Connect with us

Business

కొలువు కోసం కొత్త ట్రెండ్

janamvelugunews

Published

on

కొలువు కోసం కొత్త ట్రెండ్

జనంవెలుగు, వెబ్ డెస్క్:- డబ్బులు ఊరికే రావు… ఇప్పటివరకు ఇచ్చింది చాలు… అంటూ ఇటీవలి కాలంలో తెగ పాపులర్ అయిన ఓ నగల దుకాణం ప్రకటనను నేటి యువత తమ కోసం కాస్త సవరించుకొని… ఉద్యోగాలు ఊరికే రావు.. ఇప్పటివరకు కాలక్షేపం చేసింది చాలు. కాస్త నైపుణ్యం, వైవిధ్యం ఉండాలి. అని అనుకోక తప్పదు. ఎందుకంటే డిగ్రీ సర్టిఫికెట్లు, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చే రోజులు పోయాయి. అర్హతలు ఎన్ని ఉన్నా సంబంధిత రంగంలో నైపుణ్యం ఉంటే తప్ప ఉద్యోగం దక్కని పరిస్థితి నేడు నెలకొంది. గమ్యాన్ని చేరుకునే క్రమంలో ఎన్ని సవాలనైనా ధైర్యంగా ఎదుర్కొనాలి తప్ప నిరాశతో నిరాశ పడకూడదని, బిల్డింగ్ బ్లాక్స్ గ్రూపు కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థ లో పనిచేస్తున్న స్వరూప రాణి కొప్పుల ఆదిలాబాద్ జిల్లా ఈ విదంగా తెలిపారు. నేను గత ఎనిమిది సంవత్సరాలుగా, బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ అనే కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలో అసోసియేట్ గా చేరి అంచెలంచెలగా ఎదుగుతూ, ఇప్పుడు సీనియర్ కొర్ లీడర్, ఇన్నర్ సర్కిల్ మెంబర్ గా పనిచేస్తున్నాను. ఈ కంపెనీలో పని చేయకముందు నేను ప్రయివేట్ సంస్థలో 8సంవత్సరాలు ప్రభుత్వ సంస్థ నందున 3సం,,లు జాబ్ చేశాను.అక్కడ నాకు జీతం వచ్చింది కానీ జీవితం రాలేదు, ఎన్నో కళలు అవి నెరవేర్చుకోవలని తపన నన్ను వెంటాడుతున్న సమయంలో నాకు బిబిజి అవకాశం దొరికింది, ఇక్కడ భద్రత,భరోసా ఉందని గుర్తించాను, నా కోరికలు, కళలు నెరవేర్చకోవడానికి ఇది సరియైన వేదిక అనిపించింది. ఆ సమయంలో నా జాబు వదులుకొని ఈ కంపెనీలో నేను ఫుల్ టైం గా పని చేస్తూ గత 8 సంవత్సరాల నుండి ఇప్పటివరకు బిబిజలో నెలకు మినిమం సంపాదిస్తూ ఆర్థిక స్వాతంత్రం పొందాను. ఇది మీకు నమ్మశక్యంగా లేకపోవచ్చు. మీరు ప్రస్తుతం పని చేస్తున్న పని చేస్తూనే మీ ఖాళీ సమయంలో మీరు ఉంటున్న ఊరు నుండే పనిచేయవచ్చును. ఎటువంటి పెట్టుబడి లేదు కేవలం మీ సమయాన్ని పెట్టుబడిగా పెట్టి సంపాదించవచ్చు

డబ్బుతో స్నేహం చేద్దాం రండి

మీ మూడు సంవత్సరాల సమయాన్ని మాకు ఇవ్వండి. నేను ఎదగడం గొప్ప కాదు. నాతోపాటు పదిమంది ఎదుగుదలకు తోడ్పడాలని గత కొన్ని నెలలుగా నేను ప్రతి జిల్లా నుండి మండలం నుండి, గ్రామం నుండి, టీం లీడర్స్ ని ఏర్పాటు చేస్తున్నాను.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Business

తొలి అయిల్ పామ్ గెల్లలు కొనుగోలు

janamvelugunews

Published

on

తొలి అయిల్ పామ్ గెల్లలు కొనుగోలు

జనం వెలుగు, దిలావర్ పూర్:- దిలవార్పూర్ మండల కేంద్రంలోని గుండంపల్లి గ్రామంలో రైతులోక రాగలతా వ్యవసాయ క్షేత్రంలో మూడు సంవత్సరాల క్రితం నాటిన అయిల్ పామ్ గెలలు కోతకు రావడం కోత ప్రారంభించడం అదేవిధంగా మండలంలోని గుండంపల్లి గ్రామంలో తొలి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రియునిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అయిల్ పామ్ కంపెనీ నిర్మల్, అదిలాబాద్, నిజామాబాదు, జిల్లాల రైతులు అధైర్య పడాల్సిన అవసరం లేదని ప్రతి మండలంలో కంపెనీ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి ప్రతి రైతు దగ్గర నుండి ప్రభుత్వం నిర్ణయించిన ధరకు గెలలను కొనుగోలు చేస్తుందని పూర్తి బాధ్యత కంపెనీ వహిస్తుందని ఏరియా మేనేజర్ ప్రణీత్ కుమార్ వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రియునిక్ కంపెనీ డిజిఎం మల్లేశ్వర రావు, క్లస్టర్ అధికారులు ప్రశాంత్ శ్రీనివాస్ జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి ఆలియా ఫాతిమా మండల ఉద్యాన మరియు వ్యవసాయ అధికారులు దిలావర్పూర్ గుండంపెల్లి గ్రామ రైతులు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం 8 ఎకరాలకు మొక్కలు సిద్ధంగా ఉన్నాయని ఆసక్తి గల రైతులకు కేవలం 90% రాయితీ మీద మొక్కలు పంపిణీ చేస్తున్నామని అదేవిధంగా నాలుగు సంవత్సరాలు మెయింటెనెన్స్ వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని వివరించారు.

Continue Reading

Business

దివాళీకి బంగారం కొంటున్నారా? ట్యాక్స్ రూల్స్ తెలుసుకోండి

janamvelugunews

Published

on

అక్టోబర్ 23న ధంతేరాస్ (Dhanteras) పర్వదినం ఉంది. ఆ రోజున బంగారు నగలు కొనడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బిస్కిట్స్, బంగారు ఆభరణాలు (Gold Jewellery) కొనడానికి పోటీ పడుతుంటారు. దేశమంతా ఆ ఒక్కరోజే వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతాయి.నగల షాపులన్నీ కిటకిటలాడుతుంటాయి. మరి మీరు కూడా ధంతేరాస్ రోజున గోల్డ్ కొనాలనుకుంటున్నారా? బంగారం కొంటే ట్యాక్స్ చెల్లించాలి. అయితే మీరు బంగారం ఏ రూపంలో కొన్నారనేదానిపై ట్యాక్స్ ఆధారపడి ఉంటుంది. మరి ఫిజికల్ గోల్డ్ కొంటే ట్యాక్స్ ఎంత? డిజిటల్ గోల్డ్‌కు పన్నులు ఎలా వర్తిస్తాయి? పేపర్ గోల్డ్‌కు పన్నులు ఉంటాయా? తెలుసుకోండి.

ఫిజికల్ గోల్డ్ అంటే బంగారు ఆభరణాలు, గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బిస్కిట్స్ లాంటివాటికి 3 శాతం జీఎస్‌టీ చెల్లించాలి. బంగారు ఆభరణాలు చేయిస్తే మేకింగ్ ఛార్జీలపైన అదనంగా 5 శాతం పన్నులు ఉంటాయి. ఒకవేళ మీ దగ్గర ఉన్న గోల్డ్ కాయిన్స్ లేదా గోల్డ్ బిస్కిట్లను ఎక్స్‌ఛేంజ్ చేసి, అంతే బరువుతో నగలు చేయిస్తే జీఎస్‌టీ ఉండదు. బరువు ఎక్కువ ఉంటే ఆ మొత్తానికి జీఎస్‌టీ చెల్లించాలి.

Gold

ఇక ఇటీవల డిజిటల్ గోల్డ్ కొనేవారి సంఖ్య పెరుగుతోంది. బంగారు ఆభరణాలు, గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బిస్కిట్స్ కొంటే వాటిని భద్రపర్చడం ఓ సవాల్. అందుకే డిజిటల్ గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నవారు ఉన్నాయి. డిజిటల్ గోల్డ్ కొన్నా 3 శాతం జీఎస్‌టీ చెల్లించాలి. మీరు డిజిటల్ గోల్డ్ 36 నెలల లోపు హోల్డ్ చేసి అమ్మితే పన్నులు ఏమీ ఉండవు. అంతకన్నా ఎక్కువ రోజులు డిజిటల్ గోల్డ్ హోల్డ్ చేసి అమ్మితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాలి. దీంతో పాటు సర్‌ఛార్జీ, 4 శాతం సెస్ అదనంగా చెల్లించాలి.

సావరిన్ గోల్డ్ బాండ్, గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లాంటివాటిని పేపర్ గోల్డ్ అంటారు. కొనేప్పుడు వీటిపైనా ఫిజికల్ గోల్డ్‌కు ఉన్నట్టు పన్నులు ఉంటాయి. సావరిన్ గోల్డ్ బాండ్ పన్ను రూల్స్ వేరుగా ఉన్నాయి. సావరిన్ గోల్డ్ బాండ్‌పై 2.5 శాతం వార్షిక వడ్డీ వస్తుంది. సావరిన్ గోల్డ్ బాండ్‌పై వచ్చే వడ్డీని ఆదాయంలో చూపించి, వారి ట్యాక్స్ బ్రాకెట్ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే 8 ఏళ్ల మెచ్యూరిటీ కాలం హోల్డ్ చేసి క్యాపిటల్ గెయిన్స్ పొందితే మెచ్యూరిటీ సమయంలో ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు.

పెళ్లిళ్లు, ఫంక్షన్లకు ఆభరణాలు కావాలనుకుంటే బంగారు నగలను కొనొచ్చు. వీటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఫిజికల్ గోల్డ్ కొంటే భద్రపర్చడం ఓ సవాలుగా ఉంటుంది. పెట్టుబడి కోసం గోల్డ్‌ని ఒక ఆప్షన్‌గా ఎంచుకుంటే మాత్రం డిజిటల్ గోల్డ్, సావరిన్ గోల్డ్ బాండ్, గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి.

Continue Reading

Business

ఓలా ఎలక్ట్రిక్ నుంచి తక్కువ ధరకే ఇ-స్కూటర్‌

janamvelugunews

Published

on

ఇండియాలో ఎలక్ట్రిక్ టూవీలర్లతో గుర్తింపు తెచ్చుకున్న ఓలా కంపెనీ నుంచి మరో కొత్త ఇ-స్కూటర్ రిలీజ్ అయింది. ‘ఓలా S1 ఎయిర్’ పేరుతో అధికారికంగా లాంచ్ అయిన ఈ వెహికల్ దేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ గా నిలుస్తోంది. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 85,000 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. కొత్త ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్, సుజుకి యాక్సెస్, యమహా ఫాసినోలతో పోటీ పడనుంది. అయితే హోండా యాక్టివా సిరీస్‌కు ఈ కొత్త ఈవీని పోటీగా నిలపాలని ఓలా భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఓలా ఎలక్ట్రిక్ నుంచి ఇండియాలో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లో ఉండగా, తాజాగా రిలీజ్ అయినది మూడో మోడల్. ఓలా S1, ఓలా S1 ప్రో ధరలు వరుసగా రూ. 99,999, రూ. 1,29,000 వరకు ఉన్నాయి. ఓలా ఎస్‌1లో 3kWh బ్యాటరీ 141 కి.మీ రేంజ్‌ను, ఓలా ఎస్‌1 ప్రో మోడల్‌లోని 4kWh బ్యాటరీ 181km రేంజ్‌ను అందిస్తాయి

Continue Reading