Connect with us

Uncategorized

రేపు జర్నలిస్టులకు ముఖ్యమంత్రిచే నివాస స్థలాల పంపిణి

janamvelugunews

Published

on

రేపు జర్నలిస్టులకు ముఖ్యమంత్రిచే నివాస స్థలాల పంపిణి
38 ఎకరాల భూమి అందచేయనున్న సీఎం

మరణించిన 36 మంది జర్నలిస్టుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ లక్ష రూపాయలు అందచేత

 జనం వెలుగు, హైదరాబాద్:-  సుదీర్ఘకాలంగా జర్నలిస్టులు తమ నివాస స్థలాలకై ఎదురుచూస్తున్న శుభ ముహూర్తం ఖరారైంది. రేపు (8 . 9 .2024 ) న ఉదయం 10 హైదరాబాద్ రవీంద్ర భారతి లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై జవహర్ లాల్ నెహ్రు హోసింగ్ సొసైటీ కి 38 ఎకరాల భూమిని అందచేయనున్నారు.

ప్రజాప్రభుత్వంలో జర్నలిస్టుల సంక్షేమం అనే పేరుతొ నిర్వహిస్తున్న ఈ జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమానికి రాష్ట్ర సమాచార పౌరసంబందాలు, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస రెడ్డిలతో పాటు హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, స్థానిక పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు..
రాష్ట్రంలో విధినిర్వహణలో, వివిధ కారణాల వల్ల మరణించిన 36 మంది జర్నలిస్టుల కుటుంబాలకు మీడియా అకాడమీ ద్వారా ఒక్కొక్క కుటుంబానికి ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయం కూడా ఈ సమావేశంలో అందించనున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్య అతిధిగా పాల్గొనే ఈ సమావేశానికి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా జర్నలిస్టులను సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ ఎం. హనుమంత రావు విజ్ఞప్తిచేశారు. ఈ కార్యక్రమాన్ని సమాచార శాఖ తరపున లైవ్ కవరేజి ఇస్తున్నందున ప్రెస్ ఫోటో, వీడియో గ్రాఫ్ చేయడానికి అనుమతించడంలేదని, ఇందుకు సహకరించాల్సిందిగా తెలిపారు.

Uncategorized

ప్రభుత్వ వైఫల్యంపై ధర్మోరా, అబ్దుల్లాపూర్ రైతుల నిరసన

janamvelugunews

Published

on

ప్రభుత్వ వైఫల్యంపై ధర్మోరా, అబ్దుల్లాపూర్ రైతుల నిరసన

జనంవెలుగు, లోకేశ్వరం, నవంబర్ 12: లోకేశ్వరం మండలం పరిధిలోని ధర్మోరా, అబ్దుల్లాపూర్ గ్రామాల రైతులు వరి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ, మంగళవారం వారు సమగ్ర కుటుంబ సర్వేను బహిష్కరించారు. రైతులు మాట్లాడుతూ, ఈ వానాకాలం సీజన్‌లో పండించిన వరి పంటను కొనుగోలు చేయడానికి తగిన కేంద్రాలు అందుబాటులో లేకపోవడం తమను తీవ్రంగా ఆందోళనకు గురి చేసిందని చెప్పారు. పండిన పంటతోనే నిలిచి ఉండాల్సిన పరిస్థితులు కల్పించడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ కాలంలో పంట సకాలంలో కొనుగోలు చేయకపోతే రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, పంట నష్టపోయే ప్రమాదం ఉన్నందున ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. “సర్కారు ఇలాగే కొనసాగితే, గ్రామస్థులు తమ హక్కుల కోసం మరింత గట్టిగా నిరసన తెలిపే ప్రయత్నం చేస్తారు. సమగ్ర సర్వేకు మేము సహకరించేందుకు సిద్ధంగా లేము,” అని గ్రామస్థులు హెచ్చరించారు. ఈ సమస్యకు త్వరితగతిన పరిష్కారం లేకపోతే మరింత పెద్ద స్థాయిలో ఆందోళనలు చేపడతామని పేర్కొన్నారు. గ్రామస్థుల నిరసన నేపథ్యంలో అధికారులు త్వరగా స్పందించి, రైతుల సంక్షేమం కోసం పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వారిని ఆదుకోవాలని రైతులు ఆశిస్తున్నారు.

Continue Reading

Uncategorized

ఉచిత బస్సు ప్రయాణం-ప్రజలకు ప్రాణ సంకటం

janamvelugunews

Published

on

ఉచిత బస్సు ప్రయాణం-ప్రజలకు ప్రాణ సంకటం

Continue Reading

Politics

స్థానిక సంస్థల ఎన్నికలలో అత్యధిక సీట్లకు కృషి చేయాలి

janamvelugunews

Published

on

స్థానిక సంస్థాగత ఎన్నికలలో అత్యధిక సీట్లకు కృషి చేయాలి

జనం వెలుగు, బాల్కొండ:- త్వరలో జరుగబోవు స్థానిక ఎన్నికలలో అత్యధిక సీట్లను సాదించుకునే దిశలో కృషిచేయాలని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ చారి కార్యకర్తలను కోరాడు. మండల కేంద్రమైన బాల్కొండ పట్టణంలోని బిజెపి కార్యాలయంలో ఆదివారం మండల అధ్యక్షుడు అంబటి నవీన్ అధ్యక్షతన మండల స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. కాంగ్రెసు పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయకనే ప్రజలను మోసం చేస్తొందని కాంగ్రెసు పార్టీని ప్రజలు నమ్మడం లేదని ఆయన అన్నాడు. ఆగమ్య గోచరంగా కొట్టుకు మిట్టాడుతున్న బిఆర్ఎస్ (టిఆర్ఎ స్) పార్టీ త్వరలో కనుమరుగై పోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పాడు. ఈ కార్యక్రమంలో నక్కల గణేష్, మీసాల చందు, పార్టీ కన్వీనర్ శేరియాల కార్తీక్, కిసాన్ మోర్చ అధ్యక్షుడు కళ్ళెం సుధాకర్, జక్కం శ్రీకాంత్, మాజి ఎంపిటిసి సభ్యుడు శేరియాల జగన్, రామన్ శివ, ఠాకూర్ రాము, తదితర బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Continue Reading