Connect with us

నిజామాబాద్

విద్యుత్తు చార్జీలు పెంచుతొందని, కేటిఆర్ తప్పుడు ప్రచారం

janamvelugunews

Published

on

విద్యుత్తు చార్జీలు పెంచుతొందని, కేటిఆర్ తప్పుడు ప్రచారం

జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి

జనం వెలుగు, బాల్కొండ:- రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్తు చార్జీలు పెంచుతొందని బిఆర్ఎస్ నాయకుడు కేటిఆర్ రాష్ట్ర ప్రజలను తప్పు తోవ పట్టిస్తున్నాడని జిల్లా కాంగ్రెసు కమిటి అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. మండల కేంద్రమైన భీంగల్ లో శుక్రవారం స్థానిక విలేఖరులతో మాట్లాడాడు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సుమారు 50 లక్షల గృహాలకు 200 యూనిట్లలోపు విద్యుత్తు వాడే గృహాలకు కాంగ్రెసు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్తును అందిస్తుందని ఆయన అన్నాడు. టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులు పెంచిన విద్యుత్ చార్జీలు చాలా ఉన్నాయని, అందులో భాగంగా గడిచిన పదేండ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్తు రంగాన్ని విధ్వంసం చేయటంతో పాటు అడ్డగోలుగా విద్యుత్తు ఛార్జీలను పెంచి వినియోగదారులకు వాతలు పెట్టిందని, విద్యుత్తు ఛార్జీల పెంపుతో తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలపై మోయలేనంత భారం మోపిందని ఆయన దుయ్యబట్టాడు.
తమ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో విద్యుత్తు ఛార్జీలు పెంచనే లేదని ఆ పార్టీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించాడు. గతంలో బిఆర్ఎస్ చేసిన పాపాలను కాంగ్రెసు ప్రభుత్వానికి అంట గట్టేందుకు బిఆర్ఎస్ నాయకులు కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించాడు. 2 015-2016లో డొమెస్టిక్, నాన్ డొమెస్టిక్, అన్ని కేట గిరీల నుంచి విద్యుత్తు ఛార్జీల ద్వారా రాష్ట్రంలోని డిస్కంలు (ఎన్పీడీ సీఎల్,ఎస్పీడీసీఎల్) 18845 కోట్ల రూపాయలను బిఆర్ఎస్ ప్రభుత్వం వసూలు చేసిందని ఆయన తెలిపాడు. 2023–24లో బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయేనాటికి విద్యుత్తు ఛార్జీల ద్వారా డిస్కంలకు వచ్చిన రాబడి 43439 కోట్ల రూపాయలు కాగా ఈ లెక్కన పదేండ్లలో అన్ని వర్గాలపై అప్పటి ప్రభుత్వం వడ్డించిన విద్యుత్తు ఛార్జీల భారం 24594 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపడం జరిగిందని ఆయన తెలిపాడు.ఇందులో పెరిగిన కనెక్షన్లు, పెరిగిన విద్యుత్తు వినియోగం పక్కనపెట్టినా దాదాపు రూ.20 వేల కోట్ల భారం ప్రజలపై ఛార్జీల పెంపు ఫలితమేనని ఆయన చెప్పాడు. 2015-16 సంవత్సరంలో 5% విద్యుత్తు ఛార్జీల పెంచగా 2016-17లో అంతకంటే ఎక్కువగా 8% ఛార్జీలను పెంచిందని ఆయన తెలిపాడు.2022-23లో భారీ మొత్తం ఒకేసారి 16 శాతం ఛార్జీల పెం చిందని దీంతో వినియోగదారులపై ఒకేసారి 6 వేల కోట్లకు పైగా భారం మోపిందని ఆయన తెలిపాడు.
2020కి ముందు ఫిక్స్డ్ ఛార్జీల ప్రస్తావన లేనే లేదని, గృహ వినియోగదారుల నుంచి ఫిక్స్డ్ ఛార్జీలను వసూలు చేయటం మొదలు పెట్టింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన అన్నాడు. తర్వాత అయిదేండ్లు ఛార్జీలు పెంచ లేదంటూ ప్రజలను నమ్మించి బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తు చాటుమాటు ఛార్జీలు పెంచి ప్రజలను పెద్ద ఎత్తున మోసం చేసిందని ఆయన తెలిపాడు. పేదలను, మధ్య తరగతి ప్రజలను ఏ ఒక్క వర్గాన్ని కూడా వదిలి పెట్టకుండా గత ప్రభుత్వం ఒక్కో యూనిట్ పై 50 పైసల నుండి ఒక రూపాయి వరకు వడ్డించిందని ఆయన అన్నా డు.వీటితో పాటు ఫిక్స్డ్ కస్టమర్ ఛార్జీలను కూడా పెంచిందని. అప్పుడు వినియోగదారుల నుండి అన్ని చోట్ల ఆందోళనలు చేసినా బిఆర్ఎస్ పెడచెవిన పెట్టిందని, మరోవైపు విద్యుత్తు సంస్థల లాభనష్టాలను వెల్లడించకుండా గత ప్రభుత్వం విద్యుత్తు రంగాన్ని సర్వనాశనం చేసిందని, అందుకే తెలంగాణలోని డిస్కంలు వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయాయని ఆయన చెప్పాడు.ఏడాది కోసారి డిస్కంలు ఈఆర్సీకి సమర్పించాల్సిన వార్షిక ఆదాయ అవసరాల నివేదికలను (ఏఆర్ఆర్) కూడా గత 2014-15, 2019-20, 2020- 21, 2021-22 సంవత్సరాల్లో డిస్కంలు ఈ నివేదికలను (ఏఆర్ఆర్) కూడా దాఖలు చేయలేదని ఆయన తెలి పాడు.తమ ప్రభుత్వ నిర్వాకాన్ని దాచిపెట్టి ఈ ప్రభుత్వం రూ.18 వేల కోట్ల ఛార్జీలు పెంచుతుందని బీఆర్ఎస్ నేత కేటీఆర్ తప్పుడు ప్రచారం చేశాడని ఆయన ధ్వజమెత్తాడు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వి ద్యుత్తు ఛార్జీలను పెంచలేదని, డిస్కంలు ప్రతిపాదించిన1200 కోట్ల రూపాయల ఛార్జీల పెంచి భారాన్ని మోపిందని ఆయన అన్నాడు. నేను చెప్పిన దాంట్లో ఏమైన అసత్యాలు ఉంటే ఏ బహిరంగ చర్చకైన సిద్దమేనని మాజి మంత్రి బాల్కొండ ఎంఎల్ఏ ప్రశాంత్ రెడ్డి సవాల్ స్వీకరించాలని ఆయన సవాల్ విసిరాడు. ఈ కార్యక్రమంలో భీంగల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బోదిరే స్వామి, టౌన్ అధ్యక్షుడు నర్సయ్య,జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట రమేష్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు అనంతరావు ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు గోపాల్ నాయక్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు కోరాడి రాజు, బాల్కొండ నియోజకవర్గం యువజన అధ్యక్షుడు నాగేంద్రబాబు, మండల యువజన అధ్యక్షుడు బద్దం అవినాష్, ముచ్కూర్ సొసైటీ చైర్మన్ బంగ్లా దేవేందర్, మాజీ ఎంపీ పీ కన్నె సురేందర్, చంద్రు నాయక్, సురేష్, బొర్రన్న, విక్రమ్, నరసయ్య, నవీన్, వంశీ, అనిల్, శ్యామ్ రాజ్, మీరాజ్, కలీం, శ్రీను, సాయి, శివ, విక్రం, రత్నం, యాదగిరి, ఇక్రం తదితరులు పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిజామాబాద్

మణికంఠ సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు

janamvelugunews

Published

on

మణికంఠ సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు

జనంవెలుగు, ఆర్మూర్: జిల్లా కేంద్ర ఆర్మూర్ మున్సిపల్ పరిధి లో గల శ్రీ నవనాథ సిద్ధుల గుట్ట అయ్యప్ప దేవాలయంలో ప్రతి నెల మొదటి బుధవారం పురస్కరించు కొని శ్రీ నగేష్ శర్మ గురుస్వామి ఆధ్వర్యంలో ఉదయం శ్రీ గణపతి శ్రీసుబ్రహ్మణ్యం శ్రీ అయ్యప్ప స్వామి వార్లకు ప్రత్యేక పూజలు హారతి మంత్రపుష్పం, మధ్యాహ్నం 12.30 నిముషాలకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించబడినది.

 మణికంఠ సేవా సమితి అధ్యక్షులు: చెపూర్ ధనుంజయ్

 ఈ సందర్భంగా మణికంఠ సేవా సమితి అధ్యక్షులు చేపూరు దనంజయ్ మాట్లాడుతూ ఇట్టి కార్యక్రమానికి వి. అయ్యప్ప శ్రీనివాస్ అయ్యప్ప ఆలయం నిర్మాణ కర్త సహాయ సహకారం అందిస్తున్నందుకు నవనాథ సిద్ధుల గుట్ట ఆలయ కమిటీ దాతలకు . పాల్గొన్న అయ్యప్ప స్వామి భక్తులకు ధన్యవాదాలు తెలుపుతూ, ఆ మణికంఠుడు యొక్క ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను.

 ఈ కార్యక్రమంలో మణికంఠ సేవా సమితి ప్రధాన కార్యదర్శి ఉదయ్, ఉపాధ్యక్షులు కౌటికేవిజయ్, కోశాధికారి సురేష్ చారి, ప్రచార కార్యదర్శి గంగా మోహన్, కార్యవర్గ సభ్యులు ఒడ్డేన్న, సలహదారులు శ్రీహరి, నవనాథ సిద్ధుల గుట్ట కమిటీ సభ్యులు దత్తు గురు స్వామి, కొండవీటి శ్యామ్ గురు స్వామి, మోహన్ రావు గురు స్వామి, గ్యాస్ ప్రభాకర్ గురు స్వామి,నవీన్ రెడ్డి గురు స్వామి, నర్సారెడ్డి గురు స్వామి గోవింద్ పేట్, అయ్యప్ప భక్తులకు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

నిజామాబాద్

ప్రెస్ క్లబ్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

janamvelugunews

Published

on

ప్రెస్ క్లబ్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

నిజామాబాద్:- ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ను పురస్కరించుకొని మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ అధ్యక్షులు పంచ రెడ్డి శ్రీకాంత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచ రెడ్డి శ్రీకాంత్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకంగా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జర్నలిస్టుల ఎన్నో ఏండ్లుగా ఇళ్ల స్థలాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నామని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ఆమె ఇవ్వడం జరిగింది అని, టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సైతం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటివరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేలా టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిలకు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వినతిపత్రాలను ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆ తర్వాత జర్నలిస్టుల ఉద్యమ కార్యాచరణ ఉంటుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు వచ్చేవరకు జర్నలిస్టుల పోరాటాలు, ధర్నాలు నిరసనలు ఉంటాయని తెలిపారు. అనంతరం ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి వాగ్మారే సుభాష్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నిజామాబాద్ నగర జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల అంశంపై ప్రభుత్వం స్పందించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని లేనియెడల ఇళ్ల స్థలాలు వచ్చేవరకు ఉద్యమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

నిజామాబాద్

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

janamvelugunews

Published

on

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి,

రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలిసిన నగర జర్నలిస్టులు

నిజామాబాద్:- నగర జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రధాన డిమాండ్ తో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిలను నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో నగర జర్నలిస్టులు కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచ రెడ్డి శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఇళ్ల స్థలాల అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి నీ కలిసి మొదట వినతి పత్రాన్ని అందజేశామన్నారు. సానుకూలంగా స్పందించి ఇళ్ల స్థలాలు వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సంబంధిత ఆర్డీవోకు ఫోన్ చేసి తక్షణమే జర్నలిస్టులకు సంబంధించిన ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ స్థలం ఎక్కడైతే ఉందో చూడాలని ఆదేశించడం జరిగిందన్నారు. అనంతరం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలవగా ఇళ్లస్థలాల అంశంపై క్షుణ్ణంగా చర్చించడం జరిగిందన్నారు. త్వరలోనే ఇళ్ల స్థలాలు ఇచ్చేలా ప్రయత్నం చేస్తున్నామని నగరంలో ఎక్కడ ఇళ్లస్థలాలు లేవని అందుకోసం కేశపూర్, బర్దిపూర్ ప్రాంతాలలో ప్రభుత్వ స్థలం ఉంటే చూడాలని నిజామాబాద్ ఆర్డిఓ కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు అని తెలిపారు. ఇళ్ల స్థలాల అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై సానుకూలంగా స్పందించినందుకు ప్రెస్ క్లబ్ కమిటీ తరఫున నగర జర్నలిస్టుల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞత అభివందనాలు తెలిపారు.

Continue Reading