Connect with us

నిజామాబాద్

కర్ర గణపతిని దర్శించిన ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ

janamvelugunews

Published

on

కర్ర గణపతిని దర్శించిన ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ

జనంవెలుగు, నిజామాబాద్:- తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం పాలజ్ కర్ర గణపతి ఆలయాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ మంగళవారం భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొని గణపతికి మొక్కులు చెల్లించారు. ఎమ్మెల్యేకు ఆలయ పూజారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మాట్లాడుతూ ఆయన, ఏడు దశాబ్దాలుగా భక్తుల విశ్వాసానికి కేంద్రబిందువుగా నిలుస్తున్న ఈ కర్ర గణపతి ఆలయం భక్తుల కోరికలను తీర్చే పవిత్ర స్థలం అని పేర్కొన్నారు. ఏడు దశాబ్దాల క్రితం విషవ్యాధులు వ్యాపిస్తున్న కాలంలో, నిర్మల్ జిల్లా కొయ్యబొమ్మల కళాకారుడు ఒకే చెక్కతో ఈ గణపతిని తయారు చేసి ప్రతిష్టించగా, అది నేటికీ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందడం గర్వకారణమని ఆయన గుర్తుచేశారు. గణపతిని 11 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజిస్తే ఎటువంటి విషవ్యాధులు దగ్గరపడవని ప్రజల విశ్వాసం అని చెప్పారు. అలాగే నిమజ్జనం చేయకుండా ఊరేగింపుతో గణపతిని ఒక గదిలో భద్రపరిచే ఆనవాయితీ ప్రత్యేకతగా ఉందని తెలిపారు. దేశ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, రైతులకు అనుకూల వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని కర్ర గణపతి ఆశీర్వాదం కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిజామాబాద్

రోడ్డు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం కోసం పీఎం రాహత్ పథకం. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

Thammali Pandu

Published

on

రోడ్డు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం కోసం పీఎం రాహత్ పథకం

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

జనంవెలుగు నిజామాబాద్ :- రోడ్డు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించడంలో పీఎం రాహత్ పథకం కీలకంగా నిలుస్తుందని, దీనిని సద్వినియోగం చేసుకునేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సూచించారు.

పీఎం రాహత్ (ప్రైమ్ మినిస్టర్ రోడ్ ఆక్సిడెంట్ విక్టిమ్స్ హాస్పిటలిజేషన్ అండ్ అస్యూర్డ్ ట్రీట్మెంట్) పథకం అమలుపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కలిసి సీ.ఎస్ సంజయ్ జాజు శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో అత్యవసర వైద్యం అందించడం, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల అనుసంధానం, నిధుల విడుదల ప్రక్రియపై చర్చించారు.

రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే బాధితుడిని ఆసుపత్రిలో చేర్పించడానికి పోలీస్ ఆమోదిత కేసులకు గరిష్టంగా లక్షా 50 వేల రూపాయల వరకు పూర్తి చికిత్స అందించే అవకాశం ఈ పథకం ద్వారా లభిస్తుందని పేర్కొన్నారు.

ప్రమాదం తర్వాత బాదితుల ప్రాణాలు కాపాడేందుకు గోల్డెన్ అవర్ ఎంతో కీలకమని, ఈ సమయంలో వేగంగా స్పందించాలని అన్నారు. ఈ పథకం సమర్థవంతమైన అమలు కోసం జిల్లా కలెక్టర్లు రహదారి భద్రత కమిటీలతో సమన్వయం చేసుకొని, జిల్లా ఇన్ఫర్మాటిక్స్ అధికారులను కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని సూచించారు.

          ప్రమాదాల నివారణకు, బాధితుల వివరాలను పారదర్శకంగా నమోదు చేయడానికి టీఎంఎస్ 2.0 పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు.

జనరల్ ఇన్సూరెన్స్ ద్వారా బాధితుల చికిత్స ఖర్చులను నేరుగా ఆసుపత్రులకు చెల్లించే విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.

ప్రజలలో ఈ పథకంపై అవగాహన కల్పించాలని అన్నారు. ప్రతి జిల్లాలోనూ ఈ పథకం అమలును కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎస్ స్పష్టం చేశారు.

        వీసీ అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు పలు సూచనలు చేశారు. పీఎం రాహత్ పథకాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయాలన్నారు.

రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సేవలు అందించి, వారి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయాలన్నారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే సంబంధిత శాఖలు వెంటనే అప్రమత్తమవ్వాలని అన్నారు.

నగదు, బాదితుల సమాచారం అందుబాటులో లేని కారణంగా వైద్యసేవలు నిరాకరించకూడదన్నారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ఉండి ప్రమాదాల వల్ల కలిగే ప్రాణ నష్టాలను తగ్గించాలని తెలిపారు.

       ఈ వీసీలో అదనపు కలెక్టర్ లు రాజాగౌడ్, భుజంగరావు, జిల్లా రవాణా శాఖ అధికారి రమేష్ రాథోడ్, వైద్యారోగ్య శాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాములు, జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఈ-దార్ జిల్లా మేనేజర్ వర్ష నిహంత్ తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

నిజామాబాద్

వైద్య రంగ నిపుణులకు న్యాయ అవగాహన సదస్సు  జిల్లా జడ్జి జీ వీ ఎన్ భరతలక్ష్మి 

Thammali Pandu

Published

on

వైద్య రంగ నిపుణులకు న్యాయ అవగాహన సదస్సు 

జిల్లా జడ్జి జీ వీ ఎన్ భరతలక్ష్మి 

వైద్యపరమైన రికార్డులను జాగ్రత్తగా భద్రపర్చాలి

అర్ధమయ్యే రీతిలో ప్రిస్క్రిప్షన్ ఉండాలి

జనంవెలుగు నిజామాబాద్ : – వైద్య వృత్తిలో కొనసాగుతున్న వారు వైద్యపరమైన రికార్డులను సక్రమంగా నిర్వహిస్తూ, వాటిని జాగ్రత్తగా భద్రపర్చాలని జిల్లా జడ్జి జీ.వీ.ఎన్.భరతలక్ష్మి సూచించారు.

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రధాన సమావేశ మందిరంలో శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులకు, వైద్య రంగ నిపుణులకు వివిధ అంశాలపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు.

జిల్లా జడ్జి ముఖ్య అతిథిగా విచ్చేయగా, కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు డీ.సీ.పీ శుభం నగ్రాలే తదితరులు పాల్గొన్నారు. వైద్యుల హక్కులు, వైద్య సేవల్లో చట్టపరమైన బాధ్యతలపై జిల్లా జడ్జి, కలెక్టర్, ఇతర వక్తలు ముఖ్య సూచనలు చేశారు.

హెల్త్‌ కేర్ ప్రొఫెషనల్స్ అండ్ క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (ప్రివెన్షన్ ఆఫ్ వయలెన్స్) చట్టం–2025, వైద్య రికార్డుల నిర్వహణ, వాటి చట్టపరమైన ప్రాముఖ్యత, న్యాయపరమైన విచారణల్లో వాటి ప్రామాణికత తదితర అంశాలపై ఈ సదస్సులో అవగాహన కల్పించారు.

వైద్య సేవలందించే సమయంలో చట్టపరమైన నిబంధనలను పాటించడం, వైద్య రికార్డులను సక్రమంగా నిర్వహించడం, వృత్తిపరమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడం ద్వారా వైద్యులు, రోగుల హక్కులను పరిరక్షించడంతో పాటు న్యాయ ప్రక్రియకు సహకారం అందించిన వారు అవుతారని ఈ సందర్భంగా అవగాహన కల్పించారు.

న్యాయవ్యవస్థలో వైద్యులు భాగస్వాములుగా వ్యవహరించాల్సిన ప్రాముఖ్యత గురించి తెలియజేశారు.

    ఈ కార్యక్రమంలో రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్.నారాయణ, నాల్గవ అదనపు జిల్లా న్యాయమూర్తి డి.దుర్గాప్రసాద్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి నీలిమ ముద్దసాని, ట్రైనీ కలెక్టర్ సురేష్, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎన్.సుభాష్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎ.విశాల్, డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, రాష్ట్ర వైద్య మండలి జిల్లా ఇన్‌చార్జి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ దీపక్ రాథోడ్, రాజ్ కుమార్ సుబేదార్, ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

నిజామాబాద్

అమర పోలీసు కుటుంబానికి ప్రభుత్వోద్యోగం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం

janamvelugunews

Published

on

అమర పోలీసు కుటుంబానికి ప్రభుత్వోద్యోగం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం

సిపి సాయి చైతన్య.

జనం వెలుగు ఆర్మూర్:- 2025 సంవత్సరంలో విధి నిర్వాహణలో పోలీసు కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ 1923, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తు జారీ చేసిన నియామక ఉత్తర్వుల పత్రాన్ని ఆ కుటుంబానికి నిజామాబాద్ పోలీసు కమీషనర్ సాయి చైతన్య అందజేశాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమర వీరుల కుటుంబాలను ఆదుకునే చర్యలలో భాగంగా పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రమోద్ కుమార్ కుటుంబ (ప్రణిత) సభ్యులకు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగ నియామక ఉత్తర్వుల పత్రాన్ని అందజేశాడు.

పోలీసు విధి నిర్వాహణలో అమరుడైన ప్రమోద్ కుమార్ చేసిన సేవలను స్మరించుకుంటూ, విధి నిర్వాహణలో ప్రాణాలర్పించిన అమర వీరుల త్యాగాలను ఎప్పటికి మరువదని ఆయన అన్నాడు. అమర వీరులకు టుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వారి సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తొందని ఆయన అన్నాడు. దేశం కోసం, ప్రజల కోసం తమ ప్రాణాలను సహితం లెక్క చేయ కుండా విధులను నిర్వహించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఆయన వివరించాడు.

Continue Reading
Advertisement