ARTICLE'S
45 రోజులు వేడుకలు… 66 కోట్ల పుణ్యస్నానాలు


45 రోజులు వేడుకలు… 66 కోట్ల పుణ్యస్నానాలు
జనంవెలుగు, విశ్లేషణ:- భారత ఆధ్యాత్మిక ప్రగతికి నిదర్శనమైన కుంభమేళకు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి కోట్ల మంది భక్తులు పోటెత్తారు. ప్రయాగ్‌రాజ్‌లోని గంగా, యమునా, సరస్వతి నదుల పవిత్ర త్రివేణి సంగమంలో 45 రోజుల పాటు సాగిన వేడుకలు. ఆద్యంతం ఆధ్యాత్మికత, భక్తిపారవశ్యంతో నిండిపోయాయి. కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించిన ‘మహా కుంభమేళా’ పరిసమాప్తం అయ్యింది. 144 ఏళ్లకోసారి వచ్చే ఈ విశిష్ఠ కుంభమేళా జనవరి 13న ఆరంభమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద జన జాతరగా భావిస్తున్న ఈ మహా స్నానఘట్టం మహా శివరాత్రితో ముగిసిపోయింది. చివరి రోజున అమృత స్నానం ఆచరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. ఉదయం 5.30 గంటల నుంచే స్నాన ఘాట్టాలు భక్తులతో కిక్కిరిసిపోయారు. చివరి రోజున సుమారు 1.5 కోట్లకు పైగా భక్తులు అమృతస్నానం ఆచరించారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. దీంతో, మహా కుంభమేళా స్నానాలు ఆచరించిన మొత్తం భక్తుల సంఖ్య 66 కోట్లు దాటినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
భక్తుల సంఖ్యలో అనుకున్న స్థాయికి మించి పెరుగుదల నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. చైనా, భారత్ మినహా ఇతర అన్ని దేశాల జనాభా కంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు స్నానమాచరించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందిన భక్తులతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు చెందిన వారు కూడా ఈ మహా క్రతువులో పాల్గొన్నారు. ముగింపు సందర్భంగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ‘ఎయిర్‌షో’ నిర్వహించింది. మహా కుంభమేళా క్షేత్ర గగనతలంలో ఈ ప్రత్యేక ఎయిర్‌షో ఆకట్టుకుంది. చివరి రోజున ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. అదనపు బలగాలను మోహరించారు. మహా కుంభమేళా-2025లో ఎంతో మంది సామాన్య వ్యక్తులు సెలబ్రిటీలుగా మారారు. వారిలో ప్రముఖులైన వారిలో మధ్యప్రదేశ్‌కు చెందిన 16 ఏళ్ల మోనాలీసా మొదటి స్థానంలో ఉంటారు. ఈమె పూసలు విక్రయించే ఆవిడ కాగా రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిపోయింది. సోషల్ మీడియాలో ఆమె వీడియోలు ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయంటే ఆమెకు ఎంత క్రేజ్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. కుంభమేళా ప్రాంగణంలో జనాలంతా ఆమెతో ఫోటోలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. అదృష్టం కొద్దీ మోనాలీసాను సినిమా ఛాన్స్ వరించింది. ఆ తర్వాత. ‘ఐఐటీ బాబా’ గుర్తింపు తెచ్చుకున్న అభయ్ సింగ్ అనే బాబా కూడా ఫేమస్ అయ్యాడు. ఆయన ఐఐటీ బాంబే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివారు. ఆ తర్వాత బాబాగా మారిపోయారు. అందుకే, ఆయనకు ఐఐటీ బాబా అని పిలిచారు.
మహా కుంభమేళాలో అమృత స్నానమైన ‘మౌని అమావాస్య’ సందర్భంగా జనవరి 29న ఘోర విషాదం చోటుచేసుకొంది. ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయండా రాత్రి సమయంలో భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. రద్దీ నియంత్రణలో వైఫల్యం కారణంగా తొక్కిసలాట జరిగి ఏకంగా 30 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. రాత్రి 1.30గంటల సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని నింపినప్పటికీ ప్రయాగ్‌రాజ్‌కు భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. మరోవైపు, మహా కుంభమేళాకు తరలి వెళ్లే భక్తుల రద్దీ కారణంగా ఢిల్లీ రైల్వే స్టేషన్లో కూడా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏకంగా 18 మంది చనిపోయారు.మహా కుంభమేళాలో మొత్తం మూడు సార్లు అగ్నిప్రమాదాలు సంభవించాయి.
కుంభమేళా-2025లో పేద వర్గాల నుంచి రాజకీయ, సినీ, వ్యాపార, ఇతర రంగాలకు చెందిన ఎంతోమంది ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కట్టుదిట్టమైన భద్రత నడుమ మహా కుంభమేళా స్నానం ఆచరించారు. క్షణం తీరిక లేకుండా గడిపే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 5న ప్రయాగ్‌రాజ్ వెళ్లి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు. కోట్లాది మంది భక్తుల మాదిరిగానే తాను కూడా దైవాశ్వీరాదం పొందానని మోదీ వ్యాఖ్యానించారు. ప్రపంచ కుభేరుల్లో ఒకరైన రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ, తన కుటుంబ సభ్యులతో కలిసి మహా కుంభమేళాలో స్నానమాచరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలి రాష్ట్రాల సీఎంలు, బీజేపీతో పాటు ఇతర రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో మహా కుంభమేళాలో పాల్గొన్నారు.
ARTICLE'S
గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించాలి


రుద్రూర్ జనం వెలుగు న్యూస్ 30 అక్టోబర్ :- రైతులు విధిగా తమ పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేయించాలని తద్వారా పశువులకు వ్యాధి సోకకుండా ఉంటుందని రుద్రూర్ పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ తెలిపారు. గురువారం రుద్రూర్ మండలకేద్రంలోని బొప్పాపూర్ గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ రైతులను ఉదేశించి మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి ప్రమాదకరమైనదని పశువులకు ఒకదాని నుండి ఒకదానికి సంక్రమిస్తుందని అన్నారు. గాలికుంటు వ్యాధి సోకకముందే టీకాలు వేయించి నివారణ చేపట్టాలని గాలికుంటు వ్యాధి సోకిన పశువులను ఇతర పశువుల నుండి దూరంగా ఉంచాలని లేనట్లయితే అన్ని పశువులకు వ్యాధి సోకి తీవ్ర నష్టం కలిగిస్తుందని సూచించారు. ప్రభుత్వం జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో భాగంగా పశువైద్య శాఖ ద్వారా ఉచితంగా గాలికుంటు వ్యాధి టీకాలు వేయించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతాంగం సద్వినియోగం చేసుకుని గాలికుంటు వ్యాధి టీకాలు వేయించి తమ పశువులను వ్యాధి పడకుండా రక్షించుకోవాలని బారిన సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలో 48 పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ పశు వైద్య సిబ్బంది, పాడి రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ARTICLE'S
మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలి


జనం వెలుగు న్యూస్ రుద్రూర్ 29- అక్టోబర్ : మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలకు రుద్రూర్ మండలంలో రైతులు ఆరుగాలం పాటు కష్టించి పండించిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. బుధవారం రుద్రూర్ మండల బిజెపి నాయకులు రైతుల కల్లాల వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్బంగా బిజెపి మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని మైచర్ మిషన్ వడ్లలోని తేమ శాతం 25 చూపిస్తే రైస్ మిల్లలోని మైచర్ మిషన్ తేమ శాతం 16 చూపిస్తున్నట్లు ఆరోపించారు అదేవిదంగా కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను రైస్ మిల్లుకు తరలించకపోవడం వలన కొంతమంది రైతుల ధాన్యం బస్తాలు అడుగుభాగం తడిచినట్లు సకాలంలో రైస్ మిల్ కు ధాన్యం తరలించి ఉంటే రైతులకు నష్టం జరిగేది కాదని పేర్కొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ వెంటనే సాంక్షన్ చేయాలని చేయాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లులు అన్నిటికీ అలాట్మెంట్ ఇచ్చి సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలని రుద్రూర్ బీజేపీ మండల కమిటీ తరఫున ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గూడూరి ప్రశాంత్ గౌడ్, నియోజవర్గ సీనియర్ నాయకులు పార్వతీ మురళి, మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి గజేందర్, కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు, ఎర్రోళ్ల గంగాధర్, యువ మోర్చా మండల అధ్యక్షుడు కుమ్మరి గణేష్, శివప్రసాద్, వరప్రసాద్, వినోద్ కుమార్, మాధవ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ARTICLE'S
వర్ని అంగల్లో తైబజార్ అధిక వాసుళ్లు…


జనం వెలుగు న్యూస్ : వర్ని మండల కేంద్రంలో ప్రతి మంగళవారం వారం వారపు సంత జరుగుతుంది. అందులోనే మేకల అంగడి కూడా జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుండి మేకలు అమ్మడానికి వ్యాపారులు వస్తారు.










