Connect with us

నిజామాబాద్

దేవాలయ పునర్మిమానానికి విరాళం

janamvelugunews

Published

on

 

జనం వెలుగు, నందిపేట్:- నందిపేట మండలంలోని ముత్యాలమ్మ, ఆడల్లి పోచమ్మ, చిలకల చిన్నమ్మ మందిరాల పునర్నిర్మాణానికి నందిపేట మండల కేంద్రానికి చెందిన మూడో వార్డు సభ్యులు సామాజిక సేవకుడు మాన్పూర్ భూమేష్ తనవంతుగా విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని అన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిజామాబాద్

నందిపేట్ లో ప్రభుత్వ పూర్వ ప్రాథమిక విద్య స్కూల్ ప్రారంభం

janamvelugunews

Published

on

నందిపేట్ లో ప్రభుత్వ పూర్వ ప్రాథమిక విద్య స్కూల్ ప్రారంభం

నందిపేట్ ఏప్రిల్ 21 జనం వెలుగు:  మండల కేంద్రం ప్రాథమిక పాఠశాల తెలుగు మీడియం లో మంగళవారం పూర్వ ప్రాథమిక విద్య ప్లే స్కూల్ ను స్థానిక సర్పంచ్ ఎర్రం సిలిండర్ లింగం ప్రారంభించారు‌. ఈ సందర్భంగా సిలిండర్ లింగం మాట్లాడుతూ…..

నందిపేట మండల కేంద్ర ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక విద్య ప్లే స్కూల్ ను ఈరోజు నుండి సంపూర్ణంగా ప్రారంభించడం జరిగిందని. ప్రతి ఒక్క విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాల్సిందేనని

ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు కలరని అందుకే ప్రభుత్వ పాఠశాలల ఆజరుశాతాన్ని పెంచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సదుపాయాలను కలిగిస్తుందని గుర్తు చేశారు. విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లలో చదువుకునేందుకు మొగ్గు చూపుతున్నారంటే దానికి కారణం అక్కడ మంచి

మంచి సదుపాయాలు ఉండడమేనని, అందుకే ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేటు పాఠశాలలను ఢీకొనే విధంగా ఏ ఒక్క విషయంలో కూడా వెనకడుగు వేయకుండా అన్ని సదుపాయాలను కల్పిస్తుందని తెలిపారు.

ఈ ప్లే స్కూల్లో కూడా చిన్న పిల్లలకు రెండు మూడు లక్షల రూపాయలను ఖర్చుపెట్టి మరి మంచి మంచి ఆట వస్తువులను, స్కూల్ డ్రెస్,టై బెల్ట్, షూలు, చదువుకు సంబంధించిన కొత్త కొత్త పరికరాలు, చిన్నపిల్లలను ఆకర్షించేందుకు కార్టూన్ పెయింటింగ్ లను వేయించడం జరిగింది అన్నారు. తల్లిదండ్రులు ఈ యొక్క సదుపాయాలను ఉపయోగించుకొని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఎంఈఓ అవధూత గంగాధర్ మాట్లాడుతూ… నందిపేట మండలానికి రెండు ప్రీ ప్రైమరీ పాఠశాలలు మంజూరు అయినాయని, ఒకటి ఐలాపూర్ కాగా రెండవది నందిపేట మండల కేంద్రా ఈ పాఠశాలదని, ఈ పాఠశాల కొరకు ఒక టీచర్ను ఒక ఆయాను నియమించడం జరిగిందని,

పిల్లల ఆట, చదువుకునే వస్తువుల కొరకు రెండు లక్షల రూపాయలను, మంచి పెయింటింగ్ కొరకు లక్ష రూపాయలను, స్కూల్ డ్రెస్ లాంటి విద్యార్థుల సౌకర్యార్థం 50 వేల రూపాయలను మొత్తంగా 3,50,000 దాకా మంజూరు చేయడం జరిగిందని, తెలిపారు.

ఈ పాఠశాల ప్రైమరీ పాఠశాల ఆధ్వర్యంలో నడుస్తుందని ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ మూడు, నాలుగు సంవత్సరాల పిల్లలను ఈ ఫ్రీ ప్రైమరీ పాఠశాలకు పంపించాలని కోరారు. పి ఆర్ టి యు జిల్లా కార్యదర్శి కిషన్ సార్, పి ఆర్ టి యు మండల అధ్యక్ష కార్యదర్శులు భూషణ్, రమేష్, జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మంజుల, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్కన్న, ఫ్రీ ప్రైమర్ టీచర్ రసజ్ఞ, ఉపాధ్యాయ బృందం,నాయకులుగా నాగేశ్వర్ గంగాధర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Continue Reading

నిజామాబాద్

పేద రోగులకు అండగా నిలుస్తూ ఎల్ఓసి పత్రాలు అందజేత 

janamvelugunews

Published

on

పేద రోగులకు అండగా నిలుస్తూ ఎల్ఓసి పత్రాలు అందజేత 

జనంవెలుగు, ఇందూరు: పేదలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తానని అవసరమైన వారికి నిమ్స్ లో ఎల్వోసీ అందజేస్తున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. నగరంలోని సుభాష్ నగర్ క్యాంప్ కార్యాలయంలో సోమవారం పలువురికి ఎల్ వోసీ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో అర్హులైన పేదలకు ఎల్ వోసీ ఇప్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళుతున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని గాయత్రి నగర్ కు చెందిన పెంటయ్య నరాల సంబంధిత వ్యాధితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అలాగే సబ్బని శ్రీనివాస్ మూత్ర పిండాల సంబంధిత వ్యాధితో ఇబ్బందులు పడుతున్నారన్నారు. కావున ఇరువురికి కలిపి రూ. 6 లక్షల ఎల్ వోసీ లు అందజేశామన్నారు. పార్టీలకతీతంగా ప్రజల ప్రాణాలను కాపాడటమే తన కర్తవ్యం అని పేర్కొన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రోగికి తక్షణ సహాయం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

Continue Reading

నిజామాబాద్

|nandipet నందిపేటలో నందీశ్వరుడి జయంతి

janamvelugunews

Published

on

నందిపేటలో నందీశ్వరుడి జయంతి

నందిపేట ఏప్రిల్ 20 జనం వెలుగు: నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో కొలువుదీరిన అతి పురాతన స్వయంభు నందికేశ్వర ఆలయాన సోమవారం ఆలయ కమిటీ వారు బసవ జయంతిని పురస్కరించుకొని ఆ నందీశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నందికేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ పెద్దకాపు సుమన్ మాట్లాడుతూ….

ఈరోజు బసవ జయంతిని పురస్కరించుకొని మా నందీశ్వరునికి ప్రత్యేక పూజలు జరిపించడం జరిగిందని, ఈ నంది జయంతి సందర్భంగా భక్తులకు అల్పాహారం పెట్టామని, అతి పురాతనమైన స్వయంభు నందికేశ్వర ఆలయం చాలా మహిమగలదని, ఎక్కడ లేని విధంగా ఈ నందీశ్వరుడు దినదినం పెరగడం జరుగుతుందని,

నంది పెరగడం వల్లనే ఆలయాన్ని మూడుసార్లు పునర్నిర్మించడం జరిగిందని, నందీశ్వరుడు పెరిగినట్టే మా గ్రామం కూడా అభివృద్ధి చెందుతూ వస్తుందని, నంది గుడి అంటే మా గ్రామం వాసులకు అపార నమ్మకమని, అనుకున్న కోరికలు సిద్ధిస్తాయని, ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున కనివిని ఎరుగని రీతిలో మహన్నదానాలు గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరుగుతాయని తెలిపారు.

వి డి సి అధ్యక్షులు ఎర్రం భోజేందర్, మంతెన శ్రీను, ఉప సర్పంచ్ చందర్, నందిగుడి కమిటీ వైస్ చైర్మన్ ఎకేర్ ముత్యం, క్యాషియర్ గుట్ట నారాయణ, కిషన్ కాంగ్రెస్ నాయకులు దమ్మాయి శ్రీను, కమిటీ డైరెక్టర్లు ఏషాల పెద్ద చిన్నయ్య, గంగాధర్, మైసరి శ్రీను, బూమ్ముత్తి, మాధస్తుశేఖర్, కుమ్మరి ప్రవీణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Continue Reading