Connect with us

ARTICLE'S

సామాజిక అసమానత, అస్పృశ్యత లపై సమరం చేసిన సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే

janamvelugunews

Published

on

సామాజిక అసమానత, అస్పృశ్యత లపై సమరం చేసిన సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే
-నేడు ఆయన జయంతి

జనంవెలుగు, వెబ్డేస్క్:- కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహానుభావుడు. స్త్రీలు చదువుకోవాల్సిందే అని పట్టుబట్టి ప్రత్యేక స్కూల్ ఏర్పాటు చేసిన గొప్ప సంఘ సంస్కర్త. బడుగు, బలహీన, పీడిత వర్గాలకు అండగా నిలిచిన పోరాట యోధుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే. భౌతికంగా ప్రపంచాన్ని వదిలి 129 ఏళ్లయినా బడుగుల మేలు కోసం పూలే పడిన ఆరాటం ఇప్పటికీ స్ఫూర్తిని పంచుతోంది. ఇవాళ ఆ మహనీయుడి వర్థంతి సందర్భంగా పూలే సేవలను దేశం స్మరించుకుంటోంది.
మహాత్మా జ్యోతిరావు ఫూలే. సమాజంలో అన్ని వర్గాలకూ సమాన హక్కులు ఉండాలనీ స్త్రీలు సంఘంలో భాగం కావాల్సిందే అని పోరాటం చేసి దేశాన్నే మేల్కొలిపిన మహనీయుడు. అగ్రవర్ణాల నుంచి కుల వివక్షను ఎదుర్కొన్నా ఆఖరికి చదువుకునేందుకు పరిస్థితులు సహకరించకున్నా అన్నీ తట్టుకుని అందరి కోసం జీవితం అంకింతం చేశారు ఫూలే. వెనకబడిన కుటుంబంలో పుట్టి చిన్నప్పటి నుంచే కష్టాలు ఎదుర్కొన్న ఫూలే సత్య శోధక్ సమాజ్ పేరుతో ఓ సంస్థ ఏర్పాటు చేశారు. బలహీన వర్గాల తరఫున పోరాడారు. వారికి అన్ని హక్కులూ అందాలని గొంతెత్తారు.

ఫూలే బాల్యం కష్టాలతో మొదలైంది. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో 1827 ఏప్రిల్ 11న ఫూలే పుట్టారు. 9 నెలల వయసులోనే ఫూలే తల్లి చిమన చనిపోయారు. తండ్రి గోవిందరావు ఇంకో పెళ్లి వద్దనుకోవడంతో నర్సు సంరక్షణలో పెరిగారు. ఇబ్బందుల మధ్యే ప్రాథమిక విద్య పూర్తి చేశారు. చివరికి చదువు మానేసి తండ్రికి వ్యవసాయ పనుల్లో సహాయపడ్డారు. 12 ఏళ్ల వయసులోనే సావిత్రీబాయితో పూలే వివాహం జరిగింది. అప్పటి వరకు బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ పెరిగిన పూలే పెళ్లి తర్వాత అందరి సంక్షేమం కోసం ఇంటి నుంచే కార్యాచరణ మొదలు పెట్టారు.

సమాజంలో మహిళలపై వివక్షకు వ్యతిరేకంగా ఫూలే పని చేశారు. భార్య సావిత్రీబాయికి చదువు చెబుతూ మహిళా విద్య కోసం పోరాటం మొదలు పెట్టారు. ఆమె కూడా సహకరించడంతో పూలే మరింతగా జనాల్లోకి వెళ్లారు. 1848లో అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఓ స్కూల్ ను ఏర్పాటు చేశారు. ఇలాంటిది. దేశంలో ఇదే మొదటిదని కొందరంటారు. ఇక.. అగ్రవర్ణానికి చెందిన స్నేహితుడి ఇంట్లో పెళ్లికి వెళ్లి అవమానానికి గురైన పూలే ఆ సందర్భం నుంచి బలహీన వర్గాల తరఫున పోరాటానికి సిద్ధమయ్యారు. కుల, మతాకు అతీతంగా ప్రజలందరికీ సమాన హక్కులు ఉండాలంటూ గొంతెత్తారు.

ఫూలే పోరాటానికి సమాజంలోని అన్ని వర్గాలనుంచి మెల్లగా మద్దతు పెరిగింది. ఇదే ఉత్సాహంతో 1851లో అమ్మాయిల కోసం పెద్ద స్కూల్ ఏర్పాటు చేశారు. గణితం, చరిత్ర, జాగ్రఫీ బోధిస్తూ ప్రపంచంపై అవగాహన కల్పించారు. ఇలాంటివే మరిన్ని స్కూళ్లు ఏర్పాటు చేసి బాలికల విద్య కోసం వీలైనంతగా కృషి చేశారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడిన ఫూలే వితంతువుల పెళ్లిళ్లకు అండగా నిలిచారు. గర్భవతులుగా ఉన్న వితంతువుల కోసం ప్రత్యేక సేవా కేంద్రాలు ఏర్పాటు చేశారు. భార్య సావిత్రీబాయితో కలిసి అంటరానితనం రూపుమాపేందుకు జనంలో చైతన్యం పెంచారు.

జీవితాన్ని పూర్తిగా బడుగుల పోరాటానికే అంకితం చేసిన ఫూలే దంపతులకు పిల్లలు లేరు. వితంతువుల కోసం ఏర్పాటు చేసిన సేవా కేంద్రం నుంచే ఓ శిశువును దత్తత తీసుకున్నారు. ఆ బాబు డాక్టర్ చదువు పూర్తి చేసి ఫూలే దంపతులు చూపిన మార్గంలోనే సమాజ సేవ చేశారు. ఒంట్లో శక్తి ఉన్నంత వరకు పేదల సంక్షేమానికి పాటుపడిన మహాత్మా ఫూలే 1888 జూలైలో అనారోగ్యంతో మంచాన పడ్డారు. రెండేళ్ల తర్వాత ఆరోగ్యం విషమించడంతో 1890 నవంబర్ 28న కన్నుమూశారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ARTICLE'S

గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించాలి

janamvelugunews

Published

on

రుద్రూర్ జనం వెలుగు న్యూస్ 30 అక్టోబర్ :- రైతులు విధిగా తమ పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేయించాలని తద్వారా పశువులకు వ్యాధి సోకకుండా ఉంటుందని రుద్రూర్ పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ తెలిపారు. గురువారం రుద్రూర్ మండలకేద్రంలోని బొప్పాపూర్ గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ రైతులను ఉదేశించి మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి ప్రమాదకరమైనదని పశువులకు ఒకదాని నుండి ఒకదానికి సంక్రమిస్తుందని అన్నారు. గాలికుంటు వ్యాధి సోకకముందే టీకాలు వేయించి నివారణ చేపట్టాలని గాలికుంటు వ్యాధి సోకిన పశువులను ఇతర పశువుల నుండి దూరంగా ఉంచాలని లేనట్లయితే అన్ని పశువులకు వ్యాధి సోకి తీవ్ర నష్టం కలిగిస్తుందని సూచించారు. ప్రభుత్వం జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో భాగంగా పశువైద్య శాఖ ద్వారా ఉచితంగా గాలికుంటు వ్యాధి టీకాలు వేయించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతాంగం సద్వినియోగం చేసుకుని గాలికుంటు వ్యాధి టీకాలు వేయించి తమ పశువులను వ్యాధి పడకుండా రక్షించుకోవాలని బారిన సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలో 48 పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ పశు వైద్య సిబ్బంది, పాడి రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

ARTICLE'S

మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలి

janamvelugunews

Published

on

జనం వెలుగు న్యూస్ రుద్రూర్ 29- అక్టోబర్ : మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలకు రుద్రూర్ మండలంలో రైతులు ఆరుగాలం పాటు కష్టించి పండించిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. బుధవారం రుద్రూర్ మండల బిజెపి నాయకులు రైతుల కల్లాల వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్బంగా బిజెపి మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని మైచర్ మిషన్ వడ్లలోని తేమ శాతం 25 చూపిస్తే రైస్ మిల్లలోని మైచర్ మిషన్ తేమ శాతం 16 చూపిస్తున్నట్లు ఆరోపించారు అదేవిదంగా కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను రైస్ మిల్లుకు తరలించకపోవడం వలన కొంతమంది రైతుల ధాన్యం బస్తాలు అడుగుభాగం తడిచినట్లు సకాలంలో రైస్ మిల్ కు ధాన్యం తరలించి ఉంటే రైతులకు నష్టం జరిగేది కాదని పేర్కొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ వెంటనే సాంక్షన్ చేయాలని చేయాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లులు అన్నిటికీ అలాట్మెంట్ ఇచ్చి సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలని రుద్రూర్ బీజేపీ మండల కమిటీ తరఫున ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గూడూరి ప్రశాంత్ గౌడ్, నియోజవర్గ సీనియర్ నాయకులు పార్వతీ మురళి, మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి గజేందర్, కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు, ఎర్రోళ్ల గంగాధర్, యువ మోర్చా మండల అధ్యక్షుడు కుమ్మరి గణేష్, శివప్రసాద్, వరప్రసాద్, వినోద్ కుమార్, మాధవ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Continue Reading

ARTICLE'S

వర్ని అంగల్లో తైబజార్ అధిక వాసుళ్లు…

janamvelugunews

Published

on

జనం వెలుగు న్యూస్ : వర్ని మండల కేంద్రంలో ప్రతి మంగళవారం వారం వారపు సంత జరుగుతుంది. అందులోనే మేకల అంగడి కూడా జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుండి మేకలు అమ్మడానికి వ్యాపారులు వస్తారు.

ఇదే అదునుగా వర్ని తైబజార్ నిర్వాహకులు కొన్న వారి దగ్గర నుండి 50 రూపాయలు అమ్మిన వారి దగ్గర నుండి ఒక్కో మేకకు 50 రూపాయలు వసూలు చేస్తున్నారని వ్యాపారులు, కొనుగోలుదారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు కొంతమంది గ్రామ పంచాయతీ సెక్రెటరీ ఫిర్యాదు చేయగా అవును డబ్బులు కట్టాలని నిర్లక్ష్యగా సమాధానం చెబుతున్నాడని తెలిపారు తై బజార్ వ్యాపారులతో మిలాకతయి మార్కెట్లో అక్కడే ఉండి డబ్బులు వసూలు చేస్తున్నారని మేకల కొనుగోలు దారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై సెక్రెటరీకి వివరణ కోరగా అమ్మినవారు 25 రూ. కొన్నవారు 25 రూపాయలు చెల్లించాలని తెలిపారు. తై బజార్ వ్యాపారులు అధిక డబ్బులు వసూలు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కానీ పంచాయతీ సెక్రెటరీ దగ్గరుండి మరీ తైబజార్ వ్యాపారులతో మేకల క్రయ, విక్రయాల పై డబ్బులు వసూలు చేస్తున్నట్లు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.

Continue Reading