Connect with us

ARTICLE'S

మహిళా హక్కులు మానవ హక్కులని ఉద్యమిద్దాం

janamvelugunews

Published

on

మహిళలపై ఇంటా, బయట వివక్షతను, హింసను వ్యతిరేకిద్దాం…
మహిళా హక్కులు మానవ హక్కులని ఉద్యమిద్దాం…

జనం వెలుగు:-    పురుష సమాజానికి…. ప్రజాపరివర్తకుడు … మాన్యశ్రీ…
జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ బహిరంగ లేఖ..!

మహిళల పట్ల మగవాళ్ళ ఆలోచనలలో మార్పు రావాలి…!!
కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ ప్రజా నేస్తం జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న పిలుపు

ప్రజా నేస్తం, సంఘసంస్కర్త, హేతువాది… జైబొరన్నగారి లేఖ…
స్రీ – పురుష సమానత్వానికీ పోరు కేక….
మనదేశంలో భూమిని భూమాతగా, నదులనూ నదీమ తల్లిగా, అడవుల్ని అడవితల్లిగా కొలుస్తుంటామనీ సామాజిక పరివర్తకుడు ప్రజా నేస్తం,, మాన్యశ్రీ …

జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. జీవికను, జీవితాన్ని ఇచ్చే ప్రతి అంశాన్నీ తల్లిగా కొలిచే సంస్కృతి మనదనీ,. స్త్రీని ఆదిశక్తిగా, ముగ్గురమ్మలకు మూలపుటమ్మగా పూజించే దేశం మనదనీ,. స్త్రీ మూర్తిని దేవతగా కొలిచే మన భారతదేశంలోనే నేడు మహిళలపై చెప్పనలవికాని అత్యాచారాలు… హత్యలు జరుగుతున్నాయనీ ,, అడుగడుగునా భరించలేని అవమానాల్ని ఎదుర్కొంటు నేటి మహిళలు దిన.. దిన గండం నూరేండ్ల ఆయుషు మాదిరిగా జీవిస్తున్నారని Justice association of India …
J .A. I .మరియు
Bharat organization for revolutionari awakening .. B .O .R. A . ఇటీవల చేసిన సర్వేలు వెళ్ళడైన విషయాన్ని స్త్రీ పురుష సమానత్వాన్ని కోరుకునే సాంఘిక విప్లవకారుడు ప్రజా నేస్తం జైబోరన్న గారి నేతాజీ సుభాషన్న వెల్లడించారు.

స్త్రీ జాతికి అత్యంత ప్రమాదకరమైన ప్రపంచ దేశాల జాబితాలో స్త్రీ జాతికి కంటకప్రాయమైన దేశాల జాబితాలో భారత్ ప్రథమ స్థానంలో ఉందని తేలిందనీ.. ప్రజాతంత్ర సంఘసంస్కర్త …మాన్యశ్రీ …
జైబోరన్న గారి నేతాజీ సుభాషన్న ఆవేదన వ్యక్తం చేశారు.

ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారతావనిలో నేటికీ దేశంలో బాలికా వివాహాలదే పైచేయనీ,, ప్రపంచంలో నమోదవుతున్న బాల్య వివాహాల్లో 60 శాతం భారతదేశంలోనే జరుగుతున్నాయని యూనిసెఫ్ నివేదిక స్పష్టీకరించిందనీ,. సామాజిక పరివర్తకుడు …
మాన్యశ్రీ …జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న తెలిపారు. దేవతగా పూజలందుకున్న మన కర్మభూమిలో స్త్రీ ఎన్నో దురాగతాలను సహిస్తోందనీ,, అడుగడుగునాఆడశిశువు హత్యలు, అనుక్షణం అత్యాచారాలు,,మానభంగాలు,, వరకట్న మరణాలు,, లైంగిక వేధింపులు, ఈవ్ టీజింగ్, గృహ హింస వంటి అనేక నేరాలకు గురవుతోందనీ.. స్త్రీ విముక్తినీ కోరుకునే అభ్యుదయ వాది, నూతన ప్రజాస్వామిక విప్లవ సమాజ నిర్మాణస్వాప్నికుడు… ప్రజా నేస్తం మాన్యశ్రీ
జైబోరాన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు. ప్రభుత్వాలెన్ని మారిన,, పాలకులెన్ని సాకులు చెప్పినా.. దేశంలో బాలింతల మరణాలు ఆందోళనకరమైన స్థాయిలోనే ఉన్నాయనీ,. మహిళల ఆయుర్దాయం పురుషులతో పోల్చుకుంటే తక్కువగానే ఉంటోందనీ సంఘసంస్కర్త కమ్యూనిస్టు విప్లవ పోరాట ఉద్యమకారుడు కామ్రేడ్
జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న ఆవేదన వ్యక్తం చేశారు.

మన దేశంలో మహిళలపై ప్రతి పది నిముషాలకు ఒక నేరం జరుగుతోందనీ,. ప్రతి 20 నిమిషాలకోసారి స్త్రీ గౌరవానికి భంగం కలుగుతోందనీ,. ప్రతి 34 నిమిషాలకో మానభంగం, ప్రతి 45 నిమిషాలకో లైంగిక వేధింపు,. ప్రతి 43 నిమిషాలకో స్త్రీ అపహరణ, గంటకో వరకట్న మరణం సంభవిస్తున్నాయనీ.. మన దేశంలో ప్రతిరోజు జరుగుతున్న ప్రతి 100 మానభంగాల్లో 60 శాతం అభంశుభం తెలియని బాలికలే బాధితులనీ… పసిబిడ్డలపై మగ పశువుల దారుణాలు రోజు,రోజుకు చెల రేగిపోతున్నాయనీ…
ప్రజాతంత్ర నేస్తం…
మాన్యశ్రీ ….జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న ఆవేదన వ్యక్తం చేశారు.
చెలరేగుతున్న లైంగిక హింస మహిళల శారీరక, మానసిక, సామాజిక భద్రతను ప్రశ్నార్ధకం చేస్తోందనీ.. మహిళల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోందనీ.. ఆ రకంగా మన దేశ జనాభాలో సగం పాశవిక దురాగతాలను సహిస్తోందనీ.. లైంగిక హింస మన భారతదేశం నూ ఒక ఆధునిక దేశంగా ఎదగకుండా నిరోధిస్తోందనీ జైబొరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు.

వరకట్నం మన దేశంలో అడ్డూఅదుపూ లేకుండా చెలరేగిపోతోందనీ.. వివాహానికి ఇద్దరి మనసుల కలయిక ప్రాతిపదిక కావాలనీ.. కానీ మనదేశంలో వరకట్నంపై ఇరు కుటుంబాల మధ్య కుదిరిన అంగీకరాన్నే వివాహానికి ప్రాతిపదికగా మారిపోయిందనీ… ప్రజా నేస్తం మాన్యశ్రీ ..
జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న తెలిపారు.
స్త్రీలపై యాసిడ్ దాడులు, శారీరక, మానసిక వేధింపులు దేశంలో సర్వసాధారణంగా మారాయనీ.. సుభాస్ చంద్రబోస్ పేర్కొన్నారు. నేర విచారణ, నిర్ధరణ ప్రక్రియలో తాత్సారం కారణంగా స్త్రీని వేధించే దుర్మార్గులు ఎంచేసినా చెల్లుబాటైపోతోందనీ.. మహిళలపై వేధింపుల కేసులు ఎటూ తేలక వేలు, లక్షల సంఖ్యలో గుట్టలుగా పేరుకుపోతున్నాయనీ.. దురాగతాలకు పాల్పడిన దుర్గార్గులు రొమ్ము విరుచుకుని సగర్వంగా తిరుగుతున్నారనీ..మళ్లీ మళ్లీ అదే నేరాలకు పాల్పడుతున్నారని కానీ మగ మృగ కాటుకు బలైన మహిళలు మాత్రం సమాజానికి భయపడి తలదించుకొని అత్యాచారాలన్నిటినీ సహిస్తున్నారనీ,, బాధితుల బందువు… ప్రజా నేస్తం మాన్యశ్రీ జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న బాధను వ్యక్తం చేశారు.

 

పాల ఉత్పత్తిలో, పౌల్ట్రీ కోళ్ల ఉత్పత్తిలో, కోడిగుడ్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే తొలి స్థానాల్లో ఉన్న మన దేశం, పోషకాహార సూచీలో… ఆహార భద్రత విషయంలో కానీ,, సంపూర్ణ అక్షరాస్యత విషయంలో కానీ,, మహిళాల భద్రత విషయంలోకానీ అట్టడుగున నిలవటానికి దేశాన్ని రాష్ట్రాన్ని ఏలిన,, ఏలుతున్న రాజకీయ పార్టీలు,, వాటి ప్రభుత్వాలే ప్రధాన కారణమనీ,, ఒకపక్క ఆకాశాన్నంటుతున్న ధరలతో, కొనే తాహతు లేక, అల్పవేతన జీవులు, నిరుపేదలు పోషకాహార లోపానికి గురవుతున్నారనీ ,, మరోపక్క మహిళలు వీటన్నిటితోపాటు అదనంగా లైంగిక దోపిడీకి, పురుషాధిపత్య డమనకాండకు ఇంటా బయట వివక్షతకు అణ చేతకు బలవుతున్నారని ప్రజా నేస్తం… మాన్యశ్రీ…
జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవేదన వ్యక్తం చేశారు.

స్త్రీల మీద ,, వారి శీలం మీద మగ ప్రపంచానికి అపనమ్మకం
ఉండకూడదని,
స్త్రీని ఆమె శీలం విషయమై
బదనాం చెయ్యడమూ, గాయం, చెయ్యడమూ, హత్య చేయడం మంచిది కాదని ప్రతిక్షణం… ప్రజాహితం ద్యేయంగా అభ్యుదయ ఆలోచనలతో నిరంతరం సమాజాన్ని తనవంతుగా చైతన్యవంతులను చేస్తున్న ప్రజా నేస్తం ..మాన్యశ్రీ,,
జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు.

స్త్రీ శీలం తన సొమ్మని…
పురుషులనుకోవడం మానుకోవాలని,
స్త్రీని శీలం విషయంలో శిక్షించే అధికారం… అమే భర్త కీ గానీ,, ఏ పురుషుడికీ గానీ లేదనీ,, స్త్రీ శరీరం స్రీ ఇష్టం తో కూడిన పని. ఆమె శారీరక వాంఛలు అనేవి ఆమె ఇష్ట, ఇష్టాలకు వదిలేయాలని, స్త్రీ స్వేచ్ఛ స్వతంత్రాలను కాపాడటం అంటే స్రీ శరీరం సొంత ఆస్తి అనే భావన నుండి బయటపడాలని సంఘసంస్కర్త హేతువాది మాన్యశ్రీ జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు.

స్త్రీ స్వేచ్ఛ అనేదీ కాగితాలకు పరిమితం కారాదని,స్వేచ్ఛ అనే మాటే భూతంలా పరిగణించే స్థితిలో నుండీ మగ మనువాదుల సమాజం బయటపడాలని…

స్త్రీలు స్వతంత్రులుగా నిలబడాలనీ … ఈ విషయం లో మగవాళ్ళ బుర్రలో బుద్ధులు మారాలని ప్రజానేస్తం జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు.

 

స్రీ నీ చూస్తే… మగవాడికి ఇష్టమేనని,, ఆమె
తనకి వొంటరిగా చిక్కాలనీ …. అమేతో వొంటరిగా గడపాలని… కాలక్షేపపూ కబుర్లు చెప్పుకోవాలని,,
ఆమెతో నెత్తికి నవరత్నాల ఆయిల్ కానీ, కొబ్బరి నూనె కానీ… రాయించుకోవాలని …
ఆమెతో మసాజ్ చేయించుకోవాలని ఆమెతో శృంగారంలో పాల్గొనాలని మగవాడి మనస్సు లో వుంటుందని…
కానీ అదే సమయంలో
తన భార్య మాత్రం పవిత్రంగా ఇంట్లోనేవుండాలని,, అమే జీతాన్ని ,, జీవితాన్ని,, ఆమే శీలాన్ని తన కోసమే భద్రంగా ఉంచుకోవాలని కోరుకునే మగవాడి వంకరబుద్ధి మారాలనీ ,, ఎదురింట్లో ఆడపిల్ల పుట్టాలి నా ఇంట్లో మగ పిల్లవాడు పుట్టాలి… నా కొడుక్కి పెళ్ళాం కావాలి ….నాకు మాత్రం బిడ్డ వొద్దు,, నా వంశంనూ అభివృద్ధి చేయుటకూ ఎదుటింట్లో పుట్టిన ఆడపిల్ల మా ఇంటికి కోడలుగా రావాలి… ఇటువంటి తప్పుడు ఆలోచన నుండి మగ సమాజం బయటపడాలని ఆడ, మగ సమానము అనే పరివర్తన ప్రతి ఒక్కరిలో రావాలని, సామాజిక పరివర్తకుడు మాన్యశ్రీ
జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న కోరారు.
పెళ్లయిన ఆడపిల్లలు తమ తల్లి గారి ఇంటి పేరుని కొనసాగించుటకు, చట్టం తేవాలని లేదా తమిళనాడు తరహాలో పిల్లలకు కొత్తగా ఇంటిపేర్లు వచ్చే విధంగా మార్పు జరగాలని,, ఇంటిపేరు మోయటం,వంశము, ప్రతిష్ట, గౌరవం పేరిట ఆడపిల్లల్ని వివక్షతకు గురి చేసే తప్పుడు దురాచారాల నుండి సమాజం బయటపడాలని,, మగవాళ్ళకో న్యాయం… ఆడవాళ్లకో …న్యాయమనే ఆటవిక న్యాయంనూ,, కాలం చెల్లిన నీతులనూ ఆపాలని సుభాషన్న స్పష్టం చేశారు.

“స్త్రీకి కూడా శరీరం ఉంటుందనీ….
దానికి వ్యాయామం ఇవ్వాలనీ
స్రీ కి కూడ మెదడు ఉంటుందనీ….
దానికి జ్ఞానం ఇవ్వాలనీ….
స్త్రీ కి కూడ హృదయం ఉంటుందనీ….
దానికి అనుభవం ఇవ్వాలనీ…”” ప్రజా నేస్తం, సంఘసంస్కర్త… మాన్యశ్రీ జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్
సమస్త సమాజానికి విజ్ఞప్తి చేశారు.

స్త్రీలపై కొనసాగుతున్న అమానుషానికి, వివక్షకు తెరదించుటకు, స్రీకి గౌరవాన్ని, సమానత్వాన్ని, కనీస మానవహక్కుల్ని కల్పించి వారి నిజమైన సాధికారిత కోసం చర్యలు చేపట్టే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజలు ప్రజాసంఘాలు ఒత్తిడి పెంచాలని ప్రజా నేస్తం మాన్యశ్రీ
జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కోరారు.

మహిళలపై పెరుగుతున్న అన్ని రకాల హంసను వృతదేరేద్దాం..!.
స్త్రీ -పురుష సమానత్వం కోసం, నిజమైన స్త్రీ విముక్తి కోసం పోరాడుదాం..! అనీ అభ్యుదయ వాది నూతన ప్రజాస్వామిక విప్లవ సమాజ నిర్మాణానికి తన వంతు కృషి చేస్తున్న ప్రజాస్వామిక వాది…
ప్రజా నేస్తం జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న 9848540078 పిలుపునిచ్చారు.

AGAINST VIOLENCE ON WOMEN

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ARTICLE'S

గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించాలి

janamvelugunews

Published

on

రుద్రూర్ జనం వెలుగు న్యూస్ 30 అక్టోబర్ :- రైతులు విధిగా తమ పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేయించాలని తద్వారా పశువులకు వ్యాధి సోకకుండా ఉంటుందని రుద్రూర్ పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ తెలిపారు. గురువారం రుద్రూర్ మండలకేద్రంలోని బొప్పాపూర్ గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ రైతులను ఉదేశించి మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి ప్రమాదకరమైనదని పశువులకు ఒకదాని నుండి ఒకదానికి సంక్రమిస్తుందని అన్నారు. గాలికుంటు వ్యాధి సోకకముందే టీకాలు వేయించి నివారణ చేపట్టాలని గాలికుంటు వ్యాధి సోకిన పశువులను ఇతర పశువుల నుండి దూరంగా ఉంచాలని లేనట్లయితే అన్ని పశువులకు వ్యాధి సోకి తీవ్ర నష్టం కలిగిస్తుందని సూచించారు. ప్రభుత్వం జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో భాగంగా పశువైద్య శాఖ ద్వారా ఉచితంగా గాలికుంటు వ్యాధి టీకాలు వేయించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతాంగం సద్వినియోగం చేసుకుని గాలికుంటు వ్యాధి టీకాలు వేయించి తమ పశువులను వ్యాధి పడకుండా రక్షించుకోవాలని బారిన సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలో 48 పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ పశు వైద్య సిబ్బంది, పాడి రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

ARTICLE'S

మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలి

janamvelugunews

Published

on

జనం వెలుగు న్యూస్ రుద్రూర్ 29- అక్టోబర్ : మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలకు రుద్రూర్ మండలంలో రైతులు ఆరుగాలం పాటు కష్టించి పండించిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. బుధవారం రుద్రూర్ మండల బిజెపి నాయకులు రైతుల కల్లాల వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్బంగా బిజెపి మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని మైచర్ మిషన్ వడ్లలోని తేమ శాతం 25 చూపిస్తే రైస్ మిల్లలోని మైచర్ మిషన్ తేమ శాతం 16 చూపిస్తున్నట్లు ఆరోపించారు అదేవిదంగా కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను రైస్ మిల్లుకు తరలించకపోవడం వలన కొంతమంది రైతుల ధాన్యం బస్తాలు అడుగుభాగం తడిచినట్లు సకాలంలో రైస్ మిల్ కు ధాన్యం తరలించి ఉంటే రైతులకు నష్టం జరిగేది కాదని పేర్కొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ వెంటనే సాంక్షన్ చేయాలని చేయాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లులు అన్నిటికీ అలాట్మెంట్ ఇచ్చి సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలని రుద్రూర్ బీజేపీ మండల కమిటీ తరఫున ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గూడూరి ప్రశాంత్ గౌడ్, నియోజవర్గ సీనియర్ నాయకులు పార్వతీ మురళి, మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి గజేందర్, కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు, ఎర్రోళ్ల గంగాధర్, యువ మోర్చా మండల అధ్యక్షుడు కుమ్మరి గణేష్, శివప్రసాద్, వరప్రసాద్, వినోద్ కుమార్, మాధవ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Continue Reading

ARTICLE'S

వర్ని అంగల్లో తైబజార్ అధిక వాసుళ్లు…

janamvelugunews

Published

on

జనం వెలుగు న్యూస్ : వర్ని మండల కేంద్రంలో ప్రతి మంగళవారం వారం వారపు సంత జరుగుతుంది. అందులోనే మేకల అంగడి కూడా జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుండి మేకలు అమ్మడానికి వ్యాపారులు వస్తారు.

ఇదే అదునుగా వర్ని తైబజార్ నిర్వాహకులు కొన్న వారి దగ్గర నుండి 50 రూపాయలు అమ్మిన వారి దగ్గర నుండి ఒక్కో మేకకు 50 రూపాయలు వసూలు చేస్తున్నారని వ్యాపారులు, కొనుగోలుదారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు కొంతమంది గ్రామ పంచాయతీ సెక్రెటరీ ఫిర్యాదు చేయగా అవును డబ్బులు కట్టాలని నిర్లక్ష్యగా సమాధానం చెబుతున్నాడని తెలిపారు తై బజార్ వ్యాపారులతో మిలాకతయి మార్కెట్లో అక్కడే ఉండి డబ్బులు వసూలు చేస్తున్నారని మేకల కొనుగోలు దారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై సెక్రెటరీకి వివరణ కోరగా అమ్మినవారు 25 రూ. కొన్నవారు 25 రూపాయలు చెల్లించాలని తెలిపారు. తై బజార్ వ్యాపారులు అధిక డబ్బులు వసూలు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కానీ పంచాయతీ సెక్రెటరీ దగ్గరుండి మరీ తైబజార్ వ్యాపారులతో మేకల క్రయ, విక్రయాల పై డబ్బులు వసూలు చేస్తున్నట్లు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.

Continue Reading