Connect with us

Politics

రుద్రూర్ లో ఒకే పార్టీలో వర్గ పోరు

janamvelugunews

Published

on

ఒక పార్టీ ఇతర పార్టీకి సపోర్ట్

ఒకరికి ఒకరు నేనంటే నేను సై సై

జనంవెలుగు, రుద్రూర్:- తెలంగాణ రాష్ట్రంలోని బాన్సువాడ నియోజకవర్గం అభివృద్ధి దిశలో కొనసాగిస్తున్న ఆ సార్కు రుద్రూర్ మండల కేంద్రంలో వర్గ పోరు ఇబ్బంది కలిగించేలా ఉందని ప్రజల నోట వినిపిస్తున్న మాట. ఈ వర్గ పోరు ఏళ్ల నుంచి ఉందని దీని ప్రభావం స్థానిక ఎన్నికల్లో ఓటమి దిశగా, పార్టీకి నష్టం కలిగించేలా ఉందని ఇతర పార్టీ వారికి గెలుపు గుర్రాలు కైవసం చేసుకునేందుకు దోహదం చేస్తుందని పలువురు చర్చించుకుంటున్న మాట. ఈసారి జరిగే ఎన్నికల్లో ఆ సారుకు వీరి వర్గ పోరు ఫలితం ఓట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయంటే అవుననే సమాధానం వినిపిస్తున్నాయి, వీరి వర్గ పోరు వల్ల ఇతర పార్టీ వాళ్లు ప్లస్ చేసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ సారు బాన్సువాడ నియోజకవర్గంలో అభివృద్ధి దశలో కొనసాగిస్తూ అభివృద్ధి చేశారని ఆయన చేసిన అభివృద్ధి పనులు ఆయన మంచితనమే మళ్ళీ గెలుపుకు 100% భారీ మెజార్టీతో దారితీస్తుందని, ఈ వర్గ పోరు ప్రభావం అంతగా సారుకు ఉండబోదని, ఆయన చేసిన అభివృద్ధి పనులు ఆయన మంచితనమే మళ్ళీ భారీ మెజర్ తో గెల్పొందే అవకాశాలు ఉన్నాయని, స్థానిక ఎన్నికల్లో మాత్రం ఓటమి దిశగా ఆ పార్టీ చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడడం గమనర్వం అని ప్రజలు చర్చించుకున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వర్గ పోరులో ఎవరు సార్ కోసం పనిచేస్తున్నారు, ఎవరు ఇతర పార్టీ కోసం పని చేస్తున్నారు అసలు ఏమి జరుగుతుంది అనే తికమకలో కొంతమంది ఉన్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇకపోతే మండల కేంద్రంలో కొంతమందికి గ్యాంగులుగా ఏర్పర్చి ఎవరైతే టార్గెట్ ఉన్నారో అట్టి వ్యక్తులపై నిందలు వేయించి సంబంధిత సార్లకు మచ్చిక చేసుకొని, దాడులు చేయించడం అవసరమైతే హత్యాయత్నానికి కూడా వెనకాడడంకపోవడం అలాంటి సంఘటన జరగడం విచిత్ర కరమని ప్రజలు విమర్శలు చేసుకుంటున్నట్టు చర్చలు వినిపిస్తున్నాయి, టార్గెట్ ఉన్న వ్యక్తి ఆయన ఏ కులం ఏ జాతి అని తెలుసుకొని అదే కులం అ జాతిలోని అమాయకులను మద్యం ఇతర వ్యసనాలకు వివిధ ఆశలు చూపించి ఒక రౌడీ ముఖాలుగా ఏర్పరిచి అలాంటి వ్యక్తులపై దాడులు చేయించి అవసరమైతే మర్డర్ యత్నం చేయించే ప్రయత్నాలు కూడా నెలకొనడం చాలా దారుణం అని ప్రజలు చర్చించుకుంటున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రశ్నించే తత్వం ఉన్న ప్రతి ఒక్కరిపై దాడులు చేయించడం అక్రమ కేసులు చేయించడం అవసరమైతే ఇతర పెద్ద కేసులు కూడా చేయించి వినకపోతే దాడులు చేయించి హత్యయత్నానికి ఊసిగోల్పడం అదేవిధంగా వారి కుటుంబంలో ఇబ్బంది పాలు చేయడం వారి కుటుంబాలు రోడ్డున పడే విధంగా చేయించడం ఒక ఆనవాయితీగా మారుతుందని ఇది కూడా ఎలాంటి ప్రభావం చూపుతుందో దీన్ని ప్రజలు గ్రహిస్తున్నారని ఇది ప్రభావం చూపే అవకాశాలు ఎన్నికల్లో ఉందా అని ప్రజలు చర్చించుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రుద్రూర్ లాంటి గొప్ప ఊర్లో ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమైన పరిస్థితి అని పలువురు చర్చించుకున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వేచ్చను భంగం కలిగించే విధంగా దాడులు చేయించడం అదేవిధంగా వారి వారి కుటుంబాలను అవస్థలు పాలు చేసి చివరికి వారి కుటుంబంలోని మహిళలపై అదేవిధంగా వారి పిల్లలపై కూడా విచిత్ర సంఘటన చేసి ఇబ్బంది పాలు చేసే సంఘటన రుద్రూర్లో జరగడం దురదృష్టకరమైన దుర్ఘటనలు అని ప్రజలు చర్చించుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ ప్రజలు గ్రహిస్తున్నారని ప్రజలు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పే అవకాశాలు ఉన్నాయా అనే ప్రశ్నలు వినిపిస్తా ఉంటే అవునని సమాధానం వినిపిస్తున్నాయి. ఇకపోతే ఆ పార్టీలోని సెకండ్ క్యాడర్ చేస్తున్న అవినీతి అక్రమాలు స్వలంబన స్వార్థం ఇతరత్రా పీడింపులు ఎవరైనా వాస్తవాల గురించి మాట్లాడిన ప్రశ్నించిన వారిపై దాడులు చేయించడం ఒక రౌడీ ముఖాలను ఏర్పరిచి ఇబ్బంది పాలు చేయడం అవసరమైతే హత్యాయత్నం కూడా గురిచేయడం తప్పుడు కేసులు చేయించడం ఇలాంటి సంఘటనలు చేయించడం కూడా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయంటే అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. అన్ని మావే అని ఆధిపత్య పోరు ఇగో ఫీలింగ్ నిలబెట్టుకోవడం కోసం అమాయకులైన వారిపై, వాస్తవాలు మాట్లాడే వారిపై ఇలాంటి దుర్ఘటనలు చేయడం దురదృష్టకరమైన పరిస్థితులు అని ప్రజలు చర్చించుకున్నట్టు విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో అయినా వర్గ పోరు వీడి ఎన్నికల్లో విజయం కోసం పనిచేస్తారా అనే చర్చ సర్వత్రా వినిపిస్తున్నాయి. జిల్లాలో ఎక్కడలేని విధంగా ఇలాంటి సంఘటనలు ఇక్కడే జరగడం దురదృష్టకరమని, ఇలాంటి వాటికీ కారకులైన వారికి చరిత్ర బుద్ధి చెబుతుందని ప్రజలు కూడా ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని విమర్శలు సర్వత వినిపిస్తున్నాయి. వీటన్నిటిని ఇతర పార్టీల వారు ఒక అస్త్రంగా చేసుకొని గెలుపు దిశలో ప్రయత్నాలు మమ్మురం చేసుకుంటున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. ఆ పార్టీలోని వర్గ పోరు ఆ పార్టీకి మైనస్ అవుతుందా ప్లస్ అవుతుందా ఎదురు చూడాల్సిందేనని పలువురు చర్చించుకుంటున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Politics

| armoor బిసి రిజర్వేషన్లను కాంగ్రెసు అమలు చేసింది

janamvelugunews

Published

on

తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్.

జనం వెలుగు ఆర్మూర్:- గత ఎన్ని కలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రంలో బిసి లకు 42 శాతానికి (మించి) ఎక్కువగా బిసిలకు రిజ ర్వేషన్లను కల్పించిందని తెలంగాణ రాష్ట్ర ఖనిజా భివృద్ది సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ అన్నాడు. ఆర్మూర్ మున్సిపా లిటీలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడాడు. రాష్ట్ర అసెంబ్లీలో బిసి బిల్లు పెట్టి కేంద్ర ప్రభుత్వం ఆమోద కోసం పంపితే, బిసి బిల్లును కేంద్రం అమలు చేయకుండా మొండి చేయి చూపిందని ఆయన తెలిపాడు. ఇకపోతే బిసిలకు రిజర్వేషన్లను కల్పించవద్దని మాధవ రెడ్డితో బిఆర్ఎస్ పార్టీ హై కోర్టులో పిటీషన్ వేయించిందని ఆయన తెలిపాడు. బిసి బిల్లును కేంద్రానికి పంపి ఏడాది అవుతున్న బిసి బిల్లు పాస్ చేసి బిసిలకు సహకరించడం లేదని ఆయన ఆరోపించాడు. రాష్ట్రంలో బిసిలు 56 శాతం మంది ఉండగా 30 రిజర్వేషన్లను పాటి స్తూ పార్టీ తరపున 36 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ, మొత్తానికి 62 శాతం కాంగ్రెసు పార్టీ బిసిలకు రిజర్వేషన్లను కల్పించడం జరిగిందని ఆయన తెలిపాడు. ఆర్మూర్ ఎంఎ ల్ఏ రాకేష్ రెడ్డిని, ఎంఎల్ఏగా ఎం దుకు ఎన్నుకున్నామా అని ఆర్మూర్ ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన అన్నాడు.

సమాచారం ఇచ్చి 18 వ కేసు పెట్టు.
—————————————-
కాంగ్రెసు నాయకుడు వినయ్ రెడ్డి.

ఆర్మూర్లో అవినీతికి పాల్పడినానని, సి-కన్వెన్షన్ పై మాట్లాడడం సరికాదని ఆర్మూర్ మాజి ఎంఎల్ఏ జీవన్ రెడ్డిపై ఆర్మూర్ నియోజకవర్గపు కాంగ్రెసు పార్టీ ఇంచార్జి వినయ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆర్మూర్ లో నీవు ఈపాటికే 17 కేసులు అయిపోయి నాయని జీవన్ రెడ్డి అన్నాడని 18 వ కేసును తమకు సమాచారం ఇ చ్చిన తర్వాతనే పెట్టాలనీ ఆయన డిమాండ్ చేశాడు. ఆర్మూర్ ఎంఎల్ ఏ పైడి రాకేష్ రెడ్డి అభివృద్ధిపై మాట్లాడాలని ఆయన అన్నాడు. కామారెడ్డిలో పోయి పనికిరాని మాటలు మాట్లాడడం కాదని ఆయన అన్నాడు. ప్రజల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెసు పార్టీ అని ఆర్మూర్ ను అభివృద్ధి చేసేందుకు ఆర్మూర్ ప్రజల మన్ననలను పొందేందుకు గాను 130 ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను సిఎం రేవంత్ రెడ్డి మంజూరు చేశాడని ఆయన తెలిపాడు.

Continue Reading

Politics

| armoor ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెసుకు బుద్ది చెప్పండి

janamvelugunews

Published

on

బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెసు,బిజెపిల నాయకులు

జిల్లాలో 7 మున్సిపాలిటీలను,ఒక కార్పొరేషన్ గెలుచుకుంటాం

మాజి ఎంఎల్ఏ జీవన్ రెడ్డి

జనం వెలుగు ఆర్మూర్:- అధికారం కోసం గత అసెంబ్లీ ఎన్నికలలో కాం గ్రెసు పార్టీ ప్రజలకిచ్చిన హామీలను, అమలు చేయని కాంగ్రెసు పార్టీకి గ ట్టిగా బుద్ధి చెప్పే సమయం ఆసన్న మైనదని ఆర్మూర్ మాజి ఎంఎల్ఏ, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి అన్నాడు. కాంగ్రెసు, బిజె పి పార్టీల నుండి బుధవారం బిఆర్ఎస్ పార్టీలోకి చేరిన నాయకులకు పార్టీ కండువా కప్పి ఆయన ఆహ్వానించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడాడు. జిల్లాలోని 7 మున్సి పాలిటీలను, ఒక కార్పొరేషన్ ను గెలుచుకుంటామని, అలాగే ఆర్మూర్ లోని 36 వార్డులను బిఆర్ఎస్ గెలు పొందుతొందని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. వృద్దాప్య పింఛన్లను 2000 నుండి 4000 పెంచుతామని, మహిళలకు 2500 చేయూత పింఛన్లను, కళ్యాణ లక్ష్మిలో లక్ష రూపాయలతో తులం బంగారం, రైతు భరోసా తథితర అంశాలను కాంగ్రెసు పార్టీ అమలు చేయలేక చేతులెత్తేసిందని ఆయన దుయ్యబ ట్టాడు. ఆర్మూర్ పట్టణంలో 27 వార్డు నుండి ఎస్ఆర్ రమేష్, 21 నుండి నడుకుడ నాగరాజు, 9 వార్డు భూమేష్, 7 వార్డు కీర్తి గౌడు, 32 వార్డు సుకేష్ లు బిఆర్ఎస్ పార్టీలో చేరారని ఆయన చెప్పాడు. హామీలను ఆటకెక్కించిన కాంగ్రెసు పార్టీ ప్రస్తుతం మున్సిపాలిటీ ఎన్నికలలో ఓటు ద్వారా ధీటైన బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపు నిచ్చాడు.

Continue Reading

Politics

| Nizamabad అన్నపూర్ణగా వెలిగిన నిజామాబాద్ ఎందుకు వెనుకబడింది

janamvelugunews

Published

on

మున్సిపాలిటీ ఎన్నికల ముందు ఆత్మపరిశీలన అవసరం:డాక్టర్ కేశవులు ప్రత్యేక కథనం

జనం వెలుగు, నిజామాబాద్: ఒకప్పుడు తెలంగాణకు అన్నం పెట్టిన జిల్లాగా “అన్నపూర్ణ”గా పేరొందిన నిజామాబాద్ నేడు అభివృద్ధి విషయంలో వెనుకబడి ఉండటం బాధాకరమైన వాస్తవమని తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్, నిజామాబాద్ జిల్లా డెవలప్‌మెంట్ ఫోరం చైర్మన్ మరియు సీనియర్ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కేశవులు అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ఆత్మపరిశీలన చేసుకుని రాజకీయ పార్టీలను స్పష్టమైన ప్రశ్నలు అడగాల్సిన అవసరం ఉందని ఆయన తన ప్రత్యేక కథనంలో పేర్కొన్నారు.

చుట్టుపక్కల జిల్లాలైన కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, సిరిసిల్ల, అదిలాబాద్ అభివృద్ధిలో దూసుకెళ్తుండగా, అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ నిజామాబాద్ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయిందన్నారు. ఈ పరిస్థితికి ఒకే పార్టీ కారణం కాదని, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అన్ని రాజకీయ పార్టీలూ బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు.

రాజకీయ సంకల్పం లోపమే వెనుకబాటుకు మూలకారణం
నిజామాబాద్ అభివృద్ధికి 10–20 ఏళ్ల దీర్ఘకాలిక విజన్ ప్లాన్ ఏ ప్రభుత్వమూ రూపొందించలేదని డాక్టర్ కేశవులు విమర్శించారు. తాత్కాలిక పథకాలకే పరిమితమై, పరిశ్రమలు, ఉపాధి, పట్టణ విస్తరణపై సమగ్ర ఆలోచన లేకపోవడం ప్రధాన లోపమన్నారు. అభివృద్ధికంటే రాజకీయ లాభనష్టాలకే ప్రాధాన్యం ఇచ్చారని వ్యాఖ్యానించారు.

వ్యవసాయ సంపద ఉన్నా విలువ జోడింపు లేదు
వరి, పసుపు, మొక్కజొన్న వంటి పంటలతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన పసుపు మార్కెట్ ఉన్నా, అగ్రో-ప్రాసెసింగ్ పరిశ్రమలు ఎందుకు రాలేదన్నది ప్రధాన ప్రశ్నగా నిలుస్తోందన్నారు. పసుపుకు ఇక్కడే విలువ జోడించే పరిశ్రమలు ఏర్పాటు చేయలేకపోవడంతో రైతుకు గిట్టుబాటు ధర, పట్టణానికి ఉపాధి కల్పించడంలో వైఫల్యం జరిగిందన్నారు. వ్యవసాయం ముడి సరుకుగానే బయటకు వెళ్లి, లాభాలు ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు చేరుతున్నాయని పేర్కొన్నారు.

మౌలిక వసతులు – మధ్యలో ఆగిపోయిన అభివృద్ధి
అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, డ్రైనేజీలే కాదని, రైల్వే హబ్‌గా మారే అవకాశమున్నా సరైన లాబీయింగ్ జరగలేదన్నారు. జాతీయ రహదారులు, ఇండస్ట్రియల్ కారిడార్లలో నిజామాబాద్‌కు తగిన ప్రాధాన్యం దక్కలేదని, పట్టణ విస్తరణ మాస్టర్ ప్లాన్‌లు కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. ఇతర జిల్లాల్లో ఇండస్ట్రియల్ పార్కులు, ఐటీ హబ్‌లు, మెడికల్, ఎడ్యుకేషన్ క్లస్టర్లు ఏర్పడితే, నిజామాబాద్‌లో మాత్రం వాగ్దానాలే మిగిలాయన్నారు.

*మున్సిపాలిటీ ఎన్నికలు: అభివృద్ధి ఎజెండా ఎక్కడ?*
ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ నిజామాబాద్ అభివృద్ధిపై స్పష్టమైన ఎజెండా కనిపించడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యక్తిగత ఆరోపణలు, రాజకీయ విద్వేషాలే ప్రచారంగా మారాయని, పట్టణ భవిష్యత్తుపై చర్చే లేకపోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతమన్నారు. ఎన్నికలు వ్యక్తుల కోసం కాదు, పట్టణ భవిష్యత్తు కోసం కావాలని సూచించారు. ఈ ఎన్నికల ముందు ప్రజలు రాజకీయ పార్టీల నుంచి స్పష్టమైన హామీలు కోరాలని డాక్టర్ కేశవులు పిలుపునిచ్చారు. “మాకు పార్టీ రంగు కాదు… మాకు నిజామాబాద్ భవిష్యత్తు కావాలి” అన్నది ప్రజల నినాదంగా మారాలన్నారు. అభివృద్ధిపై మాట్లాడని నాయకత్వాన్ని ప్రజలు తిరస్కరించాలని, ఈ మున్సిపాలిటీ ఎన్నికలు నిజామాబాద్‌కు టర్నింగ్ పాయింట్ కావాలని ఆయన ఆకాంక్షించారు.

అన్నపూర్ణగా వెలిగిన ఈ జిల్లా మళ్లీ తెలంగాణ అభివృద్ధి పటంలో ముందు వరుసలో నిలవాలంటే ప్రజల ఆత్మగౌరవంతో కూడిన ప్రశ్న అవసరమని డాక్టర్ కేశవులు స్పష్టం చేశారు. ఇది రాజకీయ వ్యాసం కాదని, నిజామాబాద్ భవిష్యత్తుపై ప్రజల డిమాండ్ అని ఆయన పేర్కొన్నారు.

డాక్టర్ కేశవులు భాషవత్తిని, ఎండీ (సైకియాట్రీ)
చైర్మన్: తెలంగాణ మేధావుల సంఘం & నిజామాబాద్ జిల్లా డెవలప్‌మెంట్ ఫోరం

Continue Reading