నిజామాబాద్
దేవాలయ పునర్మిమానానికి విరాళం


నిజామాబాద్
నందిపేటలో విరాట్ హిందూ సమ్మేళన ప్రభంజనం


నందిపేటలో విరాట్ హిందూ సమ్మేళన ప్రభంజనం
హైందవ ధర్మ రక్షణ కవచంగా రాష్ట్రీయ స్వయంసేవక్
నందిపేట ఏప్రిల్ 19 జనం వెలుగు:- నందిపేట మండల కేంద్ర నంది గుడి ఆవరణలో శనివారం ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విరాట్ హిందూ సమ్మేళన కార్యక్రమ జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందిపేట మండల కేంద్ర పల్గుట్ట కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు కేదరానంద మహారాజ్,
మల్లారం లింగేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు బాలయోగి కృష్ణ మహారాజ్ పాల్గొనగా తెలంగాణ ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల ఆరోగ్య భారతి దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి అమినేని కుమారస్వామి, కంటేశ్వర్ ఇస్కాన్ రామానంద రాయ్ ప్రభు, రాష్ట్ర సేవిక సమితి జిల్లా కార్యవాహిక శుభా దేశ్పాండే వక్తలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా స్వామీజీలు, వక్తలు మాట్లాడుతూ
సనాతన హిందూ ధర్మానికి ఆది అంతం లేదని ఎన్నో లక్షల సంవత్సరాల నుండి జీవన విధానం నేర్పిన మతం ఏదైనా ఉందంటే అది కేవలం హిందూ మతమేనని, ఇంకా నిక్కచ్చిగా మాట్లాడాలంటే హిందూ మతం మతం కాదని అది ఒక జీవన విధానం అని అన్నారు. ప్రపంచ దేశాలు కూడా హిందూమత విధానాన్ని ఇష్టపడుతున్నాయని, హిందూ సంస్కృతి, హిందువుల జీవన విధానం సర్వేజనా సుఖినోభవంతును తెలుపుతుందని కొనియాడారు. ప్రతి మనిషిని గౌరవించడం, ప్రతి జీవిని పూజించడం,
హిందువుల సంప్రదాయమని, ఎన్నో సంప్రదాయాలు, మరెన్నో ఆధ్యాత్మికసూక్తులు మన జీవన విధానానికి ఉత్పేరకాలుగా పనిచేస్తాయని అన్నారు. కానీ నేటి సమాజంలో మన హిందువులు మన ధర్మాన్ని,
మన సంప్రదాయాన్ని పాటించకుండా అన్యమతస్తుల కుట్రలకు బలవుతున్నారని, మన ధర్మాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కళ్ళు తెరవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, లేదంటే భారతదేశంలో హైందవ ధర్మం నామరూపం లేకుండా చేయడానికి ఎన్నో కుట్రలు చేస్తూ శత్రువులు సిద్ధంగా ఉన్నారని, కావున ప్రతి ఒక్కరూ మన ధర్మాన్ని కాపాడుతూ మన హైందవ ధర్మానికి మన వంతు కృషి చేస్తూ మన పిల్లలను, మన మహిళలను, మన కుటుంబాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందన్నారు.
ఈ మహత్తర హిందూధర్మిక కార్యక్రమంలో మండల కేంద్ర గీతా కాన్వెంట్, ఉజ్వల, కృష్ణవేణి పాఠశాలల విద్యార్థులు భరతనాట్యం, శివతాండవం, వెంకటేశ్వర స్తోత్ర పాటలతో నృత్య ప్రదర్శన చేసి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు, అంతేకాకుండా ఆర్ఎస్ఎస్ సేవికా సమితి బాలికల నియుద్ద, వెల్మల్ గ్రామ విద్యార్థుల భవద్గీత శ్లోకాలు, సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. చత్రపతి శివాజీ మహారాజ్ వేషధారణతో ఖడ్గం పట్టుకొని శివాజీ మహారాజ్ శ్లోకాలు చెబుతూ ఉత్తేజ పరిచారు.
సర్పంచ్ సిలిండర్ లింగం, తాత్కాలిక హిందూ సమ్మేళన సేవా సమితి అధ్యక్షులు కండక్టర్ నారాయణ, నందిపేట గ్రామాభివృద్ధి కమిటీ మూడు పంతల పెద్దమనుషులు, నంది గుడి కమిటీ, మండల కేంద్ర ఆలయాల కమిటీల సభ్యులు, వివిధ పార్టీల మండల అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, యువజన సంఘాలు, కుల సంఘాలు, యువకులు, కండ కార్యవాహ గుజ్జేటి గణేష్, కండ సహకార్యవాహ బొడ్డు రాజేంద్ర ప్రసాద్, కండ వ్యవస్థా ప్రముఖ చిక్కెల శశికుమార్, కండ కుటుంబ ప్రబోధన్ తాడ్వాయి ఎల్లా గౌడ్, నందిపేట్ ఉప మండల భౌతిక ప్రముఖ్ గౌలికర్ యాదిలాల్, ఆర్ఎస్ఎస్ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నిజామాబాద్
| Balkonda లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇవ్వండి.


లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇవ్వండి.
మాజి మంత్రి బాల్కొండ ఎంఎల్ఏ వేముల ప్రశాంత్ రెడ్డి.
జనం వెలుగు బాల్కొండ:- రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకంలో ఇస్తున్న లక్ష రూపాయలతో పాటు గత అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలకి చ్చిన హామీల భాగంగా ఇస్తానన్న తులం బంగారం ఇవ్వాలని మాజి మంత్రి బాల్కొండ ఎంఎల్ఏ వే ముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశాడు. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాల మంజూరి కోసం 127 ఫైల్లపై శనివారం ఆయన సంతకాలను చేశాడు. బాల్కొండ 19, వేల్పూరు 20, మెండోరా 15, ముప్కాల్ 10, మోర్తాడ్ 24, భీంగల్ 39 మండలాలకు చెందిన ఫైల్లపై బాల్కొండ ఎంఎల్ఏ క్యాంపు కార్యాలయంలో ఫైల్లను పరిశీలించి ఆయన సంతకాలను చేశాడు. ఫైల్లను మీ వద్ద పెండెంగ్ ఉంచకుండా అవసరమైన సంతకాలను వెంటనే పూర్తి చేసి ప్రభుత్వానికి ప్రభుత్వానికి పంపించాలని తహసిల్దార్ లను ఆయన ఆదేశించాడు.
నిజామాబాద్
| Armoor మున్సిపల్ కార్యాలయం లో కాంగ్రెసు, బిజెపి నాయకుల రచ్చ రచ్చ.


మున్సిపల్ కార్యాలయం లో కాంగ్రెసు, బిజెపి నాయకుల రచ్చ రచ్చ.
ఎంల్ఏ, చైర్ పర్సన్ ల ముందరే ఇరువర్గాల నాయకుల పరస్పర దూషణలు.
బిజెపి నాయకులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన రమేష్.
జనం వెలుగు ఆర్మూర్:- ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో బిజెపి నాయకులు, కాంగ్రెసు నాయకుల మధ్య రచ్చ రచ్చ జరిగిన ఘటన ఆర్మూర్ లో చర్చ నీయాం శంగా మారింది.ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో శనివారం సా ధారణ సమావేశం జరిగింది. ఇట్టి సాధారణ సమావేశానికి హాజర య్యేందుకు వచ్చిన ఆర్మూర్ ఎంఎల్ఏ పైడి రాకేష్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు చైర్ పర్సన్ గోనె లహరి చాంబర్ లో ఆశీనలై ఉండగా బిజెపి, కాంగ్రెసు నాయకుల మధ్య జరిగిన మాట మాట పెరిగి పోయి రచ్చ రచ్చగా మారిపోయింది.ఎంఎ ల్ఏ అనుచరుడు మందుల బాలు తమపై పెత్తనం చలాయించడం ఏమిటని కౌన్సిలర్ రమేష్ తీవ్రంగా పరిగణించి ఆర్మూర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
కౌన్సలర్ అయిన నాతో దుర్బాషలాడి బయటకు వెళ్ళాలని నాపై మందుల బాలు హుకుం చెలాయించడం ఏంటని ఆయన ప్రశ్నించాడు. ఒక మున్సిపల్ కార్యాలయంలో కొనసాగిన ఈ తతంగం ఒక ఉద్రిక్తత వాతావరణంలా మారింది. అటు అధికారులు గాని ఇటు పోలీసులు గాని ఇటు బిజెపి నాయకులను గాని అటు కాంగ్రెసు నాయకులను ఏమి అనలేక వినలేక మౌనం పాటించడం వలన మున్సిపల్ కార్యాలయం అంతా గందరగోళంగా ఉద్రిక్తతంగా మారి పోయింది.తమ కక్షల కు కార్పణ్యాలకు మున్సిపల్ కార్యాలయాన్ని ఓ వేధికగా చేసుకుని మాటల తూటాలతో పెరిగి పోయి నాయకులు కొట్టుకునే స్థాయికి చేరింది.ప్రజా సమస్యలను పక్కన పెట్టి కేవలం కక్ష సాధింపు చర్యలకే ఇరు నాయకులు పెద్ద పీట వేసినట్లు వారి దూషణలు స్పష్టత నిచ్చాయి.








