Uncategorized
ఎటూ తేల్చుకోలేని అన్ని రంగాల ఉద్యోగులు వ్యాపార వేత్తలు. ఎవరికి ఎంతివ్వాలి అని. ఎందుకంటే ఎంత తీసుకున్నది లెక్క లేదు కాబట్టి


జనం వెలుగు నిర్మల్ బ్యూరో:– సంవత్సరం అంతా అలా పేద ధనిక అనే తేడా లేకుండా ప్రతీ ఆఫీస్ లో హాస్టళ్లలో స్కూళ్లల్లో వ్యాపారాలల్లో చివరికి అటెండర్ గా పని చేసే వ్యక్తి అయినా చేయి తడపనిదే పని జరగదని చెప్పి లక్షల వసూళ్ళకి పాల్పడ్డ వాళ్ళు కోకొల్లలు. ఇక బడా బాబులకైతే ఒక రకంగా చెప్పాలంటే బానిసలు అని అన్నా తక్కువే. అందుకే సంవత్సరం అంతా ఎంత తీసుకున్నామో తెలీక కూడబెట్టుకున్నారు. ఇప్పుడు పేరు గాంచిన పేపర్లు, ఛానళ్లు వాళ్ళ తాట తీస్తున్నాయి. కారణం పండగకి ఒక యాడ్, పౌరుషానికి ఒక యాడ్, చచ్చినా యాడ్, పుట్టినా యాడ్, ఇలా ఇచ్చి, ఇచ్చి సంవత్సరపు చివరి అంకం క్యాలండర్ యాడ్స్ అంటూ తమ ప్రాణాలు తింటున్నారని ఒక మహిళా ఉద్యోగి జనం వెలుగుతో చెప్తూ కన్నీళ్ళు పెట్టుకుంది. తీసుకున్నది తెలిస్తే ఇచ్చేది ఎంతో అర్ధమౌతుంది లే. ఇష్టపూర్వకంగా తమ సంస్థనో లేక తను చేసే ఉద్యోగమో నచ్చి మెచ్చి యాడ్ ఇచ్చే ప్రయత్నం చేసే పనిలో ఉండాలే తప్ప బెదిరించి వసూళ్లు రాబట్టడం సరికాదని పలువురు కోరుతున్నారు.
Uncategorized
ప్రభుత్వ వైఫల్యంపై ధర్మోరా, అబ్దుల్లాపూర్ రైతుల నిరసన


ప్రభుత్వ వైఫల్యంపై ధర్మోరా, అబ్దుల్లాపూర్ రైతుల నిరసన
జనంవెలుగు, లోకేశ్వరం, నవంబర్ 12: లోకేశ్వరం మండలం పరిధిలోని ధర్మోరా, అబ్దుల్లాపూర్ గ్రామాల రైతులు వరి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ, మంగళవారం వారు సమగ్ర కుటుంబ సర్వేను బహిష్కరించారు. రైతులు మాట్లాడుతూ, ఈ వానాకాలం సీజన్‌లో పండించిన వరి పంటను కొనుగోలు చేయడానికి తగిన కేంద్రాలు అందుబాటులో లేకపోవడం తమను తీవ్రంగా ఆందోళనకు గురి చేసిందని చెప్పారు. పండిన పంటతోనే నిలిచి ఉండాల్సిన పరిస్థితులు కల్పించడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ కాలంలో పంట సకాలంలో కొనుగోలు చేయకపోతే రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, పంట నష్టపోయే ప్రమాదం ఉన్నందున ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. “సర్కారు ఇలాగే కొనసాగితే, గ్రామస్థులు తమ హక్కుల కోసం మరింత గట్టిగా నిరసన తెలిపే ప్రయత్నం చేస్తారు. సమగ్ర సర్వేకు మేము సహకరించేందుకు సిద్ధంగా లేము,” అని గ్రామస్థులు హెచ్చరించారు. ఈ సమస్యకు త్వరితగతిన పరిష్కారం లేకపోతే మరింత పెద్ద స్థాయిలో ఆందోళనలు చేపడతామని పేర్కొన్నారు. గ్రామస్థుల నిరసన నేపథ్యంలో అధికారులు త్వరగా స్పందించి, రైతుల సంక్షేమం కోసం పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వారిని ఆదుకోవాలని రైతులు ఆశిస్తున్నారు.
Uncategorized
ఉచిత బస్సు ప్రయాణం-ప్రజలకు ప్రాణ సంకటం


Uncategorized
రేపు జర్నలిస్టులకు ముఖ్యమంత్రిచే నివాస స్థలాల పంపిణి


రేపు జర్నలిస్టులకు ముఖ్యమంత్రిచే నివాస స్థలాల పంపిణి
38 ఎకరాల భూమి అందచేయనున్న సీఎం
మరణించిన 36 మంది జర్నలిస్టుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ లక్ష రూపాయలు అందచేత
జనం వెలుగు, హైదరాబాద్:- సుదీర్ఘకాలంగా జర్నలిస్టులు తమ నివాస స్థలాలకై ఎదురుచూస్తున్న శుభ ముహూర్తం ఖరారైంది. రేపు (8 . 9 .2024 ) న ఉదయం 10 హైదరాబాద్ రవీంద్ర భారతి లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై జవహర్ లాల్ నెహ్రు హోసింగ్ సొసైటీ కి 38 ఎకరాల భూమిని అందచేయనున్నారు.
ప్రజాప్రభుత్వంలో జర్నలిస్టుల సంక్షేమం అనే పేరుతొ నిర్వహిస్తున్న ఈ జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమానికి రాష్ట్ర సమాచార పౌరసంబందాలు, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస రెడ్డిలతో పాటు హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, స్థానిక పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు..
రాష్ట్రంలో విధినిర్వహణలో, వివిధ కారణాల వల్ల మరణించిన 36 మంది జర్నలిస్టుల కుటుంబాలకు మీడియా అకాడమీ ద్వారా ఒక్కొక్క కుటుంబానికి ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయం కూడా ఈ సమావేశంలో అందించనున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్య అతిధిగా పాల్గొనే ఈ సమావేశానికి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా జర్నలిస్టులను సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ ఎం. హనుమంత రావు విజ్ఞప్తిచేశారు. ఈ కార్యక్రమాన్ని సమాచార శాఖ తరపున లైవ్ కవరేజి ఇస్తున్నందున ప్రెస్ ఫోటో, వీడియో గ్రాఫ్ చేయడానికి అనుమతించడంలేదని, ఇందుకు సహకరించాల్సిందిగా తెలిపారు.










