నిజామాబాద్
ఘనంగా బలిదాన్ దివాస్


ఘనంగా బలిదాన్ దివాస్
జనంవెలుగు, ఆర్మూర్:- శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పెద్దోళ్ల గంగారెడ్డి మాట్లాడుతూ ఈ దేశంలో స్వతంత్రం కోసం విరోచితంగా పోరాడినటువంటి వ్యక్తి శ్యామ ప్రసాద్ ముఖర్జీ అన్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత జవహర్ లాల్ నెహ్రూ యొక్క ఆధ్వర్యంలో పరిశ్రమల శాఖ మంత్రిగా కొనసాగడం జరిగింది.జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతి పత్తి కల్పించాలని నెహ్రూ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఒప్పందం జరిగిన దాని కారణంగా శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆ ఒప్పందాన్ని వ్యతిరేకించి వారి యొక్క మంత్రి పదవికి రాజీనామా చేసి 1951 లో భారతీయ జనసం పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతూ జమ్ము కాశ్మీర్ కు వెళ్లాలంటే వీసా తీసుకొని వెళ్లేటువంటి పరిస్థితి ప్రత్యేక జెండా ప్రత్యేక చట్టం కల్పించిన కారణంగా మన దేశంలోనే ఒక రాష్ట్రానికి వెళ్లడానికి వీసా తీసుకొని వెళ్లడమా అందుకు ఈ దేశంలో ఒకే జెండా ఒకే చట్టం ఒకే ప్రజా ఒకే రాజ్యాంగం ఓకే ప్రధాని ఉండాలని ఈ దేశంలో అంతర్భాగమైన జమ్ము కాశ్మీర్ నేను ఈ వీసా లేకుండా వెళ్తాను అని వేలాది మందితో జమ్మూ కాశ్మీర్ కు వెళ్లడం జరిగింది. అక్కడి పోలీసులు వెంటనే అరెస్టు చేసి పాడుబడ్డ బంగ్లాలో ఉంచి కఠినమైనటువంటి పరిస్థితిని కల్పించి, శ్యామా ప్రసాద్ ముక్కాజి ఒకే దేశం ఒకే ప్రజా ఒకే చట్టం ఒకే రాజ్యాంగం ఉండాలని పోరాటం చేసి ఈ ప్రజల కోసం సమాజం కోసం ప్రాణ త్యాగం చేయడం జరిగింది. నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత శ్యామ ప్రసాద్ ముఖర్జీ యొక్క ఆశయం 370 ఆర్టికల్ ను రద్దు చేయడం దాన్ని వారి యొక్క ఆశయాన్ని నెరవేర్చడం జరిగింది. కాబట్టి మనమందరం కూడా శ్యామ ప్రసాద్ ముఖర్జీ యొక్క దేశభక్తిని గుర్తుచేసుకొని ప్రాణాన్ని లెక్క చేయకుండా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వారి ఆశయం కాబట్టి వారి ఆశయ సాధన కోసం మనమందరం అడుగుజాడల్లో నడవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ధమాకార్ శ్రీనివాస్, నల్లమోహన్ కత్తి శ్రీనివాస్, దేవేందర్, నరేందర్ గంగారం తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్
పేదవానికి చదివే వజ్రాయుధం


పేదవానికి చదివే వజ్రాయుధం
జనంవెలుగు, నందిపేట్ జూన్ 18:- గురువారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నందిపేట మండల కేంద్రంలో పర్యటించి పలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా జాతీయస్థాయి స్కాలర్షిప్ సాధించిన విద్యార్థులకు స్థానిక మోడల్ స్కూల్లో మెమొంటోను అందజేశారు.
8 తరగతి చదువుతున్న చేపూర్ శ్రీహిత, పాణెం హర్షిత, గొల్లపల్లి అలంకృత, రాచ కనిష్క్ లు మోడల్ స్కూల్లో చదివి జాతీయస్థాయి స్కాలర్షిప్ సొంతం చేసుకోవడం చాలా సంతోషం అంటూ వారిని ఘనంగా శాలువాతో సత్కరించి ఆ పిల్లల తల్లిదండ్రులను, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులను అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. డబ్బున్న వాడికి డబ్బుతో పాటు విద్యా, వైద్యం, విలాసం ఇలా రకరకాల సదుపాయాలన్నీ సమృద్ధిగా అందుతాయని డబ్బు లేని వానికే విద్యా వైద్యం విలాసం ఇలా అన్ని భారంగా మారుతాయి అని, అందుకే ప్రతి పేదవానికి విద్య అనేది వజ్రాయుధం లాంటిదని, విద్యతోనే ధనికునితో ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పొచ్చని,
సమాజంలో మంచి గౌరవం అందుతుందని అందు కొరకు అహర్నిశలు కష్టపడాలని విద్యార్థులకు సూచించారు. కటిక పేదరికమైన చదువు అనే వజ్రాయుధంతో తలరాతను మార్చుకోవచ్చని, అందుకే ఏ ఒక్క విద్యార్థి కూడా నిరాశ నిస్సృహ చెందకుండా చదువుపై మంచి ద్యాస పెట్టి లక్ష్యాలను చేదించాలని,
నిరుపేదగా పుట్టి ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఎంతోమంది విద్యార్థుల ఘాతను ఆదర్శంగా తీసుకొని తమ లక్ష్యాలను చేదించాలన్నారు. మొన్నటికి మొన్న ఐపిఎల్ లో వైభవ్ సూర్య వంశీ అనే ఒక 15 ఏళ్ల కుర్రాడు సిక్సులు బాదుతుంటే యావత్ ప్రపంచమంతా నివ్వరపోయిందని, అతి చిన్న వయసులో ఎన్నో రికార్డులను అధిగమించాడని,
ఆ బుడ్డోడు సాధించిన ఘనతల వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయని, వారి తల్లిదండ్రులు పడ్డ బాధలు, ఆ బాలుడి పట్టుదల ఆ ఘనతను సాధించేలా చేసిందని ఉదాహరించాడు. జాతీయస్థాయి స్కాలర్షిప్ పొందిన పిల్లలు 8వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు నాలుగు సంవత్సరాలు సంవత్సరంకు 12 వేల రూపాయల చొప్పున 48 వేల రూపాయలను పొందుతారని ఆయన అన్నారు.
అందుకే నన్ను గెలిపించిన నా నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేసేందుకు అనునిత్యం అసెంబ్లీలో నిరుపేదలకు విద్య, వైద్యంపైనే మాట్లాడుతున్నానని గుర్తు చేశారు. నిరుపేదలంటే ఇష్టమని ఆ నిరుపేదలకు విద్యా వైద్యం అందకపోతే ఊరుకోనని, పేద విద్యార్థుల కొరకు అహర్నిశలు పాటుపడతానన్నారు.
అలాగే గురువులు కూడా ప్రతి పేద విద్యార్థిని తమ పిల్లలుగా అనుకొని నిత్యం వారి వెన్నంటా ఉండి మంచి విద్యా బోధన చేస్తూ మెరకల్లాంటి విద్యా కుసుమాలను తయారు చేయాలని, కుల మత ధన తారతమ్యాలను పక్కనపెట్టి, మంచి క్రమశిక్షణ నేర్పిస్తూ దేశభక్తి గల పౌరులను తయారుచేసి దేశానికి అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎంఈఓ అవధూత గంగాధర్, సర్పంచ్ సిలిండర్ లింగం, మోడల్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ప్రవీణ్, నందిపేట మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పటేళ్ల రాజు, బిజెపి నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నిజామాబాద్
టి జి ఎస్ ఆర్ టి సి డిప్యూటీ రీజినల్ మేనేజర్ గా పి. జ్యోతి


టి జి ఎస్ ఆర్ టి సి డిప్యూటీ రీజినల్ మేనేజర్ గా పి. జ్యోతి
నిజామాబాద్ ఆర్ టి సి నూతన డిప్యూటీ రీజినల్ మేనేజర్ గా పి. జ్యోతి బాధ్యతల చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులు ఆమెకు పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.
డిప్యూటీ రీజినల్ మేనేజర్ గా భాద్యతలు చేపట్టిన వెంటనే పి. జ్యోతి నిజామాబాద్ బస్ స్టేషన్, డిపోలను సందర్శించి ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు, పరిశుభ్రత, టికెటింగ్ విధానం, ప్రయాణీకుల రద్దీ నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన సూచనలు చేశారు.ఈ కార్యక్రమం లో పర్సనల్ ఆఫీసర్ పద్మజ, ఏ.ఓ. బి. స్వరూప, నిజామాబాద్ 1 డి ఎం ఆనంద్, నిజామాబాద్ 2 డి ఎం, జి ఎస్ చంద్ర శేఖర్ రెడ్డి, బాన్స్ వాడ డి ఎం రవికుమార్, కామారెడ్డి డి ఎం దినేష్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్ సత్యనారాయణ, నిజామాబాద్ 1డిపో సి ఐ జనాభాయి, ఎం ఎఫ్ వసుంధర, బస్ స్టేషన్ మేనేజర్ శివరాజమ్మ తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్
మాతాశిశు సంరక్షణకు అంకిత భావంతో కృషి చేయాలి


మాతాశిశు సంరక్షణకు అంకిత భావంతో కృషి చేయాలి
కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్, జూన్ 16: మాతా శిశు సంరక్షణే ధ్యేయంగా వైద్యులు, సిబ్బంది అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ప్రసవాల సందర్భంగా మాతాశిశు మరణాలు చోటుచేసుకోకుండా ముందస్తుగానే క్రమం తప్పకుండా వైద్య సేవలు అందిస్తూ, నిశిత పర్యవేక్షణ జరపాలని అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి మాతా శిశు మరణాల నిరోధక కమిటీ సమావేశం జరిగింది.
ఇటీవలి కాలంలో జిల్లాలో చోటుచేసుకున్న మాతాశిశు మరణాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏ ఆసుపత్రిలో సంఘటన చోటుచేసుకుంది, మరణం సంభవించడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటీ, వైద్య సేవలలో ఏమైనా లోపం జరిగిందా అని ఆరా తీస్తూ, రికార్డులను పరిశీలించారు. మాతాశిశు మరణాలు జరగకుండా ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎక్కడ సంఘటన జరిగినా లోతుగా పరిశీలన జరుపుతామని, నిర్లక్ష్యం కారణంగా మరణం సంభవించినట్టు వెల్లడి అయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. గర్భిణీలకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరుపుతూ, అవసరమైన వైద్య చికిత్సలు అందించాలని సూచించారు. వారు పుట్టింటికి వెళ్ళిన పక్షంలో వారి హెల్త్ రికార్డును అక్కడి అధికారులకు పంపాలని, క్షేత్రస్థాయిలో ఆశాలు,
అంగన్వాడీలు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. హైరిస్క్ ప్రెగ్నెన్సీ కేసుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని, వారి ఇళ్ళను సందర్శించి ఆరోగ్య స్థితిని వాకబు చేయాలని అన్నారు. అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోంలలో తప్పనిసరిగా తగిన పరిజ్ఞానం కలిగిన నిపుణులైన వైద్యులు, ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, వైద్య పరీక్షలు, చికిత్సలు అందించే విషయంలో ఎలాంటి లోపం జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా రక్త హీనత, బీ.పీ పరీక్షలు క్రమం తప్పకుండా చేయాలని, అవసరమైన వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తూ, ఎంతో విలువైన నిండు ప్రాణాలు కాపాడాలని సూచించారు. కాన్పు సందర్భంగా అనుకోని పరిస్థితుల్లో తల్లి మరణిస్తే, బాధిత కుటుంబం చిన్నాభిన్నం అయ్యే అవకాశం ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని అన్నారు.
ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ,టి.వినయ్ డీ.సీ.హెచ్.ఎస్ శ్రీనివాస్ ప్రసాద్, కమిటీ సభ్యుడు బుస్స ఆంజనేయులు, స్వంచ్చంధ సంస్థల ప్రతినిధులు, సంబంధిత వైద్యాధికారులు, వైద్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.








