Connect with us

నిజామాబాద్

| Nandipet అడుగడుగునా హర హర మహాదేవ నినాదాలు

janamvelugunews

Published

on

అడుగడుగునా హర హర మహాదేవ నినాదాలు

జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండలంలోని గ్రామ గ్రామాన మహాశివరాత్రిని పురస్కరించుకొని శైవ క్షేత్రాలన్నీ శివనామ స్మరణతో మారుమ్రోగాయి. మండల కేంద్రంలోని అతి పురాతనమైన నందికేశ్వర, నవరత్నాల, సాంబయ్య ఆలయాలలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. శనివారం ఉపవాస దీక్ష చేపట్టిన భక్తులు ఆదివారం అన్నదానాల వద్ద దీక్ష విరమించారు.

అలాగే ఉమ్మెడ గ్రామ శివారు గోదావరి నది ఒడ్డున గల అతి పురాతనమైన స్వయంభు ఉమామహేశ్వర ఆలయంలో కూడ ఉమ్మెడ విడిసి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా మహాశివరాత్రి వేడుకలను జరిపారు. నందిపేట మండల కేంద్రంలో నవసిద్ధుల పల్గుట్ట కేదారేశ్వర ఆశ్రమంలో శివరాత్రి వేడుకలు అంబరాన్నంటాయి. ఆశ్రమ వ్యవస్థాపకులు మంగి రాములు మహారాజ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఒక కొత్తదనంతో భక్తులను ఆధ్యాత్మిక మార్గంలో నడిపేందుకు ఆలయ కమిటీ వారు ఎంతగానో కృషి చేస్తారు. గతేడాది ఐదు లక్షల రుద్రాక్షలను భక్తులకు పంపిణీ చేయగా ఈ సంవత్సరం మధ్యప్రదేశ్ ఓంకారేశ్వర క్షేత్ర నర్మదా నది నుండి 56వేల భాన లింగాలను తెచ్చి భక్తులకు పంపిణీ చేస్తున్నామన్నారు.

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాలన్నదే మా చివరి సంకల్పమని, ప్రతి ఒక్క వ్యక్తి తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు సేవ చేయాలని, ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ క్రమశిక్షణతో మెలిగిన నాడే ఆ ఈశ్వరుని కృప సిద్ధిస్తుందని తెలిపారు.

అలాగే మండల కేంద్రంలోని నంది గుడి, నవరత్నాల, సాంబయ్య ఆలయాల కమిటీ సభ్యులు మాట్లాడుతూ నంది గుడి క్షేత్రంలోని నందికేశ్వర విగ్రహం ఏకశిలా విగ్రహం అని గతంలో ఈ విగ్రహం ఎంతో చిన్నగా ఉండేదని ఆనంది కేశ్వర అనుగ్రహంతో దినదినం ఆలయం అభివృద్ధి చెందుతుందని, ఆలయంతో పాటు గ్రామం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందని, నంది పెరగడం వల్ల ఆలయాన్ని రెండుసార్లు నూతనంగా నిర్మించడం జరిగిందని, ఆ బసవయ్య పేరుతోనే మా నందిపేట గ్రామం గా పిలుచుకోవడం జరుగుతుందని, ప్రతి సంవత్సరం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు చేస్తామని ఆలయ కమిటీ అధ్యక్షులు పెద కాపు సుమన్ తెలిపారు.

నిజామాబాద్

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణి చేసిన ఎంఎల్ఏ.

janamvelugunews

Published

on

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణి చేసిన ఎంఎల్ఏ.

జనం వెలుగు ఆర్మూర్:- ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మా క్లూర్,నందిపేట మండలాలలోని వివిధ గ్రామాలకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను శుక్రవారం ఆర్మూర్ ఎంఎల్ఏ పైడి రాకేష్ రెడ్డి పంపిణి చేశాడు. ఈ సందర్భంగా ఎంఎల్ఏ రాకేష్ రెడ్డి మాట్లాడాడు. మండల కేంద్రమైన నందిపేటలో అక్రమంగా మొరంను తరలిస్తున్న మొరం బండ్లను పోలీసులు చూసి చూడనట్లు స్పెషల్ పోలీస్ దాడి చేసి మొరం బండ్లను పట్టుకోవడం జరిగిందని, అక్రమ వ్యాపారం చేసే వారు ఎం తటి వారినైనా సరే సహించేది లేదని ఆయన అన్నాడు. ప్రభుత్వ అనుమతులను పొందిన వారే గోదావరి నుండి నల్ల మట్టి తరలించాలని, నల్ల మట్టి వాసనలు ఓవర్ స్పీడుతో వెల్లకుండా జాగ్రత్తలు పాటించాలని ఆయన తెలిపాడు. ఈ కార్యక్రమంలో నందిపేట మండల బిజెపి అధ్యక్షుడు పటేల్ రాజు, కంఠం సర్పంచు సాయి, మాజి ఎంపిటి సి సభ్యుడు పేయింటర్ రాజు, లక్కంపల్లి చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

నిజామాబాద్

హీమోఫీలియా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ

janamvelugunews

Published

on

హీమోఫీలియా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ

జనంవెలుగు, నిజామాబాద్: ప్రపంచ హీమోఫీలియా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, నిజామాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా. కృష్ణ మోహన్ నాయకత్వం వహించగా, డిప్యూటీ సూపరింటెండెంట్ డా. రాములు, వైస్ ప్రిన్సిపాల్స్ డా. తిరుపతి రావు, డా. కిషోర్ కుమార్, హీమోఫీలియా నోడల్ ఆఫీసర్ డా. పవన్ పాల్గొన్నారు. ఈ ర్యాలీలో మెడికల్ విద్యార్థులు, నర్సింగ్ సిబ్బంది, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ప్రభుత్వ మెడికల్ కాలేజీ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వరకు కొనసాగింది. ర్యాలీ సందర్భంగా ప్రజలకు హీమోఫీలియా వ్యాధి గురించి అవగాహన కల్పిస్తూ, ముందస్తు గుర్తింపు, సరైన నిర్ధారణ, తగిన చికిత్స ద్వారా ఈ వ్యాధిని నియంత్రించవచ్చని వైద్యులు వివరించారు.

ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ హీమోఫీలియా బాధితులు సమయానికి వైద్య సేవలు పొందడం అత్యంత ముఖ్యమని, సమాజంలో అవగాహన పెంపొందించడం ద్వారా తీవ్రమైన సమస్యలను నివారించవచ్చని పేర్కొన్నారు.

Continue Reading

నిజామాబాద్

అసాంఘిక సంఘట నలకు వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్ నిరసన.

janamvelugunews

Published

on

అసాంఘిక సంఘట నలకు వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్ నిరసన.

విశ్వ హిందు పరిషత్ బజరంగ్ దళ్ జిల్లా కార్యదర్శి దయానంద్.

జనం వెలుగు ఆర్మూర్: అసాంఘిక కార్యకలాపాలకు వ్యతిరేకంగా విశ్వ హిందు పరిషత్, బజరంగ్ దళ్ లు పోరాటాలు చేస్తొందని విశ్వ హిందు పరిషత్ బజరంగ్ దళ్ జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్ అన్నాడు. ఆర్మూర్ పట్టణంలో శుక్రవారం విశ్వ హిందు పరిషత్ బజరంగ్ దళ్ లు ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించాడు.దేశ సామరస్యానికి భంగం కలిగించే వారికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరుస్తున్నామని ఆయన తెలిపాడు. ముస్లిం జనాభా అధికంగా గల ప్రాంతాల లో నివసించే హిందు కుటుంబాలను వేధిస్తున్నారని ఆయన ఆవేద న వ్యక్తం చేశాడు.

మహారాష్ట్రలోని నాసిక్ టిసిఎస్ లో వెలుగు చూసిన లవ్ జిహాద్ దేశ వ్యాప్తంగా సంచలనాన్ని రేకెత్తించిందని, లవ్ జిహాదీ కుట్రలు దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయని, అటవీ, రైల్వే, సైనిక తథితర ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమణలు చేస్తున్నవారిని దోషులుగా ప్రభుత్వానికి అప్పగిస్తామని ఆయన తెలిపాడు. ఈ కార్యక్రమంలో జిల్లా విశేష సంపర్క్ ప్రముఖ్ అల్జాపూర్ అక్షయ్, నగర కార్యదర్శి కొంగి రవి, జిల్లా ప్రచార ప్రముఖ్ బోచకర్ నిఖిల్, నగర ఉపాధ్యక్షుడు గంజాల ప్రేమ్, సహాయ కార్యదర్శి బోబిడే కరణ్, సురక్షా ప్రముఖ్ ప్రవీణ్, సహాయ సంయోజక్ అభిలాష్, సేవ ప్రముఖ్ శ్రీకాంత్, సప్తాహిక్ మిలన్ అరవింద్, సత్సంగ్ ప్రముఖ్ సచిన్, సలోపాసనా ప్రముఖ్ సాయి తదితరులు పాల్గొన్నారు.

Continue Reading