నిజామాబాద్
మైనర్లకు బైకులు ఇవ్వద్దు…. లేదంటే శిక్ష తప్పదు


మైనర్లకు బైకులు ఇవ్వద్దు…. లేదంటే శిక్ష తప్పదు
నందిపేట్ జులై 1 జనం వెలుగు న్యూస్; నందిపేట మండల కేంద్ర మోడల్ స్కూల్ పరిధిలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేస్తుండగా నలుగురు మైనర్ బాలురలు ద్విచక్ర వాహనాలు నడుపుతూ దొరికిపోవడంతో వారిని స్టేషన్కు తీసుకెళ్లి వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. చిన్నపిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇస్తే ఆ పిల్లలకు ఏదైనా ప్రమాదం జరిగితే తీరని నష్టం జరుగుతుందని.
అలాంటప్పుడు చిన్న పిల్లలకు వాహనాలు నడిపేందుకు ఎందుకు ప్రోత్సహిస్తున్నారని పట్టుబడ్డ పిల్లల తల్లిదండ్రులతో అసహనం వ్యక్తం చేశారు ఎస్సై వినయ్ కుమార్. ఇకపై చిన్నపిల్లలకు వాహనాలు ఇచ్చిన వారిని ఉపేక్షించేది లేదని వారి తల్లిదండ్రుల పైన కూడా కేసులు నమోదు చేస్తానని హెచ్చరించారు. అలాగే దత్తాపూర్లో జరిగిన మన ఊరు… మన భద్రత… మన బాధ్యత.
కార్యక్రమంలో ప్రతి ఒక్క వ్యక్తి సామాజిక బాధ్యత తప్పనిసరిగా కలిగి ఉండాలని నాకెందుకులే అని అశ్రద్ధ చేయొద్దని, గ్రామంలో అందరూ కలిసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత సూచనలపై అవగాహన కలిగి ఉండాలని,
సైబర్ నేరాలపై మెలుకువగా ఉండి వాటి బారిన పడకుండా పిల్లలను ఒక కంట కనిపెడుతూ ఉండాలని, మత్తు పదార్థాలకు అలవాటు పడకూడదు అని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.
ఏది ఏమైనా నూతన ఎస్సై వచ్చినప్పటినుండి అసాంఘిక కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు పెడుతూ ప్రజలందరికీ సామాజిక బాధ్యతను గుర్తు చేస్తూ తన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తున్న ఎస్సై వినయ్ కుమార్ ను ప్రజలు అభినందిస్తున్నారు.
నిజామాబాద్
DSP ఉద్యోగం సాధించడం జిల్లాకే గర్వకారణం: ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి


DSP ఉద్యోగం సాధించడం జిల్లాకే గర్వకారణం: ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి
DSP ఉద్యోగం సాధించిన నిఖిల రెడ్డిని సత్కరించిన ఎమ్మెల్యే
జనంవెలుగు నిజామాబాద్ :- రూరల్ నియోకజవర్గ పరిధిలో డివిజన్ నంబర్ 03-కార్పొరేషన్ గంగస్థాన్-2 కు చెందిన గౌరోల్లా చంద్రకళ-భూమ్ రెడ్డి దంపతుల కుమార్తె గౌరోల్లా నిఖిల రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రూపు-1 లో ఉత్తమ ప్రతిభ కనబరిచి DSP ఉద్యోగం సాధించడం గొప్ప విషయమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు.
స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు సంజీవ్ రెడ్డి మహేందర్ ల నేతృత్వంలో నిఖిల రెడ్డి కుటుంబ సభ్యులు బుధవారం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నిఖిల రెడ్డిని ఎమ్మెల్యే శాలువతో సత్కరించి అభినందించారు. విధి నిర్వహణలో సమర్థవంతంగా పనిచేసి జిల్లాకు మరింత మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆడపిల్లలు ఉన్నతంగా చదివి గొప్ప గొప్ప స్థానాలకు ఎదగడం అభినందనీయమని పేర్కొన్నారు.
నిజామాబాద్
కాంగ్రెస్ శ్రేణులతో రూరల్ ఎమ్మెల్యే ఆత్మీయ భేటీ


కాంగ్రెస్ శ్రేణులతో రూరల్ ఎమ్మెల్యే ఆత్మీయ భేటీ
డిచ్ పల్లి మండల అధ్యక్షుడి నివాసంలో భేటీ
దసరా సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం
పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు
జనంవెలుగు నిజామాబాద్ :– విజయదశమి దసరా పండుగ సందర్భంగా బుధవారం డిచ్ పల్లి మండలంలోని వెస్లీ నగర్ తాండా లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అంబర్ సింగ్ నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఆయా గ్రామాల సర్పంచులు కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యేతో ఆత్మీయంగా ముచ్చటించారు. అనంతరం పరస్పరం దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో పాల్గొని నాయకులతో కలిసి ఎమ్మెల్యే భోజనం చేశారు.మండల అధ్యక్షులు వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యేకు పరిచయం చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి,స్థానిక సర్పంచ్ చౌహన్ విజయ్, పార్టీ నాయకులు సాయరెడ్డి, పొలసాని శ్రీనివాస్, అమృతాపూర్ గంగాధర్, తారచంద్ నాయక్, హన్మండ్లు, రాంచందర్ గౌడ్, షాదుల్లా, సురేందర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు
నిజామాబాద్
విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు


విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు
రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
జనంవెలుగు నిజామాబాద్:- విజయదశమి పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు నింపాలని, ప్రజలు చేపట్టే ప్రతి కార్యంలో విజయం సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, ఐకమత్యంతో జీవించాలని, అన్ని వర్గాల ప్రజలకు విజయదశమి శుభాలను అందించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.








