నిజామాబాద్
ఉద్యోగ విరమణ చేసిన అదనపు కలెక్టర్ కు ఘనంగా వీడ్కోలు


ఉద్యోగ విరమణ చేసిన అదనపు కలెక్టర్ కు ఘనంగా వీడ్కోలు
కలెక్టరేట్ లో అట్టహాసంగా సన్మాన మహోత్సవం
నిజామాబాద్, జూన్ 30 : నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా విధులు నిర్వర్తిస్తూ, మంగళవారం ఉద్యోగ విరమణ చేసిన ఎస్.కిరణ్ కుమార్ కు ఘనంగా వీడ్కోలు పలికారు. కలెక్టరేట్ అధికారులు,
ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సన్మాన మహోత్సవం నిర్వహించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా విచ్చేసి, ఉద్యోగ విరమణ చేస్తున్న అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ను పూలమాలలు, శాలువాలతో సత్కరించి, జ్ఞాపిక బహూకరించారు. అదనపు కలెక్టర్ గా కిరణ్ కుమార్ అందించిన సేవలను కొనియాడారు.
ఎంతో సమర్ధత కలిగిన అధికారి పదవీ విరమణ చేస్తుండడం జిల్లా యంత్రాంగానికి ఎంతో లోటు అని అన్నారు. తన మొదటి పోస్టింగ్ భద్రాద్రి జిల్లాలో ట్రైనీ కలెక్టర్ గా ఇదివరకు కిరణ్ కుమార్ తో కలిసి పని చేశానని కలెక్టర్ గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం తాను కలెక్టర్ గా కొనసాగుతున్న నిజామాబాద్ జిల్లాలో ఆయన పదవీ విరమణ చేయడం కాకతాళీయం అన్నారు.
ఎంతో ఒత్తిడితో కూడుకుని ఉండే రెవెన్యూ శాఖలో డీఆర్ఓగా, అదనపు కలెక్టర్ గా ఎంతో సమర్థంగా విధులు నిర్వహించారని, ప్రత్యేకించి నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలు, రెవెన్యూ శాఖా పరమైన అంశాలలో ఒత్తిడికి గురి కాకుండా ఓపికతో బాధ్యతాయుతంగా పని చేశారని కొనియాడారు.
ఉద్యోగులకు పదవీ విరమణ సహజమని, ముప్ఫై సంవత్సరాలకు పైగా వివిధ హోదాలలో ఎలాంటి రిమార్క్స్ లేకుండా సేవలు అందించడం ఎంతో గొప్ప విషయం అని అన్నారు. అనేక సందర్భాల్లో కుటుంబ సభ్యులతో సమయం గడిపే అవకాశం లేకుండా ఉద్యోగులు విధి నిర్వహణలో నిమగ్నం కావాల్సి వస్తుందని అన్నారు. పదవీ విరమణ చేస్తున్న అదనపు కలెక్టర్,
వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో గడపాలని కలెక్టర్ ఆకాంక్షించారు. నచ్చిన వ్యాపకాన్ని ఎంచుకుని మానసిక ప్రశాంతతతో, కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదకరమైన జీవనం గడపాలని ఆకాంక్షించారు.
అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) భుజంగరావు మాట్లాడుతూ, ఉన్నత హోదాలో కొనసాగినప్పటికీ ఉద్యోగాలతో కిరణ్ కుమార్ ఎంతో సౌమ్యంగా, స్నేహభావంతో మెలిగేవారని అన్నారు.
ఉద్యోగ విరమణ చేసిన అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, జిల్లాలో అదనపు కలెక్టర్ గా తాను సమర్ధవంతంగా విధులు నిర్వర్తించేందుకు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పూర్తి సహకారం అందించారని కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సురేష్, డీఆర్ఓ గీత, ట్రైనీ ఆర్డీఓ సందీప్, అన్ని శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు, కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొన్నారు.
నిజామాబాద్
DSP ఉద్యోగం సాధించడం జిల్లాకే గర్వకారణం: ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి


DSP ఉద్యోగం సాధించడం జిల్లాకే గర్వకారణం: ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి
DSP ఉద్యోగం సాధించిన నిఖిల రెడ్డిని సత్కరించిన ఎమ్మెల్యే
జనంవెలుగు నిజామాబాద్ :- రూరల్ నియోకజవర్గ పరిధిలో డివిజన్ నంబర్ 03-కార్పొరేషన్ గంగస్థాన్-2 కు చెందిన గౌరోల్లా చంద్రకళ-భూమ్ రెడ్డి దంపతుల కుమార్తె గౌరోల్లా నిఖిల రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రూపు-1 లో ఉత్తమ ప్రతిభ కనబరిచి DSP ఉద్యోగం సాధించడం గొప్ప విషయమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు.
స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు సంజీవ్ రెడ్డి మహేందర్ ల నేతృత్వంలో నిఖిల రెడ్డి కుటుంబ సభ్యులు బుధవారం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నిఖిల రెడ్డిని ఎమ్మెల్యే శాలువతో సత్కరించి అభినందించారు. విధి నిర్వహణలో సమర్థవంతంగా పనిచేసి జిల్లాకు మరింత మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆడపిల్లలు ఉన్నతంగా చదివి గొప్ప గొప్ప స్థానాలకు ఎదగడం అభినందనీయమని పేర్కొన్నారు.
నిజామాబాద్
కాంగ్రెస్ శ్రేణులతో రూరల్ ఎమ్మెల్యే ఆత్మీయ భేటీ


కాంగ్రెస్ శ్రేణులతో రూరల్ ఎమ్మెల్యే ఆత్మీయ భేటీ
డిచ్ పల్లి మండల అధ్యక్షుడి నివాసంలో భేటీ
దసరా సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం
పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు
జనంవెలుగు నిజామాబాద్ :– విజయదశమి దసరా పండుగ సందర్భంగా బుధవారం డిచ్ పల్లి మండలంలోని వెస్లీ నగర్ తాండా లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అంబర్ సింగ్ నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఆయా గ్రామాల సర్పంచులు కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యేతో ఆత్మీయంగా ముచ్చటించారు. అనంతరం పరస్పరం దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో పాల్గొని నాయకులతో కలిసి ఎమ్మెల్యే భోజనం చేశారు.మండల అధ్యక్షులు వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యేకు పరిచయం చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి,స్థానిక సర్పంచ్ చౌహన్ విజయ్, పార్టీ నాయకులు సాయరెడ్డి, పొలసాని శ్రీనివాస్, అమృతాపూర్ గంగాధర్, తారచంద్ నాయక్, హన్మండ్లు, రాంచందర్ గౌడ్, షాదుల్లా, సురేందర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు
నిజామాబాద్
విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు


విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు
రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
జనంవెలుగు నిజామాబాద్:- విజయదశమి పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు నింపాలని, ప్రజలు చేపట్టే ప్రతి కార్యంలో విజయం సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, ఐకమత్యంతో జీవించాలని, అన్ని వర్గాల ప్రజలకు విజయదశమి శుభాలను అందించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.








