నిర్మల్
అడెల్లి పోచమ్మ గంగనిల్లా జాతర ఏర్పాట్లు సర్వం సిద్ధం


జనం వెలుగు, సారంగాపూర్:- నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం అడెల్లి గ్రామంలో వెలసిన మహా పోచమ్మ కరుణామయిగా, కల్పవల్లిగా ప్రసిద్ధిచెందింది. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా భక్తులు అమ్మను ఆరాధిస్తారు. అడెల్లి పోచమ్మగా, చల్లంగా చూసే చక్కని తల్లిగా మహా శక్తి ఇక్కడ పూజలందుకుంటోంది. శని ఆది తేదీల్లో ఆ శక్తిస్వరూపిణికి ‘గంగ’ నీళ్ల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. అడెల్లి గ్రామంలో వెలసిన శివపార్వతుల కుమార్తెలయిన బ్రహ్మణి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి విగ్రహాలు గర్భగుడిలో ఉన్నాయి. ఇలాంటివి దేశంలో మరెక్కడా ఉండవని వేద పండితులు చెబుతున్నారు. పరశురాముడు ఈ ప్రాంతంలో పర్యటించాడనీ, అప్పుడే పోచమ్మ గద్దెను ఏర్పాటు చేశాడనీ చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి.
ఎంతో శక్తిగల పోచమ్మ ఆలయ పరిసర ప్రాంతాలు వారిని చల్లంగా చూస్తుందనేది ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. అడెల్లి మహా పోచమ్మ ఆలయం భక్తుల తాకిడితో ప్రతి ఆదివారం జాతరను తలపిస్తుంది. సహ్యాద్రి పర్వత శ్రేణుల పచ్చదనాన్ని పానుపులుగా చేసుకున్నట్లుండే సందర్శకులకు కనువిందు చేస్తాయి స్థలపురాణం ప్రకారం పూర్వం అడెల్లి ప్రాంతంలో తీవ్ర కరవు సంభవించి తినడానికి తిండిలేని పరిస్థితి ఏర్పడింది. అనారోగ్యాల బారిన పడి ప్రజలు చనిపోవడం వల్ల వూళ్లకు వూళ్లే శ్మశానాలుగా మారిపోయాయి. దిక్కు తోచని ప్రజలు తమను కాపాడమని శివుడిని ప్రార్థించారు. భక్తుల మొరను ఆలకించిన ఆయన ఈ ప్రాంతానికి రక్షకురాలిగా తన కుమార్తె అయిన పోచమ్మను పంపించాడు. తండ్రి ఆదేశాలతో భువికి చేరుకున్న పోచమ్మ ప్రజలకు అండగా నిలిచింది. సమృద్ధిగా వానలు కురిపించి కరవు నివారించి అమ్మవారు భక్తులు కోరినకోర్కెలు నెరవేర్చింది భక్తుల విశ్వాసం జాతర ఇలా ప్రారంభం నవరాత్రులకు ముందు గంగనీళ్ల జాతరను చేస్తారు. దసరాకు ముందు వచ్చే (అమావాస్య తర్వాత) శని, ఆదివారాల్లో ఈ జాతరను నిర్వహిస్తారు. శనివారం గర్భగుడిలోని పోచమ్మ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం బాజాభజంత్రీలూ, డప్పు వాయిద్యాల నడుమ అమ్మవారు ధరించిన అన్ని ఆభరణాలనూ తీసుకుని సాంగ్వీ సమీపంలోని గోదావరి తీరానికి చేరుకుంటారు. సారంగాపూర్, యాకర్‌పల్లి, గొడిసెర్చ్, వంజర్, ప్యారమూర్, కదిలి, దిలావార్పూర్, కంజర్ గ్రామాల మీదుగా సుమారు 35 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగుతుంది. వేల
సంఖ్యలో భక్తులు ఈ యాతలోపాల్గొంటారు. రాత్రికి అక్కడే బస చేసి ఆదివారం వేకువ జామున గోదావరి నీటిలో ఆభరణాలు శుద్ధి చేస్తారు. ప్రత్యేక వెండి కడవలో నీటిని తీసుకుని సాయంత్రానికల్లా తిరిగి ఆలయానికి చేరుకుంటారు. మార్గమధ్యంలో వూరూరా ప్రజలు అమ్మవారి మంగళహారతులు ఆభరణాలకు సమర్పిస్తారు. స్థానిక కోనేటి నీటిని గోదావరి నీటిలో కలిపి పోచమ్మ విగ్రహాన్ని అభిషేకించి, ఆభరణాలను అలంకరిస్తారు. ఈ క్రతువుతో జాతర ముగుస్తుంది. భక్తులు కూడా ప్రత్యేక పాత్రలతో గోదారి నీటిని తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. పంటలు బాగా పండాలన్న ఉద్దేశంతో మిగిలిన నీటిని పంట పొలాల్లో చల్లుకుంటారు. రెండు రోజులపాటు జరిగే ఈ తెలంగాణతోపాటు మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల భక్తులూ అధిక సంఖ్యలో పాల్గొంటారు. పోచమ్మ తల్లికి మహా సమర్పిస్తారు. అమ్మవారిని చుట్టుపక్కల ప్రదేశాల్లోనే పెరుగన్నమంటే చాలా ప్రీతి. అందుకే, అమ్మవారికి కోనేటి నీటితో వండిన అన్నంలో పెరుగుకలిపి నైవేద్యంగా దర్శించుకున్న భక్తులు ఆ ఆలయం వంటచేసుకుని సహపంక్తి భోజనాలు చేయడం ఆనవాయితీ. పోచమ్మను పసుపుతోనే పూజించడం పూర్వం నుంచీ వస్తున్న ఆచారం. అందుకే, ప్రతి ఆదివారం గర్భగుడిలో పసుపు రాశులు దర్శనమిస్తాయి.
ఇలా చేరుకోవచ్చు..
హైదరాబాద్ నుంచి 210 కిలోమీటర్ల దూరంలో నిర్మల్ జిల్లా కేంద్రం ఉంటుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 20 కిలోమీటర్లు వెళితే సహ్యాద్రి పర్వతాల దిగువన ఉన్న పోచమ్మ సందర్శించవచ్చు. మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ తదితర ప్రాంతాల నుంచి రావడానికి ఆదిలాబాద్, బాసర, మహారాష్ట్రలోని ఇస్లాపూర్ వరకూ రైలు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఈ ఆలయానికి చేరుకోవచ్చు.
నిర్మల్
ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
5వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అజూహ ఫాతిమా ప్రధానోపాధ్యాయురాలిగా, భార్గవ్ ప్రసాద్ డీఈఓగా, సాత్విక్ ఎంఈఓగా, శశాంత్ కాంప్లెక్స్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా ఆదర్శ్, ప్రణీత్, చరణ్య, తేజశ్రీ, నవ్య, యశ్వంత్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.
విద్యార్థుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రతిబింబించిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
నిర్మల్
| Nirmal ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన


ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన
నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీ
జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్ ఏర్పాటు, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.
అలాగే, సభ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్
Nirmal | నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం


నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం
జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్‌బండ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, పచ్చదనం, సుందరీకరణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








