Connect with us

నిజామాబాద్

అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు

janamvelugunews

Published

on

అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు

 తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి

జనంవెలుగు, నిజామాబాద్, ఏప్రిల్ 22: అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు జారీ అయ్యేలా తెలంగాణ మీడియా అకాడమీ చిత్తశుద్ధితో కృషి చేస్తోందని అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఎవరికీ అన్యాయం జరుగకుండా చూస్తామని భరోసా కల్పించారు.

      నిజామాబాద్ నగర ప్రెస్ క్లబ్ జర్నలిస్టులకు వెల్ నెస్ ఆసుపత్రి ఆధ్వర్యంలో బుధవారం ఉచిత ఫ్యామిలీ హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. న్యూ అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి, జర్నలిస్టులకు లాంఛనంగా కార్డులు అందజేశారు.

   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర అక్రిడిటేషన్ కమిటీ నాలుగవ విడత సమావేశం గురువారం జరగనుందని తెలిపారు. జర్నలిస్టు సంఘాలు, పాత్రికేయుల అభ్యర్థనల మేరకు అక్రిడిటేషన్ల జారీ కోసం ఉద్దేశించిన 252 జీఓలో అవసరమైన సవరణలు ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామని అన్నారు. అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియలో ఎవరూ ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, అర్హులైన వారందరికీ తప్పనిసరిగా అక్రిడిటేషన్లు జారీ అవుతాయని అన్నారు. స్పోర్ట్స్ జర్నలిస్ట్ లు, కార్టూనిస్టులు, ఫిలిం, కల్చరల్ జర్నలిస్టులకు కూడా కార్డులు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జర్నలిస్టులందరికీ పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా మీడియా అకాడమీ చర్యలు తీసుకుందని అన్నారు. సర్క్యులేషన్ ప్రాతిపదికన కార్డులను రాష్ట్ర, జిల్లా స్థాయిలో జారీ చేస్తారని చెప్పారు. కేబుల్ ఛానల్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు జారీ చేసే విధి విధానాల కోసం సబ్ కమిటీ వేశామని, కమిటీ నివేదిక మేరకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. జర్నలిజంతో సంబంధం లేని వారికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రిడిటేషన్లు జారీ కాకుండా చూడాలన్నారు. దేశంలోనే మరెక్కడా లేనివిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక సంఖ్యలో అక్రిడిటేషన్ కార్డులు ఉన్నాయని, ఇదివరకటి తరహాలోనే ఈసారి కూడా కార్డులు జారీ చేయబడతాయని అన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ విషయమై రెండు మూడు రోజుల్లోనే రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రితో భేటీ ఉందని, ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని నమ్మకం ఉందన్నారు. కాగా, జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ముందుకు వచ్చి హెల్త్ కార్డులు అందించిన వెల్ నెస్ ఆసుపత్రి యాజమాన్యాన్ని చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అభినందించారు.

      ఈ కార్యక్రమంలో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ రాష్ట్ర కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ కవితా రెడ్డి, డీపీఆర్ఓ పద్మశ్రీ, వెల్ నెస్ ఆసుపత్రి యాజమాన్య ప్రతినిధులు అసద్ ఖాన్, ముబీన్ పటేల్, భార్గవ్, ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీకాంత్, సుభాష్, కార్యవర్గ సభ్యులు, జర్నలిస్టు సంఘాల నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Crime

| nandipet అక్రమ నల్లమట్టి టిప్పర్లను పట్టుకున్న ఎమ్మార్వో

janamvelugunews

Published

on

అక్రమ నల్లమట్టి టిప్పర్లను పట్టుకున్న ఎమ్మార్వో

నందిపేట్ ఏప్రిల్ 21 జనం వెలుగు; నిజామాబాద్ జిల్లా నందిపేట, డొంకేశ్వర్ మండలాలు, అటు గోదావరి అవతల లోస్రా మండల లో ఎండాకాలం వచ్చిందంటే చాలు ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ తగ్గగానే రైతుల పేరిట నల్ల మట్టి దందా యదేచ్చగా ప్రతి సంవత్సరం సాగుతూనే ఉంటుంది.

ఈ నల్ల మట్టి తరలింపు దూర ప్రాంతాలైన ఇతర జిల్లాల దాకా తరలించి బడాబడా వ్యాపారులు ఎటువంటి ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా కాసులు సంపాదిస్తున్నారు. పది చక్రాల టరాసులతో అధిక లోడు వేసుకొని, విపరీతమైన వేగంతో నడుపుతూ మండల కేంద్ర మెయిన్ రోడ్డు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

గత సంవత్సరం కొండూరు రోడ్డులో ప్రయానిస్తున్న కొత్తూరు వ్యక్తికి అధిక వేగంతో టిప్పర్ ఢీకొని తీవ్ర గాయాలయ్యాయి, అలాగే ఓవర్ లోడ్ తో వెళ్తున్న వాహనాల నుంచి పడ్డ నల్ల మట్టి వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని, వెంటనే ఈ నల్ల మట్టి అక్రమ దందాకు అడ్డుకట్టు వేయాలని, ఎస్సారెస్పీ అనుమతులు లేని వాహనాలపై కేసులు నమోదు చేయాలని, ప్రజలు కోరుకుంటున్నారు.

ఈ సందర్భంగా తాసిల్దార్ సంతోష్ రెడ్డిని వివరణ కోరగా ఈరోజు ఉమ్మెడ వైపు నుండి ఎటువంటి అనుమతులు లేకుండా నల్ల మట్టి తరలించే 11 వాహనాలను పట్టుకోవడం జరిగిందని, వారికి ఎటువంటి అనుమతులు లేవని, వారిపై ఒక్కొక్క వాహనానికి పదివేల రూపాయల జరిమానా విధించడం జరిగిందని, ఎస్సారెస్పీ అనుమతులు తప్పనిసరి అని, అనుమతులే కాకుండా ఓవర్ లోడ్, అధిక వేగంతో నడిపిన కానీ కేసులు చేస్తామని హెచ్చరించారు.

Continue Reading

నిజామాబాద్

నందిపేట్ లో ప్రభుత్వ పూర్వ ప్రాథమిక విద్య స్కూల్ ప్రారంభం

janamvelugunews

Published

on

నందిపేట్ లో ప్రభుత్వ పూర్వ ప్రాథమిక విద్య స్కూల్ ప్రారంభం

నందిపేట్ ఏప్రిల్ 21 జనం వెలుగు:  మండల కేంద్రం ప్రాథమిక పాఠశాల తెలుగు మీడియం లో మంగళవారం పూర్వ ప్రాథమిక విద్య ప్లే స్కూల్ ను స్థానిక సర్పంచ్ ఎర్రం సిలిండర్ లింగం ప్రారంభించారు‌. ఈ సందర్భంగా సిలిండర్ లింగం మాట్లాడుతూ…..

నందిపేట మండల కేంద్ర ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక విద్య ప్లే స్కూల్ ను ఈరోజు నుండి సంపూర్ణంగా ప్రారంభించడం జరిగిందని. ప్రతి ఒక్క విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాల్సిందేనని

ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు కలరని అందుకే ప్రభుత్వ పాఠశాలల ఆజరుశాతాన్ని పెంచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సదుపాయాలను కలిగిస్తుందని గుర్తు చేశారు. విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లలో చదువుకునేందుకు మొగ్గు చూపుతున్నారంటే దానికి కారణం అక్కడ మంచి

మంచి సదుపాయాలు ఉండడమేనని, అందుకే ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేటు పాఠశాలలను ఢీకొనే విధంగా ఏ ఒక్క విషయంలో కూడా వెనకడుగు వేయకుండా అన్ని సదుపాయాలను కల్పిస్తుందని తెలిపారు.

ఈ ప్లే స్కూల్లో కూడా చిన్న పిల్లలకు రెండు మూడు లక్షల రూపాయలను ఖర్చుపెట్టి మరి మంచి మంచి ఆట వస్తువులను, స్కూల్ డ్రెస్,టై బెల్ట్, షూలు, చదువుకు సంబంధించిన కొత్త కొత్త పరికరాలు, చిన్నపిల్లలను ఆకర్షించేందుకు కార్టూన్ పెయింటింగ్ లను వేయించడం జరిగింది అన్నారు. తల్లిదండ్రులు ఈ యొక్క సదుపాయాలను ఉపయోగించుకొని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఎంఈఓ అవధూత గంగాధర్ మాట్లాడుతూ… నందిపేట మండలానికి రెండు ప్రీ ప్రైమరీ పాఠశాలలు మంజూరు అయినాయని, ఒకటి ఐలాపూర్ కాగా రెండవది నందిపేట మండల కేంద్రా ఈ పాఠశాలదని, ఈ పాఠశాల కొరకు ఒక టీచర్ను ఒక ఆయాను నియమించడం జరిగిందని,

పిల్లల ఆట, చదువుకునే వస్తువుల కొరకు రెండు లక్షల రూపాయలను, మంచి పెయింటింగ్ కొరకు లక్ష రూపాయలను, స్కూల్ డ్రెస్ లాంటి విద్యార్థుల సౌకర్యార్థం 50 వేల రూపాయలను మొత్తంగా 3,50,000 దాకా మంజూరు చేయడం జరిగిందని, తెలిపారు.

ఈ పాఠశాల ప్రైమరీ పాఠశాల ఆధ్వర్యంలో నడుస్తుందని ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ మూడు, నాలుగు సంవత్సరాల పిల్లలను ఈ ఫ్రీ ప్రైమరీ పాఠశాలకు పంపించాలని కోరారు. పి ఆర్ టి యు జిల్లా కార్యదర్శి కిషన్ సార్, పి ఆర్ టి యు మండల అధ్యక్ష కార్యదర్శులు భూషణ్, రమేష్, జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మంజుల, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్కన్న, ఫ్రీ ప్రైమర్ టీచర్ రసజ్ఞ, ఉపాధ్యాయ బృందం,నాయకులుగా నాగేశ్వర్ గంగాధర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Continue Reading

నిజామాబాద్

పేద రోగులకు అండగా నిలుస్తూ ఎల్ఓసి పత్రాలు అందజేత 

janamvelugunews

Published

on

పేద రోగులకు అండగా నిలుస్తూ ఎల్ఓసి పత్రాలు అందజేత 

జనంవెలుగు, ఇందూరు: పేదలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తానని అవసరమైన వారికి నిమ్స్ లో ఎల్వోసీ అందజేస్తున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. నగరంలోని సుభాష్ నగర్ క్యాంప్ కార్యాలయంలో సోమవారం పలువురికి ఎల్ వోసీ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో అర్హులైన పేదలకు ఎల్ వోసీ ఇప్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళుతున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని గాయత్రి నగర్ కు చెందిన పెంటయ్య నరాల సంబంధిత వ్యాధితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అలాగే సబ్బని శ్రీనివాస్ మూత్ర పిండాల సంబంధిత వ్యాధితో ఇబ్బందులు పడుతున్నారన్నారు. కావున ఇరువురికి కలిపి రూ. 6 లక్షల ఎల్ వోసీ లు అందజేశామన్నారు. పార్టీలకతీతంగా ప్రజల ప్రాణాలను కాపాడటమే తన కర్తవ్యం అని పేర్కొన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రోగికి తక్షణ సహాయం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

Continue Reading