ARTICLE'S
రవి శాస్త్రి ఆరు సిక్సుల రికార్డ్ కు 40 ఏళ్ళు


రవి శాస్త్రి ఆరు సిక్సుల రికార్డ్ కు 40 ఏళ్ళు
జనంవెలుగు, వెబ్‌డెస్క్:- రవి శాస్త్రి ఆరు సిక్సుల రికార్డ్ కు 40 ఏళ్ళు నిండాయి. 18 సంవత్సరాల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన రవిశాస్త్రి… కుడి చేతితో బ్యాటింగ్ ఎడమచేతితో స్పిన్ బౌలింగ్ చేయగలడు. 1985 సంవత్సరంలో జనవరి 3వ తేదీన ఆరు బాళ్లలో ఆరు ఆరు సిక్సర్లు కొట్టిన మొట్ట మొదటి భారతీయుడిగా రికార్డు సాధించాడు రవి శాస్త్రి. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా రవిశాస్త్రి రికార్డు సృష్టించాడు. 1985లో ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచ చాంపియన్ క్రికెట్లో తన క్రీడా జీవితంలోనే అత్యంత ప్రతిభను కనబర్చి చాంపియన్ ఆఫ్ చాంపియన్స్‌గా ఎన్నికైనాడు. అదే సీజన్లో ఒకే ఓవర్లో వరుసగా 6 సిక్సర్లు కొట్టి ఈ ఘనతను సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ప్రపంచంలోనే ఈ ఘనతను సాధించిన వారిలో వెస్ట్ఇండీస్ కు చెందిన గారీ సోబర్స్ తర్వాత ఇతను రెండో వాడు మాత్రమే. టెస్ట్ క్రికెట్లో ఇతను 11 సెంచరీలు సాధించాడు, రవిశాస్త్రి క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత క్రికెట్ కామెంటేటర్ గా మారిపోయాడు. ఎన్నో మ్యాచ్ లకు తన స్టైల్లో క్రికెట్ కామెంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరించారు రవి శాస్త్రి. కొన్ని రోజుల పాటు టీమిండియా కోచ్ గా కొనసాగి టీమిండియా విజయాలను ముందుండి నడిపారు.
ARTICLE'S
గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించాలి


రుద్రూర్ జనం వెలుగు న్యూస్ 30 అక్టోబర్ :- రైతులు విధిగా తమ పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేయించాలని తద్వారా పశువులకు వ్యాధి సోకకుండా ఉంటుందని రుద్రూర్ పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ తెలిపారు. గురువారం రుద్రూర్ మండలకేద్రంలోని బొప్పాపూర్ గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ రైతులను ఉదేశించి మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి ప్రమాదకరమైనదని పశువులకు ఒకదాని నుండి ఒకదానికి సంక్రమిస్తుందని అన్నారు. గాలికుంటు వ్యాధి సోకకముందే టీకాలు వేయించి నివారణ చేపట్టాలని గాలికుంటు వ్యాధి సోకిన పశువులను ఇతర పశువుల నుండి దూరంగా ఉంచాలని లేనట్లయితే అన్ని పశువులకు వ్యాధి సోకి తీవ్ర నష్టం కలిగిస్తుందని సూచించారు. ప్రభుత్వం జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో భాగంగా పశువైద్య శాఖ ద్వారా ఉచితంగా గాలికుంటు వ్యాధి టీకాలు వేయించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతాంగం సద్వినియోగం చేసుకుని గాలికుంటు వ్యాధి టీకాలు వేయించి తమ పశువులను వ్యాధి పడకుండా రక్షించుకోవాలని బారిన సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలో 48 పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ పశు వైద్య సిబ్బంది, పాడి రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ARTICLE'S
మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలి


జనం వెలుగు న్యూస్ రుద్రూర్ 29- అక్టోబర్ : మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలకు రుద్రూర్ మండలంలో రైతులు ఆరుగాలం పాటు కష్టించి పండించిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. బుధవారం రుద్రూర్ మండల బిజెపి నాయకులు రైతుల కల్లాల వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్బంగా బిజెపి మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని మైచర్ మిషన్ వడ్లలోని తేమ శాతం 25 చూపిస్తే రైస్ మిల్లలోని మైచర్ మిషన్ తేమ శాతం 16 చూపిస్తున్నట్లు ఆరోపించారు అదేవిదంగా కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను రైస్ మిల్లుకు తరలించకపోవడం వలన కొంతమంది రైతుల ధాన్యం బస్తాలు అడుగుభాగం తడిచినట్లు సకాలంలో రైస్ మిల్ కు ధాన్యం తరలించి ఉంటే రైతులకు నష్టం జరిగేది కాదని పేర్కొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ వెంటనే సాంక్షన్ చేయాలని చేయాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లులు అన్నిటికీ అలాట్మెంట్ ఇచ్చి సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలని రుద్రూర్ బీజేపీ మండల కమిటీ తరఫున ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గూడూరి ప్రశాంత్ గౌడ్, నియోజవర్గ సీనియర్ నాయకులు పార్వతీ మురళి, మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి గజేందర్, కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు, ఎర్రోళ్ల గంగాధర్, యువ మోర్చా మండల అధ్యక్షుడు కుమ్మరి గణేష్, శివప్రసాద్, వరప్రసాద్, వినోద్ కుమార్, మాధవ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ARTICLE'S
వర్ని అంగల్లో తైబజార్ అధిక వాసుళ్లు…


జనం వెలుగు న్యూస్ : వర్ని మండల కేంద్రంలో ప్రతి మంగళవారం వారం వారపు సంత జరుగుతుంది. అందులోనే మేకల అంగడి కూడా జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుండి మేకలు అమ్మడానికి వ్యాపారులు వస్తారు.










