Connect with us

ARTICLE'S

ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ సాధన పోరాట క్రమంలో ఉద్యమ స్ఫూర్తితో తరతరాలకు నిలిచిన డి ఎస్ నకార

janamvelugunews

Published

on

చారిత్రక వారసత్వాన్ని భావితరాలకు అందించడం కృతజ్ఞత చూపడం నేటి పెన్షనర్ల కనీస బాధ్యత :

వడ్డేపల్లి మల్లేశము 9014206412

 జనం వెలుగు:-  పెన్షన్ అనే పదం నేడు సమాజంలో విశ్వవ్యాప్తమైన విషయాన్ని కాదనలేము . వ్యవసాయ రంగంలోనూ కార్మిక ఇతర అనేక రంగాలలో పనిచేసిన వారితో సహా వృద్ధాప్యంలో అనారోగ్య పరిస్థితులలో ప్రభుత్వం అందజేస్తున్నటువంటి భృతి ని కూడా పెన్షన్ అని వ్యవహరిస్తున్నాము. ప్రభుత్వాలు కూడా సామాజిక దృక్పథంతో కాకుండా ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఇవ్వడంతో పెన్షన్ అనే పదం ప్రతి వారి నోట నానుతూ ఉన్న విషయం నగ్నసత్యం . అయితే ఏ రకంగా పెన్షన్ ప్రజలకు అందజేసినా అది ప్రజాధనం మాత్రమే కానీ పాలకుల జేబులోని సొమ్ము మాత్రం కాదు అనేది గ్రహించాలి. అయితే ఆయా వర్గాలు వ్యవస్థకు చేసిన కృషి, అందుకు ప్రతిఫలంగా పదవీ విరమణ తర్వాత వృద్ధాప్యంలో అనారోగ్య పరిస్థితుల్లో తిరిగి పెన్షన్ రూపంలో పొందే వేతనము ఒక రకమైతే, ఉద్యోగులు కానటువంటి వారికి కూడా వృద్ధాప్యం ఇతర కారణాల వలన సామాజిక భద్రత, ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆర్థిక సాయం కూడా వివిధ రకాల పెన్షన్ల రూపంతో కొనసాగుతున్న మాట వాస్తవమే. మరింత విస్తృత అర్థంలో తీసుకోదల్చుకున్నప్పుడు దేశ సంపద ప్రజలందరికీ సమానంగా పంచబడాలి అనేది రాజ్యాంగంలోని మౌలిక లక్ష్యం . అంతేకాకుండా ఆదేశిక సూత్రాలలో కూడా ఈ దేశ సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకరించబడడానికి వీలులేదని స్పష్టంగా రాయబడి ఉన్న విషయం కూడా అమలుకు నోచుకోకపోవడం మరింత దారుణం. ఈ నేపథ్యంలోనే జాతి సంపదను ప్రజలకు వివిధ రూపాలలో హక్కు రూపంలో సాధించుకునే క్రమంలో అనేక పోరాటాలు జరిగిన మాట కూడా తెలిసిందే. అలాంటిదే ఉద్యోగులు పెన్షన్ రాజ్యాంగబద్ధంగా చట్ట రూపంలో సాధించుకోవడానికి చేసిన కృషి, అందుకు పోరాట బావుటా ఎగురవేసినటువంటి డిఎస్ నకార గారి జీవితం, పోరాటం తాత్విక నేపథ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించవలసిన అవసరం చాలా ఉన్నది.

ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ఉద్యోగుల పెన్షన్ హక్కును సాధించుకున్న క్రమాన్ని తెలుసుకోవడం పెన్షనర్ల బాధ్యత ఈ సందర్భంలో పెన్షన్ అనే పదానికి కొంతమంది ఇచ్చిన వివరణ సామాజిక రాజకీయ ప్రముఖులు చేసినటువంటి సూచనలు కూడా అక్షర బద్దం చేయడం సందర్భోచితం అని భావిస్తున్నాను. “పెన్షన్ అనే పదానికి సమానార్థాన్ని గ్రహించదలచుకుంటే ప్రభుత్వాలు లేదా యాజమాన్యాలు ఉద్యోగం చేసి విరమణ చేసిన అనంతరం వృద్ధాప్యం లేదా అనారోగ్యం కారణంగా బ్రతికినంత కాలం రెగ్యులర్గా చట్టబద్ధంగా పొందడానికి వీలైనటువంటి వేతన మొత్తాన్ని పె న్షన్” అని చెప్పవచ్చునని భాషా పండితులు అభిప్రాయపడుతున్నారు. సామాజికవేత్తల నిర్వచనం ప్రకారం “పెన్షన్ అనేది బహుమానమో, సన్మానమో, ప్రోత్సాహమో కాదు అని గ్రహించాలి. పెన్షన్ అనేది ప్రభుత్వాలు లేదా యాజమాన్యాల యొక్క ఉత్తమ ఆలోచనల నేపథ్యంలో నుండి రావలసినదే . కానీ ఈ చెల్లింపు దయతో దయాదాక్షిన్యాలతో సానుభూతితో చేయడాన్ని ఏ రకంగానూ అంగీకరించకూడదు. అంటే పూర్వ నేపథ్యం, తా త్వికత, హక్కు వంటి కనీసమైన మానవీయ కోణాలు దీని వెనుక ఉన్నాయని గ్రహించాలి. ఉద్యోగ సమయంలో సంవత్సరాల తరబడిగా ప్రభుత్వాలకు చేసినటువంటి సేవకు ప్రతిరూపంగా కృతజ్ఞతగా తిరిగి చేసే చెల్లింపు అని గ్రహించాలి . మరో రకంగా ఇది సామాజిక, ఆర్థిక, న్యాయపరంగా పెన్షనర్లకు అందించే సంక్షేమ చర్య అంటే బాగుంటుంది”. అందుకే ఇది దయాదాక్షిణ్య0 మీద ఆధారపడకుండా చట్టబద్ధంగా పొందాలనేదే డీఎస్ నకారా గారి ఉద్దేశం .ఆ ఆలోచన నుండి పుట్టినదే పెన్షన్ ఉద్యమము… న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పు . సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిన డిసెంబర్ 17 తేదీని ప్రతి ఏటా దేశవ్యాప్తంగా “పెన్షనర్స్ డే” గా పాటిస్తున్నప్పటికీ దాని వెనుక పోరాడి స్ఫూర్తిని నింపిన మహనీయుడు డీఎస్ నకార అని పెన్షనర్లతోపాటు సమాజం కూడా గుర్తించడం భవిష్యత్తు రీత్యా సామాజిక ప్రయోజనాల రీత్యా చాలా అవసరం.

పెన్షనర్స్ ఆత్మగౌరవంతో బతకాలి —కానీ ఆత్మ న్యూనతకు గురికారాదు:-

పెన్షన్ పొందడం ఎప్పుడైతే చట్టబద్ధమైన హక్కు అని అనుకున్నామో ఆత్మగౌరవంతో బ్రతకడానికి సిద్ధపడాలి కానీ అవమానంగా దయాదాక్షిణ్యంగా వేతనం పొందుతున్నట్లుగా ఆత్మ న్యూనతకు గురికారాదు అనేది పెన్షనర్ల ప్రాథమికమైన కర్తవ్యం. ప్రతి హక్కు సాధనకు, ప్రయోజనాలను పొందడానికి, రాజ్యాంగబద్ధతను సాధించడానికి, వ్యవస్థ నిర్మాణానికి, వ్యవస్థలో మార్పుకు చారిత్రకమైన కోణం ఉంటుందనేది మన గత అనుభవాల ద్వారా తెలుసుకోవచ్చు . 190 సంవత్సరాలు ప్రత్యక్షంగా ఆంగ్లేల పరిపాలనలో హక్కులు అవకాశాలను కోల్పోయి భావాదాస్యంలో మగ్గినటువంటి భారతదేశాన్ని విముక్తి చేయడానికి కోట్లాది ప్రజానీకం, నాయకులు, కార్యకర్తలు, అమరులు, పోరాట వీరుల కృషి తినలేనిది .ప్రథమ స్వాతంత్ర పోరాటమని , స్వాతంత్ర పోరాటమని దశ దశలుగా చరిత్రలోకి ఎక్కిన ఉద్యమ వీరుల కృషిని గుర్తిస్తేనే స్వాతంత్రానికి అర్థం ఉంటుంది. తెలంగాణ హైదరాబాదు సంస్థానము నిజాం రాజు రజాకార్ల ఏలుబడిలో కొనసాగి ప్రజలను వంచించి, దోపిడీ చేసి, నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితుల నుండి గట్టెక్కడానికి తెలంగాణ సాయుధ పోరాట వీరులు రైతాంగ ఉద్యమంలో అనేక వేలాదిమంది బలి అయిన తర్వాత మాత్రమే హైదరాబాదు సంస్థానము భారతదేశంలో కలిసిపోయిన విషయం ఆ ప్రాంత ప్రజలు ప్రశ్నించడానికి సిద్ధపడి ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్న విషయం మనందరికీ తెలిసినదే . సుమారు 60 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకోవడానికి సుమారుగా రెండు వేలకు పైగా ఉద్యమకారులు అమరులై ఆత్మార్పణ చేసుకొని పాలకులను ఆలోచింపజేసి ప్రజల ఆకాంక్షలను గుర్తింప చేయడానికి జరిగిన పోరాట చరిత్ర కారణంగానే కదా! నేడు తెలంగాణ స్వతంత్ర రాష్ట్రమై నిలబడినది . అయితే ఆ కృషి వెనుక త్యాగాలు చేసిన అమరవీరులను, ఉద్యమకారులను గుర్తించకపోవడం అనేది నాటినుండి నేటి వరకు కొనసాగుతున్న ప్రజా ద్రోహం గా భావించాలి. ఇదే క్రమంలో పెన్షనర్ల యొక్క హక్కులను సాధించి, పెన్షన్లు చట్టబద్ధం చేయడానికి, సర్వోన్నత న్యాయస్థానం ద్వారా ఆ హక్కును సాధించడానికి కృషి చేసినటువంటి డీఎస్ నకారా గారిని కూడా పెరిషనర్లు, చరిత్ర మరిచిపోతే ఉద్యమ ద్రోహులుగా మిగిలిపోతాము జాగ్రత్త పెన్షన్దారులారా !

భారతదేశంలో పెన్షన్ సమస్యలు – పెన్షన్ సాధనకు ముందున్నటువంటి పరిస్థితుల పూర్వ నేపథ్యం:-

పెన్షన్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలను పొందుపరచడం చాలా విస్తృతమైన సమస్య అయినప్పటికీ 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా స్వాతంత్రం రాకముందు ఆంగ్లేల పరిపాలన కాలంలో కొనసాగినటువంటి చట్టాలే కొనసాగుతున్న కారణంగా కూడా స్వతంత్ర పరిపాలన లో పెద్ద తేడా కనిపించకపోవడాన్ని మనం గమనించవచ్చు. ఇప్పటికీ నే ర ,న్యాయ, ఇతర ఉద్యోగ సిబ్బందికి సంబంధించినటువంటి అనేక నియమావళిలో పరాయి పాలనలోని నిబంధనలే ఉండడాన్ని గుర్తిస్తే వీలైన మేరకు సవరించుకోవడం ద్వారా భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా ఆయా రంగాలకు సంబంధించి నిబంధనలు పొందుపరచుకోవడం చాలా అవసరం.

ముఖ్యంగా 47 నుండి 1977 మధ్యన 30 సంవత్సరాల కాలంలో గమనించినట్లయితే లేదా అనుభవజ్ఞుల అనుభవాల ఆధారంగా చర్చించినట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులకు సంబంధించి చట్టబద్ధమైనటువంటి పెన్షన్ అవకాశాలు అంతగా లేవని తెలుస్తున్నది . ప్రభుత్వాలు యాజమాన్యాల దయాదాక్షిణ్యం, ఉద్యోగుల సంఖ్య, ఒత్తిడి, అవకాశాలు, ఆదాయ పరిస్థితులు వంటి అనేక అంశాలు కూడా ఆనాటి పెన్షన్కు పాత్ర పోషించిన విషయాన్ని పెద్దలు చెబుతున్నారు. కనుక చట్టబద్ధతలేని, ఇబ్బందికర, అశ్వతంత్ర విధానము నుండి బయటపడడానికి కాలం కలిసి రావడానికి 1982లో వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు వరకు ఆగవలసి వచ్చిన విషయాన్ని మనం అందరం గమనించాలి.

రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు అతి తక్కువ పెన్షన్తో, దుర్భర పరిస్థితులలో, చాలీచాలని ఆదాయంతో, నికృష్టంగా గృహవసతి తదితర సౌకర్యాలు లేకుండానే వృద్ధాప్యాన్ని గడిపి ఇబ్బందులకు గురైనట్లుగా తెలుస్తున్నది. పోరాడకుండా వ్యవస్థ మారనట్లు, ఉద్యమాలు లేకుండా పాలకులు ప్రజల కోసం పనిచేయనట్లు, ఒత్తిడి లేకుండా ఈ దేశంలో చట్టాలు రానటువంటి చరిత్రను మనం గుర్తించిన0 కనుకనే పెన్షన్ కోసం డి ఎస్ నకారా పేరుతో ఉద్యమ నాయకుడు ఉదయించడాన్ని మనం గమనించాలి. ఈ క్రమంలోనే 1979లో కేంద్ర ప్రభుత్వం కొంత మానవతా దృష్టితో ఆలోచించి కరడు కట్టిన విధానం గా ఉన్నటువంటి పెన్షన్ స్కీమును సరళీకృతం చేస్తూ 1979 నాటికి సర్వీసులో ఉన్న వారికి మాత్రమే పెన్షన్ స్కీమ్ వర్తిస్తుందని ఇచ్చిన ఉత్తర్వుల వల్ల కొద్ది మందికి అవకాశం లభించినప్పటికీ 1979కి ముందు రిటైర్డ్ అయిన వారికి ఎలాంటి అవకాశం లేకుండా వారి పాలిట శాపంగా మిగిలిపోయినది . ఈ పరిస్థితిని గమనించిన వివిధ ప్రభుత్వ రంగ సంస్థలలో మంత్రిత్వ శాఖలో కీలకంగా పని చేసిన డిఎస్ నకార గారు 1980లో భారత సర్వోన్నత న్యాయస్థానంలో. అంందరికి పెన్షన్ సాధించడం కోసం ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసినట్లు తెలుస్తున్నది.

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు– పెన్షన్ పై మరింత వివరణ :-

పెన్షన్ పొందడానికి కాల పరిమితులను నిబంధనలుగా విధించిన కారణంగా కొంతమందికి అన్యాయం జరిగిన విషయాన్ని సానుకూలంగా పరిగణించినటువంటి భారత సర్వోన్నత న్యాయస్థానం ఆనాటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైవి చంద్ర చూడు నాయకత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం సుమారు రెండు సంవత్సరాలు పూర్తిస్థాయిలో విచారణ జరిపిన అనంతరం చరిత్రాత్మ కమైన తీర్పును ఇవ్వడంతో పాటు పెన్షన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల చట్టబద్ధమైన హక్కు అని తీర్మానించి అందరికీ వర్తింప చేయడం వెనుక డిఎస్ నకారా గారి కృషి ఎనలేనిది అని మనం అంగీకరించడంతోపాటు వారిని సందర్భం గా సంస్మ రించుకొని నివాళి అర్పించడం మనందరి బాధ్యత .

17 డిసెంబర్ 1982 వ తేదీన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పులో పెన్షనర్ల యొక్క మనోభావాలు, హక్కులు విధులతో పాటు, చారిత్రక నేపథ్యాన్ని, సామాజిక న్యాయాన్ని ప్రస్తావించడం మనం గమనించాలి. ఈ సందర్భంగా” కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసే పెన్షన్ ఒక హక్కు అని దానిని బిక్షగా గుర్తించకూడదని పాలకులకు హెచ్చరిక చేయడాన్ని మనం గమనించవచ్చు . పదవిలో ఉన్న ఉద్యోగులతో సమానంగా రిటైర్డ్ అయినటువంటి పెన్షనర్లకు కూడా డీఏ లేదా డిఆర్ చెల్లించాలని, ఆరోగ్య సదుపాయాలు, దహన సంస్కరణల ఖర్చులతో పాటు మిగతా అన్ని సౌకర్యాలు వర్తింప చేయాలని .తెలిపింది పెన్షన్ అనేది ప్రభుత్వ లేదా యాజమాన్యాల విచక్షణ పై ఆధారపడినది కాదు … గతంలో సంవత్సరాల తరబడిగా చేసిన సేవలకు ప్రతిఫలం మాత్రమే. దశాబ్దాలుగా చేసినటువంటి సుదీర్ఘ సేవా కాలానికి వృద్ధాప్యంలో లోటును భర్తీ చేయడానికి ఇచ్చే ఆర్థిక సహాయం” అని చట్టబద్ధమైన తీర్పు ఇవ్వడం ద్వారా పెన్షన్లు లేకుండా ఇబ్బంది పడిన వారందరికీ కూడా ఈ సౌకర్యం అనివార్యంగా వర్తింప చేయడం ఆనందదాయకం . ఈ రకంగా పెన్షన్ సాధనలో కృషిచేసి పోరుబాటలో నిలిచి న్యాయస్థానం ద్వారా తీర్పును సాధించినటువంటి డిఎస్ నకార చేసిన కృషి పెన్షనర్ల పాలిట వరప్రసాదంగా భావించాలి అని కొంతమంది సీనియర్ పెన్షనర్లు ఉద్యోగులు మేధావులు చేసిన సూచన అంగీకరించవలసినదే.

ఏప్రిల్ 8 1914లో ముంబైలో జన్మించినటువంటి నకార హర్యానాలో స్థిరపడినప్పటికీ భారతదేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో పలు రకాల ఉద్యోగాలు ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేసిన అనుభవంతో ఆనాటి దుస్థితిని గమనించి ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసి న్యాయస్థానంలో పోరాడటం నేటి కే కాదు భవిష్యత్తు వర్గాల హక్కులకు పునాది పడిన విషయం కారణంగా ఈ తీర్పు వచ్చినటువంటి డిసెంబర్ 17 ప్రతిఏటా పెన్షనర్ల దినోత్సవం గా జరుపుకుంటున్నాము . 95 సంవత్సరాల సుదీర్ఘ జీవితం తర్వాత 29 అక్టోబర్ 1995లో డిఎస్ నకారా గారు మరణించినప్పటికీ ఆయన మన అందరికీ చిరస్మరణీయుడుగా మిగిలిపోయినారు. అయితే మహానుభావులు ఎవరికైనా వర్ధంతి లేదా జయంతుల నాడు కార్యక్రమాలు నిర్వహిస్తారు కానీ అందుకు భిన్నంగా నకారా గారి విషయంలో సుప్రీంకోర్టు తీర్పు సాధించిన రోజును పెన్షనర్ల దినంగా గుర్తించడం వినూత్న చర్యగా భావించాలి . హక్కుల సాధనే ముఖ్యం కానీ వ్యక్తి యొక్క జయంతి వర్ధంతి ముఖ్యం కాదనే బహుశా గొప్ప నిర్ణయానికి వచ్చి ఉంటారు కనుకనే దేశవ్యాప్తంగా 17 డిసెంబర్ జాతీయ పెన్షనర్ల దినంగా జరుపుకుంటున్నాము . కొన్ని ప్రాంతాలలో పరిమితంగా ,మరికొన్ని ప్రాంతాలలో పండుగలాగా , మరిన్ని ప్రాంతాలలో ఉత్సవ0 లాగా జరుపుకోవడ0 ద్వారా గత సంస్కృతిని నేటి తరానికి పరిచయం చేయడంతో పాటు బావి తరాలకు కూడా ఈ వారసత్వాన్ని తీసుకుపోవడానికి పెన్షన్ సాధనలోని తాత్వికత, పునాది, సామాజిక కోణం సమాజంతో ఆమోదింప చేయడానికి కూడా ఈ ఉత్సవాలు పెన్షన్ల దినోత్సవ కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయి.

విశ్రాంత ఉద్యోగులు లేదా పెన్షనర్లు అనగానే కేవలం పెన్షన్ పొందడానికి మాత్రమే అర్హులమని విశ్రాంతి దశలో ఉన్నామని భావన సరి అయినది కాదు . ఉద్యోగానికి దూరంగా ఉండి కొన్ని రకాలుగా వెసులుబాటు కలిగిన ఈ వయసులో వారి వారికి ఉన్న ప్రవేశాన్ని బట్టి సామాజిక ,రాజకీయ, చారిత్రక, ఆర్థిక, సాహిత్య ,సాంస్కృతిక రంగాలలో ఈ వ్యవస్థ బాగు కోసం, మెరుగైన సమాజనిర్మాణం కోసం కృషి చేయడం ద్వారా పెన్షనర్లు కూడా తమ సామాజిక బాధ్యతను నిర్వహిస్తేనే పెన్షన్ సాధించిన నకారా గారికి మనం ఘనమైన నివాళులు అర్పించిన వారిమి అవుతాము”.కృతజ్ఞతతో జీవించాలి కానీ కృతగ్ను లుగా మిగలకూడదు.”

 

(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ (చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం )

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ARTICLE'S

గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించాలి

janamvelugunews

Published

on

రుద్రూర్ జనం వెలుగు న్యూస్ 30 అక్టోబర్ :- రైతులు విధిగా తమ పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేయించాలని తద్వారా పశువులకు వ్యాధి సోకకుండా ఉంటుందని రుద్రూర్ పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ తెలిపారు. గురువారం రుద్రూర్ మండలకేద్రంలోని బొప్పాపూర్ గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ రైతులను ఉదేశించి మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి ప్రమాదకరమైనదని పశువులకు ఒకదాని నుండి ఒకదానికి సంక్రమిస్తుందని అన్నారు. గాలికుంటు వ్యాధి సోకకముందే టీకాలు వేయించి నివారణ చేపట్టాలని గాలికుంటు వ్యాధి సోకిన పశువులను ఇతర పశువుల నుండి దూరంగా ఉంచాలని లేనట్లయితే అన్ని పశువులకు వ్యాధి సోకి తీవ్ర నష్టం కలిగిస్తుందని సూచించారు. ప్రభుత్వం జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో భాగంగా పశువైద్య శాఖ ద్వారా ఉచితంగా గాలికుంటు వ్యాధి టీకాలు వేయించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతాంగం సద్వినియోగం చేసుకుని గాలికుంటు వ్యాధి టీకాలు వేయించి తమ పశువులను వ్యాధి పడకుండా రక్షించుకోవాలని బారిన సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలో 48 పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ పశు వైద్య సిబ్బంది, పాడి రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

ARTICLE'S

మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలి

janamvelugunews

Published

on

జనం వెలుగు న్యూస్ రుద్రూర్ 29- అక్టోబర్ : మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలకు రుద్రూర్ మండలంలో రైతులు ఆరుగాలం పాటు కష్టించి పండించిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. బుధవారం రుద్రూర్ మండల బిజెపి నాయకులు రైతుల కల్లాల వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్బంగా బిజెపి మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని మైచర్ మిషన్ వడ్లలోని తేమ శాతం 25 చూపిస్తే రైస్ మిల్లలోని మైచర్ మిషన్ తేమ శాతం 16 చూపిస్తున్నట్లు ఆరోపించారు అదేవిదంగా కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను రైస్ మిల్లుకు తరలించకపోవడం వలన కొంతమంది రైతుల ధాన్యం బస్తాలు అడుగుభాగం తడిచినట్లు సకాలంలో రైస్ మిల్ కు ధాన్యం తరలించి ఉంటే రైతులకు నష్టం జరిగేది కాదని పేర్కొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ వెంటనే సాంక్షన్ చేయాలని చేయాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లులు అన్నిటికీ అలాట్మెంట్ ఇచ్చి సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలని రుద్రూర్ బీజేపీ మండల కమిటీ తరఫున ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గూడూరి ప్రశాంత్ గౌడ్, నియోజవర్గ సీనియర్ నాయకులు పార్వతీ మురళి, మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి గజేందర్, కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు, ఎర్రోళ్ల గంగాధర్, యువ మోర్చా మండల అధ్యక్షుడు కుమ్మరి గణేష్, శివప్రసాద్, వరప్రసాద్, వినోద్ కుమార్, మాధవ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Continue Reading

ARTICLE'S

వర్ని అంగల్లో తైబజార్ అధిక వాసుళ్లు…

janamvelugunews

Published

on

జనం వెలుగు న్యూస్ : వర్ని మండల కేంద్రంలో ప్రతి మంగళవారం వారం వారపు సంత జరుగుతుంది. అందులోనే మేకల అంగడి కూడా జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుండి మేకలు అమ్మడానికి వ్యాపారులు వస్తారు.

ఇదే అదునుగా వర్ని తైబజార్ నిర్వాహకులు కొన్న వారి దగ్గర నుండి 50 రూపాయలు అమ్మిన వారి దగ్గర నుండి ఒక్కో మేకకు 50 రూపాయలు వసూలు చేస్తున్నారని వ్యాపారులు, కొనుగోలుదారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు కొంతమంది గ్రామ పంచాయతీ సెక్రెటరీ ఫిర్యాదు చేయగా అవును డబ్బులు కట్టాలని నిర్లక్ష్యగా సమాధానం చెబుతున్నాడని తెలిపారు తై బజార్ వ్యాపారులతో మిలాకతయి మార్కెట్లో అక్కడే ఉండి డబ్బులు వసూలు చేస్తున్నారని మేకల కొనుగోలు దారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై సెక్రెటరీకి వివరణ కోరగా అమ్మినవారు 25 రూ. కొన్నవారు 25 రూపాయలు చెల్లించాలని తెలిపారు. తై బజార్ వ్యాపారులు అధిక డబ్బులు వసూలు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కానీ పంచాయతీ సెక్రెటరీ దగ్గరుండి మరీ తైబజార్ వ్యాపారులతో మేకల క్రయ, విక్రయాల పై డబ్బులు వసూలు చేస్తున్నట్లు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.

Continue Reading