కౌట్ అయింది. కొన్నిచోట్ల సిట్టింగుల మార్పు ఖాయమని ప్రచారం జరిగిన నియోజకవర్గాల్లోనూ అనూహ్యంగా వారికే సీట్లు దక్కాయి. మెరుగైన అభ్యర్థులు లేకపోవడం, వ్యతిరేకత ఉన్నా గెలుపుకు ఢోకా లేదనే అంచనాలతో కొన్ని చోట్ల సిట్టంగ్ లకే ఛాన్స్ ఇచ్చారు. అందరికంటే ముందే అభ్యర్థుల్ని ప్రకటించడం ద్వారా ప్రత్యర్థులను ఆత్మరక్షణలోకి నెట్టారు. కాంగ్రెస్, బీజేపీలు ఇంకా అభ్యర్థులనే ఎంపిక చేయలేదు. కేసీఆర్ ముందుగానే అభ్యర్థులను ప్రకటించడంతో, నేతలంతా ఒప్పటికే నియోజకవర్గాన్ని రౌండ్ వేసేశారు. కేసీఆర్ వ్యూహాలు ఎవరికీ అంతుచిక్కవని మరోసారి ప్రూవ్ అయిందని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. ఎన్నికల ప్రచారంలో కూడా సరికొత్త వ్యూహాలు ఉంటాయని చెబుతున్నాయి. ప్రగతి ఆధారంగానే మళ్లీ గెలుస్తామని కేసీఆర్ ధీమాగా చెబుతున్నారు. గత తొమ్మిదేళ్లలో తెలంగాణలో ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసని, వారు తమనే ఆశీర్వదిస్తారని నమ్మకంగా ఉన్నారు. మిగతా పార్టీల్లో అభ్యర్థులు ఖరారయ్యే లోపే బీఆర్ఎస్ అభ్యర్థులు ఒక విడత ప్రచారం పూర్తి చేసేశారు. ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే పూడ్చుకోవడానికి, మరింత బలం పెంచుకోవడానికి అభ్యర్థులకు అవకాశం కల్పించారు గులాబీ బాస్. ఒక్క అభ్యర్థుల ప్రకటనే కాదు, మ్యానిఫెస్టోలోనూ కీలక హామీలుంటాయనే ప్రచారం జరుగుతోంది. ఈ నెల 15న హుస్నాబాద్ వేదికగా కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి బీఆర్ఎస్ కు టఫ్ ఫైట్ తప్పదని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. సీట్లు కూడా తగ్గుతాయని సవాల్ చేస్తున్నాయి. కానీ ఉన్న సీట్లు పెరుగుతాయని బీఆర్ఎస్ నేతలు చెబుతూ వస్తున్నారు. అందుకే తమను ప్రతిపక్షం ఎక్కడా సవాల్ చేసే స్థితిలో లేదని ప్రూవ్ చేయడానికి గత ఎన్నికల మాదిరిగానే అడ్వాన్సుడ్ గా అడుగులు వేస్తున్నారు కేసీఆర్. ఆ విధంగా ప్రజల్లోకి బీఆర్ఎస్ బలంగా ఉందని, ప్రతిపక్షాలవి తాటాకు చప్పుళ్లేననే సంకేతాలు బలంగా పంపాలనుకుంటున్నారు. ఎన్నికల్లో కూడా ఏడుగురు సిట్టింగుల్ని మార్చిన కేసీఆర్, మంచి ఫలితాలే సాధించారు. కొత్తగా టికెట్లు దక్కిన వారంతా విజయం సాధించారు. ఈసారి కూడా సిట్టింగు స్థానంలో గెలిచేవారినే ఎంపిక చేశారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఎన్ని ప్రాతిపదికలు తీసుకున్నా, అంతిమంగా గెలవాలనే లక్ష్యంలో రాజీలేదంటున్నాయి. అసలు టికెట్లు దక్కనివారికి కొన్ని నెలలు ముందుగానే అగ్రనేతలు పరోక్ష సంకేతాలు ఇస్తూనే వచ్చారు. కొంతమందికి అయితే నేరుగా ముఖం మీదే చెప్పేశారు. అలా అసంతృప్తిని వీలైనంత వరకు ముందే తగ్గించేలా వ్యూహం రచించారు. ఎక్కడా అసమ్మతి అదుపు తప్పుకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక లిస్ట్ ఫైనల్ చేశాం కాబట్టి చర్చలు అనవసరం అని కేసీఆర్ చెప్పేశారు. పంచాయితీలు మానేసి ప్రచారంపై దృష్టి పెట్టాలనే సంకేతం ఇచ్చేశారు. స్థానిక నేతలతో సమన్వయం చేసుకోవాలని అభ్యర్థులకు కూడా సూచించారు. ప్రత్యర్థులు అభ్యర్థుల్ని ఫైనల్ చేసే లోపే అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఏకతాటిపైకి రావాలనే ఉద్దేశంతోనే మూడ్నెళ్ల ముందే అభ్యర్థుల్ని ప్రకటించారు కేసీఆర్. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 88 సీట్లు వచ్చారు. అదే ప్లాన్ ను ఈ ఎన్నికల్లోనూ కేసీఆర్ అమలు చేస్తున్నారు. 15 నుంచి హుస్నాబాద్ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నారు. ఎలాంటి హామీలు ఇస్తారో వేచి చూడాలి.
Politics
| armoor బిసి రిజర్వేషన్లను కాంగ్రెసు అమలు చేసింది


తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్.
జనం వెలుగు ఆర్మూర్:- గత ఎన్ని కలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రంలో బిసి లకు 42 శాతానికి (మించి) ఎక్కువగా బిసిలకు రిజ ర్వేషన్లను కల్పించిందని తెలంగాణ రాష్ట్ర ఖనిజా భివృద్ది సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ అన్నాడు. ఆర్మూర్ మున్సిపా లిటీలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడాడు. రాష్ట్ర అసెంబ్లీలో బిసి బిల్లు పెట్టి కేంద్ర ప్రభుత్వం ఆమోద కోసం పంపితే, బిసి బిల్లును కేంద్రం అమలు చేయకుండా మొండి చేయి చూపిందని ఆయన తెలిపాడు. ఇకపోతే బిసిలకు రిజర్వేషన్లను కల్పించవద్దని మాధవ రెడ్డితో బిఆర్ఎస్ పార్టీ హై కోర్టులో పిటీషన్ వేయించిందని ఆయన తెలిపాడు. బిసి బిల్లును కేంద్రానికి పంపి ఏడాది అవుతున్న బిసి బిల్లు పాస్ చేసి బిసిలకు సహకరించడం లేదని ఆయన ఆరోపించాడు. రాష్ట్రంలో బిసిలు 56 శాతం మంది ఉండగా 30 రిజర్వేషన్లను పాటి స్తూ పార్టీ తరపున 36 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ, మొత్తానికి 62 శాతం కాంగ్రెసు పార్టీ బిసిలకు రిజర్వేషన్లను కల్పించడం జరిగిందని ఆయన తెలిపాడు. ఆర్మూర్ ఎంఎ ల్ఏ రాకేష్ రెడ్డిని, ఎంఎల్ఏగా ఎం దుకు ఎన్నుకున్నామా అని ఆర్మూర్ ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన అన్నాడు.
సమాచారం ఇచ్చి 18 వ కేసు పెట్టు.
—————————————-
కాంగ్రెసు నాయకుడు వినయ్ రెడ్డి.
ఆర్మూర్‌లో అవినీతికి పాల్పడినానని, సి-కన్వెన్షన్ పై మాట్లాడడం సరికాదని ఆర్మూర్ మాజి ఎంఎల్ఏ జీవన్ రెడ్డిపై ఆర్మూర్ నియోజకవర్గపు కాంగ్రెసు పార్టీ ఇంచార్జి వినయ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆర్మూర్ లో నీవు ఈపాటికే 17 కేసులు అయిపోయి నాయని జీవన్ రెడ్డి అన్నాడని 18 వ కేసును తమకు సమాచారం ఇ చ్చిన తర్వాతనే పెట్టాలనీ ఆయన డిమాండ్ చేశాడు. ఆర్మూర్ ఎంఎల్ ఏ పైడి రాకేష్ రెడ్డి అభివృద్ధిపై మాట్లాడాలని ఆయన అన్నాడు. కామారెడ్డిలో పోయి పనికిరాని మాటలు మాట్లాడడం కాదని ఆయన అన్నాడు. ప్రజల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెసు పార్టీ అని ఆర్మూర్ ను అభివృద్ధి చేసేందుకు ఆర్మూర్ ప్రజల మన్ననలను పొందేందుకు గాను 130 ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను సిఎం రేవంత్ రెడ్డి మంజూరు చేశాడని ఆయన తెలిపాడు.
Politics
| armoor ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెసుకు బుద్ది చెప్పండి


బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెసు,బిజెపిల నాయకులు
జిల్లాలో 7 మున్సిపాలిటీలను,ఒక కార్పొరేషన్ గెలుచుకుంటాం
మాజి ఎంఎల్ఏ జీవన్ రెడ్డి
జనం వెలుగు ఆర్మూర్:- అధికారం కోసం గత అసెంబ్లీ ఎన్నికలలో కాం గ్రెసు పార్టీ ప్రజలకిచ్చిన హామీలను, అమలు చేయని కాంగ్రెసు పార్టీకి గ ట్టిగా బుద్ధి చెప్పే సమయం ఆసన్న మైనదని ఆర్మూర్ మాజి ఎంఎల్ఏ, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి అన్నాడు. కాంగ్రెసు, బిజె పి పార్టీల నుండి బుధవారం బిఆర్ఎస్ పార్టీలోకి చేరిన నాయకులకు పార్టీ కండువా కప్పి ఆయన ఆహ్వానించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడాడు. జిల్లాలోని 7 మున్సి పాలిటీలను, ఒక కార్పొరేషన్ ను గెలుచుకుంటామని, అలాగే ఆర్మూర్ లోని 36 వార్డులను బిఆర్ఎస్ గెలు పొందుతొందని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. వృద్దాప్య పింఛన్లను 2000 నుండి 4000 పెంచుతామని, మహిళలకు 2500 చేయూత పింఛన్లను, కళ్యాణ లక్ష్మిలో లక్ష రూపాయలతో తులం బంగారం, రైతు భరోసా తథితర అంశాలను కాంగ్రెసు పార్టీ అమలు చేయలేక చేతులెత్తేసిందని ఆయన దుయ్యబ ట్టాడు. ఆర్మూర్ పట్టణంలో 27 వార్డు నుండి ఎస్ఆర్ రమేష్, 21 నుండి నడుకుడ నాగరాజు, 9 వార్డు భూమేష్, 7 వార్డు కీర్తి గౌడు, 32 వార్డు సుకేష్ లు బిఆర్ఎస్ పార్టీలో చేరారని ఆయన చెప్పాడు. హామీలను ఆటకెక్కించిన కాంగ్రెసు పార్టీ ప్రస్తుతం మున్సిపాలిటీ ఎన్నికలలో ఓటు ద్వారా ధీటైన బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపు నిచ్చాడు.



Politics
| Nizamabad అన్నపూర్ణగా వెలిగిన నిజామాబాద్ ఎందుకు వెనుకబడింది


మున్సిపాలిటీ ఎన్నికల ముందు ఆత్మపరిశీలన అవసరం:డాక్టర్ కేశవులు ప్రత్యేక కథనం
జనం వెలుగు, నిజామాబాద్: ఒకప్పుడు తెలంగాణకు అన్నం పెట్టిన జిల్లాగా “అన్నపూర్ణ”గా పేరొందిన నిజామాబాద్ నేడు అభివృద్ధి విషయంలో వెనుకబడి ఉండటం బాధాకరమైన వాస్తవమని తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్, నిజామాబాద్ జిల్లా డెవలప్మెంట్ ఫోరం చైర్మన్ మరియు సీనియర్ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కేశవులు అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ఆత్మపరిశీలన చేసుకుని రాజకీయ పార్టీలను స్పష్టమైన ప్రశ్నలు అడగాల్సిన అవసరం ఉందని ఆయన తన ప్రత్యేక కథనంలో పేర్కొన్నారు.
చుట్టుపక్కల జిల్లాలైన కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, సిరిసిల్ల, అదిలాబాద్ అభివృద్ధిలో దూసుకెళ్తుండగా, అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ నిజామాబాద్ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయిందన్నారు. ఈ పరిస్థితికి ఒకే పార్టీ కారణం కాదని, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అన్ని రాజకీయ పార్టీలూ బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు.
రాజకీయ సంకల్పం లోపమే వెనుకబాటుకు మూలకారణం
నిజామాబాద్ అభివృద్ధికి 10–20 ఏళ్ల దీర్ఘకాలిక విజన్ ప్లాన్ ఏ ప్రభుత్వమూ రూపొందించలేదని డాక్టర్ కేశవులు విమర్శించారు. తాత్కాలిక పథకాలకే పరిమితమై, పరిశ్రమలు, ఉపాధి, పట్టణ విస్తరణపై సమగ్ర ఆలోచన లేకపోవడం ప్రధాన లోపమన్నారు. అభివృద్ధికంటే రాజకీయ లాభనష్టాలకే ప్రాధాన్యం ఇచ్చారని వ్యాఖ్యానించారు.
వ్యవసాయ సంపద ఉన్నా విలువ జోడింపు లేదు
వరి, పసుపు, మొక్కజొన్న వంటి పంటలతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన పసుపు మార్కెట్ ఉన్నా, అగ్రో-ప్రాసెసింగ్ పరిశ్రమలు ఎందుకు రాలేదన్నది ప్రధాన ప్రశ్నగా నిలుస్తోందన్నారు. పసుపుకు ఇక్కడే విలువ జోడించే పరిశ్రమలు ఏర్పాటు చేయలేకపోవడంతో రైతుకు గిట్టుబాటు ధర, పట్టణానికి ఉపాధి కల్పించడంలో వైఫల్యం జరిగిందన్నారు. వ్యవసాయం ముడి సరుకుగానే బయటకు వెళ్లి, లాభాలు ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు చేరుతున్నాయని పేర్కొన్నారు.
మౌలిక వసతులు – మధ్యలో ఆగిపోయిన అభివృద్ధి
అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, డ్రైనేజీలే కాదని, రైల్వే హబ్‌గా మారే అవకాశమున్నా సరైన లాబీయింగ్ జరగలేదన్నారు. జాతీయ రహదారులు, ఇండస్ట్రియల్ కారిడార్లలో నిజామాబాద్‌కు తగిన ప్రాధాన్యం దక్కలేదని, పట్టణ విస్తరణ మాస్టర్ ప్లాన్లు కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. ఇతర జిల్లాల్లో ఇండస్ట్రియల్ పార్కులు, ఐటీ హబ్‌లు, మెడికల్, ఎడ్యుకేషన్ క్లస్టర్లు ఏర్పడితే, నిజామాబాద్‌లో మాత్రం వాగ్దానాలే మిగిలాయన్నారు.
*మున్సిపాలిటీ ఎన్నికలు: అభివృద్ధి ఎజెండా ఎక్కడ?*
ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ నిజామాబాద్ అభివృద్ధిపై స్పష్టమైన ఎజెండా కనిపించడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యక్తిగత ఆరోపణలు, రాజకీయ విద్వేషాలే ప్రచారంగా మారాయని, పట్టణ భవిష్యత్తుపై చర్చే లేకపోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతమన్నారు. ఎన్నికలు వ్యక్తుల కోసం కాదు, పట్టణ భవిష్యత్తు కోసం కావాలని సూచించారు. ఈ ఎన్నికల ముందు ప్రజలు రాజకీయ పార్టీల నుంచి స్పష్టమైన హామీలు కోరాలని డాక్టర్ కేశవులు పిలుపునిచ్చారు. “మాకు పార్టీ రంగు కాదు… మాకు నిజామాబాద్ భవిష్యత్తు కావాలి” అన్నది ప్రజల నినాదంగా మారాలన్నారు. అభివృద్ధిపై మాట్లాడని నాయకత్వాన్ని ప్రజలు తిరస్కరించాలని, ఈ మున్సిపాలిటీ ఎన్నికలు నిజామాబాద్‌కు టర్నింగ్ పాయింట్ కావాలని ఆయన ఆకాంక్షించారు.
అన్నపూర్ణగా వెలిగిన ఈ జిల్లా మళ్లీ తెలంగాణ అభివృద్ధి పటంలో ముందు వరుసలో నిలవాలంటే ప్రజల ఆత్మగౌరవంతో కూడిన ప్రశ్న అవసరమని డాక్టర్ కేశవులు స్పష్టం చేశారు. ఇది రాజకీయ వ్యాసం కాదని, నిజామాబాద్ భవిష్యత్తుపై ప్రజల డిమాండ్ అని ఆయన పేర్కొన్నారు.
డాక్టర్ కేశవులు భాషవత్తిని, ఎండీ (సైకియాట్రీ)
చైర్మన్: తెలంగాణ మేధావుల సంఘం & నిజామాబాద్ జిల్లా డెవలప్మెంట్ ఫోరం











