ARTICLE'S
బైరి నరేష్ అరెస్టు రాజ్యంగ వ్యతిరేకం


బైరి నరేష్ అరెస్టు రాజ్యంగ వ్యతిరేకం
ప్రజానేస్తం కామ్రేడ్
జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న
జనం వెలుగు:- అయ్యప్ప స్వామి అశాస్త్రీయ పురాణ కథను విమర్శించినందుకు నాస్తికవాది బైరి నరేష్ ను అరెస్టు చేయడాన్ని కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ, ప్రజా నేస్తం జైబోరాన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ తీవ్రంగా ఖండించారు. ఇది భావప్రకటనా స్వేచ్ఛను హరించే చర్యగా, మత ఉన్మాదులకు మనువాదులకు రాజ్యాంగ పరంగా మద్దతు ఇచ్చినట్టు గా ఉందనీ ప్రజా నేస్తం జైబోరాన్నగారీ నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు. పుక్కటి పురాణాలు మనువాద భావజాలానికి వ్యతిరేకంగా మాట్లాడవద్దనే మతోన్మాదుల, అశాస్త్రీయవాదులకు లొంగి కేసు పెట్టడం రాజ్యాంగ వ్యతిరేకమనీ జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న స్పష్టం చేశారు. బైరి నరేష్ అంబేడ్కర్ సంస్మరణ సభలో అయ్యప్ప స్వామిపై అనుచితవ్యాఖ్యలు చేశారని సభ నిర్వాహకుడు బాలరాజును ఉరికించి కొట్టడం, గాయకులు రెంజర్ల రాజేష్ ఇంటిపై దాడిచేసి కుటుంబ సభ్యులను భయాందోళనకు గురిచేయడంనూ అప్రజాస్వామిక చర్యగా బోరాన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు. ఈ మేరకు నేడొక ప్రకటన విడుదల చేస్తూ ఈ ప్రజాస్వామిక చర్యలను ప్రజలు ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఖండించాలని ప్రజా నేస్తం జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న కోరారు. మన దేశంలో అశాస్త్రీయ విషయాల పట్ల మాట్లాడే బావప్రకటన హక్కు అందరికి ఉందనీ మాట్లాడిన విషయాలపై విభేదిస్తే చర్చ ద్వారా సమాధానం చెప్పాలి నిరూపించాలి. కానీ దాడులతో బెదిరింపులతో భయబ్రాంతులకు గురి చేయడం సరికాదని ప్రజా నేస్తం, సంఘసంస్కర్త, హేతువాది జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ మతోన్మాద గుండాలు చేస్తున్న దాడులు మధ్యాయుగాల నాటి ఉన్మాదపు చర్యలుగా ఉన్నాయనీ.. జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న ఆవేదన వ్యక్తం చేశారు.
బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం వీటన్నిటిని ప్రోత్సహిస్తూ ప్రశ్నించే గొంతులు ఇక మాట్లాడ వద్దనే కుట్రతో వ్యవహరిస్తున్నదనీ.. సామాజిక కార్యకర్త
జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న ఆరోపించారు. ఏచిన్న అవకాశం దొరికినా బిజెపి, RSS దానిపరివారం ప్రజల మధ్య మత విద్వేషాలు రగిల్చి దాడులకు ఉసిగొల్పి రాజకీయలబ్ది పొందడానికి ఉవ్విళ్లూరుతుందనీ.. ప్రజాతంత్ర ఉద్యమకారుడు
జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న తెలిపారు. బిజెపి, ఆర్ఎస్ఎస్ మతోన్మాదుల దాడుల సంసృతిని, పోలీసుల అక్రమ అరెస్టులను ప్రజలు ప్రజాస్వామికవాదులు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు తీవ్రంగా ఖండించాలని ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసం పరితపించే ప్రజానేస్తం బోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 9848540078 పిలుపునిచ్చారు.
కానీ ఇదే సమయంలో బైరి నరేష్ రెంజర్ల రాజేష్ నుండి మొదలు అనేకమంది ప్రజా ఉద్యమ నాయకులకు, కార్యకర్తలకు , సామాజిక మార్పునూ కాంక్షించే అభ్యుదయ వాదులకు ప్రజా నేస్తం జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న మరొక విజ్ఞప్తి చేశారు. మన భారత దేశ రాజ్యాంగం ఎవరినైనా విమర్శించే, ప్రశ్నించే స్వేచ్ఛను మనకిచ్చిందనీ కానీ విమర్శ ఇతరులను ఆలోచింప చేసేలా ఉండాలనీ అలజడులు సృష్టించేలా మాత్రం ఉండకూడదనీ అణగారిన వర్గాల రాజ్యాధికారాన్ని కాంక్షించే అభ్యుదయ వాది ప్రజా నేస్తం జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న హితవు పలికారు.
విమర్శ హేతుబద్ధంగా ఉండాలి. కానీ హేళన చేసేలా ఉండకూడదనీ ప్రజా శ్రేయోభిలాషి జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు. విమర్శ వినయంగా ఉండాలి కానీ వెకిలి చేష్టలతో ఉండకూడదనీ బహుజన శ్రామిక రాజ్య స్వప్నికుడు జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న తెలిపారు. విమర్శ ప్రేమగా ఉండాలి కానీ పొగరుగా ఉండకూడదనీ ప్రజాతంత్ర ఉద్యమకారుడు
జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు. విమర్శ ద్వైపాక్షికంగా ఉండాలి కానీ ద్వేషంతో ఉండకూడదనీ ఉద్యమాలతోనే సమాజ మార్పు సాధ్యమని చాటి చెప్పే విప్లవ సమాజ స్వప్నికుడు ప్రజా నేస్తం జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న విమర్శకులకు విజ్ఞప్తి చేశారు.
విమర్శ విప్లవాత్మకంగా ఉండాలని, విమర్శ సమాజాన్నిమెప్పించేలా ఉండాలనీ కానీ నొప్పించేలా ఉండకూడదనీ ప్రజా నేస్తం జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న కోరారు.బుద్ధుడు, నారాయణ గురు, పెరియర్, మహాత్మా గాంధీజీ, సర్దార్ పటేల్, అంబేద్కర్ జ్యోతిరావు పూలే మహనీయుల మార్గంలో పయనించి మార్క్స్ లెనిన్ మావోల విప్లవ భావాలతో సమాజాన్ని మార్చుటకు దోపిడి అసమానతలు లేని నూతన సమాజ స్థాపనకు కృషి చేయాలని సామాజిక మార్పును కోరుకునే అభ్యుదయ వాదులకు అణగారిన వర్గాల రాజ్యాధికారాన్ని కోరుకునే అభ్యుదయ వాది ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాషన్న పిలుపునిచ్చారు.
ARTICLE'S
గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించాలి


రుద్రూర్ జనం వెలుగు న్యూస్ 30 అక్టోబర్ :- రైతులు విధిగా తమ పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేయించాలని తద్వారా పశువులకు వ్యాధి సోకకుండా ఉంటుందని రుద్రూర్ పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ తెలిపారు. గురువారం రుద్రూర్ మండలకేద్రంలోని బొప్పాపూర్ గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ రైతులను ఉదేశించి మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి ప్రమాదకరమైనదని పశువులకు ఒకదాని నుండి ఒకదానికి సంక్రమిస్తుందని అన్నారు. గాలికుంటు వ్యాధి సోకకముందే టీకాలు వేయించి నివారణ చేపట్టాలని గాలికుంటు వ్యాధి సోకిన పశువులను ఇతర పశువుల నుండి దూరంగా ఉంచాలని లేనట్లయితే అన్ని పశువులకు వ్యాధి సోకి తీవ్ర నష్టం కలిగిస్తుందని సూచించారు. ప్రభుత్వం జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో భాగంగా పశువైద్య శాఖ ద్వారా ఉచితంగా గాలికుంటు వ్యాధి టీకాలు వేయించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతాంగం సద్వినియోగం చేసుకుని గాలికుంటు వ్యాధి టీకాలు వేయించి తమ పశువులను వ్యాధి పడకుండా రక్షించుకోవాలని బారిన సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలో 48 పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ పశు వైద్య సిబ్బంది, పాడి రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ARTICLE'S
మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలి


జనం వెలుగు న్యూస్ రుద్రూర్ 29- అక్టోబర్ : మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలకు రుద్రూర్ మండలంలో రైతులు ఆరుగాలం పాటు కష్టించి పండించిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. బుధవారం రుద్రూర్ మండల బిజెపి నాయకులు రైతుల కల్లాల వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్బంగా బిజెపి మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని మైచర్ మిషన్ వడ్లలోని తేమ శాతం 25 చూపిస్తే రైస్ మిల్లలోని మైచర్ మిషన్ తేమ శాతం 16 చూపిస్తున్నట్లు ఆరోపించారు అదేవిదంగా కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను రైస్ మిల్లుకు తరలించకపోవడం వలన కొంతమంది రైతుల ధాన్యం బస్తాలు అడుగుభాగం తడిచినట్లు సకాలంలో రైస్ మిల్ కు ధాన్యం తరలించి ఉంటే రైతులకు నష్టం జరిగేది కాదని పేర్కొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ వెంటనే సాంక్షన్ చేయాలని చేయాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లులు అన్నిటికీ అలాట్మెంట్ ఇచ్చి సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలని రుద్రూర్ బీజేపీ మండల కమిటీ తరఫున ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గూడూరి ప్రశాంత్ గౌడ్, నియోజవర్గ సీనియర్ నాయకులు పార్వతీ మురళి, మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి గజేందర్, కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు, ఎర్రోళ్ల గంగాధర్, యువ మోర్చా మండల అధ్యక్షుడు కుమ్మరి గణేష్, శివప్రసాద్, వరప్రసాద్, వినోద్ కుమార్, మాధవ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ARTICLE'S
వర్ని అంగల్లో తైబజార్ అధిక వాసుళ్లు…


జనం వెలుగు న్యూస్ : వర్ని మండల కేంద్రంలో ప్రతి మంగళవారం వారం వారపు సంత జరుగుతుంది. అందులోనే మేకల అంగడి కూడా జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుండి మేకలు అమ్మడానికి వ్యాపారులు వస్తారు.










