Connect with us

ARTICLE'S

సరైన అవగాహనతో ఓట్లు వేస్తే సమర్థులు గెలిచే అవకాశం

janamvelugunews

Published

on

-శాసనమండలి అభ్యర్థులకు ఓటు వేసే విధానాన్ని పరిశీలిద్దాం
-గతంలో వేల ఓట్లు చెల్లకుండా పోయిన నేపథ్యం బాధాకరం.
-సరైన అవగాహనతో ఓట్లు వేస్తే సమర్థులు గెలిచే అవకాశం ఉంటుంది.
-చెల్లకుండా పోతే ఫలితాలు తారుమారు కావచ్చు

జనంవెలుగు, వెబ్డెస్క్:- ఫిబ్రవరి 27, 2025 వ తేదీన కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి, నల్లగొండ వరంగల్ ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటు వేసే విధానాన్ని అవగాహన చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన పలు ఎన్నికలలో ఎమ్మెల్సీ కౌంటింగ్ సందర్భంగా పట్టభద్రులు ఉపాధ్యాయ ఓట్లు వేల సంఖ్యలో చెల్లకుండా పోయినటువంటి పరిస్థితి మనకు తెలుసు. అప్పుడు విద్యావంతులకే ఓటు వేయడం రాకపోతే ఎలా?అనే సందేహం సర్వత్రా వినిపించింది అంతే కాదు సమర్ధులను ఎన్నుకోవాలన్నా, ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్న నమోదు చేసుకున్న ప్రతి సభ్యుడు ఓటు వేయడంతో పాటు తప్పులు జరగకుండా చూసుకుంటే చె ల్లని ఓట్ల శాతాన్ని సాధ్యనంతవరకు తగ్గించవచ్చు. తద్వారా ఫలితాలను సరిగా అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు అవగాహన రాహి త్యంతో ఓట్లేస్తే అంతకుమించినటువంటి అప్రతిష్ట మరొకటి ఉండదు. ఓటు వేసే విధానం కానీ ఓట్ల లెక్కింపు విధానం కానీ శాసనసభకు ఇతర సాధారణ ఎన్నికలతో పోల్చుకున్నప్పుడు భిన్నంగా ఉంటుంది అందుకోసమే దీని గూర్చి ప్రత్యేకంగా చర్చించుకోవడం పోలింగ్ రోజున తప్పులు జరగకుండా చూసుకోవడానికి ఉపయోగపడుతుందని ఆశిద్దాం.
ఎన్నికల సంఘం సూచించిన కొన్ని నిబంధనలు:- ఎన్నికలలో పార్టీల గుర్తులు, ఎలక్ట్రానిక్ మిషన్లు ఉండవు బ్యాలెట్ పేపర్లతో మాత్రమే ఎన్నిక జరుగుతుంది బ్యాలెట్ పేపర్ లో కూడా 1 క్రమ సంఖ్య2 అభ్యర్థి పేరు 3ఫోటో 4 చివరి కాలంలో ప్రాధాన్యత ఓటు సంఖ్య వేయవలసి ఉంటుంది.
-బ్యాలెట్ పేపర్లో ఉన్న అభ్యర్థులందరిలో సమర్ధులైన వారు అని నచ్చిన అభ్యర్థికి 1 నెంబర్ వేయాలి ఆ క్రమంలో పోటీలో ఉన్న అందరికీ కూడా వేయవచ్చు కానీ వేసిన నంబర్ మళ్లీ వేయడానికి వీలు లేదు వరుసక్రమం తప్పినా కూడా ఓటు చెల్లదు.
— 1నెంబర్ వేయకుండా 2,3,4 వేస్తే ఆ ఓటు చెల్లదు. ఆంగ్ల సంఖ్యలు మాత్రమే వేయాలి కానీ రోమన్ అంకెలు వేయరాదు వేస్తే ఆ ఓటు చెల్లదు .
— టిక్ పెట్టడం, one, two, three అని ఆంగ్లంలో కానీ ఒకటి, రెండు, మూడు అని తెలుగులో కానీ రాసినా కూడా ఓటు చెల్లదు.
—వేద్దామనుకున్నా ఓట్లు ఉదాహరణకు 10 మందికి అయినప్పుడు మధ్యలో ఏ ఒక్కటి మిస్ అయినా ఆ ఓటు చెల్లదు.1,2,3,5,6,7,8,9,10 రాసినాము. ఇక్కడ మిస్ అయింది 4సంఖ్య కనుక చెల్లదు.
— ఒకే అభ్యర్థికి రెండు నెంబర్లు వేసిన ఆ ఓటు చెల్లదు.
— ఒక అభ్యర్థికి వేసిన నెంబర్ మరొక అభ్యర్థికికూడా అదే వేసిన ఆ ఓటు చెల్లదు.
— బ్యాలెట్ పేపర్ మీద ఎక్కడ సంతకం పెట్టిన వేరే ఏదైనా రాసిన ఆ ఓటు చెల్లదు.
పోలింగ్ కేంద్రంలో ఎన్నికల అధికారులు ఇచ్చిన పెను మాత్రమే వాడాలి సొంత పెన్నుతో నంబర్ వేస్తే కూడా ఆ ఓటు చెల్లదు .
—నచ్చినవారికి 1 నంబరు వేసిన తర్వాత ఇష్టముంటే మిగతా వాళ్లకు కూడా నంబర్లు వేసి ప్రాధాన్యత కేటాయించవచ్చు లేదా వేయకుండా వదిలిపెట్టిన అభ్యంతరం లేదు.
సాధారణంగా ఓట్ల సందర్భంలో ఎన్నికల సంఘం సూచించే గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి తప్పకుండా తీసుకు వెళ్ళవలసి ఉంటుంది. వీలున్నంతవరకు మొదటి ప్రాధాన్యతతో పాటు ఎక్కువ మందికి కూడా ప్రాధాన్యత ఇచ్చి ఓటు వేయవచ్చు. ఈ పద్ధతిలో మొదటి ప్రాధాన్యత ఇచ్చిన అభ్యర్థికి ఎలాంటి నష్టం ఉండదు. సాధారణ ఎన్నికల్లో ఒకే వ్యక్తికి ఓటు వేసే అవకాశం ఉంటుంది కానీ శాసనమండలి అభ్యర్థుల ఎన్నికల్లో మాత్రం ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు సమర్థులు అని అనిపించినప్పుడు ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయడానికి అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే పెద్దగా నష్టం లేదు. 1 ప్రాధాన్యత ఓటు మాత్రమే అత్యంత కీలకమైన దశలో పోలింగ్ కేంద్రంలోకి వెళ్లే ముందే నమూనా బ్యాలెట్ పేపర్ ఆధారంగా నిర్ణయించుకొని ఉండడం వలన సులభం అవుతుంది. ఆ తర్వాత ఇష్టముంటే మిగతా అభ్యర్థులకు వేయవచ్చు లేకపోయినా అభ్యంతరం లేదు అది పూర్తిగా చెల్లుబాటు అవుతుంది చట్టబద్ధంగా లెక్కించబడుతుంది. ఈ సూచనలను పట్టబద్రులు ఉపాధ్యాయ ఓటర్లు జాగ్రత్తగా పాటించడం ద్వారా పెద్దల సభకు ఎన్నుకునే అత్యంత ప్రాధాన్యత కలిగిన సమర్థులైన అభ్యర్థులను పంపడం మనందరి బాధ్యత. తద్వారా విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు ప్రభుత్వ రంగంలో ఉచిత నాన్యమైన విద్య, నిరుద్యోగ నిర్మూలన, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల సమస్యల పరిష్కారం, విద్యకు హెచ్చు బడ్జెట్, ప్రైవేటు ఫీజుల జులుమును పూర్తిగా నిర్మూలించడం వంటి అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయి.


(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ARTICLE'S

గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించాలి

janamvelugunews

Published

on

రుద్రూర్ జనం వెలుగు న్యూస్ 30 అక్టోబర్ :- రైతులు విధిగా తమ పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేయించాలని తద్వారా పశువులకు వ్యాధి సోకకుండా ఉంటుందని రుద్రూర్ పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ తెలిపారు. గురువారం రుద్రూర్ మండలకేద్రంలోని బొప్పాపూర్ గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ రైతులను ఉదేశించి మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి ప్రమాదకరమైనదని పశువులకు ఒకదాని నుండి ఒకదానికి సంక్రమిస్తుందని అన్నారు. గాలికుంటు వ్యాధి సోకకముందే టీకాలు వేయించి నివారణ చేపట్టాలని గాలికుంటు వ్యాధి సోకిన పశువులను ఇతర పశువుల నుండి దూరంగా ఉంచాలని లేనట్లయితే అన్ని పశువులకు వ్యాధి సోకి తీవ్ర నష్టం కలిగిస్తుందని సూచించారు. ప్రభుత్వం జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో భాగంగా పశువైద్య శాఖ ద్వారా ఉచితంగా గాలికుంటు వ్యాధి టీకాలు వేయించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతాంగం సద్వినియోగం చేసుకుని గాలికుంటు వ్యాధి టీకాలు వేయించి తమ పశువులను వ్యాధి పడకుండా రక్షించుకోవాలని బారిన సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలో 48 పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ పశు వైద్య సిబ్బంది, పాడి రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

ARTICLE'S

మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలి

janamvelugunews

Published

on

జనం వెలుగు న్యూస్ రుద్రూర్ 29- అక్టోబర్ : మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలకు రుద్రూర్ మండలంలో రైతులు ఆరుగాలం పాటు కష్టించి పండించిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. బుధవారం రుద్రూర్ మండల బిజెపి నాయకులు రైతుల కల్లాల వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్బంగా బిజెపి మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని మైచర్ మిషన్ వడ్లలోని తేమ శాతం 25 చూపిస్తే రైస్ మిల్లలోని మైచర్ మిషన్ తేమ శాతం 16 చూపిస్తున్నట్లు ఆరోపించారు అదేవిదంగా కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను రైస్ మిల్లుకు తరలించకపోవడం వలన కొంతమంది రైతుల ధాన్యం బస్తాలు అడుగుభాగం తడిచినట్లు సకాలంలో రైస్ మిల్ కు ధాన్యం తరలించి ఉంటే రైతులకు నష్టం జరిగేది కాదని పేర్కొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ వెంటనే సాంక్షన్ చేయాలని చేయాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లులు అన్నిటికీ అలాట్మెంట్ ఇచ్చి సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలని రుద్రూర్ బీజేపీ మండల కమిటీ తరఫున ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గూడూరి ప్రశాంత్ గౌడ్, నియోజవర్గ సీనియర్ నాయకులు పార్వతీ మురళి, మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి గజేందర్, కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు, ఎర్రోళ్ల గంగాధర్, యువ మోర్చా మండల అధ్యక్షుడు కుమ్మరి గణేష్, శివప్రసాద్, వరప్రసాద్, వినోద్ కుమార్, మాధవ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Continue Reading

ARTICLE'S

వర్ని అంగల్లో తైబజార్ అధిక వాసుళ్లు…

janamvelugunews

Published

on

జనం వెలుగు న్యూస్ : వర్ని మండల కేంద్రంలో ప్రతి మంగళవారం వారం వారపు సంత జరుగుతుంది. అందులోనే మేకల అంగడి కూడా జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుండి మేకలు అమ్మడానికి వ్యాపారులు వస్తారు.

ఇదే అదునుగా వర్ని తైబజార్ నిర్వాహకులు కొన్న వారి దగ్గర నుండి 50 రూపాయలు అమ్మిన వారి దగ్గర నుండి ఒక్కో మేకకు 50 రూపాయలు వసూలు చేస్తున్నారని వ్యాపారులు, కొనుగోలుదారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు కొంతమంది గ్రామ పంచాయతీ సెక్రెటరీ ఫిర్యాదు చేయగా అవును డబ్బులు కట్టాలని నిర్లక్ష్యగా సమాధానం చెబుతున్నాడని తెలిపారు తై బజార్ వ్యాపారులతో మిలాకతయి మార్కెట్లో అక్కడే ఉండి డబ్బులు వసూలు చేస్తున్నారని మేకల కొనుగోలు దారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై సెక్రెటరీకి వివరణ కోరగా అమ్మినవారు 25 రూ. కొన్నవారు 25 రూపాయలు చెల్లించాలని తెలిపారు. తై బజార్ వ్యాపారులు అధిక డబ్బులు వసూలు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కానీ పంచాయతీ సెక్రెటరీ దగ్గరుండి మరీ తైబజార్ వ్యాపారులతో మేకల క్రయ, విక్రయాల పై డబ్బులు వసూలు చేస్తున్నట్లు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.

Continue Reading