Connect with us

Crime

చలానా స్కామ్ లో మాజీ డీజీపీ అల్లుడు

janamvelugunews

Published

on

జనంవెలుగు, విజయవాడ:- కోట్లాది రుపాయల ట్రాఫిక్ చలాన్ల సొమ్మును సొంత ఖాతాలకు మళ్లించుకున్న వ్యవహారంలో మాజీ డీజీపీ అల్లుడిపై కేసు నమోదైంది. ఏపీలో సంచలనం సృష్టించిన వ్యవహారంలో పోలీసుల తీరుపై విమర్శలు రావడంతో కేసు వివరాలను బయట పెట్టారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు ప్రకటించారు. ఏపీ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహన చోదకులు పోలీసు శాఖకు చెల్లించిన జరిమానాలను దారి మళ్లించిన కేసులో మాజీ డీజీపీ అల్లుడుతో పాటు పలువురిపై గుంటూరు జిల్లా తాడేపల్లిలో కేసు నమోదైంది. ఈ కేసులో కీలక సూత్రధారి కొమ్మిరెడ్డి అవినాశ్‌ పరారీలో ఉన్నట్లు ప్రకటించారు. ఏపీ పోలీసుశాఖను మోసం చేసి రూ.40 కోట్ల రుపాయలు దోచుకున్న మాజీ డీజీపీ అల్లుడి వ్యవహారంలో ఎట్టకేలకు పోలీసులు స్పందించారు. ఈ వ్యవహారం వెలుగు చూడటంతో నిందితులపై కేసు నమోదు చేశారు. ఏకంగా పోలీసులకే బురిడీ కొట్టించిన వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు మౌనం వహించడంపై విమర్శలు వచ్చాయి. చిన్నాచితక కేసులకు హడావుడి చేసే పోలీసులు కోట్లాది రుపాయలు దోచుకున్న ఘటనలో మౌనం వహించడంపై సందేహాలు తలెత్తాయి. ఈ వ్యవహారంపై మీనమేషాలు లెక్కించిన పోలీసులు చివరకు గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. డేటా ఎవాల్వ్‌ సంస్థతో పాటు దాని సీఈవో కొమ్మిరెడ్డి అవినాశ్‌, కొత్తపల్లి రాజశేఖర్‌, మరికొందరిని ఈ కేసులో నిందితులుగా చేర్చారు. నిందితులపై ఐపీసీ 409 నేరపూరిత విశ్వాసఘాతుకం, ఐపీసీ 420 సెక్షన్లతో పాటు ఐటీ చట్టంలోని సెక్షన్‌ 65 కింద వీరిపై అభియోగాలు మోపారు.ట్రాఫిక్ చలాన్ల చెల్లింపుల మోసం కొన్ని నెలలుగా పోలీసుశాఖలో అంతర్గతంగా దర్యాప్తు జరుగుతోంది. సెప్టెంబర్‌ నెలలోనే కేసు నమోదైనా బయటకు రానీయకుండా తొక్కిపెట్టారు. తాడేపల్లిలో కేసు నమోదైన తర్వాత కేసు వివరాలను ఐజీ పాలరాజు అధికారికంగా ప్రకటించారు. ఈ చలానా కుంభకోణంలో రూ.36.52 కోట్లు దుర్వినియోగం అయినట్టు చెప్పారు. కొమ్మిరెడ్డి అవినాష్‍కు చెందిన రేజర్ పీఈ ఖాతాకు మళ్లించినట్లు గుర్తించామన్నారు. పీఈ ఖాతా నుంచి డీజీ ఖాతాకు నగదు జమ కాలేదన్నారు. నాలుగేళ్లకు పైగా నగదు దారి మళ్లిస్తున్నట్లు చెప్పారు. నిధుల మళ్లింపు విషయాన్ని సెప్టెంబర్‍లో తిరుపతి యూనిట్‍లో గుర్తించామని, డేటా సొల్యూషన్స్ నిర్వాహకుడు అవినాష్‍ను సంజాయిషీ అడిగామని చెప్పారు. నిధుల దుర్వినియోగంపై అవినాష్‍ను సంజాయిషీ కోరామని, డేటా సొల్యూషన్స్ ప్రతినిధి రాజశేఖర్‍ను ప్రశ్నించినా సరైన సమాచారం ఇవ్వకుండా అవినాష్ కాలయాపన చేశారని వివరించారు. దీంతో రాజశేఖర్ ను అరెస్ట్ చేసి విచారణ జరిపామన్నారు. విచారణలో నిధులు దుర్వినియోగం చేసినట్లు అంగీకారించారని, అవినిష్ ఆస్తుల విషయమై సబ్ రిజిస్ట్రార్‍కు లేఖలు రాసినట్లు చెప్పారు. ఆస్తుల క్రయవిక్రయాలకు తావులేకుండా సబ్ రిజిస్ట్రార్‍కు లేఖలు రాశామని, త్వరలోనే నిందితుడు అవినాష్‍ను పట్టుకుంటామని, కొమ్మిరెడ్డి అవినాష్ మాజీ డీజీపీకి బంధువని ఐజీ పాలరాజు చెప్పారు.మరోవైపు నాలుగున్నేరుళ్లుగా ట్రాఫిక్ చలాన్ల సొమ్ము పోలీసు ఖాతాలకు జమ కాకపోయినా పోలీసులు ఎందుకు పట్టించుకోలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీసు శాఖలోని సాంకేతిక విభాగాల్లో ఉన్న అధికారులకు కూడా ఈ వ్యవహారంలో ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి. మాజీ డీజీపీతో ఉన్న సన్నిహిత సంబంధాలతోనే ఈ వ్యవహారాన్ని చూసి చూడనట్టు వదిలేశారని చెబుతున్నారు. పేమెంట్ గేట్‌వేల నుంచి వసూలైన సొమ్మును నిర్దిష్ట వ్యవధిలోగా ప్రభుత్వ ఖాతాలకు చెల్లించకపోయినా ఏళ్ల తరబడి ఎందుకు కళ్లు మూసుకున్నారనే సందేహాలు ఉన్నాయి. ఈ అక్రమంలో ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఐపీఎస్ అధికారుల ప్రమేయం కూడా ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయిఈ చలాన్ల టెండర్ల ప్రక్రియలో కీలకంగా వ్యవహరించిన అధికారులతో పాటు ఈ వ్యవహారాలను పర్యవేక్షించే అధికారులను కూడా ప్రశ్నిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని చెబుతున్నారు. నిందితుల్ని కాపాడేందుకు ఉన్నత స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. మరోవైపు మాజీ డీజపీ అధికార పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఎన్నికల్లో ఎంత ఖర్చైనా భరించేందుకు సిద్ధమని ఇప్పటికే ముందుకు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Crime

జాలరి వల విసిరితేనే…. జానెడు పొట్టకు..జీవనం..

janamvelugunews

Published

on

జాలరి వల విసిరితేనే…. జానెడు పొట్టకు..జీవనం..

 కాని తాను.. విసిరే వల.. తన మడకే చుట్టుకొని తననే కాటేస్తదనుకోలేదు ఆ గంగా పుత్రుడు. అటువంటి దురదృష్ట ఘటన ఒకటి డొంకేశ్వరం మండలంలో చోటు చేసుకుంది.

 నందిపేట్ సెప్టెంబర్ 30 జనం వెలుగు:- నిజమాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండల కేంద్రానికి చెందిన మాడబోయి కట్ట గణేష్ (37) సోమవారం ఎస్ఆర్ఎస్పి ముంపు ప్రాంతం గంగాసముందర్ గ్రామ శివారు గంగలో చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాద వశాత్తు వల చుట్టుకొని మరణించడం జరిగింది. స్థానిక ఎస్సై వినయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం…

   కట్ట గణేష్ సోమవారం సాయంత్రం 4 గంటలకు ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ లో చేపలు పట్టడానికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేడు, మంగళవారం ఉదయం 7 గంటల 30 ని:కు గంగ సముందర్ గ్రామ శివారు గంగాలో శివమై తేలినాడని

  గణేష్ భార్య కట్ట కళ్యాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. మృతునికి కొడుకు యోగేష్, కూతురు హన్సిక కలరని ఆయన అన్నారు. గంగాపుత్రులకు వారి వలలే వారికి శాపంగా మారి తరచూ మృత్యువాత పడుతున్నారు.

ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా మత్స్యశాఖ తగు చర్యలు చేపట్టలని, ఆ వలల బారిన పడకుండా ప్రత్యేక శిక్షణ ఇప్పించేందుకు ప్రయత్నాలు చేపట్టాలని ప్రజల అభిప్రాయపడుతున్నారు.

Continue Reading

Crime

మోసం కేసులో లక్కంపల్లి సర్పంచ్ అరెస్ట్…..

janamvelugunews

Published

on

మోసం కేసులో లక్కంపల్లి సర్పంచ్ అరెస్ట్…..

నందిపేట్ సెప్టెంబర్ 19 జనం వెలుగు: నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం లక్కంపల్లి గ్రామ సర్పంచ్ బొల్లపల్లి సంతోష్ గౌడ్ ను చీటింగ్ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం రూరల్ నార్త్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం మాక్లూర్ మండలం మణిక్ బండార్ గ్రామ

  శివారులో గల గండ్ర రివర్ వ్యూ అనే రియల్ ఎస్టేట్ వెంచర్కు సంబంధించిన లావాదేవీల్లో దాదాపు 8 కోట్ల వరకు లెక్కలు తారుమారు అయ్యాయని వెంచర్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు సంతోష్ గౌడ్ పై చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.

అయితే సంతోష్ గౌడ్ సర్పంచ్ కాకముందు రియల్ ఎస్టేట్ కు సంబంధించిన వెంచర్లో ఉద్యోగం చేసేవాడని యాజమాన్యానికి తెలియకుండా మరికొంత మంది వ్యక్తులతో కలిసి ప్లాట్లు లావాదేవీలు చేసే పెద్ద ఎత్తున డబ్బులు దండుకొని మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఖర్చు పెట్టి గెలిచాడేమోనని ప్రజలు గుసగుసలాడుతున్నారు.

ఏది ఏమైనా గ్రామ ప్రథమ పౌరుడు సేవా దృక్పథం, తమ ప్రజలకు ఎవరైనా మోసం చేస్తే ముందు నిలబడే నాయకుడుగా ఉండాలని కోరుకుంటారని, అలాంటి ప్రథమ పౌరుడు పైనే మోసం కేసు నమోదవడం తో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతున్నారు.

Continue Reading

Crime

Big breaking news నడిరోడ్డుపై వాడిన సిరంజీ సూదులు….

janamvelugunews

Published

on

నడిరోడ్డుపై వాడిన సిరంజీ సూదులు….

 స్వతంత్ర వేడుకలకు స్వాగతం పలుకుతూ… రోడ్డుపైనే సిరంజీ సూదులు

 మండల కేంద్రం నంది విగ్రహం వద్ద రోడ్డుపై వందలాది సూదులు

 నందిపేట్ ఆగస్టు 15 జనం వెలుగు: నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్ర నంది విగ్రహం వద్ద శనివారం ఉదయాన్నే నడిరోడ్డుపై వాడిన సిరంజీ సూదరులు విచ్చలవిడిగా పడి ఉన్నాయి. నేడు స్వాతంత్ర వేడుకలు సందర్భంగా గ్రామపంచాయతీ వారు రాత్రి నుండే మండల కేంద్రం రోడ్లన్నీ శుభ్రపరిస్తే ఉదయాన్నే రోడ్డంతా ఉపయోగించిన సిరంజీ సూదులు విచ్చలవిడిగా పడి ఉండడంతో పాదచారులకు తీవ్ర ఇబ్బంది కలిగింది.

  హాస్పిటల్స్ లో ఉపయోగించే ఈ ఇంజక్షన్ల నీడిల్సు వాడిన తర్వాత బయో మెడికల్ వేస్టేజ్ బాక్స్ లో వేసి ఎంతో జాగ్రత్తగా డంపు యార్డుకు తరలించాల్సి ఉంటుంది. ఈ యూజుడ్ ఇంజక్షన్స్, నీడిల్స్ ద్వారా హెచ్ఐవి, హెపటైటీస్ బి/సి లాంటి ఇన్ఫెక్షన్స్ జరిగే ప్రమాదం ఉంది.

  కానీ మండల కేంద్రంలో మాత్రం విచ్చలవిడిగా పి ఎంపీ, ఆర్ఎంపీ ల పేరిట గల్లీకో దవఖాన పేరుతో ప్రజలను దోపిడీ చేస్తున్నారు. కనీసం మెడికల్ నిబంధనలను కూడా పాటించకుండా ఇలాంటి ఘటనలు జరగడం శోచనీయం ఇటువంటి వారిపై అధికారులు చర్య తీసుకోవాలని ప్రతి హాస్పిటల్స్ లో బయో మెడికల్ వేస్టేజ్ బాక్సులు ఉండేటట్టు చూడాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Continue Reading