Connect with us

నిజామాబాద్

కొండెక్కిన ధరలు

janamvelugunews

Published

on

పువ్వుల రేట్లు బాంబుల రేట్లు, పండ్ల రేట్లు కొండెక్కాయి

జనంవెలుగు, నిజామాబాద్:- దీపావళి వచ్చిందంటే అందరికీ ఒక సందడి ప్రతి ఒక్కరూ అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగ దీపావళి పండుగ, ఈ పండుగ సందర్భంగా బంతిపూలకు భలే గిరాకీ పెరిగిపోయింది సుమారు 30 రూపాయలకిలో ఉన్న బంతిపూల రేటు 150 రూపాయల నుంచి 200 రూపాయల కిలో విక్రయాలు, అదేవిధంగా పండ్ల రేట్లు కూడా అమాంతంగా కొండెక్కాయి, పువ్వులు పండ్లు దేవుళ్లకు సమర్పిస్తారు, అయితే పండ్లు కూడా పువ్వులు కూడా షాటేజీ ఉండడం వల్ల వాటి రేట్లు కొండేక్కాయి. వర్నితో పాటు రుద్రూర్ ఉమ్మడి మండలాలు ఉమ్మడి జిల్లాల్లో అమాంతంగా పెరిగిపోవడం పట్ల బంతిపూల రేట్లు కొండెక్కి అని పలువురు చర్చించుకుంటున్నారు. ఇక బాంబులు కొట్టడం ఆనవాయితీ ఈ బాంబుల ధరలు కూడా విపరీతంగా పెంచడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పండుగ సందర్భంగా దేవతలకు పూలు సమర్పించాలన్న బాంబులు పెట్టాలన్న వాటిని కొనుగోలు చేయడానికి అధిక డబ్బులు పెట్టాల్సి వస్తుందని దీంతో జేబులు ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నారు. పుట్టగొడుగుల బాంబులు షాపులు పెట్టి అధిక ధరలకు విక్రయిస్తూ ప్రజల యొక్క జేబులు ఖాళీ చేస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిజామాబాద్

మణికంఠ సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు

janamvelugunews

Published

on

మణికంఠ సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు

జనంవెలుగు, ఆర్మూర్: జిల్లా కేంద్ర ఆర్మూర్ మున్సిపల్ పరిధి లో గల శ్రీ నవనాథ సిద్ధుల గుట్ట అయ్యప్ప దేవాలయంలో ప్రతి నెల మొదటి బుధవారం పురస్కరించు కొని శ్రీ నగేష్ శర్మ గురుస్వామి ఆధ్వర్యంలో ఉదయం శ్రీ గణపతి శ్రీసుబ్రహ్మణ్యం శ్రీ అయ్యప్ప స్వామి వార్లకు ప్రత్యేక పూజలు హారతి మంత్రపుష్పం, మధ్యాహ్నం 12.30 నిముషాలకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించబడినది.

 మణికంఠ సేవా సమితి అధ్యక్షులు: చెపూర్ ధనుంజయ్

 ఈ సందర్భంగా మణికంఠ సేవా సమితి అధ్యక్షులు చేపూరు దనంజయ్ మాట్లాడుతూ ఇట్టి కార్యక్రమానికి వి. అయ్యప్ప శ్రీనివాస్ అయ్యప్ప ఆలయం నిర్మాణ కర్త సహాయ సహకారం అందిస్తున్నందుకు నవనాథ సిద్ధుల గుట్ట ఆలయ కమిటీ దాతలకు . పాల్గొన్న అయ్యప్ప స్వామి భక్తులకు ధన్యవాదాలు తెలుపుతూ, ఆ మణికంఠుడు యొక్క ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను.

 ఈ కార్యక్రమంలో మణికంఠ సేవా సమితి ప్రధాన కార్యదర్శి ఉదయ్, ఉపాధ్యక్షులు కౌటికేవిజయ్, కోశాధికారి సురేష్ చారి, ప్రచార కార్యదర్శి గంగా మోహన్, కార్యవర్గ సభ్యులు ఒడ్డేన్న, సలహదారులు శ్రీహరి, నవనాథ సిద్ధుల గుట్ట కమిటీ సభ్యులు దత్తు గురు స్వామి, కొండవీటి శ్యామ్ గురు స్వామి, మోహన్ రావు గురు స్వామి, గ్యాస్ ప్రభాకర్ గురు స్వామి,నవీన్ రెడ్డి గురు స్వామి, నర్సారెడ్డి గురు స్వామి గోవింద్ పేట్, అయ్యప్ప భక్తులకు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

నిజామాబాద్

ప్రెస్ క్లబ్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

janamvelugunews

Published

on

ప్రెస్ క్లబ్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

నిజామాబాద్:- ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ను పురస్కరించుకొని మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ అధ్యక్షులు పంచ రెడ్డి శ్రీకాంత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచ రెడ్డి శ్రీకాంత్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకంగా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జర్నలిస్టుల ఎన్నో ఏండ్లుగా ఇళ్ల స్థలాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నామని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ఆమె ఇవ్వడం జరిగింది అని, టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సైతం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటివరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేలా టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిలకు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వినతిపత్రాలను ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆ తర్వాత జర్నలిస్టుల ఉద్యమ కార్యాచరణ ఉంటుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు వచ్చేవరకు జర్నలిస్టుల పోరాటాలు, ధర్నాలు నిరసనలు ఉంటాయని తెలిపారు. అనంతరం ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి వాగ్మారే సుభాష్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నిజామాబాద్ నగర జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల అంశంపై ప్రభుత్వం స్పందించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని లేనియెడల ఇళ్ల స్థలాలు వచ్చేవరకు ఉద్యమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

నిజామాబాద్

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

janamvelugunews

Published

on

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి,

రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలిసిన నగర జర్నలిస్టులు

నిజామాబాద్:- నగర జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రధాన డిమాండ్ తో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిలను నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో నగర జర్నలిస్టులు కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచ రెడ్డి శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఇళ్ల స్థలాల అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి నీ కలిసి మొదట వినతి పత్రాన్ని అందజేశామన్నారు. సానుకూలంగా స్పందించి ఇళ్ల స్థలాలు వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సంబంధిత ఆర్డీవోకు ఫోన్ చేసి తక్షణమే జర్నలిస్టులకు సంబంధించిన ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ స్థలం ఎక్కడైతే ఉందో చూడాలని ఆదేశించడం జరిగిందన్నారు. అనంతరం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలవగా ఇళ్లస్థలాల అంశంపై క్షుణ్ణంగా చర్చించడం జరిగిందన్నారు. త్వరలోనే ఇళ్ల స్థలాలు ఇచ్చేలా ప్రయత్నం చేస్తున్నామని నగరంలో ఎక్కడ ఇళ్లస్థలాలు లేవని అందుకోసం కేశపూర్, బర్దిపూర్ ప్రాంతాలలో ప్రభుత్వ స్థలం ఉంటే చూడాలని నిజామాబాద్ ఆర్డిఓ కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు అని తెలిపారు. ఇళ్ల స్థలాల అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై సానుకూలంగా స్పందించినందుకు ప్రెస్ క్లబ్ కమిటీ తరఫున నగర జర్నలిస్టుల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞత అభివందనాలు తెలిపారు.

Continue Reading